మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

శరవేగంగా సంజీవనగర్ పైపులైన్ మరమ్మతులు... సోమవారం మధ్యాహ్నానికి నీటి సరఫరా పునరుద్ధరణ!

శరవేగంగా సంజీవనగర్ పైపులైన్ మరమ్మతులు... సోమవారం మధ్యాహ్నానికి నీటి సరఫరా పునరుద్ధరణ!


చిలకలూరిపేట: స్థానిక సంజీవనగర్ ప్రాంతంలో కలుషిత నీటి సమస్యను పరిష్కరించే దిశగా మున్సిపల్ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పైపులైన్ లీకేజీల మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

తాజా పరిస్థితి (గ్రౌండ్ రిపోర్ట్): నేడు (ఆదివారం) క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించగా.. అధికారులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం సాయంత్రం కల్లా ఈ పైపులైన్ మరమ్మతులను పూర్తి చేసి, సోమవారం మధ్యాహ్నం నాటికి సంజీవనగర్ వాసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీటిని సరఫరా చేయాలని అధికారులు దృఢ నిశ్చయంతో ఉన్నారు.

అధికారుల పర్యవేక్షణ: ఈ పనులను మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని శుక్రవారం నాడు స్వయంగా పరిశీలించారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా స్వచ్ఛమైన నీటిని అందించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు, డీఈ అబ్దుల్ రహీం ఈ నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ప్రజలకు విజ్ఞప్తి: నీటి సరఫరాలో ఎక్కడైనా అంతరాయాలు లేదా ఇబ్బందులు తలెత్తితే వెంటనే మున్సిపల్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని పుర ప్రజలను అధికారులు కోరారు. ఈ పనుల పర్యవేక్షణలో 10వ వార్డు కౌన్సిలర్ మౌలాలి, ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈలు, సచివాలయ సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

​పుంగనూరులో ఘోర విషాదం: మెకానిక్ ఇచ్చిన ఒక్క సలహాతో ఒకే కుటుంబంలో నలుగురు బలి! అసలు ఏమి జరిగింది అంటే?

​పుంగనూరులో ఘోర విషాదం: మెకానిక్ ఇచ్చిన ఒక్క సలహాతో ఒకే కుటుంబంలో నలుగురు బలి! అసలు ఏమి జరిగింది అంటే?

​🚨 చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ - ప్రత్యేక కథనం 🚨

మెకానిక్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. ఒకే కుటుంబంలో నలుగురిని బలి తీసుకుంది!

నిద్రలోనే ప్రాణాలు తీసిన 'సైలెంట్ కిల్లర్'.. బైక్ ఇంజిన్ పొగతో ఘోర విషాదం

​అన్నమయ్య జిల్లా పుంగనూరులో కంటతడి పెట్టించే అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. అమాయకత్వం, అవగాహనా లోపం వెరసి పసివాళ్లతో సహా నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక మెకానిక్ ఇచ్చిన సలహా ఆ కుటుంబాన్ని శాశ్వత శోకంలోకి నెట్టేసింది.

అసలేం జరిగిందంటే..?

పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధికి చెందిన మురళి అనే వ్యక్తి శనివారం తన బైక్‌ ఇంజిన్ చెడిపోతే మెకానిక్ షా‌పులో బోర్ చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. అయితే, "కొత్తగా బోర్ చేయించావు కదా.. ఇంజిన్ బాగా సెట్ అవ్వాలంటే రాత్రంతా బైక్‌ను స్టార్ట్ చేసి ఉంచు" అని మెకానిక్ ఉచిత సలహా ఇచ్చాడు.

​దీంతో మురళి తన బైక్‌ను ఇంటి లోపల హాల్లో ఉంచి, తలుపులన్నీ గడియపెట్టి ఇంజిన్ ఆన్ చేశాడు. మురళి, అతడి భార్య రేవతి పై అంతస్తులో నిద్రించగా.. కింద గదిలో మురళి తండ్రి రామచంద్రయ్య, కుమారుడు కార్తీక్, కవల కుమార్తెలు చరిత, చందన పడుకున్నారు. గాలి బయటకు వెళ్లే అవకాశం లేని ఆ ఇరుకు గదిలో రాత్రంతా ఇంజిన్ నుంచి వెలువడిన పొగ దట్టంగా పేరుకుపోయింది. ఉదయం వచ్చి చూసేసరికి నలుగురూ విగతజీవులుగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ప్రాణాలు తీసిన 'సైలెంట్ కిల్లర్' (కార్బన్ మోనాక్సైడ్):

సాధారణంగా వాహనాల నుంచి వెలువడే పొగలో 'కార్బన్ మోనాక్సైడ్' (CO) అనే అత్యంత ప్రమాదకరమైన వాయువు ఉంటుంది. దీనికి రంగు, రుచి, వాసన ఉండవు.

  • ​మూసి ఉన్న గదుల్లో ఇంజిన్ ఆన్ చేసినప్పుడు.. ఈ వాయువు గదిలోని ఆక్సిజన్ స్థానాన్ని ఆక్రమిస్తుంది.
  • ​మనం పీల్చే గాలి ద్వారా ఇది నేరుగా రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలిసిపోతుంది.
  • ​దీనివల్ల క్షణాల్లో మెదడుకు, గుండెకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది.
  • ​గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ వాయువు ప్రభావం వల్ల మనిషికి ఊపిరి ఆడుతుందో లేదో కూడా తెలియదు. ఏమాత్రం స్పృహ లేకుండానే, నొప్పి తెలియకుండానే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. పుంగనూరులో కూడా సరిగ్గా ఇదే జరిగింది.

మన చిలకలూరిపేట ప్రజలకు స్పీడ్ న్యూస్ హెచ్చరిక - ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

ఈ ఘటన మనందరికీ ఒక కనువిప్పు కావాలి. మన ప్రాంతంలో కూడా ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఈ జాగ్రత్తలు పాటించండి:

  • ఇంట్లో వాహనాలు వద్దు: బైక్ లేదా కారు ఇంజిన్‌ను ఎప్పుడూ మూసి ఉన్న గదుల్లో స్టార్ట్ చేసి ఉంచకూడదు. కనీసం కిటికీలు, తలుపులైనా తెరిచి ఉంచాలి.
  • మెకానిక్ సలహాలు గుడ్డిగా నమ్మకండి: ఇంజిన్ బోర్ చేసినప్పుడు వాహనాన్ని రాత్రంతా స్టార్ట్ చేసి ఉంచాల్సిన అవసరం ఏమాత్రం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఉంచినా అది పూర్తిగా ఆరుబయట (బహిరంగ ప్రదేశంలో) మాత్రమే ఉండాలి.
  • వెంటిలేషన్ ముఖ్యం: ఇళ్లలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా క్రాస్ వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.
  • జనరేటర్లతో జాగ్రత్త: కరెంటు పోయినప్పుడు వాడే జనరేటర్లు, పంపు సెట్లను కూడా ఇళ్ల లోపల, లేదా మూసి ఉన్న వరండాల్లో అస్సలు వాడకూడదు.
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్
 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

- మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్



Share:

చిలకలూరిపేట - రౌడీయిజం చేస్తే తోలు తీస్తాం.. గీత దాటితే 'పీడీ యాక్టే'.. సీఐ రమేష్ స్ట్రాంగ్ కౌన్సెలింగ్.

చిలకలూరిపేట - రౌడీయిజం చేస్తే తోలు తీస్తాం.. గీత దాటితే 'పీడీ యాక్టే'.. సీఐ రమేష్ స్ట్రాంగ్ కౌన్సెలింగ్.


​🚨 చిలకలూరిపేట రౌడీ షీటర్లకు టౌన్ సీఐ రమేష్ 'మాస్ వార్నింగ్'.. పద్ధతి మార్చుకోకపోతే ఊరు విడిచి పోవాల్సిందే! 🚨

(చిలకలూరిపేట - స్పీడ్ న్యూస్ ప్రతినిధి): పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఇకపై ఉపేక్షించేది లేదని, రౌడీయిజం చేస్తే తోలు తీస్తామని చిలకలూరిపేట టౌన్ సీఐ పి. రమేష్ గట్టిగా హెచ్చరించారు. ఆదివారం టౌన్ పోలీస్ స్టేషన్‌లో పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లను పిలిపించి ఆయన ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.


ప్రధానాంశాలు:

  • గీత దాటితే 'పీడీ యాక్ట్' (PD Act) ఖాయం: పాత నేరస్తుల కదలికలపై పోలీసుల స్పెషల్ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచాయని సీఐ స్పష్టం చేశారు. ఎవరైనా వీధుల్లో గొడవలకు దిగినా, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. నేర స్వభావాన్ని మార్చుకోని వారిపై వెంటనే పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా, ఏకంగా పట్టణ బహిష్కరణ (Externment) చేస్తామని ఘాటుగా హెచ్చరించారు.
  • గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై స్పెషల్ ఫోకస్: యువతను పెడదోవ పట్టించేలా గంజాయి విక్రయాలు జరిపినా, గ్రూపులుగా ఏర్పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
  • పనీపాటా చూసుకొని బతకండి: రౌడీ షీటర్లు గతాన్ని వదిలిపెట్టి, సమాజంలో గౌరవప్రదంగా బతకాలని సీఐ సూచించారు. ఏదైనా ఉపాధి లేదా పనులు చేసుకుంటూ కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలని, మళ్లీ నేరాల బాట పడి జైళ్ల పాలు కావొద్దని, కుటుంబ సభ్యులను రోడ్డున పడేయొద్దని హితవు పలికారు.
  • ప్రజలకు పోలీసుల భరోసా: చిలకలూరిపేటలో ప్రజలకు ఎవరి నుంచైనా బెదిరింపులు వచ్చినా, అసాంఘిక శక్తులు ఇబ్బంది పెట్టినా వెంటనే 'డయల్ 100' కు గానీ, టౌన్ పోలీస్ స్టేషన్ కు గానీ సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రజలకు భరోసా ఇచ్చారు.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్

మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట రూరల్ - 'రాకెట్ లాంచర్' స్కామ్.. రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తానంటూ నిలువుదోపిడీ!​ రూ.10 వేలు కడితే కోట్లు ఇస్తామంటూ మాయమాటలు.. 5 వేల మందికి కుచ్చుటోపీ!

చిలకలూరిపేట రూరల్ - 'రాకెట్ లాంచర్' స్కామ్.. రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తానంటూ నిలువుదోపిడీ!​ రూ.10 వేలు కడితే కోట్లు ఇస్తామంటూ మాయమాటలు.. 5 వేల మందికి కుచ్చుటోపీ!


చిలకలూరిపేట స్పీడ్ న్యూస్: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని గొట్టిపాడు గ్రామంలో ఒక భారీ మోసం బట్టబయలైంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తామంటూ, మాయమాటలు చెప్పి ఒక వ్యక్తి అమాయక ప్రజల వద్ద నుండి లక్షల రూపాయలు వసూలు చేసి ఉడాయించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా పూట గడవని పేదలు, బిక్షాటన చేసుకునేవారు, చెంచు గిరిజనుల ఆశలనే పెట్టుబడిగా మార్చుకున్న ఆ కేటుగాడు వందలు కాదు.. వేలాది మందిని నిలువునా ముంచేశాడు.

​గొట్టిపాడు గ్రామానికే చెందిన నాగండ్ల వెంకటరావు (తండ్రి: పుల్లయ్య) అనే వ్యక్తి ఈ దారుణమైన స్కామ్‌కు తెరతీశాడు. 'రాకెట్ లాంచర్' అనే నకిలీ కంపెనీ పేరును తెరపైకి తెచ్చి, కేవలం పది వేల రూపాయలు చెల్లిస్తే చాలు.. మీ బ్యాంక్ అకౌంట్లలోకి కోట్ల రూపాయలు వచ్చి పడతాయంటూ మభ్యపెట్టాడు. ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వారు, డబ్బు కోసం ఆశగా ఎదురుచూస్తున్న అమాయకులు అతని మాటల గారడీకి పడిపోయి తమ కష్టార్జితాన్ని సమర్పించుకున్నారు. ఈ మోసం కేవలం ఒక్క గ్రామానికే పరిమితం కాలేదు. రెండు రాష్ట్రాల్లో ఏకంగా సుమారు 5,000 మందిని నమ్మించి ఒక్కొక్కరి వద్ద రూ. 10,000 చొప్పున కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. తన సొంత ఊరైన గొట్టిపాడులో కూడా సుమారు 22 మందిని బురిడీ కొట్టించి వారి వద్ద నుండి డబ్బులు దండుకున్నాడు.

​డబ్బులు కట్టి రోజులవుతున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించారు. తమ కష్టార్జితమైన డబ్బులు తమకు తిరిగి ఇచ్చేయాలని నిలదీయగా.. కంత్రి వెంకటరావు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. డబ్బులు అడిగిన అమాయక ప్రజల ఇళ్ల మీదికి రౌడీలను తీసుకొచ్చి దౌర్జన్యానికి దిగాడు. దిక్కులేని పేదలపై రౌడీయిజాన్ని ప్రదర్శిస్తూ బాధితులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేశాడు.

​వెంకటరావు ఆగడాలు శృతిమించడంతో, తమకు ఇక న్యాయం జరగదని గ్రహించిన బి. దావీదు సహా ఇతర బాధితులు, గ్రామస్తులు కలిసి శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలో జరిగిన గ్రీవెన్స్ (Grievance) కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ పత్తిపాటి పుల్లారావు గారిని కలిసి తమ కన్నీటి గాథను, వెంకటరావు రౌడీయిజాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అడుక్కునే వారిని, పేదలను సైతం వదలకుండా మోసం చేశాడన్న విషయం తెలుసుకున్న పత్తిపాటి పుల్లారావు గారు తక్షణమే స్పందించారు. అక్కడి నుండే నేరుగా రూరల్ సీఐ (Rural CI) కి ఫోన్ చేసి, ఈ సమస్యపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితుల పట్ల దౌర్జన్యానికి దిగిన వారి ఆటలు సాగనివ్వొద్దని, మోసపోయిన ప్రతి ఒక్కరికీ వారి డబ్బులు వెనక్కి ఇప్పించి, తగిన న్యాయం చేయాలని గట్టిగా సూచించారు.

​నాయకుడి అండ దొరకడంతో బాధితుల్లో భరోసా నెలకొంది. ఈ భారీ మోసంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు నమోదు కావడంతో.. పోలీసుల విచారణలో నిందితుడికి తగిన గుణపాఠం చెబుతారని బాధితులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

​చిలకలూరిపేట రోడ్లపై మృత్యుఘోష.. రోజుకొక ఆక్సిడెంట్... ఆ మరణాలను ఆపేది ఎవరు? - మాదాసు భాను ప్రసాద్

​చిలకలూరిపేట రోడ్లపై మృత్యుఘోష.. రోజుకొక ఆక్సిడెంట్... ఆ మరణాలను ఆపేది ఎవరు? - మాదాసు భాను ప్రసాద్ 


చిలకలూరిపేటలో వరుస రోడ్డు ప్రమాదాలు : అడ్వకేట్ మాదాసు భాను ప్రసాద్

​ఇటీవల చిలకలూరిపేటలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ఆ ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వరుస మరణాలకు తక్షణమే చెక్ పెట్టాలని, ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారాలను కనుగొనేందుకు వెంటనే 'రోడ్డు సేఫ్టీ కమిటీ మీటింగ్' ను ఏర్పాటు చేయాలని ప్రముఖ న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్ డిమాండ్ చేశారు.

​ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలలో ఎక్కువ శాతం నివారించదగినవేనని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వాహనదారుల్లో అవగాహన రాహిత్యం, కొంత నిర్లక్ష్యం, అలాగే నిబంధనలు ఉల్లంఘించే వారిపై అధికారుల మెతక వైఖరే ఈ ఘోర ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు.

ప్రమాదాలకు దారితీస్తున్న ప్రధాన అంశాలు ఇవే:

  • మిరుమిట్లు గొలిపే లైట్లు: కొందరు ద్విచక్ర వాహనాలకు, కారులకు పరిమితికి మించి అధిక వెలుగునిచ్చే ఎల్ఈడీ (LED) బల్బులు వాడటం వలన, ఎదురుగా వచ్చే వాహనదారులకు రోడ్డు సరిగ్గా కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు.
  • మైనర్ల డ్రైవింగ్: సరైన వయసు, డ్రైవింగ్ నైపుణ్యం లేని మైనర్లు వాహనాలను నడపడం కూడా యాక్సిడెంట్లకు మరో ముఖ్య కారణం.
  • బ్లాక్ స్పాట్స్: తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లను) గుర్తించి తగిన చర్యలు తీసుకోకపోవడం.

​ప్రజల భాగస్వామ్యంతోనే ప్రమాదాలను పూర్తి స్థాయిలో నియంత్రించడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి రోడ్డు సేఫ్టీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలని, స్థానిక ప్రజలు, నిపుణుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించి పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. చిలకలూరిపేటలో ఇకపై రోడ్డు ప్రమాదాల వల్ల ఒక్క ప్రాణం కూడా బలి కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందంటూ భాను ప్రసాద్ పిలుపునిచ్చారు.

- మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చంద్రబాబు టార్గెట్‌గా రజిని బాణాలు.. వైస్సార్సీపీ 16వఆవిర్భావ వేడుకల్లో రజిని సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు టార్గెట్‌గా రజిని బాణాలు.. వైస్సార్సీపీ 16వఆవిర్భావ వేడుకల్లో రజిని సంచలన వ్యాఖ్యలు!


"మళ్లీ వచ్చేది రాజన్న రాజ్యమే.. మళ్లీ సీఎం అయ్యేది జగనన్నే!"

చిలకలూరిపేటలో అంబరాన్నంటిన వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి విడదల రజిని

చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో చిలకలూరిపేట పట్టణం హోరెత్తింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని వైసిపి కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు, అభిమానుల జై జగన్ నినాదాలతో పట్టణం మార్మోగింది. ఈ వేడుకలకు మాజీ మంత్రి, పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు విడదల రజిని ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు.

కార్యక్రమంలోని హైలైట్స్:

  • ఘనంగా నివాళులు: ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్న విడదల రజిని.. ముందుగా వైసీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
  • కేక్ కటింగ్ కోలాహలం: పార్టీ శ్రేణులు, స్థానిక నాయకుల మధ్య భారీ కేక్ కట్ చేసిన రజిని, ప్రతి ఒక్కరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

టీడీపీపై నిప్పులు చెరిగిన విడదల రజిని:

సమావేశంలో మాట్లాడిన విడదల రజిని.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. "చంద్రబాబు మాయమాటలు, మోసపూరిత హామీలను రాష్ట్రంలో ఏ ఒక్కరూ నమ్మే స్థితిలో లేరు. ఆయన మార్కు రాజకీయాన్ని ప్రజలు ఇప్పటికే పక్కన పెట్టారు," అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే సత్తా కేవలం జగనన్నకు మాత్రమే ఉందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.

కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు:

గత 15 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన ఏకైక పార్టీ వైసీపీ అని రజిని కొనియాడారు. ఢిల్లీ పెద్దల మెడలు వంచి, వారిని సైతం ఎదిరించి నిలబడిన ధీశాలి వైఎస్ జగన్ అని ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రతి నిరుపేద గడపకూ అందుతున్న సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలంటే.. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

సమరశంఖం:

"ప్రతి కార్యకర్తా ఒక సైనికుడిలా కదం తొక్కాలి. పల్లె పల్లెకూ వెళ్లి ప్రభుత్వం చేసిన మేలును వివరించాలి. రాబోయే ఎన్నికల్లో చిలకలూరిపేట గడ్డపై వైసీపీ జెండా ఎగురవేసి సత్తా చాటాలి," అని శ్రేణులకు పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా కార్యకర్తలు మరియు వైసిపి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట రూరల్ - నెత్తురోడిన రహదారి.. బైకర్ స్పాట్ డెడ్, ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలు. ఏమి జరిగింది?

చిలకలూరిపేట రూరల్ - నెత్తురోడిన రహదారి.. బైకర్ స్పాట్ డెడ్, ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలు. ఏమి జరిగింది?


చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): చిలకలూరిపేట - నరసరావుపేట రాష్ట్ర రహదారిపై కావూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి సృష్టించిన బీభత్సానికి ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది.

​స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నరసరావుపేట వైపు నుంచి వస్తున్న ఓ క్రెటా (Creta) కారు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ కావూరు వద్దకు రాగానే అకస్మాత్తుగా అదుపు తప్పింది. ఈ క్రమంలో అదే రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనంతో పాటు, ఒక ప్యాసింజర్ ఆటోపైకి విచక్షణారహితంగా దూసుకెళ్లింది. ఈ భయంకరమైన ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందాడు. కారు ఢీకొన్న వేగానికి బైక్ నుజ్జునుజ్జు కాగా, ఆటో డ్రైవర్‌కు సైతం తీవ్ర గాయాలయ్యాయి.

​ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు.. క్షతగాత్రుడైన ఆటో డ్రైవర్‌ను మెరుగైన వైద్యం కోసం అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతుడి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

​రహదారిపై నిలిచిపోయిన వాహనాలను పక్కకు తొలగించి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి