|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
#Chilakaluripet #PrathipatiPullaRao #AtalBihariVajpayee #StatueUnveiling #AmitShah #ChandrababuNaidu #PawanKalyan #వెంకటపాలెం
» రేపే భారీ బహిరంగ సభ: కదంతొక్కనున్న చిలకలూరిపేట కూటమి! భారీ జన సమీకరణకు ఏర్పాట్లు
రేపే భారీ బహిరంగ సభ: కదంతొక్కనున్న చిలకలూరిపేట కూటమి! భారీ జన సమీకరణకు ఏర్పాట్లు
రేపే భారీ బహిరంగ సభ: కదంతొక్కనున్న చిలకలూరిపేట కూటమి! భారీ జన సమీకరణకు ఏర్పాట్లు
చలో వెంకటపాలెం: కూటమి అగ్రనేతల సమక్షంలో అటల్ జీ విగ్రహావిష్కరణ.. చిలకలూరిపేట నుండి భారీగా తరలిరావాలని పిలుపు!చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్):
భారత రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన మహానాయకుడు, మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్‌పాయ్ జయంతి సందర్భంగా రేపు (25.12.2025) ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. వెంకటపాలెం గ్రామంలో అటల్ జీ కాంస్య విగ్రహావిష్కరణ మరియు భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
🚩 ఒకే వేదికపై త్రిమూర్తులు:
ఈ కార్యక్రమం సామాన్యమైనది కాదు. కూటమి బలాన్ని చాటేలా.. కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మరియు ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రానున్నారు.
📣 చిలకలూరిపేట శ్రేణులకు అలర్ట్:
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మన బాధ్యత అని చిలకలూరిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. వారి ఆదేశాల మేరకు, నియోజకవర్గ పరిశీలకురాలు శ్రీమతి దాసరి ఉషారాణి ఆధ్వర్యంలో నేడు పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుండి టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి మన నియోజకవర్గ సత్తా చాటాలని నిర్ణయించారు.
🤝 సన్నాహక సమావేశంలో పాల్గొన్నది వీరే:
జన సమీకరణ మరియు వాహనాల ఏర్పాట్లపై జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ముఖ్యంగా నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, ఏఎంసీ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, కార్యదర్శి మద్దుమాల రవి, మండల అధ్యక్షులు జవ్వాజి మదన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయి బాబా గార్లు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.
అలాగే క్లస్టర్ ఇంచార్జీలు మల్లవరపు జయప్రసాద్, బాలశౌరిరెడ్డి, మద్దూరి శ్రీనివాసరెడ్డి, మద్దినేడి శివరామకృష్ణ, కోడె హనుమంతరావు, గంజి శ్రీనివాసరావు, గంగ శ్రీనివాసరావు, ముల్లా కరీముల్లా, కందుల వెంకట రమణ, షేక్ మస్తాన్ వలి, కొత్త కోటేశ్వరరావు, మద్దిబోయిన శివ తదితరులు పాల్గొని జన సమీకరణ ప్రణాళికను రూపొందించారు.
గమనిక: రేపు ఉదయం 9:30 గంటలకల్లా కార్యకర్తలందరూ వెంకటపాలెం చేరుకోవాలి.
అధిక విద్యుత్ ఛార్జీలతో భయపడుతున్నారా ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేసి సోలార్ సిస్టంని బిగించుకోండి. మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గరిష్టంగా 78,000 సబ్సిడీని పొందండి. ఆదిత్య సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ +91 8074300423





No comments:
Post a Comment