మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట నియోజకవర్గం - బతుకుతెరువుకి చిలకలూరిపేట వచ్చి వచ్చిన రోజే అనంత లోకాలకు! అసలేం జరిగింది ?

చిలకలూరిపేట నియోజకవర్గం - బతుకుతెరువుకి చిలకలూరిపేట వచ్చి వచ్చిన రోజే అనంత లోకాలకు!

​చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ (ఎడ్లపాడు):

బతుకుదెరువు కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఓ వలస కార్మికుడిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో బలితీసుకుంది. పనిలో చేరిన తొలి రోజే ఆ కార్మికుడు విగతజీవిగా మారడంతో తోటి కార్మికుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

​వివరాల్లోకి వెళితే...

బీహార్ రాష్ట్రానికి చెందిన బాగీ బింద్ (తండ్రి పేరు: నాగ బింద్) అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం నిన్ననే ఎడ్లపాడు మండలంలోని వంకాయలపాడులో ఉన్న BSR సిమెంట్ స్తంభాల ఫ్యాక్టరీకి పని కోసం వచ్చాడు. రాత్రి సమయంలో మద్యం సేవించేందుకు సమీపంలోని బోయపాలెం వెళ్లాడు. తిరిగి తన గదికి వస్తుండగా వంకాయలపాడు జైన్ మందిరం సమీపంలో, జాతీయ రహదారి-16 (NH-16) సర్వీస్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాగీ బింద్‌ను ఓ గుర్తుతెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది.

​చికిత్స పొందుతూ మృతి..

ఈ ప్రమాదంలో బాగీ బింద్ తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు, తోటి కార్మికులు అతడిని హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి (GGH) తరలించారు. అక్కడ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బాగీ బింద్ కన్నుమూశాడు. కొద్ది గంటల క్రితమే తమతో కలిసి మాట్లాడిన వ్యక్తి విగతజీవిగా మారడంతో తోటి కార్మికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

​పోలీసుల దర్యాప్తు ముమ్మరం..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎడ్లపాడు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, యాక్సిడెంట్ చేసి పరారీలో ఉన్న ఆ గుర్తుతెలియని వాహనాన్ని పట్టుకునేందుకు జాతీయ రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి వేళల్లో సర్వీస్ రోడ్లపై నడిచి వెళ్లే పాదచారులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.

​మరిన్ని స్థానిక తాజా వార్తలు, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి... మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్.ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి