మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

ప్రజా ప్రతినిధిగా నిలబెట్టిన లోకేష్ చంద్రబాబుకి ధన్యవాదాలు అంటూ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన కేశినేని శ్వేత

ప్రజా ప్రతినిధిగా నిలబెట్టిన లోకేష్ చంద్రబాబుకి ధన్యవాదాలు అంటూ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన కేశినేని శ్వేత


విజయవాడ :-  గత కొంతకాలంగా విజయవాడ రాజకీయాల్లో చర్చినియాంసమైన కేశినేని బ్రదర్స్ వార్ లో భాగంగా ఈరోజు కేశినేని శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తూ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏమీ తెలియని తనను ప్రజా ప్రతినిధిని చేసి విజయవాడ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన నారా లోకేష్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అంటూ, తన వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తన తండ్రికి జరిగిన అవమాన దృశ్యం గౌరవం లేని చోట పనిచేయలేమని ఆమె తెలిపారు. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో రాజకీయాలకు వచ్చినట్లు ఆమె తెలిపారు. అలాగే విజయవాడ మరియు 11వ డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని అభిమానులు డైలమాలో పడ్డారు. నిన్న జరిగిన రా కదలిరా అనే చంద్రబాబు బహిరంగ సభకు కేశినేని చిన్ని అధ్యక్షత వహించటంతో కేశినేని నాని అభిమానులు అసహనానికి గురైనట్లు నాని వర్గీయులు తెలియజేశారు.

Share:

నరసరావుపేట ఎంపీ - పయ్యనమేటు ?

 నరసరావుపేట ఎంపీ - పయ్యనమేటు ?

పలనాడు జిల్లా :- నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయల రాబోవు ఎన్నికలకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది సందిగ్ధత ఏర్పడింది. పార్లమెంట్ పరిధిలో తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకోవడంలో సఫలమయ్యారు. అయితే వైఎస్ఆర్సిపి అధిష్టానం నరసరావుపేట నుంచి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే దానికి సదరు ఎంపీ ససేమీరా అనటంతో క్యాంప్ ఆఫీస్ లోని ముఖ్య నేతలు ఖంగుతున్నారు. అయితే ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను గుంటూరు పార్లమెంటు నుండి పోటీ చేయమని అధిష్టానం కోరిందని కానీ తాను నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని కరాకండిగా తెలియజేశారు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో తాను చేయాల్సిన పనులు ఇంకా చాలా మిగిలి ఉన్నాయని వాటన్నిటిని తాను పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో తాను గుంటూరు నుండి పోటీ చేయనని నరసరావుపేట నుంచి మాత్రమే పోటీ చేస్తానని తెలియజేశారు. గతంలో చిలకలూరిపేట శాసనసభ్యురాలుగా ఉన్న మంత్రి విడదల రజినికి మరియు ఎంపీకి మధ్య ఉన్న విభేదాల వలన పార్లమెంటు పరిధిలోని చాలా పనులు ఆటంకం కలిగాయని ఇప్పుడు మళ్లీ గుంటూరు నుంచి పోటీ చేస్తే అదే విడదల రజిని కూడా గుంటూరు పశ్చిమ నుండి పోటీ చేయడం తర్వాత వచ్చే పరిణామాలు దృష్ట్యా ఎంపీ గుంటూరు నుంచి పోటీ చేయకూడదని అనుకుంటున్నారని పలువురి అభిప్రాయం. మెయిన్ రోడ్, చిన్నరథం సెంటర్, చిలకలూరిపేట.



Share:

వైసీపీకి షాక్ ఇచ్చిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు

వైసీపీకి షాక్ ఇచ్చిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు 

ఆంధ్రప్రదేశ్ :- గత కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున తన మార్కును చాటి విస్తృతంగా పర్యటన చేసిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు తిరిగి అదే పార్టీకి షాక్ ఇవ్వటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయానికి అభిమానులు ఒకింత షాక్కి గురయ్యారు. కొన్ని నెలల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరిన అంబటి రాయుడు గుంటూరు, విజయవాడ కాన్స్టెన్సీ లో టికెట్ ఆశించడం జరిగింది. అయితే ఆ రెండు కాన్స్టెన్సీలో గెలుపు రాయులకు టికెట్లు కన్ఫర్మ్ చేయడంతో అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి తాను వైసిపి నుండి బయటకు వస్తున్నట్లు కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండి తర్వాత కార్యాచరణను ప్రకటిస్తారని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Share:

టిడిపికి బిగ్ షాక్ - ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు

 టిడిపికి బిగ్ షాక్ - ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు


ఆంధ్రప్రదేశ్ :- టిడిపికి వెన్నుదండగా ఉండే ముఖ్య నేతలలో విజయవాడ ఎంపీ కేసీనేని నాని ఒకరు. గత కొన్ని రోజులుగా తన తమ్ముడు కేశినేని చిన్నికి నానికి మధ్య జరుగుతున్న సంఘటన దృష్ట్యా కేశినేని నాని టిడిపికి రాజీనా మా చేయాలని ఆలోచనలో ఉన్నట్టు ఆయన చేసిన పోస్ట్ తెలుగు తమ్ముళ్లకు ఒకింత ఆందోళనకు గురిచేస్తుంది. "అందరికీ నమస్కారం. టిడిపికి నా అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా నేను టిడిపిలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నా భావన. త్వరలో ఢిల్లీ వెళ్లి నా రాజీనామా ఆమోదించుకునే టిడిపికి రాజీనామా చేస్తానని" ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ పోస్టుతో టిడిపిలో తీవ్ర దుమారం రేగుతుంది.

Share:

రేపు పెళ్లి అనగా ఈ రోజు యాక్సిడెంట్ లో పద్మశాలి పేటకు చెందిన యువతి మృతి

రేపు పెళ్లి అనగా ఈ రోజు యాక్సిడెంట్ లో పద్మశాలి పేటకు చెందిన యువతి మృతి

రేపు పెళ్లి అనగా ఈ రోజు యాక్సిడెంట్ లో పద్మశాలి పేటకు చెందిన యువతి మృతి

చిలకలూరిపేట టౌన్ :- చిలకలూరిపేట పట్టణం లోని పద్మశాలి పేట కు చెందిన సాయి లక్ష్మి (30) అనే యువతి తన తల్లితో కలిసి స్కూటీ పై గుంటూరు వెళుతుండగా మార్గ మధ్యలో యడ్లపాడు సమీపంలో ఆగి ఉన్న వసంత నూనె మిల్లు కు సంబంధించిన బస్సును ఢీకొట్టడంతో యువతి అక్కడికక్కడే మరణించింది. వెనక ఉన్న తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు బస్సు డ్రైవర్ రోడ్డు పక్కన బస్సు ని ఆపి కాలకృత్యాలు తీసుకుంటుండగా సాయి లక్ష్మి ఆమె తల్లి తో పాటు స్కూటీపై వెళ్తుండగా రోడ్డుపై ఎవరో దిష్టి తీసిన కొబ్బరికాయ కొట్టి ఉండటంతో దాన్ని తప్పించబోయి వేగాన్ని ఆపలేక ఘటన జరిగినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న యడ్లపాడు పోలీసు వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి యువతి మృతదేహాన్ని చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పటల్ కు తీవ్రగాయాలైన తల్లిని గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు. విషాదకరమైన విషయం ఏమిటంటే యువతికి రేపు వివాహం అనగా ఈ రోజు ఆమె మృతి చెందటంతో పట్టణంలోని ఆమె నివాస గృహం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. మృతి చెందిన యువతి సాయి లక్ష్మి స్థానిక బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నందు ఆధార్ సెంటర్ లో పని చేస్తున్నట్లు సమాచారం.

Share:

రేపు చిలకలూరిపేట థియేటర్లో పోకిరి సినిమా 4K HD ప్రింట్ తో స్పెషల్ ఫ్యాన్స్ షోస్

రేపు చిలకలూరిపేట థియేటర్లో పోకిరి సినిమా 4K HD ప్రింట్ తో స్పెషల్ ఫ్యాన్స్ షోస్ 

https://chilakaluripetspeednews.blogspot.com/



చిలకలూరిపేట రేపు అనగా ఈ నెల 9వ తారీకు మహేష్ బాబు జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోకిరి చిత్ర ప్రదర్శనను 4K HD ప్రింట్ ద్వారా అభిమానులకు ప్రదర్శించాలని పోకిరి సినిమా డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అదేవిధంగా చిలకలూరిపేట మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అభిమానుల కోసం పోకిరి సినిమా ప్రదర్శనను పట్టణంలోని సాయి కార్తీక్ థియేటర్ నందు సాయంత్రం 6 గంటల షో మరియు 9 గంటల షోలను ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఫ్యాన్స్ హంగామాతో అడ్వాన్స్ బుకింగ్ కొనసాగుతుంది. తమ అభిమాన నటుడి సినిమా చిత్రం 4K HD ప్రెంట్ తో మళ్లీ రిలీజ్ చేయటం తో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.
Share:

చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి జాతీయ జెండాల పంపిణీ - కమిషనర్

చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి జాతీయ జెండాల పంపిణీ - కమిషనర్

చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి జాతీయ జెండాల పంపిణీ - కమిషనర్


చిలకలూరిపేట భారతదేశం స్వతంత్రం పొంది 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత మహోత్సవాల న చిలకలూరిపేట పట్టణంలో కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ ... చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల పై ఈనెల అనగా ఆగస్టు 13, 14 ,15, తేదీలలో ఈ జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యతను చాటిచెప్పాలని కమిషనర్ కోరారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి