చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట 'కరివేపాకు'.. గ్లోబల్ మార్కెట్లోకి పరుగులు!కట్టుబడివారిపాలెంలో సరికొత్త వ్యవసాయ విప్లవం: రూ.2.34 కోట్లతో ప్రాసెసింగ్ ప్లాంట్.. పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి
మహాగణపతి సన్నిధిలో గణపతి యూత్ ఫోర్స్ ఉత్సవాలలో 25 ఏళ్ల భక్తికి సలాం.. తిమ్మాపురం మహిళలను సత్కరించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్.. పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి
చిలకలూరిపేట - కళామందిర్ సెంటర్లో కలకలం..ఏటీఎం కాస్తా 'ఓపెన్ బార్'.. చిలకలూరిపేటలో మందుబాబుల వీరంగం! పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పైన క్లిక్ చెయ్యండి....
🚨 చిలకలూరిపేట స్పీడ్ న్యూస్: ఎస్బీఐ ఏటీఎం కాస్తా.. మందుబాబుల అడ్డా! 🚨
🍺 పట్టపగలే మందుబాబుల వీరంగం చిలకలూరిపేట పట్టణ నడిబొడ్డున ఉన్న కళామందిర్ సెంటర్ ఇప్పుడు మందుబాబులకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ముఖ్యంగా పెదనందిపాడు ఆర్టీసీ బస్టాప్ పక్కనే ఉన్న SBI ATM వద్ద పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. అత్యవసరంగా డబ్బులు డ్రా చేసుకుందామని వచ్చే సామాన్య ప్రజలకు ఈ ఏటీఎం కాస్తా 'ఓపెన్ బార్'ను తలపిస్తూ షాక్ ఇస్తోంది. మందుబాబుల హల్చల్, వారి అసభ్యకర ప్రవర్తనతో ఆ ప్రాంతం గుండా వెళ్లాలంటేనే స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
😨 కరువైన భద్రత.. భయాందోళనలో జనం నిత్యం రద్దీగా ఉండే ఈ ఏటీఎం వద్ద కనీసం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఇదే అదనుగా భావించిన కొందరు ఆకతాయిలు దీన్ని తమ అడ్డాగా మార్చుకున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు డబ్బులు తీసుకునేందుకు ఏటీఎం లోపలికి వెళ్లాలంటేనే వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. లోపల మద్యం మత్తులో తూగుతున్న వారిని చూసి, భయంతో డబ్బులు డ్రా చేయకుండానే చాలామంది వెనుతిరుగుతున్నారు. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్లే సామాన్యులు ఈ అవస్థలు పడాల్సి వస్తోందని కస్టమర్లు మండిపడుతున్నారు.
🚓 అసాంఘిక కార్యకలాపాలకు నిలయం.. పెరగాల్సిన గస్తీ పగటి పూటే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రాత్రి వేళల్లో ఈ ఏటీఎం పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిగా నిలయంగా మారుతున్నాయని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకటి పడితే చాలు ఆ ప్రాంతమంతా భయానకంగా మారుతోందని, చుట్టుపక్కల నివసించే వారు సైతం కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వస్తోందని వాపోతున్నారు. చిలకలూరిపేట పట్టణ పోలీసులు తక్షణమే స్పందించి ఈ ప్రాంతంలో నైట్ పెట్రోలింగ్ (గస్తీ) ముమ్మరం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మందుబాబులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బ్యాంక్ యాజమాన్యం వెంటనే సెక్యూరిటీ గార్డును నియమించేలా చూసి ప్రజలకు భద్రత కల్పించాలని ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు.




