మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేటలో రూరల్ లో విషాద ఛాయలు.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యలు..​కలచివేసిన రెండు ఘటనలు: ఉరికొయ్యకు విద్యార్థి.. ఎలుకల మందుకు ఇద్దరు పిల్లల తల్లి బలి! పూర్తి వివరాలు కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి..

చిలకలూరిపేటలో రూరల్ లో విషాద ఛాయలు.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యలు..​కలచివేసిన రెండు ఘటనలు: ఉరికొయ్యకు విద్యార్థి.. ఎలుకల మందుకు ఇద్దరు పిల్లల తల్లి బలి!


చిలకలూరిపేట నియోజకవర్గంలో తీవ్ర విషాదం.. వేరువేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్య 🚨

​చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో మంగళవారం రెండు వేరువేరు ప్రాంతాల్లో జరిగిన ఆత్మహత్య ఘటనలు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపాయి. చదువుల ఒత్తిడితో ఒకరు, అనారోగ్య సమస్యలతో మరొకరు బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచివేసింది.

​💔 చదువుల ఒత్తిడికి బలైపోయిన ఇంటర్ విద్యార్థి.. కొండవీడులో విషాదం 💔

​చదువుల ఒత్తిడి మరో లేత ప్రాణాన్ని బలితీసుకుంది. ఎడ్లపాడు మండలం కొండవీడులో కన్నవారికి కడుపుకోత మిగిల్చే ఘటన చోటుచేసుకుంది. గుంటూరులోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న కట్టా ఇసాక్ వెస్లీ పాల్ (19) అనే విద్యార్థి ఉరివేసుకుని తనువు చాలించాడు. చదువులో తాను ఆశించిన స్థాయిలో మార్కులు, ఫలితాలు రాకపోవడంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భవిష్యత్తుపై బెంగతో క్షణికావేశంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చేతికి అందివచ్చిన కొడుకు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 🚓

​😭 అనారోగ్యం తెచ్చిన కష్టం.. ఇద్దరు పసిపిల్లలను వదిలి తల్లి ఆత్మహత్య 😭

​చిలకలూరిపేట మండలం వేలూరులో మరో హృదయ విదారక ఘటన జరిగింది. అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన అలా పవన్ కుమార్ భార్య దివ్య సాయి (22) గత ఆరు నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఎంత వైద్యం చేయించినా నయం కాకపోవడం, చిన్న పనులకే నీరసించిపోతుండటంతో ఆమె శారీరకంగా, మానసికంగా తీవ్రంగా కుంగిపోయింది. ఈ క్రమంలో జులై 30వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది.

​మరుసటి రోజు ఉదయం ఆమె తీవ్రంగా వాంతులు చేసుకుంటుండటాన్ని గమనించిన తండ్రి వంశీకృష్ణ.. మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. 🚑 అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఐదు రోజుల పాటు పోరాడిన ఆమె, మంగళవారం (ఆగస్టు 4న) ఉదయం కన్నుమూసింది. మృతురాలికి ఇద్దరు చిన్నారి కుమార్తెలు ఉండటం, పసిపిల్లలు తల్లి లేని అనాధలు కావడం స్థానికులను కంటతడి పెట్టించింది. తండ్రి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై జి.అనిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

​🤝 స్పీడ్ న్యూస్ విజ్ఞప్తి:

ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదు. సమస్యలు, ఒత్తిడి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో పంచుకోండి. మీరు ప్రాణాలు తీసుకుంటే మీపై ఆధారపడిన మీ కుటుంబం రోడ్డున పడుతుందని గుర్తుంచుకోండి. మానసిక ఒత్తిడి అనిపిస్తే వెంటనే 104 లేదా 100 కు కాల్ చేసి కౌన్సెలింగ్ పొందండి. 🙏

Share:

చిలకలూరిపేట బైపాస్‌పై భారీ స్కెచ్.. నట్లు ఊడదీశారు, రేపు బారియర్స్ ఎత్తేస్తారు... కొత్త బైపాస్ పైన దొంగల కన్ను! అసలేం జరిగింది తెలుసుకోవడం కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి...

చిలకలూరిపేట బైపాస్‌పై భారీ స్కెచ్.. నట్లు ఊడదీశారు, రేపు బారియర్స్ ఎత్తేస్తారు... కొత్త బైపాస్ పైన దొంగల కన్ను! అసలేం జరిగింది తెలుసుకోవడం కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి...


ఎంతో సుందరంగా, రవాణాకు ఎంతో సౌకర్యవంతంగా ముస్తాబైన మన చిలకలూరిపేట కొత్త బైపాస్ పైన ఇప్పుడు దొంగల కళ్లు కుట్టాయి. అద్భుతమైన నిర్మాణంతో మురిపిస్తున్న ఈ బైపాస్ పై, సామాన్యుల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ ఆస్తులను సైతం కేటుగాళ్లు వదిలిపెట్టడం లేదు.

​🚧 క్రాష్ బారియర్స్ ని కూడా వదలని కేటుగాళ్లు!

హైవేపై ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహనాలు అదుపుతప్పి కింద ఉన్న సర్వీస్ రోడ్డు మీదకు దూసుకురాకుండా అడ్డుకునే అత్యంత కీలకమైన ఇనుప కవచాలే ఈ 'క్రాష్ బారియర్స్'. లక్షల రూపాయల విలువ చేసే ఈ రక్షణ గోడలపై ఇప్పుడు దొంగలు కన్నేశారు. వాటికి ఉన్న నట్లు, బోల్ట్లను ముందుగానే పకడ్బందీగా తొలగించారు. ఒకేసారి ఇనుప రేకులను దొంగతనం చేస్తే దొరికిపోతామనే భయంతోనో ఏమో.. ఇలా విడతల వారీగా స్కెచ్ గీశారు. పరిస్థితులు చూస్తుంటే రేపో, ఎల్లుండో ఆ భారీ ఇనుప బారియర్స్ ని కూడా అమాంతం ఎత్తుకుపోయేలా ఉన్నారు.

​🚶‍♂️ అవాక్కవుతున్న వాకర్స్.. పొంచి ఉన్న పెను ప్రమాదం!

రోజూ ఉదయాన్నే బైపాస్ పై వాకింగ్ కి వెళ్లే పాదచారులు ఈ దొంగల బరితెగింపును చూసి అవాక్కవుతున్నారు. ఇంత చిన్న నట్లు, బోల్ట్లను కూడా వదలడం లేదంటే దొంగలు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ బారియర్స్ ను దొంగలిస్తే.. హైవేపై జరిగే చిన్న ప్రమాదం కూడా సర్వీస్ రోడ్డుపై ప్రయాణించే వారి ప్రాణాలను బలితీసుకునేంత తీవ్రంగా మారుతుంది. ఇది నేరుగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే!

​🚓 నైట్ పెట్రోలింగ్ పెంచాలి.. కఠిన చర్యలు తీసుకోవాలి!

ప్రజా భద్రత కోసం ఏర్పాటు చేసిన ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే పోలీసు యంత్రాంగం స్పందించి, బైపాస్ పై నైట్ పూట గస్తీ (Night Patrolling) ముమ్మరం చేయాలని, అసాంఘిక శక్తుల ఆగడాలకు తక్షణమే అడ్డుకట్ట వేసి మన బైపాస్ అందాన్ని, భద్రతను కాపాడాలని చిలకలూరిపేట వాసులు కోరుతున్నారు.

దానికి సంబందించిన వీడియో కోసం క్రింది లింక్ పైన క్లిక్ చెయ్యండి.

https://www.instagram.com/reel/DbmxImeJacp/?igsh=M2F0cHNxcHg1dGgy

Share:

చిలకలూరిపేట - సుబ్బయ్య తోటలో పెట్రోల్ దొంగల పంజా... వీధిలైట్లు లేని రోడ్లే టార్గెట్...నిద్రపోతున్న అధికారులు... ప్రాణభయంలో ప్రజలు! ఆ ప్రాంతంలో దారుణ పరిస్థితులు... అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం క్రింద లింక్ పై క్లిక్ చేయండి....

చిలకలూరిపేట - సుబ్బయ్య తోటలో పెట్రోల్ దొంగల పంజా... వీధిలైట్లు లేని రోడ్లే టార్గెట్...నిద్రపోతున్న అధికారులు... ప్రాణభయంలో ప్రజలు! ఆ ప్రాంతంలో దారుణ పరిస్థితులు...


చిలకలూరిపేటలో చీకటి రాజ్యం... దడ పుట్టిస్తున్న దొంగలు, భయపెడుతున్న వీధి కుక్కలు! 🚨

​గత కొద్ది రోజులుగా చిలకలూరిపేట పట్టణ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఒకవైపు దొంగల హడావిడి, మరోవైపు వీధి కుక్కల స్వైర విహారం... వీటికి తోడు అధికారుల నిర్లక్ష్యం తోడై పట్టణంలో భయానక వాతావరణం నెలకొంది. కరెంటు లేని చీకటి వీధుల్లో రాత్రివేళ ఏం జరుగుతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

​💡 వెలుగని వీధి దీపాలు... దొంగలకు వరాలు! 🥷

సుబ్బయ్య తోట, పాత రవి ఎక్స్-రే రోడ్డు పరిసర ప్రాంతాలు ఇప్పుడు దొంగలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. రాత్రి అయితే చాలు ఈ ప్రాంతాలు చిమ్మ చీకట్లోకి జారుకుంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో వెలగని వీధి దీపాలు దొంగలకు అడ్డాగా, చోరీలకు అనువైన ప్రదేశాలుగా మారుతున్నాయి. ఏ మూల నుంచి ఎవరు దాడి చేస్తారో అర్థం కాని గగుర్పాటు కలిగించే పరిస్థితి ఇక్కడ నెలకొంది.

​🏍️ చుక్క చుక్కా... పెట్రోల్ పాయే!

చీకటిని ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు, ఇళ్ల బయట పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేస్తున్నారు. ప్రతిరోజూ రాత్రి వాహనాల్లోని పెట్రోల్ చోరీకి గురవుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. రాత్రిపూట ఏదైనా అలికిడి వినిపించి, ఏ దొంగలో పడ్డారని చూద్దామంటే... ఆ చిమ్మచీకట్లో వాళ్ళు ఎదురుదాడి చేస్తే ప్రాణాలు ఎక్కడ పోతాయోనన్న భయంతో ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోవాల్సిన దయనీయ స్థితి దాపురించింది. దొంగలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.

​🐕 కుక్కల స్వైర విహారం... ప్రాణాల మీదకు వస్తున్న వైనం! 🩸

దొంగల భయం ఒక ఎత్తయితే... వీధి కుక్కల భయం మరొక ఎత్తు. చీకటి పడితే చాలు ప్రధాన రహదారులపై కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ దారినపోయే వారిపై ఎగబడుతున్నాయి. వాహనదారులను వెంటాడి మరీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇదే ప్రాంతంలో చీకట్లో ఉన్న ఒక చిన్నారిపై కుక్కలు దాడి చేసి కాటు వేయడం స్థానికులను తీవ్ర కలవరానికి గురిచేసింది. పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు.

​⚠️ అధికారులూ... ఇంకెప్పుడు మేల్కొంటారు? 🛑

ఇన్ని సమస్యలు ఒకేసారి పట్టి పీడిస్తున్నా మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు చోద్యం చూడటం దారుణం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిద్ర మత్తు వీడి, తక్షణమే సుబ్బయ్య తోట, పాత రవి ఎక్స్-రే రోడ్డు తదితర ప్రాంతాల్లో వీధి దీపాలకు మరమ్మతులు చేయించాలి. అలాగే వీధి కుక్కల బెడదను నివారించి, పోలీసుల సాయంతో రాత్రి పూట పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా పెద్ద ప్రాణనష్టం జరిగేలోపు అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి!

- మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ 🎤

వీడియో కోసం క్రింది లింక్ పైన క్లిక్ చెయ్యండి.

https://www.instagram.com/reel/DbmhvLFJD4j/?igsh=MTQ0emN3dGVxbXhzZQ==

Share:

చిలకలూరిపేట - స్పీడ్ న్యూస్'తో ఉన్న ఆత్మీయ అనుబంధంతో.. చిలకలూరిపేటలో ఆగిన జబర్దస్త్ స్టార్స్ దొరబాబు, రైజింగ్ రాజు!సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు!.. పూర్తి వివరాల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి..

చిలకలూరిపేట - స్పీడ్ న్యూస్'తో ఉన్న ఆత్మీయ అనుబంధంతో.. చిలకలూరిపేటలో ఆగిన జబర్దస్త్ స్టార్స్ దొరబాబు, రైజింగ్ రాజు!సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు!..

చిలకలూరిపేటలో "జబర్దస్త్" సందడి: స్పీడ్ న్యూస్‌తో రైజింగ్ రాజు, దొరబాబుల ఆత్మీయ కలయిక! 💥

​బుల్లితెరపై తమ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ ఫేమ్ రైజింగ్ రాజు, దొరబాబు మన చిలకలూరిపేటలో సందడి చేశారు! స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేసే స్టార్స్ నేరుగా మన ఊరి వీధుల్లో కనిపించేసరికి పట్టణవాసులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

​కార్యక్రమ వివరాలు మన స్పీడ్ న్యూస్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా..

​🤝 స్పీడ్ న్యూస్‌తో ప్రత్యేక అనుబంధం.. 🚗

​ఒక ప్రైవేట్ ఈవెంట్ నిమిత్తం బాపట్ల వెళ్లిన ఈ జబర్దస్త్ ద్వయం, తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. మార్గమధ్యలో 'చిలకలూరిపేట స్పీడ్ న్యూస్' టీం తో తమకున్న ప్రత్యేకమైన, ఆత్మీయ అనుబంధంతో మన పట్టణంలో ఆగారు. మన స్పీడ్ న్యూస్ ప్రతినిధులను ఎంతో ఆప్యాయంగా పలకరించి, కాసేపు సరదాగా ముచ్చటించారు.

​🍽️ పద్మనాభయ్య హోటల్‌లో రుచికరమైన బ్రేక్ ఫాస్ట్! 😋

​ప్రయాణ బడలికను తీర్చుకుంటూ, చిలకలూరిపేటలో ఎంతో పేరుగాంచిన 'పద్మనాభయ్య హోటల్' కు ఈ స్టార్స్ విచ్చేశారు. సాధారణ వ్యక్తుల్లా కూర్చుని వేడి వేడి బ్రేక్ ఫాస్ట్ ఆస్వాదించారు. మన ఊరి అద్భుతమైన రుచులకు వారు ఫిదా అయ్యారు!

​☕ 'మన కాఫీ క్లబ్' సందర్శన.. కాఫీ టేస్ట్ అదుర్స్! 👌

​టిఫిన్ పూర్తయిన తర్వాత, పట్టణంలో మన వేములకొండ సంజయ్ గారు సరికొత్తగా, ఎంతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన ‘మన కాఫీ క్లబ్’ (Mana Coffee Club) పాయింట్‌ను జబర్దస్త్ ఆర్టిస్టులు సందర్శించారు. అక్కడి చక్కటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కాఫీ సిప్ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఈ కేఫ్‌ను ప్రారంభించిన సంజయ్ గారికి వారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

​📸 సెల్ఫీల హంగామా.. అభిమానుల కోలాహలం! 🎉

​టీవీలు, సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే దొరబాబు, రైజింగ్ రాజులు మన ఊర్లో ఉన్నారని తెలియగానే స్థానికులు, యువత భారీగా అక్కడికి చేరుకున్నారు. తమ అభిమాన నటులను చూసి ఉత్సాహంతో కేకలు వేశారు. అభిమానుల కోరిక మేరకు ఏమాత్రం విసుక్కోకుండా చిరునవ్వుతో అందరికీ ఫోజులిస్తూ సెల్ఫీలు దిగారు. అనంతరం అభిమానులకు బై బై చెబుతూ తమ ప్రయాణాన్ని తిరిగి హైదరాబాద్‌ వైపు కొనసాగించారు.

 దానికి సంబంధించిన వీడియో కోసం క్రింద లింక్ పై క్లిక్ చేయండి.

https://www.instagram.com/reel/DblWRVupNpg/?igsh=MXQwbHd4NWg5ejUwaw==

Share:

చిలకలూరిపేట - పేదలకు 'సబ్సిడీ' భరోసా.. అభివృద్ధి కూటమిది.. ఆరాటం వైసీపీది.. వైసిపిపై ప్రత్తిపాటి పొలిటికల్ బ్లాస్ట్!ఎల్ నినో ఎఫెక్ట్ ఉన్నా ఆకలి కష్టాలు రానివ్వం - ప్రత్తిపాటి.. పూర్తి వివరాల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి...

చిలకలూరిపేట - పేదలకు 'సబ్సిడీ' భరోసా.. అభివృద్ధి కూటమిది.. ఆరాటం వైసీపీది.. వైసిపిపై ప్రత్తిపాటి పొలిటికల్ బ్లాస్ట్!ఎల్ నినో ఎఫెక్ట్ ఉన్నా ఆకలి కష్టాలు రానివ్వం - ప్రత్తిపాటి


చిలకలూరిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అటు సంక్షేమం, ఇటు రాజకీయ విమర్శలతో హోరెత్తించారు. ఒకవైపు పేదలకు తక్కువ ధరకే బియ్యం అందిస్తూనే.. మరోవైపు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. సోమవారం చిలకలూరిపేట రైతు బజార్‌లో జరిగిన సబ్సిడీ బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఆయన చేసిన సంచలన వ్యాఖ్యల రౌండప్ మీకోసం..

​🌾 సామాన్యుడికి గుడ్ న్యూస్.. రైతు బజార్‌లో సబ్సిడీ బియ్యం! 🍚

'ఎల్ నినో' ప్రభావంతో వాతావరణంలో మార్పులు వచ్చి వరి సాగు మందగించినా.. సామాన్యుడికి ఆకలి కష్టాలు రానివ్వబోమని ప్రత్తిపాటి పుల్లారావు భరోసా ఇచ్చారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, పేదలకు ఊరటనిస్తూ చిలకలూరిపేట రైతు బజార్‌లో "ప్రభుత్వం - రైస్ మిల్లర్స్ అసోసియేషన్" సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డుదారులకు తన చేతుల మీదుగా బియ్యాన్ని పంపిణీ చేశారు. బియ్యమే కాదు.. నిత్యావసరాల ధరల నియంత్రణపై కూటమి ప్రభుత్వం డేగకన్ను వేసిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనేలేదని ఆయన స్పష్టం చేశారు.

​🗣️ జగన్‌కు ‘క్రెడిట్ చోరీ’ అనే వింత జబ్బు.. ప్రత్తిపాటి ఫైర్! 🔥

సబ్సిడీ కేంద్రం ప్రారంభం అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి.. మాజీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం జగన్ "క్రెడిట్ చోరీ" అనే ఒక కొత్త రకం వింత జబ్బుతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇతరులు చేసిన మంచిని, వాళ్ల గొప్పతనాన్ని సిగ్గులేకుండా తన ఖాతాలో వేసుకోవడమే ఈ జబ్బు ప్రధాన లక్షణమన్నారు. గత రెండేళ్లుగా తన చేతిలోని అవినీతి సొమ్ముతో, ఫేక్ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వ విజయాలను తనవిగా ప్రచారం చేసుకుంటూ.. తనను తాను మోసం చేసుకుంటున్నారని మండిపడ్డారు.

​✈️ భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ బాబుదే.. వైసీపీది అసూయ! 🦅

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం) ప్రారంభమైతే.. ఆ ఖ్యాతి తనదేనని జగన్ చెప్పుకోవడం పచ్చి అబద్ధమని ప్రత్తిపాటి ధ్వజమెత్తారు. కోర్టు కేసులు పరిష్కరించి, శంకుస్థాపన నుంచి నిర్మాణ పనుల వరకు అన్నీ చంద్రబాబు నాయుడి హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ రాష్ట్రం కోసం అహర్నిశలు పడుతున్న కష్టాన్ని, వారికి ప్రధాని మోదీ ఇస్తున్న సపోర్ట్‌ను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాకెట్ స్పీడ్‌తో ఏపీ అభివృద్ధి చెందుతుంటే.. అది చూసి వైసీపీ నేతలు అసూయతో రగిలిపోతున్నారని ఆయన దుయ్యబట్టారు.

​🤝 పాల్గొన్న టీడీపీ, కూటమి శ్రేణులు 👥

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావుతో పాటు మద్దిబోయిన శివ, ముల్లా కరిముల్లా, మురకొండ మల్లిబాబు, కూటమి నాయకులు, స్థానిక అధికారులు మరియు చిలకలూరిపేట ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share:

లకలూరిపేటలో ​ప్లానింగ్ నిల్.. హడావుడి ఫుల్! చిలకలూరిపేటలో వికటించిన 'నైట్ శానిటేషన్'...ఆకతాయిలు, వీధి కుక్కల మధ్య వదిలేస్తారా? పారిశుధ్య కార్మికుల భద్రతకు బాధ్యులెవరు? పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పైన క్లిక్ చెయ్యండి.

లకలూరిపేటలో ​ప్లానింగ్ నిల్.. హడావుడి ఫుల్! చిలకలూరిపేటలో వికటించిన 'నైట్ శానిటేషన్'...ఆకతాయిలు, వీధి కుక్కల మధ్య వదిలేస్తారా? పారిశుధ్య కార్మికుల భద్రతకు బాధ్యులెవరు? 

నమస్తే చిలకలూరిపేట! మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికుల కష్టాలు వింటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. 'ఊరు నిద్రపోయాక ఉప్పెన వచ్చినట్లు' మన మున్సిపాలిటీ అధికారులు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాత్రిపూట పారిశుధ్య పనులకు శ్రీకారం చుట్టారు. కానీ, ఇందులో కనీస ప్రణాళిక శూన్యం.. కార్మికుల భద్రత గాలికి దీపం!

​🚫 అనుమతులు నిల్.. అధికారుల మౌఖిక ఆదేశాలే ఫుల్! 📝

ఏ కొత్త నిర్ణయం అమలు చేయాలన్నా మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం లేదా కలెక్టర్ ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా, కేవలం అధికారుల మౌఖిక ఆదేశాలతోనే ఈ 'నైట్ శానిటేషన్' ప్రహసనం నడుస్తోంది. 1వ డివిజన్ పరిధిలోని 15 వార్డుల్లో ఏకంగా 142 మంది కార్మికులతో (అందులో 85 మంది మహిళలే!) అర్ధరాత్రి 11 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా బలవంతంగా పనులు చేయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

​🐕 చీకటి వీధుల్లో భయం భయం.. భద్రత ఏది అధికారులూ? 💔

పగటిపూట రోడ్లపై తిరగడానికే జంకుతున్న ఈ రోజుల్లో.. అర్ధరాత్రి ఆకతాయిలు, మద్యం మత్తులో తూగే వాళ్లు, వీధి కుక్కల మధ్య ఆ పేద కార్మికులను వదిలేయడం ఎంతవరకు సమంజసం? గతంలో మన చిలకలూరిపేట గడియార స్తంభం సెంటర్‌లోనే ఓ మహిళా కార్మికురాలిపై జరిగిన అమానుష ప్రవర్తనే దీనికి నిదర్శనం. అలాగే పొరుగున ఉన్న నరసరావుపేటలో రాత్రి పూట పనిచేస్తున్న కార్మికుడు మితిమీరిన వేగంతో వచ్చిన వాహనం ఢీకొని ప్రాణాలు వదిలిన ఘటన ఇంకా కళ్లముందే ఉంది. అయినా అధికారుల్లో చలనం లేదా?

​🗑️ రాత్రి ఊడుస్తున్నారు.. పగలు దుర్గంధం పీల్చుతున్నారు! 🤢

రాత్రివేళ కష్టపడి చెత్త ఊడ్చి ఒకచోట పోస్తే.. ఉదయం ట్రాక్టర్లు వచ్చి వాటిని తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఆ చెత్త దాదాపు 24 గంటల పాటు దుకాణాల ముందే ఉండిపోయి, ముక్కుపుటలు అదిరే దుర్గంధం వెదజల్లుతోంది. దీనివల్ల వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు ప్లానింగ్ లేని ఈ 'క్లీనింగ్' వల్ల ఎవరికి లాభం?

​⚠️ కార్మికుల ప్రాణాలతో చెలగాటం వద్దు! - తక్షణమే పునఃసమీక్షించాలి 🛑

నాయకులు, పై అధికారుల మెప్పు కోసమే కింది స్థాయి సిబ్బంది పేద కార్మికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో చలి, వర్షాలు పెరిగితే అర్ధరాత్రి వీళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. రాత్రి శానిటేషన్ నిజంగా అవసరమైతే, ముందుగా కౌన్సిల్ అనుమతితో పక్కా ప్రణాళిక రూపొందించాలి. వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కార్మికులకు తగిన భద్రత కల్పించిన తర్వాతే అమలు చేయాలి. మున్సిపల్ కమిషనర్, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ నిర్ణయాన్ని నిలిపివేయాలని చిలకలూరిపేట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

​📱 మరిన్ని స్థానిక వార్తలు, ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.. మన చిలకలూరిపేట స్పీడ్ న్యూస్!

Share:

చిలకలూరిపేట - మద్దినగర్‌లో తీవ్ర విషాదం.. కుటుంబ కలహాలతో భార్య అలిగిందని.. యువకుడి ఆత్మహత్య! పూర్తి వివరాలు కోసం క్రింది లింకు పై క్లిక్ చెయ్యండి.....


చిలకలూరిపేట - మద్దినగర్‌లో తీవ్ర విషాదం.. కుటుంబ కలహాలతో భార్య అలిగిందని.. యువకుడి ఆత్మహత్య! 


భార్య పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య.. చిలకలూరిపేటలో తీవ్ర విషాదం! 🚨

​📍 చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్):

ఆదివారం సెలవు దినం కావడంతో ప్రశాంతంగా ఉన్న చిలకలూరిపేట పట్టణంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం అలుముకుంది. చిన్నపాటి కుటుంబ కలహాలు, క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. పట్టణంలోని మద్దినగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

​💔 భార్య దూరమైందనే బాధతో..

వివరాల్లోకి వెళితే.. మద్దినగర్ ప్రాంతానికి చెందిన షేక్ నాగూర్ వలి (30)కి, షేక్ మస్తాన్ బి కి వివాహం జరిగింది. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో భార్య మస్తాన్ బి అలిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తనను విడిచి వెళ్లిపోయిందనే విషయం జీర్ణించుకోలేకపోయిన నాగూర్ వలి, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, తన నివాసంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

​🏥 కాపాడాలని చూసినా.. దక్కని ప్రాణం!

కొంత సమయం తర్వాత ఇంట్లో ఉరివేసుకుని వేలాడుతున్న నాగూర్ వలిని గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో ఉరి తాడును కోసి అతడిని కిందకు దించారు. బతుకుతాడన్న ఆశతో హుటాహుటిన చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తూ, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చేతికొచ్చిన కొడుకు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వారి ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలచివేశాయి.

​🚓 రంగంలోకి పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే చిలకలూరిపేట టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేవలం భార్య పుట్టింటికి వెళ్లిందనే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేమైనా ఇతర కారణాలు, కుటుంబ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? అనే కోణంలో లోతుగా దర్యాప్తును వేగవంతం చేశారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి