|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిరేపు 19-04-2021 ఫీజు రేయింబర్సమెంట్ డబ్బులు విడుదల - నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలోకి
ఎప్పటి నుండో విద్యార్థులు ఎదురు చూస్తున్నా జగనన్న విద్య దీవెన పధకం కింద ఫీజు రేయింబర్స్మెంట్ డబ్బులను రేపు అనగా 19-04-2021 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. కాలేజీ, స్కూల్ యాజమాన్యాలకు కాకుండా నేరుగా తల్లుల బ్యాంకు ఖాతా కి తరలిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా 10 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది. ఇప్పటికే కాలేజీల యాజమాన్యం పలు సార్లు విద్యార్ధులకి ఫీజు కట్టమని నోటీసులు పంపించారు.
చిలకలూరిపేట- మురికి కాలవలో పసిపాప మృతుదేహం కలకలం
చిలకలూరిపేట- మురికి కాలవలో పసిపాప మృతుదేహం కలకలం
పట్టణంలోని పోలిరెడ్డిపాలెం మదర్ థెరిస్సా కాలనీ లోని ఒక మురికి కాల్వలో పసిపాప మృతుదేహం కలచివేసింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు, మున్సిపల్ సిబ్బంది మృతుదేహాన్ని బయటకు తీశారు. నెలల పాప ని ఇలా కాలవలో పడేయటం స్థానికులని కలచివేసింది. ఈ దుర్మార్గపు చర్యకు కారణం కనుకునే పనిలో పడ్డారు స్థానికులు.
చిలకలూరిపేట విద్య సంఘం అధ్యక్షులుగా ఎన్నిక అయిన కార్యవర్గాన్ని గారిని సత్కరించిన మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు
చిలకలూరిపేట విద్య సంఘం అధ్యక్షులుగా ఎన్నిక అయిన కార్యవర్గాన్ని గారిని సత్కరించిన మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు
చిలకలూరిపేట లో గడిచిన విద్య సంఘం ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని సత్కరించారు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు. అధ్యక్షునిగా తేళ్ల సుబ్బారావు గారు, ఉపాధ్యక్షునిగా ఘంటా జగన్నాధం గారు, సెక్రెటరీ గా మైలవరపు శివానంద కుమార్ గారు, సంయుక్త కార్యదర్శి గా బేతంచర్ల రామకోటీశ్వరావు గారు, కోశాధికారిగా బచ్చు రామలింగేశ్వరావు గారు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా పుల్లరావు గారు మాట్లాడుతూ 5 సార్లు ఎన్నిక అయిన 14 సంవత్సరాల నుండి విద్య సంఘం అధ్యక్షునిగా ఎన్నిక అయిన తేళ్ల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో సేవలు గుర్తు చేసుకొని ఇలాగే మరింత అభివృద్ధి పధంలో ముందుకి సాగాలి అని తెలిపారు.
బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద కూరగాయలతో లోడ్ తో వెళ్తున్న ఆటో బోల్తా
బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద కూరగాయలతో లోడ్ తో వెళ్తున్న ఆటో బోల్తా
చిలకలూరిపేట బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద కూరగాయలతో వెళ్తున్న అప్పి ఆటో బోల్తా పడింది. వివరాలలోకి వెళ్తే గోవింద పురం కి చెందిన పెద్ద వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పొలం లో పండిన కూరగాయలను తీసుకొని మార్టూరు మార్కెట్ కి వెళ్లే దారిలో ఆంజనేయస్వామి గుడి వద్ద జాతీయ రహదారి పైన ఒంగోలు వైపు వెళ్తున్న లారీ అప్పి ఆటోని ఢీ కొన్నది. ఆటో అదుపుతప్పి రోడ్ పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి బోల్తా పడింది. ఈ సమయంలో ఆటో లో ప్రయాణిస్తున్న వ్యక్తి మరియు డ్రైవర్ గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనం సిబ్బంది అక్కడకి వచ్చి గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు.
చిలకలూరిపేటలో సోమవారం నుండి 9 నుండి 6 వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంటాయి
CHILAKALURI PET SPEED NEWSSaturday, April 17, 2021కరోనా న్యూస్, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
1 comment
చిలకలూరిపేటలో సోమవారం నుండి 9 నుండి 6 వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంటాయి
పట్టంలోని మునిసిపల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలు విషయాలు చర్చించారు. ఈ సమావేశంలో చైర్మెన్ రఫాని గారు, వైస్ చైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు గారు, కమిష్నర్ రవీంద్ర గారు,ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ పట్టణ అధ్యక్షులు కూనల సుబ్రమణ్యం గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా రోజు రోజుకి విస్తరిస్తున్న క్రమంలో పట్టణంలోని అన్ని వ్యాపార దుకాణాలు స్వచ్చందంగా సోమవారం నుండి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచివుంటాము అని తెలిపారు. పట్టణ ప్రజలు ఇది గమనించి సహకరించవలసినదిగా కోరారు. అలాగే ప్రతి దుకాణంలో నో మాస్క్ నో సేల్ బోర్డు పెట్టాలి తెలిపారు . కరోనా నియమాలి తప్పకుండా పాటించాలి అని తెలిపారు.
మురికిపూడిలో అసైన్ట్ భూముల విషయం ఒకే పార్టీ చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ
మురికిపూడిలో అసైన్ట్ భూముల విషయం ఒకే పార్టీ చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ
చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామము నందు శుక్రవారం నాడు రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని జమ్మలమడక ఆదిబాబు అసైన్ట్ భూముల విషయం మాట్లాడటానికి అదే గ్రామాని చెందిన ఆరుమళ్ల వెంకట శివ అనే వ్వక్తి ఇంటి వద్దకు వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో భూముల విషయం అడగగా వారి మధ్య మాటలు దాటి వెంకటశివ ఆదిబాబుని నెట్టాడు. ఆ సమయంలో ఆదిబాబు పక్కనే ఉన్న కాలవలో పడ్డాడు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాటతో ఘర్షణ వాతావరం నెలకొన్నది. ఇరువర్గాలు రురల్ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువర్గాలు ఒకే పార్టీ కావటం విశేషం.
తమిళ స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటుతో కన్నుమూత
తమిళ స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటుతో కన్నుమూత
తమిళ సినీ పరిశ్రమకి చెందిన స్టార్ కమెడియన్ వివేక్ (59) ఈ రోజు తెల్లవారు జామున 4:35 గంటలకు మరణించినట్లు వైద్యులు తెలిపారు. శుక్రువారం ఉదయం 11 గంటల సమయంలో తీవ్ర గుండెనొప్పితో చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించటంతో మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న చిత్ర పరిశ్రమ దిగ్బ్రతికి లోనైనది. తెలుగులో డబ్బింగ్ సినిమాలతో పరిచయం అయ్యారు. అపరిచితుడు, శివాజీ ది బాస్ లాంటి సినిమాలో చాల తెలుగు డబ్బింగ్ మూవీస్ నందు నటించారు.











