మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

ప్రత్తిపాటి శరత్ శరత్ త్వరగా విడుదల కావాలని శాంతినిలయం చర్చిలో ప్రార్థనలు

ప్రత్తిపాటి శరత్ శరత్ త్వరగా విడుదల కావాలని శాంతినిలయం చర్చిలో ప్రార్థనలు.

ప్రత్తిపాటి శరత్ శరత్ త్వరగా విడుదల కావాలని శాంతినిలయం చర్చిలో ప్రార్థనలు.


చిలకలూరిపేట :- రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాక్షస పాలనకు చిరునామాగా మారారని చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు అన్నారు. మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్టును నిరసిస్తూ చిలకలూరిపేట 32వ వార్డు శాంతినగర్‌లోని శాంతినిలయం చర్చిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శరత్ క్షేమంగా ఉండాలని.. త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు దయతో వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసుల నుంచి శరత్ నిర్దోషిగా బయటకు వస్తారని వారంతా ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌రెడ్డి ఏపీఎస్‌డీఆర్‌ఐని అడ్డంపెట్టుకొని శరత్‌పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను టార్గెట్ చేయడం, బెదిరించడం, లొంగకపోతే కేసులు పెట్టడం అధికారపార్టీకి మాములైందన్నారు. శరత్‌ను అక్రమ నిర్బంధం నుంచి విడుదల చేయాలని తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - బి.సి భవనానికి కేటాయించిన స్థలానికి ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలపై వినతి

 చిలకలూరిపేట - బి.సి భవనానికి కేటాయించిన స్థలానికి ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలపై వినతి

చిలకలూరిపేట - బి.సి భవనానికి కేటాయించిన స్థలానికి ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలపై వినతి

 చిలకలూరిపేట:-  జాతీయ బీసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  మాజీ మంత్రి,నర్సరావు పేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి మల్లెల రాజేష్ నాయుడుకు మంగళవారం వినతిపత్రం అందించడం జరిగింది. పట్టణ ములోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో భాగంగా కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా  జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మాదాసు పృధ్వీరాజ్ సాయి, రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి ఆలా శివ గోపి,మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రాచపూడి వెంకట్ మాట్లాడుతూ  నరసరావుపేట రోడ్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ స్థలంలో బి.సి సామాజిక వర్గానికి 53 సెంట్లు భూమి, భవన నిర్మాణానికి కేటాయించడం జరిగిందని, ఆ స్థలం ముందు కొంతమంది  శాశ్వత రేకుల షెడ్లు, చిన్న..చిన్న పాకాల నిర్మాణాలు చేపడుతున్నారని, ఇవి తొలగించాలని సంబంధిత అధికారులకు తెలియపరిచిన కాలయాపన చేస్తున్నారని వాపోయారు. మునుముందు భవన నిర్మాణం చేపట్టేటప్పుడు, ఇతర కార్యక్రమాలు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.


Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిన్న చిన్న సమస్యలను సర్దుకుపోతూ పార్టీ గెలుపుకి పని చేద్దాం - చిలకలూరిపేట సభలో అనిల్ కుమార్ యాదవ్

 చిన్న చిన్న సమస్యలను సర్దుకుపోతూ పార్టీ గెలుపుకి పని చేద్దాం - చిలకలూరిపేట సభలో అనిల్ కుమార్ యాదవ్

చిన్న చిన్న సమస్యలను సర్దుకుపోతూ పార్టీ గెలుపుకి పని చేద్దాం - చిలకలూరిపేట సభలో అనిల్ కుమార్ యాదవ్

చిలకలూరిపేట:-  పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వైయస్సార్సీపి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, చిలకలూరిపేట వైయస్ఆర్సిపి సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు మరియు పార్టీలోని ముఖ్య కార్యకర్తలు, నాయకులు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ చిలకలూరిపేటలో వైఎస్ఆర్సిపి కేడర్ చాలా బలంగా ఉంటుందని. చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుకుపోయి పార్టీ గెలుపుకి కృషి చేద్దామని. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా రాజేష్ నాయుడు గెలుపుకై కార్యకర్తలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 45 రోజులు కార్యకర్తలు సమయమును పాటిస్తే ఆ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లాలో ఉన్న ఏడికి ఏడు ఎమ్మెల్యేలను ఒక ఎంపీ స్థానాన్ని గెలిచి జగన్మోహన్ రెడ్డి కి మనం అందజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నో కష్టాలు పడి తాను రెండుసార్లు ఎమ్మెల్యేని అయ్యానని ఒకసారి మంత్రిగా కూడా పని చేశానని కష్టం విలువ తనకు తెలుసునని ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని అదే వైఎస్ఆర్సిపి ముఖ్య అజెండా అని ఆయన తెలిపారు.


Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

రేపు మంగళగిరిలో టిడిపి ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద జయహో బీసి భారీ బహిరంగ సభ

రేపు మంగళగిరిలో టిడిపి ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద జయహో బీసి భారీ బహిరంగ సభ

రేపు మంగళగిరిలో టిడిపి ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద జయహో బీసి భారీ బహిరంగ సభ


ఆంధ్రప్రదేశ్ :- బీసీలు అందని ఐక్యం చేస్తూ రేపు మంగళగిరిలో జయహో బిసి అనే పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న బీసీలకు వారి అభివృద్ధి అభ్యుదయానికి ఉపయోగపడే విధంగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు TDP పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున బిసి కార్యకర్తలు, పార్టీలోని ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ సభలో చంద్రబాబు బీసీ డిక్లరేషన్ను ప్రకటించనున్నారు. పల్నాడు జిల్లా నుండి భారీగా బూత్ స్థాయి నుండి కార్యకర్తలు, ముఖ్య నేతలు, బీసీ అధికార ప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. ఈ సభ దేశంలోనే అతిపెద్ద బీసీ సభ అవుతుందని వారు తెలియజేశారు.


Follow the Chilakaluripetspeed Speed News channel on WhatsApp:

 https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల - లింక్ పై క్లిక్ చేసి నేరుగా డౌన్లోడ్ చేసుకోండి

పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల - లింక్ పై క్లిక్ చేసి నేరుగా డౌన్లోడ్ చేసుకోండి

పదవ తరగతి హాల్ టికెట్లు విడుదల - లింక్ పై క్లిక్ చేసి నేరుగా డౌన్లోడ్ చేసుకోండి


పాఠశాలతో సంబంధం లేకుండా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్ ని ఆన్లైన్లో పొందవచ్చు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ జిల్లాని సెలెక్ట్ చేసి స్కూల్ పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు.ఈనెల 18 నుండి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరుకానున్నారు.


https://www.bse.ap.gov.in/apsscht24/RegDefault.aspx


చిలకలూరిపేట పట్టణంలోని వార్తలను త్వరగా పొందడం కోసం క్రింది వాట్స్అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి & ఆ లింకును మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.


https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన MLC మర్రి రాజశేఖర్

చిలకలూరిపేట - సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన MLC మర్రి రాజశేఖర్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన MLC మర్రి రాజశేఖర్


చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని పలువురు బాధితులకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆఫీసు నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన నాగండ్ల వెంకటేశ్వరరావుకు ముఖ్యమంత్రి సహయ నిధి నుంచి రూ.1,70,000/- చెక్కును మంజూరు చేసారు.ఈరోజు నాగండ్ల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్  చెక్కును అందజేశారు.

చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామ వాస్తవ్యులు కనడం గౌతం రామ్ సాయి ఊరి నడిబొడ్డున కట్టలపాము కరవగా ఆ పురుగు విషం ఊపిరితిత్తులకి చేరి అనారోగ్యంతో హస్పిటల్ లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారి కుటుంబానికి అండగా  శ్రీ మర్రి రాజశేఖర్ ముఖ్యమంత్రి సహయనిధి నుండి 70,000/-డెబ్భై వేల రూపాయలు మంజూరు చేయించారు.ఈరోజు వారి కుటుంబ సభ్యులకు చెక్కు అందించారు.

అలాగే గోవిందపురం వాస్తవ్యులు నీరుకొండ నాగరాజకుమారి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరు అయిన 80,000/-యెనభైవేలరూపాయలు చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందించారు. వారితో పాటుగా మండల యువజన విభాగ మాజీ అధ్యక్షులు వేజర్ల కోటేశ్వరరావు, తోట పుల్లారావు, ఆలా మస్తాన్, గాయాల కొండలు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి, శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ కి తమ ధన్యవాదాలు తెలియజేశారు.


చిలకలూరిపేట పట్టణంలోని వార్తలను త్వరగా పొందడం కోసం క్రింది వాట్స్అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి & ఆ లింకును మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

ప్రత్తిపాటికి‌ TDP కుటుంబం అండగా ఉంటుంది - అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.

ప్రత్తిపాటికి‌ TDP కుటుంబం అండగా ఉంటుంది -  అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.

ప్రత్తిపాటికి‌ TDP కుటుంబం అండగా ఉంటుంది -  అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.


చిలకలూరిపేట నియోజకర్గం :-  మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి గెలుపు ఖాయమైన నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం ఆయన కుమారుడిని అక్రమంగా అరెస్టుచేసి  వేధింపులకు పాల్పడుతోందన్నారు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి. చిలకలూరిపేట నివాసంలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలిసిన ఆయన వారి కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. ఆయనతో పాటు నరసరావుపేట నియోజకవర్గ తెదేపా నేత నల్లపాటి రాము, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ప్రత్తిపాటి నివాసానికి తరలివచ్చారు.  ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ చిలకలూరిపేటలో ప్రత్తిపాటి గెలుపు ఖాయమని సర్వేల్లో సుస్పష్టంగా తెలిసిందని.. ప్రజల్లో అత్యంత ఆదరణ కలిగిన నాయకుడిగా ప్రత్తిపాటి నిలిచారని అన్నారు. ఇది గమనించి రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక, జీర్ణించుకోలేక ప్రత్తిపాటిని ఏమీ చేయలేక కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకున్నారని గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నీతిమాలిన రాజకీయాలకు ఇది పరాకాష్ట అని అభిప్రాయపడ్డారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఇటువంటి సవాళ్లు ఎన్నో చూశామని.. భయపడేది ప్రసక్తే లేదని తెదేపా నేతలకు తెలిపారు. నేను గానీ నా కుటుంబసభ్యులు గానీ తప్పు చేయలేదు.. తలవంచేది లేదన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కక్షకట్టి చిన్న పిల్లోడిని జైలులో పెట్టారనే బాధ ఉందన్నారు. శరత్ ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు... ఉన్నత విద్యావంతుడు. రాజకీయాలకు దూరంగా తన పని ఏదో తాను చేసుకుంటున్నాడని అని పేర్కొన్నారు. ఎక్కడా తెరపై కనిపించరు.. అత్యంత సౌమ్యుడు... అలా అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడిపై అక్రమ కేసు పెట్టి జైలులో పెట్టారనే బాధ ఉందన్నారు. తన రాజకీయ జీవితం కోసం కుటుంబసభ్యులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ కష్టసమయాన్ని తమ కుటుంబం మొత్తం కలిసి ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. తెదేపా కుటుంబం మొత్తం అండగా ఉంటుందని చంద్రబాబు, లోకేశ్ కూడా భరోసా ఇచ్చారని అన్నారు. ఈ సమయంలో తమకు మద్దతుగా సంఘీభావం తెలుపుతున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రత్తిపాటి.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి