ఆపరేషన్ పెట్రోల్: అర్ధరాత్రి బంకుల్లో కలెక్టర్.. అక్రమార్కుల భరతం పడుతున్న వైనం!రెండు పెట్రోల్ బంకులపై కేసు నమోదు!
చిలకలూరిపేట కరెంటుపల్నాడులో ఇంధన కొరతపై కలెక్టర్ సీరియస్.. అర్ధరాత్రి పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు!
➤ అర్ధరాత్రి కలెక్టర్ మెరుపు దాడులు
పల్నాడు జిల్లాలో తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరతపై జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. నరసారావుపేటలో రాత్రి 10 గంటల సమయంలో పలు పెట్రోల్ బంకులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వయంగా రంగంలోకి దిగిన కలెక్టర్.. జిల్లా వ్యాప్తంగా ఉన్న బంకుల్లో దాదాపు 80% బంకులను అధికారులు విజిట్ చేసేలా చర్యలు చేపట్టారు. రేపటి లోగా ఇంధన కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు.
➤ 80 శాతం ఇంధన సమస్యకు చెక్
నిన్నటి వరకు జిల్లాలో ఎక్కడెక్కడైతే షార్టేజ్ వచ్చిందో, అందులో 80% బంకుల్లో ఈ రోజు సప్లై పూర్తి చేశామని కలెక్టర్ వెల్లడించారు. మిగిలిన 22 బంకుల్లో కూడా ఈ రోజు రాత్రికల్లా పూర్తి స్థాయిలో ఇంధన సరఫరా జరుగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని, వాహనదారులు కంగారు పడి ట్యాంకులు ఫుల్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఆమె సూచించారు.
➤ వాహనదారులకు రేషనింగ్.. పరిమితులు ఇవే..
ఇంధన పంపిణీలో క్రమశిక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా వాహనాలకు కొన్ని పరిమితులు విధించారు. ద్విచక్ర వాహనాలకు రూ.200, త్రీ వీలర్స్‌కు రూ.300, నాలుగు చక్రాల వాహనాలకు రూ.1000 చొప్పున లిమిట్ సెట్ చేశారు. క్వారీలకు సంబంధించిన వాహనాలకు లో-ప్రయారిటీ ఇచ్చి, ఆ బంకుల నుంచి ఇతర బంకులకు ఇంధనాన్ని డైవర్ట్ చేస్తున్నారు.
➤ రైతన్నలకు తొలి ప్రాధాన్యం.. సచివాలయాల్లో కూపన్లు
ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వారు హార్వెస్టింగ్ కోసం వాడే మెషిన్, పండించే పంటను బట్టి వారికి డీజిల్ లిమిట్స్ సెట్ చేశారు. రైతుల సౌకర్యార్థం గ్రామ సచివాలయాల్లోని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, వీఆర్వోలు, మండల వ్యవసాయ అధికారుల ద్వారా డీజిల్ కూపన్లను జారీ చేస్తున్నారు. రైతులు ఈ కూపన్లను ఉపయోగించుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా డీజిల్ పొందవచ్చు.
వీడియో కోసం క్రింది లింక్ పైన క్లిక్ చెయ్యండి.
https://www.instagram.com/reel/DXpYnq1Ei3X/?igsh=MTExaWdtM3FsanFxdQ==
➤ బ్లాక్ మార్కెట్ చేస్తే జైలుకే.. రెండు బంకులపై కేసు నమోదు
కృత్రిమ కొరత సృష్టించి పానిక్ బయింగ్, బ్లాక్ మార్కెటింగ్ లేదా హోర్డింగ్‌కు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని కలెక్టర్ కృతిక శుక్లా గట్టిగా హెచ్చరించారు. ఇప్పటికే పరిమితికి మించి డీజిల్ విక్రయించి, బ్లాక్ మార్కెట్‌కు పాల్పడుతున్న రెండు పెట్రోల్ బంకులపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశామన్నారు. అనుమానాస్పద లావాదేవీలు జరిపిన మరికొన్ని బంకులను బ్లాక్ లిస్ట్‌లో కూడా పెట్టామని, రాబోయే వారం రోజుల పాటు బంకుల వద్ద ఉదయం నుండే రెవెన్యూ, పోలీసు అధికారుల పహారా ఉంటుందని స్పష్టం చేశారు.
➤ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్ లో కాల్ సెంటర్
ఇంధన పంపిణీలో అక్రమాలు జరిగినా, ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్లు తెలిసినా వెంటనే సమాచారం అందించాలని కలెక్టర్ ప్రజలను కోరారు. ఇందుకోసం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌లో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఓపెన్ చేశామని, పౌరులు తమ ఫిర్యాదులను నేరుగా అక్కడికి తెలియజేయవచ్చని ఆమె సూచించారు.
- మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్
విద్యుత్ వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.




