చిలకలూరిపేట - పల్నాడు కలెక్టర్ స్పీడ్ మామూలుగా లేదుగా.. రాష్ట్రంలోనే సరికొత్త రికార్డ్ సాధించిన కలెక్టర్ దంపతులు! ఫైళ్ల క్లియరెన్స్‌లో సత్తా చాటిన పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా.
ఫైళ్ల పరిష్కారంలో ఆదర్శంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా.. రాష్ట్రస్థాయిలో సరికొత్త రికార్డ్!
రాష్ట్ర పరిపాలనా విభాగంలో కలెక్టర్ దంపతులు తమదైన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా మన పల్నాడు జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృతికా శుక్లా, అలాగే ఆమె భర్త, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రభుత్వ ఫైళ్ల పరిష్కారంలో రికార్డు సృష్టిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.
ప్రజల సమస్యల పరిష్కారం, పల్నాడు జిల్లా అభివృద్ధి పనుల్లో వేగమే లక్ష్యంగా కృతికా శుక్లా సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా, ఫైల్ క్లియరెన్స్‌లోనూ ఈ దంపతులు టాప్ పొజిషన్‌లో నిలిచారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు కదలడానికి రోజుల సమయం పడుతుందనే అపవాదు ఉంది. దాన్ని చెరిపేస్తూ ఈ-ఆఫీస్ విధానాన్ని మన పల్నాడు కలెక్టర్ అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు.
గణాంకాలు చూస్తే..
మార్చి 11 నుంచి మే 5వ తేదీ వరకు జరిగిన ఫైల్ క్లియరెన్స్ వివరాలను పరిశీలిస్తే:
- పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా: తన వద్దకు వచ్చే ఒక్కో ఫైల్‌ను సగటున కేవలం 7.65 గంటల సమయంలోనే పరిష్కరిస్తూ అద్భుతమైన వేగాన్ని కనబరిచారు.
- నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా: వీరు సైతం ఒక్కో ఫైల్‌ను కేవలం 4.59 గంటల్లో క్లియర్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫైల్స్ క్లియరెన్స్ వేగంలో ఈ ఇద్దరు కలెక్టర్లు మొదటి రెండు ర్యాంకులు సాధించడం విశేషం. కలెక్టర్ కృతికా శుక్లా చొరవతో కింది స్థాయి అధికారుల్లోనూ జవాబుదారీతనం పెరుగుతోందని, మన పల్నాడు జిల్లాలో పరిపాలన మరింత పారదర్శకంగా, వేగంగా సాగుతోందని చిలకలూరిపేటతో సహా జిల్లా వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.




