చిలకలూరిపేట - పేదలకు 'సబ్సిడీ' భరోసా.. అభివృద్ధి కూటమిది.. ఆరాటం వైసీపీది.. వైసిపిపై ప్రత్తిపాటి పొలిటికల్ బ్లాస్ట్!ఎల్ నినో ఎఫెక్ట్ ఉన్నా ఆకలి కష్టాలు రానివ్వం - ప్రత్తిపాటి
చిలకలూరిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అటు సంక్షేమం, ఇటు రాజకీయ విమర్శలతో హోరెత్తించారు. ఒకవైపు పేదలకు తక్కువ ధరకే బియ్యం అందిస్తూనే.. మరోవైపు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. సోమవారం చిలకలూరిపేట రైతు బజార్‌లో జరిగిన సబ్సిడీ బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఆయన చేసిన సంచలన వ్యాఖ్యల రౌండప్ మీకోసం..
🌾 సామాన్యుడికి గుడ్ న్యూస్.. రైతు బజార్‌లో సబ్సిడీ బియ్యం! 🍚
'ఎల్ నినో' ప్రభావంతో వాతావరణంలో మార్పులు వచ్చి వరి సాగు మందగించినా.. సామాన్యుడికి ఆకలి కష్టాలు రానివ్వబోమని ప్రత్తిపాటి పుల్లారావు భరోసా ఇచ్చారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, పేదలకు ఊరటనిస్తూ చిలకలూరిపేట రైతు బజార్‌లో "ప్రభుత్వం - రైస్ మిల్లర్స్ అసోసియేషన్" సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డుదారులకు తన చేతుల మీదుగా బియ్యాన్ని పంపిణీ చేశారు. బియ్యమే కాదు.. నిత్యావసరాల ధరల నియంత్రణపై కూటమి ప్రభుత్వం డేగకన్ను వేసిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనేలేదని ఆయన స్పష్టం చేశారు.
🗣️ జగన్‌కు ‘క్రెడిట్ చోరీ’ అనే వింత జబ్బు.. ప్రత్తిపాటి ఫైర్! 🔥
సబ్సిడీ కేంద్రం ప్రారంభం అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి.. మాజీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం జగన్ "క్రెడిట్ చోరీ" అనే ఒక కొత్త రకం వింత జబ్బుతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇతరులు చేసిన మంచిని, వాళ్ల గొప్పతనాన్ని సిగ్గులేకుండా తన ఖాతాలో వేసుకోవడమే ఈ జబ్బు ప్రధాన లక్షణమన్నారు. గత రెండేళ్లుగా తన చేతిలోని అవినీతి సొమ్ముతో, ఫేక్ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వ విజయాలను తనవిగా ప్రచారం చేసుకుంటూ.. తనను తాను మోసం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
✈️ భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ బాబుదే.. వైసీపీది అసూయ! 🦅
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం) ప్రారంభమైతే.. ఆ ఖ్యాతి తనదేనని జగన్ చెప్పుకోవడం పచ్చి అబద్ధమని ప్రత్తిపాటి ధ్వజమెత్తారు. కోర్టు కేసులు పరిష్కరించి, శంకుస్థాపన నుంచి నిర్మాణ పనుల వరకు అన్నీ చంద్రబాబు నాయుడి హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ రాష్ట్రం కోసం అహర్నిశలు పడుతున్న కష్టాన్ని, వారికి ప్రధాని మోదీ ఇస్తున్న సపోర్ట్‌ను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాకెట్ స్పీడ్‌తో ఏపీ అభివృద్ధి చెందుతుంటే.. అది చూసి వైసీపీ నేతలు అసూయతో రగిలిపోతున్నారని ఆయన దుయ్యబట్టారు.
🤝 పాల్గొన్న టీడీపీ, కూటమి శ్రేణులు 👥
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావుతో పాటు మద్దిబోయిన శివ, ముల్లా కరిముల్లా, మురకొండ మల్లిబాబు, కూటమి నాయకులు, స్థానిక అధికారులు మరియు చిలకలూరిపేట ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





No comments:
Post a Comment