నరసరావుపేటలో కీచక ప్రిన్సిపాల్.. కక్షగట్టి విద్యార్థినిపై అమానుష దాడి!
🔴 జుట్టుపట్టుకుని విచక్షణారహితంగా కొట్టిన వైనం
🔴 ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, రంగంలోకి దిగిన SFI
🔴 ఆక్స్‌ఫర్డ్ స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
నరసరావుపేట (స్పీడ్ న్యూస్): విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే క్రూరుడిగా మారాడు. ప్రశ్నించిన పాపానికి పగబట్టి ఓ మైనర్ బాలికపై తన ప్రతాపం చూపించాడు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రకాష్ నగర్‌లో గల ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ వ్యవహరించిన తీరు ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే..?
ప్రకాష్ నగర్ ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్ శివారెడ్డి దారుణంగా ప్రవర్తించాడు. చిన్న కారణానికే ఆ విద్యార్థిని జుట్టు పట్టుకుని విచక్షణారహితంగా కొట్టాడు. అయితే ఈ దాడి వెనుక ప్రిన్సిపాల్ పాత కక్ష ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో సదరు విద్యార్థిని స్కూల్‌కు షూస్ వేసుకుని రాలేదన్న కారణంతో యాజమాన్యం ₹100 ఫైన్ వేసింది. "ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా, అప్పులు చేసైనా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీ స్కూల్లో చేర్పిస్తే.. ఇలా అడుగడుగునా ఫైన్ల పేరుతో వేలకు వేలు దోచుకోవడం ఏంటి?" అని బాలిక తల్లిదండ్రులు ఆ సమయంలో ప్రిన్సిపాల్‌ను గట్టిగా నిలదీశారు.
మనసులో పెట్టుకుని కక్ష సాధింపు..
తల్లిదండ్రులు ప్రశ్నించారనే అక్కసును ప్రిన్సిపాల్ శివారెడ్డి మనసులో పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆ బాలికపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలిక ఏ చిన్న తప్పు చేసినా వెంటనే టార్గెట్ చేసి దారుణంగా కొట్టడం పరిపాటిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా బాలికపై జుట్టు పట్టుకుని దాడికి పాల్పడ్డాడు.
ఎస్ఎఫ్ఐ (SFI) ఎంట్రీతో ఉద్రిక్తత..
విద్యార్థినిపై జరిగిన అమానుష దాడికి నిరసనగా.. బాధిత తల్లిదండ్రులకు మద్దతుగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) నాయకులు రంగంలోకి దిగారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు స్కూల్ ఎదుట భారీ ధర్నాకు దిగారు. విద్యార్థినిపై దాడి చేసిన ప్రిన్సిపాల్ శివారెడ్డిపై విద్యాశాఖ అధికారులు, పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆక్స్‌ఫర్డ్ స్కూల్ వద్ద భారీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g




