చిలకలూరిపేటలో హోరెత్తిన సీఎం పుట్టినరోజు వేడుకలు! చిలకలూరిపేటలో ఎక్కడెక్కడ ఏ ఏ కార్యక్రమాలు జరిగాయి అంటే ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దార్శనిక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు చిలకలూరిపేట నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో జరిగాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఏరియాల్లో, ప్రతి వార్డులో టీడీపీ శ్రేణులు, అభిమానులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ కేక్ కటింగ్స్, మిఠాయిల పంపిణీ, ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలతో కోలాహలం నెలకొంది.
చిలకలూరిపేటలో ఎక్కడెక్కడ, ఎలా వేడుకలు జరిగాయంటే:
- ఎమ్మెల్యే నివాసం వద్ద ప్రత్యేక పూజలు: తన నివాసం వద్ద ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబు చిత్రపటానికి గుమ్మడికాయలతో దిష్టి తీసి, పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేశారు.
- అన్నా క్యాంటీన్లలో పేదలతో కలిసి: గడియార స్తంభం, అడ్డరోడ్డు, నరసరావుపేట సెంటర్లలోని అన్నా క్యాంటీన్లలో ఘనంగా వేడుకలు జరిగాయి. ప్రత్తిపాటి సామాన్య ప్రజలతో కలిసి వరుసలో కూర్చుని భోజనం చేసి, ప్రజలతో ముచ్చటించారు.
- ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో: డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ప్రత్తిపాటి పాల్గొని కేక్ కట్ చేశారు. కంచర్ల శ్రీనివాసరావు, నెల్లూరు సదాశివరావు, డిపో ప్రెసిడెంట్ బాబురావు, పబ్లిసిటీ సెక్రటరీ నక్క శీను తదితర సిబ్బంది, నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
- గ్రామాల్లో చిన్నారుల కేరింతలు: గొట్టిపాడు గ్రామంలో మహిళలు, చిన్నారులు, పెద్దలు ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. "హ్యాపీ బర్త్డే సీఎం సార్" అంటూ నినాదాలు చేశారు.
- ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు: కళామందిర్ సెంటర్లోని శివాలయంలో 18వ వార్డు అధ్యక్షుడు అరెకట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సయ్యద్ వహబ్, మేకనబోయిన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఇదే ఆలయ రాజగోపుర శంకుస్థాపనలో పాల్గొన్న ప్రత్తిపాటి, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
- ఎన్టీఆర్ టిట్కో గృహాల వద్ద: ఇట్టే శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పఠాన్ సమాద్ ఖాన్, మద్దుమాల రవి, మద్దిబోయిన శివ, పిల్లి కోటి తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.
- వీఓఏలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ: సెర్ఫ్, వెలుగు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 115 మంది వీఓఏలకు ప్రత్తిపాటి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను, ముఖ్యమంత్రి పడుతున్న కష్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత మహిళా సంఘాలదేనని దిశానిర్దేశం చేశారు.
- బార్ అసోసియేషన్ సంబరాలు: గుంటూరు కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మర్రి రాజశేఖర్, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
- అన్ని వార్డుల్లో మిన్నంటిన సంబరాలు: 23వ వార్డుతో పాటు చిలకలూరిపేట పట్టణంలోని ప్రతి వార్డులో, ప్రతి ఏరియాలో స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని వేడుకలు నిర్వహించారు. ముఖ్యంగా 23వ వార్డులోని దర్గా వద్ద టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకొని టపాసులతో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. చంద్రబాబు నినాదాలతో వార్డు మొత్తం హోరెత్తించారు. వార్డులోని ముఖ్య నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో స్వీట్స్ మరియు కేకులను పంచిపెట్టారు.
మొత్తంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు కేవలం రాజకీయ కార్యక్రమంగా కాకుండా, ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో జరిగే పండుగలా ఓన్ చేసుకుని ఘనంగా జరుపుకున్నారు.
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.




