మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం - పరామర్శించిన మర్రి
చిలకలూరిపేట: పార్టీ అధికారములో లేకపోయినా అహర్నిశలు కష్టపడి పార్టీ అభ్యున్నతికి కృషిచేసి పదవి కాంక్ష లేకుండా ఎమ్మెల్యే టికెట్టు వదులుకున్న మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని అభిమాని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం. వివరాల్లోకి వెళ్తే చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వేలూరు గ్రామానికి చెందిన దేవరకొండ గోపి(30) అనే యువకుడు మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని తీవ్ర మనస్తాపంతో శనివారం నాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన యువకుడిని చిలకలూరిపేట లోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న మర్రి రాజశేఖర్ హాస్పటల్ కు చేరుకొని ఘటనకు పాల్పడిన వ్యక్తిని పరామర్శించారు.





No comments:
Post a Comment