మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేటలో తెలంగాణ కారు బీభత్సం.. గుడిసెలోకి దూసుకెళ్లిన వైనం! స్థానికుల కేకలతో జంప్ అయిన యువకులు!

చిలకలూరిపేటలో తెలంగాణ కారు బీభత్సం.. గుడిసెలోకి దూసుకెళ్లిన వైనం! స్థానికుల కేకలతో జంప్ అయిన యువకులు!

చిలకలూరిపేట: స్థానిక నరసరావుపేట సెంటర్ వద్ద గురువారం ఒక కారు సృష్టించిన బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అతివేగం, నిర్లక్ష్యం వెరసి రోడ్డు పక్కన ఉన్న ఒక పేదవాడి గుడిసెలోకి కారు దూసుకుపోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.

అసలేం జరిగిందంటే..

నరసరావుపేట వైపు మితిమీరిన వేగంతో వెళ్తున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారు (TS 08 JB 8260) ఒక్కసారిగా అదుపుతప్పింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనే ఉన్న ఒక గుడిసెలోకి భీకరంగా దూసుకుపోయింది. అదృష్టవశాత్తూ, ప్రమాద సమయంలో ఆ గుడిసెలో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో అక్కడ ఎవరైనా ఉండి ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు వణికిపోతూ చెబుతున్నారు.

కారు వదిలేసి పరారీ..

ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అప్రమత్తమై కేకలు వేశారు. కారులో ముగ్గురు యువకులతో పాటు ఒక మహిళ ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. జనం గుమిగూడుతుండటాన్ని గమనించిన ఆ నలుగురు, భయంతో కారును అక్కడే వదిలేసి, హుటాహుటిన ఒక ఆటో ఎక్కి చిలకలూరిపేట టౌన్ వైపు పరారయ్యారు.

మద్యం మత్తే కారణమా?

వాహనం నడిపిన వ్యక్తులు మద్యం సేవించి ఉండొచ్చని స్థానికులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ కారు తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, ఉప్పల్ RTO పరిధిలో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. వీరు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన 'చీరాల బీచ్' కు విహారయాత్ర కోసం వచ్చి ఉండొచ్చని, మార్గమధ్యలో మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు.

​పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి, కారు నంబర్ ఆధారంగా పరారైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

 వీడియో కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://www.instagram.com/reel/DXMzaC9CS67/?igsh=cDEwcno1bmFrenZw

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట రూరల్ - ఎడ్లపాడు పోలీసుల మెరుపు దాడి! పేకాట రాయుళ్ల గుట్టురట్టు! ఎనిమిది మంది కటకటాలకు!

చిలకలూరిపేట రూరల్ - ఎడ్లపాడు పోలీసుల మెరుపు దాడి! పేకాట రాయుళ్ల గుట్టురట్టు! ఎనిమిది మంది కటకటాలకు!


ఎడ్లపాడు (చిలకలూరిపేట స్పీడ్ న్యూస్): పల్లెల్లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తూ, గుట్టుచప్పుడు కాకుండా వ్యవసాయ పొలాల్లో సాగుతున్న అక్రమ జూద క్రీడలపై ఎడ్లపాడు పోలీసులు ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో మెరుపు దాడి చేసి పేకాట రాయుళ్లకు చెక్ పెట్టారు.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు:

  • పొలాల్లో పేకాట శిబిరం: ఎడ్లపాడు మండల పరిధిలోని ఉప్పరపాలెం గ్రామ శివారులో ఉన్న పచ్చని వ్యవసాయ పొలాలను కొందరు వ్యక్తులు జూదానికి అడ్డాగా మార్చుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ గుట్టుగా పేకాట ఆడుతున్నారు.
  • పోలీసుల మెరుపు దాడి: ఈ అక్రమ వ్యవహారంపై పోలీసులకు అందిన పక్కా (విశ్వసనీయ) సమాచారం మేరకు, వ్యూహాత్మకంగా వ్యవహరించి వ్యవసాయ పొలాలపై ఆకస్మిక దాడి చేశారు.
  • 8 మంది అరెస్ట్, నగదు స్వాధీనం: ఈ దాడుల్లో జూదంలో మునిగితేలుతున్న 8 మంది వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ. 3,800/- నగదును, జూదానికి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారందరిపై గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు.

జూదం ఆడితే కటకటాల పాటే: ఎస్ఐ శివరామకృష్ణ

ఈ సందర్భంగా ఎడ్లపాడు సబ్-ఇన్స్పెక్టర్ (SI) శ్రీ శివరామకృష్ణ గారు మాట్లాడుతూ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. "గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా సహించేది లేదు. ప్రజలు ముఖ్యంగా యువత జూదం వంటి వ్యసనాలకు బానిసలై అమూల్యమైన జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు" అని స్పష్టం చేశారు.

​గ్రామాల్లో ఎక్కడైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరిగితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన సూచించారు.

చిలకలూరిపేట మరియు పరిసర ప్రాంతాల తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి... మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్!


చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - ​గొడ్డలి, కోడికత్తి, గులకరాయితో వైఎస్సార్సీపీకి కొత్త జెండాను బహుకరించిన నవతరం పార్టీ రావు సుబ్రహ్మణ్యం - అమరావతికి 'ప్లాన్ బి' కాదు.. జగన్‌కే 'ప్లాన్ బి' ఇచ్చాం

చిలకలూరిపేట - ​గొడ్డలి, కోడికత్తి, గులకరాయితో వైఎస్సార్సీపీకి కొత్త జెండాను బహుకరించిన నవతరం పార్టీ రావు సుబ్రహ్మణ్యం - అమరావతికి 'ప్లాన్ బి' కాదు.. జగన్‌కే 'ప్లాన్ బి' ఇచ్చాం - రావు 


జగన్ పార్టీకి 'ప్లాన్ బి' జెండా..! గొడ్డలి, కోడికత్తి, గులకరాయితో సరికొత్త నమూనా విడుదల

చిలకలూరిపేట (అమరావతి న్యూస్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చిలకలూరిపేట వేదికగా నవతరం పార్టీ తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించింది. పార్టీకి సరైన జెండా, ఎజెండా లేక ఇబ్బంది పడుతున్న జగన్‌కు తనవంతు సాయంగా నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఒక వినూత్నమైన 'ప్లాన్ బి' జెండా నమూనాను మీడియాకు విడుదల చేశారు. మూడు రంగుల నేపథ్యంతో రూపొందించిన ఈ జెండాలో, మధ్యలో రక్త వర్ణపు వృత్తాన్ని ఉంచి.. అందులో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గుర్తులను ప్రధానంగా హైలైట్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

​గతంలో స్వంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్.. ఇప్పుడు 'మావిగన్' పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగానే ఈ జెండాను ప్లాన్ బి కింద రూపొందించినట్లు రావు సుబ్రహ్మణ్యం ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలని చూసిన పాపానికి, ఆయన పార్టీ ఎన్నికల గుర్తు అయిన సీలింగ్ ఫ్యాన్ ముక్కలై 11 చెక్కలుగా (సీట్లు) విడిపోయిందని చురకలంటించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని దయనీయ స్థితిలో ఉన్న జగన్‌కు.. ఈ సమయంలో ఇటువంటి జెండా అత్యవసరమని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో అన్యథా భావించకుండా రాజధాని 'మావిగన్' ఎజెండాతో పాటు, ఈ గొడ్డలి, కోడికత్తి, గులకరాయి జెండాతో మావయ్య జగన్ ముందుకు రావాలని సూచించారు.

​అధికారం వారి చేతుల్లోకి వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయో, వారి చేతుల్లో ఏముంటాయో ప్రజలకు ఈ జెండా ద్వారా ఇట్టే అర్థమవుతుందని.. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేసింది. రాజధాని అమరావతికి జగన్ 'ప్లాన్ బి' ఇవ్వాల్సిన అవసరం లేదని, కూటమి తరపున నవతరం పార్టీ నుండే తాము 'ప్లాన్ బి' కింద ఈ జెండాను జగన్‌కు అందిస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం కుండబద్దలు కొట్టారు. మొత్తానికి నవతరం పార్టీ విడుదల చేసిన ఈ సెటైరికల్ జెండా నమూనా ఇప్పుడు స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

పల్నాడు జిల్లాపై చిలకలూరిపేట మార్క్..​ఇంటర్ ఫలితాల్లో చిలకలూరిపేట రికార్డ్! చదువుల తల్లులు.. మార్కుల సింహాలు వీరే...

పల్నాడు జిల్లాపై చిలకలూరిపేట మార్క్..​ఇంటర్ ఫలితాల్లో చిలకలూరిపేట రికార్డ్! చదువుల తల్లులు.. మార్కుల సింహాలు వీరే...


చిలకలూరిపేట: తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో చిలకలూరిపేట విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. విద్యానగరంగా చిలకలూరిపేట పేరును మరోసారి మార్మోగేలా చేస్తూ.. పల్నాడు జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకులు, టౌన్ ఫస్ట్ ర్యాంకులతో సంచలనం సృష్టించారు. పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు, రికార్డ్ స్థాయి పాస్ పర్సంటేజీలతో తమ సత్తా చాటారు.

​మెరిట్ విద్యార్థులు, వివిధ కళాశాలల అత్యుత్తమ ఫలితాల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:

జిల్లా స్థాయిలో మెరిసిన ఆణిముత్యాలు (సెకండ్ ఇయర్):

​ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మన చిలకలూరిపేట విద్యార్థినులు పల్నాడు జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు.

  • ఎస్.కె గడ్డం సుమియా (991/1000)
  • సాజియా సమన్ (991/1000) - (మున్సిపల్ డీఈ రహీం కుమార్తె) ఈ ఇద్దరు విద్యార్థినులు అత్యుత్తమ మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంకులు సాధించి పట్టణానికి గర్వకారణంగా నిలిచారు.

ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో హోరాహోరీ (టౌన్ ఫస్ట్ & సెకండ్):

​ప్రథమ సంవత్సర ఫలితాల్లో కళాశాలల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. విద్యార్థులు అద్భుతమైన మార్కులతో టౌన్ టాపర్లుగా నిలిచారు.

టౌన్ ఫస్ట్ ర్యాంకర్లు (465/470):

  • ​మండలనేని పల్లవి
  • ​మాదినేని తనుజ
  • ​అన్నపురెడ్డి జయ దీపికా రెడ్డి (MPC)
  • ​మండల రమేష్ (MPC)

టౌన్ సెకండ్ ర్యాంకర్లు (464/470):

  • ​బొల్లెపల్లి ఆశ్రిత
  • ​కారెడ్ల సుప్రియ
  • ​దాసరి రేవతి
  • ​అంబలపాటి హాసిని శ్రీ
  • ​ప్రత్తిపాటి జెస్సి వేరోనికా
  • ​తెలగతోటి సౌమ్య దీనితో పాటు పలువురు విద్యార్థులు 463, 462, 461 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

బైపీసీ (BiPC) విభాగంలో:

  • షేక్ సుహానా 450/455 మార్కులతో బైపీసీలో టౌన్ ఫస్ట్ సాధించగా.. పలువురు విద్యార్థులు 440కి పైగా మార్కులు సాధించి సత్తా చాటారు.

ఉత్తీర్ణత శాతంలో దూసుకెళ్తున్న కళాశాలలు:

​ఫలితాల సాధనలో పట్టణంలోని కళాశాలలు ఏదీ తీసిపోని విధంగా పోటీ పడ్డాయి.

  • శ్రీ చైతన్య కళాశాల: జిల్లా ఫస్ట్, టౌన్ ఫస్ట్ ర్యాంకులతో పాటు అత్యధిక సంఖ్యలో మెరిట్ విద్యార్థులను అందించి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది.
  • ఎన్.ఆర్.ఐ (NRI) కళాశాల: స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఏకంగా 95% పాస్ పర్సంటేజ్ నమోదు చేసి సంచలనం సృష్టించింది. 460 కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
  • నారాయణ, చైతన్య జూనియర్ కళాశాల , మోడరన్ కళాశాలలు: ఈ కళాశాలల విద్యార్థులు కూడా రెండు, మూడు మార్కుల స్వల్ప తేడాతో అత్యుత్తమ మార్కులు సాధించి మెరుగైన ఫలితాలు నమోదు చేశారు.

​మంచి ర్యాంకులు, అద్భుతమైన ఉత్తీర్ణత శాతం సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ప్రిన్సిపాల్స్ మరియు అధ్యాపక బృందానికి 'చిలకలూరిపేట స్పీడ్ న్యూస్' తరపున హృదయపూర్వక అభినందనలు! 💐

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట టౌన్ :- పోగొట్టుకున్న 10 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన అర్బన్ సి.ఐ. పి. రమేష్

చిలకలూరిపేట టౌన్ :- పోగొట్టుకున్న 10 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన అర్బన్ సి.ఐ. పి. రమేష్


చిలకలూరిపేట:

స్మార్ట్ ఫోన్ అనేది నేటి కాలంలో కేవలం మాట్లాడే సాధనం మాత్రమే కాదు, ఎంతో విలువైన వ్యక్తిగత, ఆర్థిక సమాచారం ఉండే ఆస్తి. అలాంటి ఫోన్లు పోగొట్టుకుని తీవ్ర ఆందోళనలో ఉన్న బాధితులకు చిలకలూరిపేట పట్టణ పోలీసులు తీపికబురు అందించారు. పట్టణ పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో, వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న మరియు చోరీకి గురైన సుమారు లక్షల రూపాయల విలువ చేసే 10 మొబైల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు.

​ఈ మేరకు నేడు చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో, పట్టణ సీఐ శ్రీ పి. రమేష్ గారి ఆధ్వర్యంలో రికవరీ చేసిన ఫోన్లను వాటి అసలు యజమానులకు స్వయంగా అప్పగించారు.

  • సాంకేతిక పరిజ్ఞానంతో పక్కాగా ట్రాకింగ్: బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, మొబైల్ ఫోన్ల ఐ.ఎం.ఇ.ఐ (IMEI) నంబర్ల ఆధారంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. సైబర్ విభాగం సహకారంతో ఈ ఫోన్లను ఎక్కడున్నా పక్కాగా ట్రాక్ చేసి, సురక్షితంగా స్వాధీనం చేసుకున్నట్లు సి.ఐ. రమేష్ తెలిపారు.
  • బాధితుల్లో వ్యక్తమైన హర్షం: ఇక తమ ఫోన్లు తిరిగి దొరకవు అని ఆశలు వదులుకున్న బాధితులకు.. పోలీసులు ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తమ విలువైన ఫోన్లు తిరిగి లభించేలా వేగంగా స్పందించిన పట్టణ పోలీసులకు, సి.ఐ. రమేష్ గారికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
  • ప్రజలకు సీఐ కీలక సూచనలు - CEIR పోర్టల్ వినియోగం: సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు గానీ, చోరీకి గురైన వారు గానీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీఐ సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌లో వెంటనే వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ పోర్టల్ ద్వారా ఫోన్‌ను సులభంగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా ఇతరులు ఆ ఫోన్‌లోని డేటాను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవచ్చని తెలిపారు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఫోన్లను సులభంగా రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.

​ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్ సిబ్బంది, మరియు పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి పొందిన బాధితులు పాల్గొన్నారు. వేగంగా స్పందించి ఫోన్లు రికవరీ చేసిన పోలీసుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నిరంతరం స్థానిక తాజా వార్తలు, నిఖార్సయిన సమాచారం కోసం చదువుతూనే ఉండండి... మీ "చిలకలూరిపేట స్పీడ్ న్యూస్"


చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట రూరల్ - ఒకే ఇల్లు.. ఏకంగా నలుగురికి అమ్మి రిజిస్ట్రేషన్! 🚨- బ్యాంకులను బురిడీ కొట్టించి స్టోరీ

చిలకలూరిపేట రూరల్ - ఒకే ఇల్లు.. ఏకంగా నలుగురికి అమ్మి రిజిస్ట్రేషన్! 🚨- బ్యాంకులను బురిడీ కొట్టించి స్టోరీ 


చిలకలూరిపేట (క్రైమ్ డెస్క్): సినిమాలను తలపించే రేంజ్ లో పక్కా స్కెచ్.. సెంటిమెంట్ డైలాగులతో కన్నీళ్లు.. గుట్టుచప్పుడు కాకుండా సర్వే నెంబర్ల మార్పిడి.. చివరికి నమ్మిన వాళ్ల ప్రాణాలు తీసే స్థాయికి దౌర్జన్యం! చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో వెలుగుచూసిన ఒక భారీ రియల్ ఎస్టేట్ మోసం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. ఒకే ఇంటిని అడ్డం పెట్టుకుని, బ్యాంకులను సైతం బురిడీ కొట్టిస్తూ మాబు వలి అనే వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు ఆడిన నాటకం గుట్టురట్టయింది.

అసలు కథ.. సినిమాను మించిన స్క్రీన్ ప్లే:

లింగంగుంట్లలోని ఒక ఇల్లు గతంలో మాబు వలి కుటుంబానిది. అయితే వారు 'యాప్టస్ ప్రైవేట్ బ్యాంక్' (Aptus)లో తీసుకున్న రుణం కట్టకపోవడంతో, ఆ బ్యాంకు వారు ఆ ఇంటిని వేలం (Auction) వేశారు. ఆ వేలంలో లింగంగుంట్లకే చెందిన పెడవల్లి రాజకుమార్ (చిన్నబాబు) కొనుగోలు చేశారు. అనంతరం ఆయన వద్ద నుంచి చిలకలూరిపేట సుబ్బయ్య తోటకు చెందిన తూమాటి ప్రవీణ్.. 'విస్తార్ ప్రైవేట్ బ్యాంక్' (Vistar) ద్వారా రుణం తీసుకుని, పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కొనుగోలు చేశారు. 2010 నుండి ఆ ఇంటికి సంబంధించిన పక్కా లింక్ డాక్యుమెంట్లన్నీ ప్రవీణ్ దగ్గరే ఉన్నాయని, చట్టపరంగా ఆ ఇంటికి పూర్తి హక్కుదారుడు ప్రవీణ్ అని ఆవేదన వ్యక్తం చేసారు.

యాక్ట్-1: కన్నీటి కష్టాలు.. సెంటిమెంట్ వల!

ఇల్లు కొన్న తర్వాత ప్రవీణ్ దాన్ని కొన్ని నెలలు ఖాళీగా ఉంచారు. ఆ ఏరియాలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ఇదే అదనుగా భావించిన పాత ఓనర్ మాబు వలి.. ప్రవీణ్ వద్దకు వచ్చి కన్నీటి నాటకానికి తెరతీశాడు. "లోన్ కట్టలేక ఇల్లు వదులుకున్నాం.. కానీ ఆ ఇంటి మీద మాకు మమకారం చావలేదు. త్వరలో నా కూతురు పెళ్లి ఉంది, ఆ ఏరియాలో అంతా మా వాళ్లే ఉంటారు, దయచేసి మమ్మల్ని మీ ఇంట్లోనే అద్దెకు ఉండనివ్వండి.. నెల నెలా అద్దె చెల్లిస్తాం" అని బ్రతిమిలాడాడు. పాపం.. అతడి మాటలు నమ్మిన ప్రవీణ్ ఇంటిని వారికే అద్దెకు ఇచ్చాడు.

యాక్ట్-2: అద్దె అడిగితే దాడి.. కాలు తీసేసే పరిస్థితి!

ఇంట్లో దిగిన మాబు వలి.. రెండు నెలలైనా అద్దె ఇవ్వలేదు. సరేనని ప్రవీణ్ స్వయంగా వెళ్లి అద్దె అడగగా మాబు వలి కుటుంబం తమ అసలు రంగు బయటపెట్టింది. అద్దె ఇవ్వకపోగా, 'ఇది మా ఇల్లు.. నువ్వెవరు అడగడానికి' అంటూ ప్రవీణ్ పై కిరాతకంగా దాడికి దిగారు. ఈ దాడిలో ప్రవీణ్ కాలికి తీవ్ర గాయమైంది. ప్రవీణ్‌కు ముందుగానే షుగర్ వ్యాధి ఉండటంతో ఆ గాయం కాస్తా ఇన్ఫెక్షన్ గా మారి, ఇప్పుడు కాలు తీసివేయాల్సిన (Amputation) దారుణమైన పరిస్థితికి చేరుకున్నాడు.

​బాధితుడు ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించగా.. పోలీస్ స్టేషన్ బయట కూడా మాబు వలి తమ్ముడు 'మీరావలి' రెచ్చిపోయాడు. స్టేషన్ నుంచి బయటకు రాగానే ప్రవీణ్ పై బూతులు తిడుతూ తిరిగి దాడికి యత్నించడం వారి రౌడీయిజానికి అద్దం పడుతోంది.

యాక్ట్-3: అసలు ట్విస్ట్.. తెరవెనుక మహా కుట్ర! (యడ్ల రామాంజనేయులు కన్నీటి గోస)

ఒకపక్క ప్రవీణ్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉంటే.. ఇంకోపక్క మాబు వలి మరో మహా మోసానికి తెరతీశాడు. ప్రవీణ్ సుబ్బయ్య తోటలో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, అద్దెకు ఉంటున్న ఇంటి సర్వే నెంబర్లను ఇష్టానుసారంగా మార్చేశాడు.

​రియల్ ఎస్టేట్ ఏజెంట్ పసుపులేటి ప్రభాకర్‌తో కలిసి.. వలపర్లకు చెందిన స్వర్ణకారుడు యడ్ల రామాంజనేయులుకు కూడా ఇవే 'కూతురు పెళ్లి' సెంటిమెంట్ డైలాగులు చెప్పారు. సర్వే నెంబర్లు మార్చిన నకిలీ డాక్యుమెంట్లతో రామాంజనేయులు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి, గృహం హోసింగ్ ఫైనస్ ఏకంగా . 23.25 లక్షలు లోన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంటి పన్ను రసీదుల్లో రామాంజనేయులు సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఆ తర్వాత అదే ఇంటిని 'సింగు మహాలక్ష్మి' అనే ఆవిడకు అమ్మి రిజిస్ట్రేషన్ చేశారు.

క్లైమాక్స్: మళ్లీ మొదటికి..!

బ్యాంకు వేలంలో ఇల్లు పోగొట్టుకున్న మాబు వలి అండ్ కో.. సర్వే నెంబర్లు మార్చి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఇద్దరు ముగ్గురికి ఆ ఇంటిని అమ్మేసి లక్షలు దండుకున్నారు. ఇక ఇవన్నీ చాలదన్నట్లు, ఆ తర్వాత మళ్లీ సర్వే నెంబర్ మార్చి ఏకంగా మాబు వలి తన ఇంట్లో వాళ్ళ పేరు మీదకే ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఈ మోసంలో పరాకాష్ట! ఈ మొత్తం వ్యవహారంలో మాబు వలి, అతని తమ్ముడు మీరావలి, కొడుకు ఇస్మాయిల్, ఏజెంట్ ప్రభాకర్.. ఇలా కుటుంబమంతా ఒక ముఠాగా ఏర్పడి పక్కా ప్లాన్ తో జనాలను దోచుకున్నారు.

న్యాయం కావాలి అంటున్న బాధితులు:

ఒకే ఇంటికి నాలుగు రిజిస్ట్రేషన్లు.. నకిలీ సర్వే నెంబర్లు.. సంతకాల ఫోర్జరీలు.. అసలు యజమానిపైనే ప్రాణాంతక దాడి! ఇంతటి దారుణాలకు ఒడిగట్టిన మాబు వలి, అతని ముఠాపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రవీణ్ కు, నిలువునా మోసపోయిన రామాంజనేయులుకు న్యాయం చేయాలని స్థానికులు, పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు.

ఈ కేసులో తదుపరి పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి.. మీ 'చిలకలూరిపేట స్పీడ్ న్యూస్'. ---


చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..​ప్రాణం తీసిన 'ఫెయిల్' భయం

చిలకలూరిపేట - ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..​ప్రాణం తీసిన 'ఫెయిల్' భయం


​విద్యార్థుల పాలిట పరీక్షల భయం ప్రాణసంకటంగా మారుతోంది. ఫలితాలు ఎలా వస్తాయో అన్న ఆందోళన, తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు, సమాజం ఏమనుకుంటుందో అన్న ఒత్తిడి తట్టుకోలేక ఎందరో విద్యార్థులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలు కలచివేస్తున్నాయి. తాజాగా చిలకలూరిపేట పట్టణంలో చోటుచేసుకున్న ఇలాంటి ఘటనే స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలానికి చెందిన సదరు విద్యార్థిని, చిలకలూరిపేట పట్టణంలోని ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గత ఏడాది జరిగిన ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఆమెకు నాలుగు సబ్జెక్టులు మిగిలిపోయాయి. తాజాగా ఇప్పుడు రాసిన సెకండియర్ ఫలితాలు కూడా అనుకూలంగా రావేమోనన్న తీవ్ర మానసిక ఒత్తిడికి ఆమె లోనైంది. ఈ మనస్తాపంతో రెండు రోజుల క్రితం తీవ్ర నిర్ణయం తీసుకుని, ఎలుకల మందు సేవించింది.

​గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (GGH) కి తీసుకువెళ్లారు. అక్కడ ప్రాణాలతో పోరాడుతూ మంగళవారం రాత్రి పరిస్థితి మరింత విషమించడంతో విద్యార్థిని కన్నుమూసింది. కళ్లెదుటే పెరిగి పెద్దయిన బిడ్డ విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పెదనందిపాడు ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

స్పీడ్ న్యూస్ విజ్ఞప్తి:

విద్యార్థులకు, తల్లిదండ్రులకు మాదొక చిన్న విజ్ఞప్తి. పరీక్షలు, అందులో వచ్చే మార్కులు మాత్రమే జీవితాన్ని నిర్ణయించలేవు. ఫెయిల్ అవ్వడం అనేది జీవితానికి ముగింపు కాదు, అది మరో ప్రయత్నానికి నాంది మాత్రమే. పిల్లలు ఒత్తిడిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా వారికి అండగా నిలవాలి, ధైర్యం చెప్పాలి. క్షణికావేశంలో ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుని కన్నవారికి కడుపుకోత మిగల్చకండి.

- ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి.. మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి