మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట ప్రయాణికులకు కావేరి ట్రావెల్స్ చేదు అనుభవం...నాది మాచర్ల.. దిక్కున్న చోట చెప్పుకోండి! అర్ధరాత్రి ప్రయాణికులపై కావేరి ట్రావెల్స్ సిబ్బంది వీరంగం! పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పైన క్లిక్ చెయ్యండి....

చిలకలూరిపేట ప్రయాణికులకు కావేరి ట్రావెల్స్ చేదు అనుభవం...నాది మాచర్ల.. దిక్కున్న చోట చెప్పుకోండి! అర్ధరాత్రి ప్రయాణికులపై కావేరి ట్రావెల్స్ సిబ్బంది వీరంగం! 


చిలకలూరిపేట ప్రయాణికులకు కావేరి ట్రావెల్స్ చేదు అనుభవం...నాది మాచర్ల.. దిక్కున్న చోట చెప్పుకోండి! అర్ధరాత్రి ప్రయాణికులపై కావేరి ట్రావెల్స్ సిబ్బంది వీరంగం! పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పైన క్లిక్ చెయ్యండి....ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం అంటేనే జనం జంకుతున్నారు. వేలకు వేలు చార్జీలు వసూలు చేయడంలో ఉండే శ్రద్ధ, ప్రయాణికులకు కనీస మర్యాద ఇవ్వడంలో, వారి భద్రతను పట్టించుకోవడంలో ట్రావెల్స్ యాజమాన్యాలకు లేకుండా పోయింది. శనివారం రాత్రి హైదరాబాద్ నుండి చిలకలూరిపేట మీదుగా మార్టూరు, ఒంగోలు వెళ్లే 'కావేరి ట్రావెల్స్' బస్సులో చోటుచేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. ప్రయాణికుల పట్ల బస్సు సిబ్బంది ప్రదర్శించిన రౌడీయిజం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

​వివరాల్లోకి వెళితే...

​⏰ గంటకో మెసేజ్.. నడిరోడ్డుపై ప్రయాణికుల పడిగాపులు

హైదరాబాద్ నుంచి చిలకలూరిపేట, మార్టూరు వెళ్లేందుకు శనివారం రాత్రి పలువురు ప్రయాణికులు కావేరి ట్రావెల్స్ బస్సును బుక్ చేసుకున్నారు. రాత్రి 10 గంటలకు బోర్డింగ్ పాయింట్‌కు రావాల్సిన బస్సు 11 గంటలకు వస్తుందని ముందుగా ఓ మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత కాసేపటికే 'బస్సు బ్రేక్ డౌన్ అయింది, ఇంకో గంట ఆలస్యం అవుతుంది' అంటూ మరో మెసేజ్. దీంతో పసిపిల్లలు, మహిళలు, వృద్ధులతో సహా ప్రయాణికులంతా గమ్యస్థానాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఈలోపు వచ్చిన ఒక బస్సులో నుంచి కొందరిని దించేసి, కనెక్టింగ్ బస్సుల ద్వారా వారిని హైదరాబాదులోని ప్రాంతాలకు పంపడానికి మరొక చిన్న బస్సులోకి ఎక్కించారు.

​🚌 బ్రేక్ డౌన్ కాదు.. ప్రాణాలతో చెలగాటం!

తీరా అర్ధరాత్రి బస్సు వచ్చాక అసలు బండారం బయటపడింది. బ్రేక్ డౌన్ అని చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని తేలింది. వాస్తవానికి ఒంగోలు నుంచి హైదరాబాద్ వచ్చిన అదే బస్సును.. కనీసం డ్రైవర్లకు విశ్రాంతి కూడా ఇవ్వకుండా, ఏమాత్రం చెక్ j తిరిగి హైదరాబాద్ నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరే ప్రయత్నం చేశారు. యంత్రాలకే కాదు, మనుషులకు కూడా కనీస విశ్రాంతి ఇవ్వకుండా నిద్రమత్తులో ఉన్న డ్రైవర్లతో బస్సులు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైనం తెలిసి ప్రయాణికులు విస్మయానికి గురయ్యారు.

​😡 "నాది మాచర్ల.. నా సంగతేంటో చూపిస్తా".. సిబ్బంది వీరంగం

అప్పటికే సమయం రాత్రి ఒంటిగంట దాటిపోవడంతో, విసిగిపోయిన ప్రయాణికులు "ఎందుకింత ఆలస్యం? అబద్ధాలు ఎందుకు చెప్పారు?" అని నిలదీశారు. తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పాల్సిన బస్సు సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. "నాది మాచర్ల.. నేనేంటో, నా సంగతేంటో చూపిస్తా.. ఏంచేసుకుంటారో చేసుకోండి" అంటూ ప్రయాణికులపైకి రౌడీల్లా దూసుకొచ్చారు. దీంతో అర్ధరాత్రి నడిరోడ్డుపై బస్సు సిబ్బంది బూతులు, బెదిరింపులతో ప్యాసింజర్లు అవాక్కయ్యారు.

​💸 ముక్కుపిండి వసూళ్లు.. బాధ్యత ఏదీ?

పండుగలు,) అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చిలకలూరిపేట, మార్టూరు ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

 దీనికి సంబంధించిన వీడియో కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 

https://www.instagram.com/reel/DaoyG4spNbp/?igsh=a2ExZmgzZTRwNml1

Share:

చిలకలూరిపేట - నరసరావుపేట మార్గంలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో! తీవ్ర గాయాలతో బయటపడ్డ వృద్ధుడు... పూర్తి వివరాల కోసం క్రింది లింకు పైన క్లిక్ చేయండి....

చిలకలూరిపేట - నరసరావుపేట మార్గంలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో! తీవ్ర గాయాలతో బయటపడ్డ వృద్ధుడు... 


నరసరావుపేట మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో! 🚨

​పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా చిలకలూరిపేట - నరసరావుపేట ప్రధాన రహదారిపై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న కొండ్రుపాడు సమీపంలో క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.

​💥 అకస్మాత్తుగా మలుపు.. తప్పిన అదుపు

లోడుతో వెళ్తున్న ఒక భారీ టిప్పర్ లారీ చిన్న కొండ్రుపాడు సమీపానికి రాగానే.. డ్రైవర్ అకస్మాత్తుగా ఎడమవైపు మార్గంలోకి లారీని తిప్పాడు. అదే సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా వస్తున్న ఆటో డ్రైవర్ అప్రమత్తమయ్యే లోపే అదుపుతప్పి నేరుగా వెళ్లి ఆ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ భయానక ఘటనలో ఆటో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది.

​🚑 వృద్ధుడికి తీవ్రగాయాలు.. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి..

ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆటో ముందు భాగంలో కూర్చున్న కావూరు గ్రామానికి చెందిన కోడే రామకృష్ణ అనే వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. డొక్క భాగం పూర్తిగా నొక్కుకుపోవడంతో ఆయన అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి (కోమాలోకి) వెళ్లిపోయారు. మిగతా ప్రయాణికులు సైతం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

​🤝 మానవత్వం చాటుకున్న స్థానికులు..

ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న స్థానికులు, వాహనదారులు మానవత్వంతో స్పందించారు. క్షతగాత్రులను వెంటనే రోడ్డు పక్కకు చేర్చి, 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది.. అపస్మారక స్థితిలో ఉన్న రామకృష్ణను చికిత్స నిమిత్తం హుటాహుటిన 'చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రి'కి తరలించారు.

​🛑 స్తంభించిన రాకపోకలు.. భారీ ట్రాఫిక్ జామ్

ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రమాదం కారణంగా చిలకలూరిపేట నుంచి నరసరావుపేట వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన స్థానికులు, కొందరు యువకులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి రాకపోకలను పునరుద్ధరించారు.

​⚠️ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ విజ్ఞప్తి:

చిలకలూరిపేట - నరసరావుపేట మార్గంలో నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటుంది. భారీ వాహనాలు వెళ్లేటప్పుడు, మలుపుల వద్ద డ్రైవర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. "మితిమీరిన వేగం - ప్రాణ సంకటం". దయచేసి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించండి.

 ఘటనకు సంబంధించిన వీడియో కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 

https://www.instagram.com/reel/DanVaRZJTHN/?igsh=cW1vajdrNXk4ejc=

Share:

చిలకలూరిపేట - బోరుబావులకు ఆ పర్మిషన్ అవసరం లేదు - తేల్చిచెప్పిన ప్రత్తిపాటి పుల్లారావు!పీఎం కిసాన్, సుఖీభవ నిధులపై ప్రత్తిపాటి క్లారిటీ...వైసీపీవి తప్పుడు ప్రచారాలే.. దొంగ ఓట్లు పోవాల్సిందే: మాజీ మంత్రి ప్రత్తిపాటి ఫైర్!...

చిలకలూరిపేట - బోరుబావులకు ఆ పర్మిషన్ అవసరం లేదు - తేల్చిచెప్పిన ప్రత్తిపాటి పుల్లారావు!పీఎం కిసాన్, సుఖీభవ నిధులపై ప్రత్తిపాటి క్లారిటీ...వైసీపీవి తప్పుడు ప్రచారాలే.. దొంగ ఓట్లు పోవాల్సిందే: మాజీ మంత్రి ప్రత్తిపాటి ఫైర్!...


చిలకలూరిపేటలోని శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు క్యాంప్ కార్యాలయంలో ప్రతి శుక్రవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే "ప్రజా గ్రీవెన్స్" కార్యక్రమం ప్రజల పాలిట వరంగా మారింది. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న వినతులను స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారు, అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. అవేంటో స్పీడ్ న్యూస్ లో చూద్దాం! 👇

​🚜 రైతులకు గుడ్ న్యూస్.. బోరుబావులకు ఎన్ఓసీ (NOC) అవసరం లేదు!

​వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు కొత్తగా బోరు వేసుకోవాలన్నా, పవర్ కనెక్షన్ పొందాలన్నా తహసీల్దార్ లేదా భూగర్భ జలాల శాఖ నుంచి ఎన్ఓసీ (NOC) తీసుకురావాలంటూ కొందరు అధికారులు అనవసరమైన అభ్యంతరాలు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రత్తిపాటి తెలిపారు. దీనిపై వెంటనే తాను పల్నాడు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడానని అన్నారు. వాల్టా చట్టం నిబంధనల ప్రకారం, గ్రౌండ్ వాటర్ ఉన్నచోట రైతులు స్వేచ్ఛగా బోర్లు వేసుకోవచ్చని, దీనికి ప్రభుత్వ పరంగా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవని కలెక్టర్ స్పష్టం చేశారని తెలిపారు. అవగాహనా లోపంతో వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే అధికారుల తీరును వెంటనే మార్చుకోవాలని సూచించారు.

​🌾 పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవపై ప్రత్యేక దృష్టి!

​ఇటీవల చిలకలూరిపేట వేదికగా సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా ప్రారంభమైన 'పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ' నిధులకు సంబంధించి కొంతమంది రైతులకు 22 సార్లు వచ్చి, 23వ విడత నగదు అందలేదని తన దృష్టికి వచ్చిందన్నారు. 'అండర్ ప్రాసెస్' అని వస్తున్న ఈ సాంకేతిక సమస్యను వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్‌కు సూచించినట్లు చెప్పారు. నిలిచిపోయిన నిధుల డేటాను సేకరించి వెంటనే రెక్టిఫై చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని, రేపటికల్లా పరిష్కారం కాకపోతే ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తామని రైతులకు భరోసా ఇచ్చారు. అయితే, కేవలం ఈ పథకాల కోసం కొత్తగా భూములు విభజించుకుని (పార్టీషన్) దరఖాస్తు చేసుకునే వారికి మాత్రం నిధులు రావని, 2019 ఆగస్టు కటాఫ్ తేదీకి ముందు ఉన్న అసలైన అర్హులకు (జెన్యూన్ గా ఉన్నవారికి) మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

​🗳️ దొంగ ఓట్లు పోవాల్సిందే.. వైసీపీవి తప్పుడు ప్రచారాలే!

​కూటమి ప్రభుత్వం ఓట్లు తీసేస్తుందంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రత్తిపాటి తీవ్రంగా ఖండించారు. బీఎల్‌ఓల (BLO) ద్వారా, మై టీడీపీ యాప్ పేరుతో ఓట్లు గల్లంతు చేస్తున్నారనడం పచ్చి అబద్ధమన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో, సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో అటువంటి దురాలోచనలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పౌరులు తమ ఫారాలు పూర్తి చేసి బీఎల్‌ఓలకు ఇస్తే వారు డిజిటలైజ్ చేస్తారని, ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుందన్నారు. గడచిన ఎన్నికల్లో వైసీపీ నాయకులు అక్రమంగా నమోదు చేయించిన దొంగ ఓట్లు మాత్రమే తొలగించబడతాయని, ఏ ఒక్క నిజమైన పౌరుడి ఓటు తొలగించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.

​🏛️ జవాబుదారీతనంతో కూటమి ప్రభుత్వం.. తగ్గుతున్న ఫిర్యాదులు!

​గత ఐదేళ్ల వైసీపీ పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని ప్రత్తిపాటి అన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో, అలాగే చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాల ద్వారా అధికారుల్లో జవాబుదారీతనం (Accountability) పెరిగిందన్నారు. అధికారుల పనితీరు మెరుగుపడటం, ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారం అవుతుండటం వల్లే, గ్రీవెన్స్‌కు వచ్చే ఫిర్యాదుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇది ప్రజల కోసం పని చేసే మంచి ప్రభుత్వమని ప్రజలంతా కొనియాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.

Share:

చిలకలూరిపేటలో ఆత్మీయ కలయిక...25 ఏళ్ల స్నేహబంధం...కంచర్ల శ్రీనివాసరావు నివాసంలో ఎంపీ భాష్యం రామకృష్ణ సందడి! పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి...

చిలకలూరిపేటలో ఆత్మీయ కలయిక...25 ఏళ్ల స్నేహబంధం...కంచర్ల శ్రీనివాసరావు నివాసంలో ఎంపీ భాష్యం రామకృష్ణ సందడి!


చిలకలూరిపేట: రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించినా, ఒదిగి ఉండే వ్యక్తిత్వం రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ సొంతం అని మరోసారి రుజువైంది. గురువారం నాడు చిలకలూరిపేట పట్టణంలో ఆయన పర్యటన ఆధ్యాత్మికతతో పాటు, ఆత్మీయ కలయికలకు వేదికగా నిలిచింది.

​🛕 భక్తిశ్రద్ధలతో సాయినాథుని దర్శనం..

గురువారం ఉదయం చిలకలూరిపేటలోని షిర్డీ సాయినాథుని ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ తన సతీమణితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకకల్యాణాన్ని, ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ వారు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

​🫂 పదవి మారినా.. చెరగని పాతికేళ్ల స్నేహబంధం..

సాయిబాబా ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఎంపీ రామకృష్ణ దంపతులు తమ చిరకాల మిత్రుడు, పట్టణ ప్రముఖులు, ప్రత్తిపాటి ఫౌండేషన్ కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు నివాసానికి విచ్చేశారు. పల్నాడు డీఎస్పీ హనుమంతరావుతో కలిసి ఆయన మిత్రుడి ఇంటికి వెళ్లడం విశేషం. రాజ్యసభ ఎంపీగా ఇంతటి అత్యున్నత హోదాలో ఉండి కూడా, పాత స్నేహాలను గుర్తుపెట్టుకుని మరీ ఇంటికి రావడంతో స్థానికులు ఆయన నిరాడంబరతను చూసి ముచ్చటపడ్డారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వారు కాసేపు ఉల్లాసంగా గడిపారు.

​💐 ఆత్మీయ సత్కారం.. ఉప్పొంగిన స్నేహ హృదయం..

తమ ఇంటికి విచ్చేసిన ఎంపీ భాష్యం రామకృష్ణ దంపతులకు, కంచర్ల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ఈ ఆత్మీయ కలయికపై కంచర్ల శ్రీనివాసరావు ఉద్వేగంగా మాట్లాడుతూ.. "గత 25 సంవత్సరాలుగా భాష్యం రామకృష్ణ కుటుంబంతో మాకు విడదీయరాని సన్నిహిత స్నేహబంధం ఉంది. ఆయన రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా మా ఇంటికి రావడం మాకు దక్కిన అరుదైన గౌరవం. ఉన్నత స్థానంలో ఉండి కూడా పాత స్నేహాన్ని మర్చిపోకుండా వారు చూపించిన ఈ ప్రేమ, మా కుటుంబానికి జీవితకాలం గుర్తుండిపోయే చిరస్మరణీయమైన మధుర ఘట్టం" అని హర్షం వ్యక్తం చేశారు.

Share:

చిలకలూరిపేటలో మెరుపు తనిఖీలు!...హాస్టళ్లు, అంగన్వాడీలపై ఫుడ్ కమిషన్ సభ్యుల కొరడా..నాణ్యత తగ్గితే యాక్షనే.. పూర్తి వివరాలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి..

చిలకలూరిపేటలో మెరుపు తనిఖీలు!...హాస్టళ్లు, అంగన్వాడీలపై ఫుడ్ కమిషన్ సభ్యుల కొరడా..నాణ్యత తగ్గితే యాక్షనే..


మన చిలకలూరిపేట పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు శ్రీ జె. కృష్ణ కిరణ్ రెండు రోజుల సుడిగాలి పర్యటన చేపట్టారు. విద్యార్థులకు అందుతున్న పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను దగ్గరుండి పరిశీలిస్తున్నారు.

​🏢 క్షేత్రస్థాయిలో తనిఖీలు.. నాణ్యతలో రాజీపడితే యాక్షనే! ⚠️

పట్టణంలోని మద్ది నగర్ అంగన్వాడీ కేంద్రం నుంచి తన పర్యటనను ప్రారంభించిన ఆయన రికార్డులను పక్కాగా తనిఖీ చేశారు. రేషన్ షాపులు, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలపై (హాస్టళ్లపై) స్పెషల్ ఫోకస్ పెట్టారు. అధికారుల మాటలు వినడమే కాకుండా.. నేరుగా విద్యార్థుల వద్దకే వెళ్లి భోజనం నాణ్యతపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. "పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు.. ఫుడ్ క్వాలిటీలో ఏమాత్రం లోపాలున్నా కఠిన చర్యలు తప్పవు!" అంటూ నిర్వాహకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

​🍗 2002 నాటి రేట్లతో చికెన్ వస్తుందా..? ప్రభుత్వానికి సూటి విన్నపం! 💸

నిన్నటి వరకు బాపట్ల జిల్లాలో పర్యటించి మన పేటకు వచ్చిన ఆయన.. హాస్టల్ వార్డెన్లు, విద్యార్థుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ముఖంగా ప్రభుత్వానికి ఒక కీలక విజ్ఞప్తి చేశారు. "2002 నాటి ధరలకు, ఇప్పటి ధరలకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రోజురోజుకూ నిత్యావసరాలు, ముఖ్యంగా చికెన్ లాంటి వాటి ధరలు మండిపోతున్నాయి. కానీ, ఆ రేషియోలో పిల్లల డైట్ ఛార్జీలు పెరగలేదు. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఏటా కనీసం ₹100 చొప్పున మెస్ ఛార్జీలు పెంచాలి" అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

​🛡️ పిల్లల ఆరోగ్యమే మహాభాగ్యం.. మెరుగైన భోజనమే లక్ష్యం! 👶🍲

పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే ఫుడ్ కమిషన్ ప్రధాన లక్ష్యమని కృష్ణ కిరణ్ స్పష్టం చేశారు. కేవలం తనిఖీలు చేసి వదిలేయకుండా, విద్యార్థుల తరపున వకాల్తా పుచ్చుకుని డైట్ ఛార్జీల పెంపు కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. ప్రభుత్వం ఈ ఛార్జీలు పెంచితే.. వార్డెన్లపై భారం తగ్గి, విద్యార్థులకు మరింత రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించడానికి వీలవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మన పేటలోని హాస్టళ్లలో మెనూ మరింత మెరుగవుతుందని ఆశిద్దాం!

​📱 మరిన్ని ఎక్స్‌క్లూజివ్ మరియు ఫాస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.. మీ "చిలకలూరిపేట స్పీడ్ న్యూస్"

Share:

చిలకలూరిపేట రూరల్ - డాబాపై కోళ్లు...కోళ్లను తినడానికొచ్చిన కుక్క.. ఊహించని ట్విస్ట్..స్పాట్‌లోనే ప్రాణాలు గాలిలోకి! పూర్తి వివరాల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి...

చిలకలూరిపేట రూరల్ - డాబాపై కోళ్లు...కోళ్లను తినడానికొచ్చిన కుక్క.. ఊహించని ట్విస్ట్..స్పాట్‌లోనే ప్రాణాలు గాలిలోకి!


పెంచుకున్న కోళ్ల కోసం ప్రాణాలొదిలిన యజమాని.. లింగంగుంట్లలో తీవ్ర విషాదం! 🚨

​మృత్యువు ఏ రూపంలో, ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. రాత్రి పూట ప్రశాంతంగా ఉన్న ఆ కుటుంబంలో.. ఒక చిన్న కుక్క రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కోళ్లను కాపాడుకునే క్రమంలో జరిగిన ఒక ఊహించని ప్రమాదం.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ హృదయ విదారక ఘటన చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో చోటుచేసుకుంది.

​🐓 ప్రాణం తీసిన కోళ్ల పెంపకం.. అసలేం జరిగిందంటే?

​గ్రామానికి చెందిన దూదేకుల షేక్ ఖాసీం తన ఇంటి డాబాపై ఎంతో అల్లారుముద్దుగా కొన్ని కోళ్లను పెంచుకుంటున్నాడు. మంగళవారం (07.07.2026) రాత్రి సుమారు 9 గంటల సమయం. అందరూ భోజనాలు చేసి విశ్రాంతి తీసుకునే వేళ.. ఓ వీధి కుక్క డాబాపై ఉన్న కోళ్లను తినేందుకు దాడికి యత్నించింది. కోళ్ల అరుపులు విన్న ఖాసీం, వెంటనే అప్రమత్తమై కుక్కను తరిమికొట్టేందుకు ఓ కర్ర తీసుకుని వేగంగా డాబా మెట్లు ఎక్కసాగాడు.

​🐕 ఎదురుపడిన శునకం.. అదుపుతప్పిన అడుగు!

​ఖాసీం మెట్లు ఎక్కుతున్న అదే సమయంలో, పైన అలికిడికి భయపడిన కుక్క వేగంగా కిందకు దూసుకొచ్చింది. చీకటి పడటం, కుక్క అకస్మాత్తుగా మీదకు రావడం తో కంగారుపడిన ఖాసీం.. దానిని కర్రతో అదిలించే ప్రయత్నం చేశాడు. ఈ హడావుడిలో మెట్ల మధ్యలో అతని కాలు జారి, అదుపుతప్పి పక్కనే ఉన్న 20 అడుగుల లోతులోని ఖాళీ స్థలంలోకి ఒక్కసారిగా కింద పడిపోయాడు.

​🩸 రక్తపు మడుగులో యజమాని.. మార్గమధ్యంలోనే కన్నుమూత

​ప్రమాదవశాత్తూ పైనుంచి పడటంతో ఖాసీం తల వెనుక భాగంలోనూ, ఎడమ వైపున పలకల మీద తీవ్రమైన గాయాలయ్యాయి. ఎడమ భుజం, కంటి పక్కన చర్మం గీసుకుపోయి విపరీతంగా రక్తం కారింది. పెద్ద శబ్దం రావడంతో వెంటనే బయటకు వచ్చిన కుటుంబ సభ్యులు.. రక్తపు మడుగులో ఉన్న ఖాసీంను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (GGH) కి తరలిస్తుండగా.. దురదృష్టవశాత్తూ మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.

​🚓 కేసు నమోదు చేసిన పోలీసులు.. కన్నీటి సంద్రంలో కుటుంబం

​తమ కళ్ల ముందే క్షణాల వ్యవధిలో తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో కొడుకు సైదా గుండెలవిసేలా రోదిస్తున్నాడు. సైదా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న చిలకలూరిపేట రూరల్ ఎస్సై జి. అనిల్ కుమార్.. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం (శవ పంచనామా) నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ హఠాన్మరణంతో లింగంగుంట్ల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కేవలం కోళ్లను కాపాడుకునే చిన్న ప్రయత్నం.. ఒక కుటుంబాన్ని పెద్దదిక్కు లేకుండా చేసిందని స్థానికులు కంటతడి పెడుతున్నారు.

Share:

చిలకలూరిపేట - ఏపీలో ఉన్నది B-బాబు, J-జగన్, P-పవన్ కూటమే...వైఎస్సార్ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నేత రాధా ఫైర్.. పూర్తి వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి..

​చిలకలూరిపేట - ఏపీలో ఉన్నది B-బాబు, J-జగన్, P-పవన్ కూటమే...వైఎస్సార్ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నేత రాధా ఫైర్.. 


📍 చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్):

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పేదల పెన్నిధి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు చిలకలూరిపేటలో అట్టహాసంగా జరిగాయి. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాధా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక సూత్రా సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి రాధా పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్ సువర్ణ పాలనను గుర్తుచేసుకుంటూనే, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

​👑 నవశకానికి నాంది పలికిన అపర భగీరథుడు వైఎస్సార్!

"పేదవాడిని రక్షించి, బలహీనుడికి అండగా నిలిచేదే సుపరిపాలన అని నిరూపించిన దార్శనికుడు వైఎస్సార్" అని రాధా కొనియాడారు. అణగారిన వర్గాల సంక్షేమం, రైతుల అభ్యుదయం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఆయన అంకితభావంతో పనిచేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతుల కళ్లలో ఆనందం చూసిన 'అపర భగీరథుడు' రాజన్న అని, ఆయన పాలనను ఈ రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ అంగీకరించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.

​🌾 పల్నాడు రైతుల కన్నీరు తుడిచిన 75 వేల కోట్ల రుణమాఫీ!

ఉమ్మడి గుంటూరు జిల్లా, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న చీకటి రోజులను ఆయన గుర్తుచేశారు. ఆ విపత్కర పరిస్థితుల్లో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గార్లను ఒప్పించి, మెప్పించి ఏకంగా 75 వేల కోట్ల రూపాయల చారిత్రాత్మక రుణమాఫీ చేయించిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. ఒక తెలుగు బిడ్డ సూచనతో కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడం మనందరికీ గర్వకారణమని రాధా పేర్కొన్నారు.

​🎓 మైనారిటీల జీవితాల్లో 4% రిజర్వేషన్ల వెలుగులు!

ఏ కమిటీల నివేదికలతో పనిలేకుండా, అణచివేతకు గురైన ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్లు కల్పించిన సాహసికుడు వైఎస్సార్ అని రాధా ప్రశంసించారు. ఈరోజు లక్షలాది మంది మైనారిటీ బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారంటే దానికి కారణం వైఎస్సార్ ప్రపోజల్, సోనియా-మన్మోహన్ గార్ల ఆమోదమేనని, ఈ వాస్తవాన్ని ప్రతి మైనారిటీ సోదరుడు గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు.

​💥 రాజకీయ సంచలనం: ఏపీలో ఉన్నది 'ఆంధ్రా BJP' కూటమే..!

ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ రాధా వినూత్న విమర్శలు చేశారు. "దేశంలో మతోన్మాద పాలన సాగిస్తున్న బీజేపీతో రాష్ట్రంలోని నాయకులు కుమ్మక్కయ్యారు. ఏపీలో నడుస్తున్నది 'ఆంధ్రా BJP' (B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్). అధికారంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రతిపక్షంగా నటిస్తున్న జగన్మోహన్ రెడ్డి... అందరూ ఒక్కటే!" అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

​✊ షర్మిలమ్మ నాయకత్వంలో ఆంధ్రా బీజేపీని తరిమికొడతాం!

దేశ ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ఈ 'ఆంధ్రా బీజేపీ' త్రయాన్ని ఎదిరించి, నిలవరించే సత్తా... రాజన్న ముద్దుబిడ్డ, ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. రాష్ట్రం నుంచి ఈ ఆంధ్రా బీజేపీని తరిమికొట్టడమే మనం రాజన్నకు అర్పించే నిజమైన జయంతి నివాళి అని రాధా ఉద్వేగభరితంగా పిలుపునిచ్చారు.

​కార్యక్రమం చివరలో.. "జోహార్ వైఎస్సార్", "జోహార్ కాంగ్రెస్ మాత కన్నబిడ్డ సోమేపల్లి సాంబయ్య", "వర్ధిల్లాలి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ నాయకత్వం", "వర్ధిల్లాలి వై.ఎస్. షర్మిలా రెడ్డి నాయకత్వం" అంటూ కాంగ్రెస్ శ్రేణులు చేసిన నినాదాలతో సూత్రా సెంటర్ హోరెత్తిపోయింది.

 పూర్తి వీడియో కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://youtu.be/K98Fb86eUmg

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి