మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

మహిళా చదువు - అభివృద్ధి మెరుగు * ఆర్థికంగా వెనుకబడి టాలెంట్ ఉన్నా బాలికల విద్యాభివృద్ధికి నా వంతు సాయం చేస్తాను - సీఐ రాజేశ్వర రావు

మహిళా చదువు - అభివృద్ధి మెరుగు * ఆర్థికంగా వెనుకబడి టాలెంట్ ఉన్నా బాలికల విద్యాభివృద్ధికి నా వంతు సాయం చేస్తాను - సీఐ రాజేశ్వర రావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని ఆది ఆంధ్ర కాలనీ లో ఏర్పాటుచేసిన మహిళ బాలికల రక్షణ మరియు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు అందులో భాగంగా టౌన్ సీఐ రాజేశ్వరరావు మహిళల చదువు వారి యొక్క ఒక అభివృద్ధి అపోహల పై మాట్లాడుతూ సమాజంలో మహిళల చదువు ఎంతో ఉపయోగకరమని, మహిళలు చదువుకోవడం వలన సమస్యలు ఏర్పడతాయి... అన్నా అపోహల నుండి బయటకి రావాలని, తాను ప్రభుత్వ ఉద్యోగిని అయినప్పటికీ సొంత ఊరికి దూరంగా ఉండి విధులను నిర్వహిస్తున్నామని, కానీ మహిళలు చదువుకోవడం వలన స్థానికంగానే అనేక ఉద్యోగ సదుపాయాలు ఉన్నాయని. ఉదాహరణకు ఏఎన్ఎంలు ,వాలంటీర్లను చూపిస్తూ కష్టపడి చదవడం వలన సొంత ఊరిలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నారని, అలాగే స్త్రీలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నెలకు లక్ష నుండి మూడు లక్షల వరకు జీతం సంపాదిస్తున్నారని, గుర్తు చేశారు. టాలెంట్ ఉండి ఆర్థికంగా వెనుకబడిన బాలికలకు తన వంతు సహాయంగా కృషి చేస్తానని. ఈ సందర్భంగా సిఐ రాజేశ్వరరావు తెలిపారు. అలాగే దిశ చట్టంపై అవగాహన కలిగించారు. మహిళలు అభద్రతా భావాన్ని తొలగించుకోవాలని స్త్రీ ఒక శక్తిగా ఉండాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు తెలియజేశారు.



Share:

చిలకలూరిపేట:- విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు - సభ్యుల వివరాలు ఇవే

చిలకలూరిపేట:- విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు  - సభ్యుల వివరాలు ఇవే

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గంలోని పాఠశాలలు కళాశాలలోని విద్యార్థులు వారి యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం పట్టణంలోని విద్యార్థులు అందరూ కలిసి 10/11/2021 న‌ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) (నాన్ పొలిటికల్) ఏర్పాటు చేసుకున్నారు. ఈ అందులో భాగంగా విద్యార్థులకు వారి యొక్క హక్కులను తెలియజేస్తూ - హక్కులకు భంగం కలిగించే ఏ చర్యను సహించబోమని వాటిపై న్యాయ పోరాటం చేసి సాధించుకుంటామని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ జేఏసీ కమిటీ ఏ పార్టీలకు సంబంధం లేదని విద్యార్థుల హక్కులను పరిరక్షించడానికి ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ జేఏసీ విద్యార్థులందరికీ భవిష్యత్తుకు ఉపయోగపడేది లాగా పనిచేయాలని అని వారు తీర్మానించుకున్నారు. ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి ప్రెసిడెంట్ గా సి ఆర్ కాలేజీ కి సంబంధించిన విద్యార్థి యు.సిద్దు, వైస్ ప్రెసిడెంట్ గా రోహిణి డిగ్రీ కళాశాల కు సంబంధించిన విద్యార్థి మేకపోతుల. నాగేశ్వరరావు, ఎం. సాయి తేజ, సెక్రెటరీగా గుడిపల్లి. జగదీష్, జాయింట్ సెక్రటరీగా మాదాసు. పృథ్వీరాజ్, ఎ. త్రినాధ్, ట్రెజరీ గా మండాది ఫణి, నెంబర్లుగా భగత్ సింగ్, పి. మహేష్, మురారి (DRNS), మస్తాన్ వలీ, ఆలీ బాబు గా తన 13 మంది సభ్యుల తో జేఏసీ ని ఏర్పాటు చేశారు.



Share:

అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఉద్రిక్తత !!!

అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఉద్రిక్తత !!!

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అమరావతి రైతుల మహా పాదయాత్ర ఈరోజు 11వ రోజు కి చేరింది అందులో భాగంగా ప్రకాశం జిల్లా చదలవాడ ఊర్లో రైతులు పాదయాత్ర కొనసాగిస్తుండగా. పోలీసులు ఒక్కసారిగా లాఠీఛార్జ్ చేశారు. రైతులకు మద్దతు తెలపడానికి వచ్చిన స్థానిక రైతుల పై కూడా లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో సంతనూతలపాడు గ్రామానికి చెందిన నాగార్జున అనే వ్యక్తి గాయాలయ్యాయి. రైతులను పాదయాత్ర చేయకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఘటన లోని రైతు మాట్లాడుతూ న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమానికి ప్రతి ఊరు నుండి వేలాదిమంది ప్రజలు రైతులు మద్దతు తెలుపుతున్నారని. శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటూ ఉండే మాపై లాఠీ ఛార్జ్ చేయడం సముచితం కాదని వారు తెలిపారు.



Share:

దొంగ దొరికాడు - చాకచక్యంగా పట్టుకున్న టౌన్ పోలీస్ శాఖ

దొంగ దొరికాడు - చాకచక్యంగా పట్టుకున్న టౌన్ పోలీస్ శాఖ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట ఈనెల 8 వ తారీఖున పండరీపురం 8 వ లైను నందు అంబటిపూడి శారద అనే మహిళ నడుచుకుంటూ వెళుతుండగా .. అది గమనించిన చైన్ స్నచర్ వెనకనుండి వచ్చి అమాంతం ఆమె మెడలోని మూడు సవర్ల బంగారపు గొలుసును లాక్కొని వెళ్ళిపోయాడు. వెంటనే టౌన్ పోలీస్ శాఖకు విషయం తెలియజేయగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా దుండగుడు పట్టణంలోని సంజీవ్ నగర్ కు చెందిన బత్తుల నాగేంద్రబాబు గా గుర్తించారు. పోలీసు విచారణలో తాను పెయింట్ వర్క్ చేస్తుంటాడని, అప్పుల బాధతో ఇలాంటి చర్యకు పాల్పడ్డాడని తెలిపాడు. పోలీసులు బంగారు గొలుసును రికవరీ చేశారు. కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే దొంగను పట్టుకోవడంతో సీఐ రాజేశ్వరరావు టౌన్ ఎస్ఐ ఫిరోజ్ ను అభినందించారు.



Share:

చిలకలూరిపేట:- పొలాల్లోకి దూసుకు వెళ్ళిన RTC బస్సు

చిలకలూరిపేట:- పొలాల్లోకి దూసుకు వెళ్ళిన RTC బస్సు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నుండి నరసరావుపేట బయలుదేరిన నరసరావుపేట డిపో ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకుపోయింది. నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వచ్చి దారిలో అమీన్ సాహెబ్ పాలెం సమీపంలోని బసిక పురం గ్రామం వద్ద బస్సు అదుపు తప్పి పొలాల్లో కి వెళ్ళింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అనంతరం వెనక నుండి వచ్చే ఆర్టీసీ బస్సు లో మిగిలిన ప్రయాణికులను ఎక్కించి బస్సు డ్రైవర్ నరసరావుపేట డిపో కి ఘటనను వివరించారు.



Share:

ప్రకృతి వైద్య నిపుణుడు( అవిసాపాలెం కట్టు) పూనాటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి

ప్రకృతి వైద్య నిపుణుడు( అవిసాపాలెం కట్టు) పూనాటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అవిసాపాలెం కట్టు అంటే దేశ నలుమూలల నుండి ప్రత్యేకంగా గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాలలో కాళ్లు చేతులకు ఎముకలు ఏమి విరిగిన శస్త్రచికిత్సతో కాకుండా ప్రకృతి వైద్యం ద్వారా నయం చేస్తూ తమకంటూ ఒక గుర్తింపు పొందినది పూనాటి కుటుంబం. అయితే ఆ కుటుంబం లో ఒకరైన వైద్య నిపుణులు పునాటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందారు. అవిసాపాలెం కట్టు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. అంతటి గుర్తింపు కలిగిన వీరి వద్దకు ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి వైద్యం చేయించుకొని వెళ్లేవారు. 1900 సంవత్సరం నుండి పూనాటి వీరయ్య చౌదరి తదనంతరం వారి కుమారులు ఇప్పుడు వారి మనవళ్లు, ముని మనవాళ్ళు, వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. పూనాటి వెంకటేశ్వర్లు మృతి పట్ల గ్రామ పెద్దలు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంతాపం తెలిపారు.



Share:

విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ - చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్

విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ - చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- ఎయిడెడ్ స్కూల్స్ & కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నందుకు గాను అనంతపురంలో విద్యార్థులపై జరిగిన ఘటనలను నిరసిస్తూ చిలకలూరిపేట అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మురారి మాట్లాడుతూ ఎయిడెడ్ కాలేజీ & స్కూల్స్ నందు పేద విద్యార్థులు మాత్రమే చదువుకుంటానని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 38, 42 జీవోలను తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు. ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన ఎయిడెడ్ కాలేజీలను & స్కూళ్ల పై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో "విద్యార్థులతో చెలగాటమా ఖబడ్దార్ ఖబడ్దార్" అనే నినాదంతో విద్యార్థులు పట్టణంలోని వీధులన్నీ మోత మోగించారు.

                                                VIDEO  మీకోసం 

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి