మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం - పరామర్శించిన మర్రి

మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం - పరామర్శించిన మర్రి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: పార్టీ అధికారములో లేకపోయినా అహర్నిశలు కష్టపడి పార్టీ అభ్యున్నతికి కృషిచేసి పదవి కాంక్ష లేకుండా ఎమ్మెల్యే టికెట్టు వదులుకున్న మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని అభిమాని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం. వివరాల్లోకి వెళ్తే చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వేలూరు గ్రామానికి చెందిన దేవరకొండ గోపి(30) అనే యువకుడు మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని తీవ్ర మనస్తాపంతో శనివారం నాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన యువకుడిని చిలకలూరిపేట లోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న మర్రి రాజశేఖర్ హాస్పటల్ కు చేరుకొని ఘటనకు పాల్పడిన వ్యక్తిని పరామర్శించారు.



Share:

మర్రి రాజశేఖర్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారు!మడమ తిప్పారు! - రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.

మర్రి రాజశేఖర్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారు!మడమ తిప్పారు! - రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు బహిరంగ సభలో మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పారని, జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడమ తిప్పడు అనే ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.అమరావతి రాజధానిగా ఉండాల్సిందే అని మాట తప్పడంతో పాటు అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే మాటతప్పారని,ఉద్యోగుల సీపీఎస్ రద్దు వారం రోజుల్లో చేస్తానని నమ్మబలికి ఉద్యోగులకు మొండి చెయ్యి ఇచ్చిన ఘనత సాధించారని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గ వైస్సార్సీపీ సీటు వదులుకుంటే ఎమ్మెల్సీ ఇచ్చి మర్రి రాజశేఖర్ ను మంత్రిగా చేస్తానని చిలకలూరిపేట నడిబొడ్డున నిలబడి హామీ ఇచ్చిన జగన్ మర్రి రాజశేఖర్ కమ్మ కులస్తుడు కావడంతో కమ్మకులాన్ని అనగదొక్కాలనే ఆయనకు చివరిరోజు వరకూ వేచి చూసేలా చేసి ఎమ్మెల్సీ ఇవ్వకుండా ప్రక్కన పెట్టారని,ఇది చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ప్రజలను, ఆయన అభిమానులను మోసం చేయడమే అని రావు సుబ్రహ్మణ్యం అన్నారు.వైస్సార్సీపీలో పదవులకు సంబంధించిన విషయంగా ఈ అంశాన్ని చూడలేమని ఎమ్మెల్సీ,మంత్రి పదవి రాజ్యాంగ బద్ధమైన వి కనుక చిలకలూరిపేట కు రావాలనే ప్రజల ఆకాంక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీరుగార్చడం వైస్సార్సీపీ పార్టీకి నష్టం కలిగించే విషయం అని మర్రి రాజశేఖర్ అభిమానులు మరోసారి మోసపోయిన విషయాన్ని గ్రహించి చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో,గుంటూరు జిల్లాలో వైస్సార్సీపీ ని పునాదులు పెకళించి వేస్తారని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.నియోజకవర్గ పరిధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్సార్ కాంగ్రెస్ పాలన ఈ సంఘటనతో  అంతిమ క్షణాలు లెక్కించడం మొదలు అయిందని అన్నారు.పొన్నూరు నియోజకవర్గ పరిధిలో రావి వెంకటరమణ నుఇదే తరహాలో ఎమ్మెల్సీ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి మోసం చేసిన విషయం ఈసందర్భంగా గుర్తు చేశారు.



Share:

ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం - చిలకలూరిపేట విద్యార్థి జేఏసీ

ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం - చిలకలూరిపేట విద్యార్థి జేఏసీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై శుక్రవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నాలుగు ఆప్షన్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చిలకలూరిపేట విద్యార్థి జేఏసీ అధ్యక్ష , ఉపాధ్యక్షులు ఉప్పుతెల్ల. సిద్దు , మేకపోతుల నాగేశ్వరరావు లు తెలిపారు. అదేవిధంగా నవంబర్ 15వ తేదీన స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ డిసెంబర్ 10 వరకు అమలులో ఉన్నందున విరమించుకోవడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య కార్యాచరణ, అవగాహన సదస్సులు నిర్వహిస్తామని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు బొంతా భగత్ సింగ్ ,బి.సాయి నాయక్ , మాదాసు పృథ్వీరాజ్, ఎమ్.ఫణి, పి.మహేష్ ,జగదీష్ తదితరులు ఉన్నారు.



Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

 చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు


చిల‌క‌లూరిపేట రెండో శ‌నివారం సంద‌ర్భంగా రేపు 13-11-2021 చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలం గ్రామాల నందు విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిపివేసే స‌మ‌యం వివ‌రాల‌ను విద్యుత్‌శాఖ డీఈఈ సీహెచ్ రాంబొట్లు శుక్ర‌వారం తెలిపారు. విద్యుత్ వినియోగ‌దారులు గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని కోరారు. విద్యుత్‌  స‌ర‌ఫ‌రా నిలిపివేసే ప్రాంతాల వివ‌రాలివే..

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిల‌క‌లూరిపేట నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల, మండలాల గ్రామాలలో

చిల‌క‌లూరిపేట మండ‌లంలో...

చిలకలూరిపేట రూరల్ మండలం లోనీ మద్దిరాల33/11కేవీ సబ్స్టేషన్ లోని గోపాలంవారి పాలెం ఫీడెర్ మరమ్మత్తులు కారణంగా గోపాలంవారి పాలెం , యూ టి, యడవల్లి కట్టుబడివారిపాలెం గ్రామములో లోని  గృహ, వాణిజ్య, చిన్న మరియు బారి పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల  వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.

నాదెండ్ల మండ‌లంలో...

గణపవరం 33/11కేవీ సబ్ స్టేషన్ లో   ఫీడర్లు  మరమత్తులు కారణంగా నాదెండ్ల మండలం లోని గణపవరం, నాదెండ్ల, అప్పాపురం, చిరుమామిల్ల, తూబాడు, సంకురాత్రిపాడు  జంగాలపల్లి,సంకురాత్రిపాడు గ్రామాలకు మరియు గణపవరం గ్రామములోని పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. 

 యడ్లపాడు మండలంలో...

యడ్లపాడు మండలం లోని తిమ్మాపురం , బోయపాలెం, వంకాయలపాడు , జాలాది, మైదవోలు, జగ్గాపురం, కారుచొల, గుత్తవారిపాలెంగ్రామం లోని గృహ, వాణిజ్య, చిన్న మరియు బారి పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల  వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.

చిలకలూరిపేట టౌన్ లో విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాల కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి

https://chilakaluripetspeednews.blogspot.com/2021/11/13112021-9-2.html?m=1




Share:

చిలకలూరిపేట పట్టణంలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

 చిలకలూరిపేట పట్టణంలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిలకలూరిపేట పట్టణంలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిల‌క‌లూరిపేట రెండో శ‌నివారం సంద‌ర్భంగా రేపు 13-11-2021 చిలకలూరిపేట టౌన్ నందు విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిపివేసే స‌మ‌యం వివ‌రాల‌ను విద్యుత్‌శాఖ డీఈఈ సీహెచ్ రాంబొట్లు శుక్ర‌వారం తెలిపారు. విద్యుత్ వినియోగ‌దారులు గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని కోరారు. విద్యుత్‌  స‌ర‌ఫ‌రా నిలిపివేసే ప్రాంతాల వివ‌రాలివే..

చిల‌క‌లూరిపేట టౌన్ నందు

చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని మద్దినగర్,A1  ఫీడర్ విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలోని మద్దినగర్, చీరాల రోడ్డు, రహమత్ నగర్,కోమరవల్లిపాడు, శ్రీనివాస కాలనీ, దాసరి కాలనీ, ప్రభుత్వ వైద్యశాల రోడ్డు, వెంకటప్పయ్య కాలనీ , బాలాజీ థియేటర్ రోడ్డు, క్రిస్టియన్ పేట, వెంకటాఛారి నగర్, వెంగళరెడ్డి నగర్, యం వి నారాయణపురం, ఆర్ టి సి కాలనీ, రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్డు, కృష్ణమహల్ రోడ్డు, గుర్రాల చావిడి, కొల్లారామారావుహాస్పిటల్ నుండి కలామందిర్ రోడ్డు వరకు మరియు టౌన్2 పరిధిలోకి పురుషోత్తమపట్టణం, అడ్డరోడ్డు సెంటర్ బొందిలిపాలెం, గుండయ్యతోట, వడ్డెరపాలెం, పందరిపురం, కృష్ణనగర్ ప్రాంతములకు ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.



Share:

విద్యార్థులపై పోలీసుల లాఠీ చర్యకు వ్యతిరేకంగా ఈనెల 15వ తేదీన తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన - చిలకలూరిపేట విద్యార్థి JAC

విద్యార్థులపై పోలీసుల లాఠీ చర్యకు వ్యతిరేకంగా ఈనెల 15వ తేదీన తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన - చిలకలూరిపేట విద్యార్థి JAC

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: అనేక సంవత్సరాలుగా లక్షలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం కొనసాగించాలని..చిలకలూరిపేట విద్యార్థి జెఎసి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు సిద్దు , జగదీష్ కోరారు. శుక్రవారం స్థానిక ఎన్ ఆర్ టీ సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థి జేఏసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిడెడ్ విద్యాసంస్థలను యధావిధిగా కొనసాగించాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో లోపాలు ఉంటే ప్రభుత్వం సరిదిద్దాలి కానీ పూర్తిగా వ్యవస్థను తీసివేయడం సమంజసం కాదని తెలిపారు. రాష్ట్రంలో పలు చోట్ల ఈ అంశంపై నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయటం అన్యాయమన్నారు. పోలీసుల లాఠీఛార్జి కి వ్యతిరేకంగా నవంబర్ 15వ తేదీన చిలకలూరిపేట మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి అనంతరం తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని విద్యార్థులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో విద్యార్థి జేఏసీ నాయకులు బొంతా భగత్ సింగ్,బి.సాయి,  ఎం.ఫణి, కిరణ్ ,వి.మణి , యం.నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.



Share:

చిలకలూరిపేట:- ఫిట్స్ రావడంతో రన్నింగ్ లారీ నుండి కిందపడి క్లీనర్ మృతి

చిలకలూరిపేట:- ఫిట్స్ రావడంతో రన్నింగ్ లారీ నుండి కిందపడి క్లీనర్ మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట బెంగళూరు నుండి విజయవాడ కు వెళుతున్న లారీలో ఉన్న క్లీనర్ ఫిట్స్ రావడంతో లారీ లో నుంచి క్రిందపడి మృతి చెందిన ఘటన చిలకలూరిపేటలో జరిగింది. ఎస్ ఆర్ ఎమ్ టి పార్సిల్ కు సంబంధించిన లారీ విజయవాడ నుండి బెంగళూరు కు సరుకు దించి రిటర్న్ వస్తుండగా... చిలకలూరిపేట గణపవరం మధ్య ఉన్న కుప్ప గంజి వాగు బ్రిడ్జి పైన గుంటూరుకు చెందిన క్లీనర్ కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో రన్నింగ్ లారీ నుండి కిందపడి మరణించినట్టుగా డ్రైవర్ రవి బాబు తెలిపారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీస్ వారు దర్యాప్తు చేపట్టారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి