మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

లండన్ లో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మన తెలుగు కృష్ణ తేజం

లండన్ లో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మన తెలుగు కృష్ణ తేజం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన IAS మైలవరపు కృష్ణ తేజ అవార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా లండన్ హై స్పీడ్ డైవర్సిటీ కార్యక్రమంలో  మన కృష్ణతేజకు అవార్డుని అందజేశారు. ప్రస్తుతం కేరళ టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. కేరళలో "అయమానం" గ్రామీణ పర్యాటక ప్రాజెక్టుకు (WTM) 'వరల్డ్ ట్రావెల్ మార్కెట్' అవార్డు లభించింది. కేరళ లో పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి ఈ మిషన్ అయమనం ప్రాజెక్టుకు అవార్డు దక్కడంతో కేరళ పర్యాటక శాఖ అధికారి మహమ్మద్ రియాజ్ ఆనందం వ్యక్తం చేశారు. కోవిడ్ తర్వాత పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ఈ అవార్డు తమ రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అలాగే కృష్ణ తేజ పదునైన ఆలోచనలను అవలంబించడం వలన ఇలాంటి అవార్డులు తమకు దక్కాయని వారు తెలిపారు. కృష్ణ తేజ తనకు అప్పగించిన బాధ్యతలను తన ఆలోచనలను కలుపుకొని సంపూర్ణంగా నిర్వహించడం వలన ఈ యొక్క అవార్డే కాదు గతంలోనూ పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. కేరళలో వరదలు మొదలుకొని & కోవిడ్ నియంత్రణను చర్యలను చేపట్టడంలో మైలవరపు కృష్ణ తేజ తనకు తానే సాటి అని - ఈనాడు లండన్లో ఈ అవార్డును అందుకోవడంతో మరోసారి మన తెలుగువారి ఘనతను విదేశాల్లో కూడా చాటిచెప్పారు. ఇలాంటి అవార్డులు మరెన్నో పొంది తెలుగువారి కీర్తిని దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల తెలియజేయాలని కోరుకుంటూ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



Share:

MLA ఆధ్వర్యంలో వైద్యులకు సత్కారం - కరోన మృతుల కుటుంబాలకు 50,000 - ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం - కలెక్టర్ వివేక్ యాదవ్

MLA ఆధ్వర్యంలో వైద్యులకు సత్కారం - కరోన మృతుల కుటుంబాలకు 50,000 - ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం - కలెక్టర్ వివేక్ యాదవ్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపం నందు కరోన విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కోవిడ్ రోగులకు చికిత్స అందించిన డాక్టర్లకు  MLA విడుదల రజిని ఆధ్వర్యంలో ఘన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ :-

కోవిడ్ సమయంలో ఎనలేని సేవలందించిన డాక్టర్లకు సత్కారం చేయటం మంచి ఆలోచన అని ముఖ్యంగా సెకండ్ వేవ్ నందు కొత్త వైద్య సిబ్బందిని, తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు ఏర్పాటు చేశామని. అలాగే ప్రభుత్వం కోవిడ్ రోగులకు ఉచితంగా వైద్య సదుపాయాలను అందించిందని. అలాగే కోవిడ్ టీకాలను అందించామని ఆయన తెలిపారు. కోవిడ్ వలన చనిపోయిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయలను అందించమని వెంటనే మీ సమీప ANMలను సంప్రదించాలని అని ఆయన తెలిపారు. కోవిడ్ వలన చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఇంకొక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఆదేశించారని ఆయన తెలిపారు.

MLA మాట్లాడుతూ :-

MLA విడుదల రజనీ మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ & కొరత బెడ్లు కొరత లేకుండా చేశామని -  క్లిష్ట సమయాల్లో కలెక్టర్ గారిని సంప్రదించగా వెంటనే అన్ని సమకూర్చారని ఆమె తెలిపారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ఉచితంగా బియ్యం & ఆర్థిక సాయం అందజేశామని ఆమె గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా మన రాష్ట్రంలో ప్రవేటు ఆసుపత్రులకు దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ పని చేశాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేషిరెడ్డి, క‌మిష‌న‌ర్ ర‌వీంద్ర‌,తహసీల్దార్ సుజాత,సురేష్ నాయక్,డిప్యూటీ డి.యం.హెచ్.ఓ,వైద్యులు గోపినాయ‌క్,లక్ష్మ నాయక్,సోమల నాయక్,కీర్తి,రాజేష్,శ్యాంసోన్. ప్రియాంక,భాగ్యలక్ష్మి,సీనియర్ డాక్టర్స్ కొల్లా అమర్,కొమ్మినేని వీరశంకరరావు, మక్కెన వంశీ, గరికపాటి వరలక్ష్మి,కందిమల్ల వాసు, వెల్లటూరి పెద్దబ్బాయి,రామకృష్ణ,మునిసిపల్ చైర్మన్ షేక్ రఫాని,వైస్ చైర్మన్లు కొలిశెట్టి శ్రీనివాసరావు, వలేటి వెంకటేశ్వర్లు,మార్కెట్ యార్డ్ చైర్మన్ మద్దిరాల విశ్వనాధం,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్, ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు, జడ్పీటీసీలు కాట్రగడ్డ మస్తాన్ రావు,ముక్తా వాసు,కోడె సుధారాణి,ఎంపీపీ లు దేవినేని శంకరరావు, పిడతల ఘాన్సీ,తలతోటి రాణి,నాదెండ్ల మండల అధ్యక్షుడు గొంటు శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి,విడదల గోపి, తులం సుధాకర్,పిల్లి సాగర్,షేక్ ఆదం వలి, చేమిటిగంటి పార్వతి,చింతపల్లి విల్సన్,షేక్ మీరాబి, షేక్ జమీలా, పుల్లగూర అనురాధ,నాయబ్ సైదాబి,షేక్ నసీమా బేగం,చెంబేటీ భారతి,అన్నపురెడ్డి శ్రీలక్ష్మి,ములకలూరి బాజి మున్నీ,యూసుబ్, షేక్ ఖాజా భాను,కొచ్చెర్ల విజయలక్ష్మి, బిట్రా రాజేంద్ర,వడితే కోట నాయక్,రమణి బాయ్, కో ఆప్షన్ సభ్యులు పొలిశెట్టి మస్తాన్,బక్షు మేస్ట్రీ,మరియు పలువురు ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,మరియు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



Share:

బద్వేల్లో YSRCP భారీ కాదు అతి భారి విజయం - భర్త కన్న భార్యకి డబల్ మెజారిటీ

బద్వేల్లో YSRCP భారీ కాదు అతి భారి విజయం - భర్త కన్న భార్యకి డబల్ మెజారిటీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

బద్వేల్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మళ్లీ వీచిన ఫ్యాన్ గాలి - అందరూ అనుకున్నట్లే YSRCP విజయ ఢంకా మోగించింది. గత ఎన్నికల్లో భర్త వెంకటసుబ్బయ్యకు 44,000 మెజారిటీతో గెలుపొందితే. ఇప్పుడు సుబ్బయ్య భార్య దాసరి సుధా కు 1,11,710 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి పి సురేష్ కు  21,612 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ కు 6,191 ఓట్లు వచ్చాయి. దీంతో బద్వేల్ ఎన్నికల్లో YSRCP 90,089 ఓట్ల మెజారిటీతో అతి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విషయం ఏమిటంటే గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కొంచెం తక్కువగా నమోదు అయినా కూడా భర్త వెంకట సుబ్బయ్య కన్నా డబల్ మెజారిటీతో విజయం సాధించడం విశేషం. ఈ ఎన్నికల్లో టిడిపి పాల్గొనలేదు.



Share:

బద్వేల్ ఉపఎన్నికల్లో సూపర్ స్పీడ్ గా తిరుగుతున్న ఫ్యాన్ - ఎంత స్పీడుగా అంటే ?

బద్వేల్ ఉపఎన్నికల్లో సూపర్ స్పీడ్ గా తిరుగుతున్న ఫ్యాన్ - ఎంత స్పీడుగా అంటే ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


బద్వేలు ఉపఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం మొదలైంది. అయితే ఇప్పటివరకు జరిగిన మూడవ రౌండ్ కౌంటింగ్ లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా 23,700 భారీ ఆదిత్యంలో కొనసాగుతున్నారు, తరువాత బిజెపి అభ్యర్థి పి సురేష్ 1688 ఓట్లతో, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ 580 ఓట్లు పొందారు. ప్రత్యర్థులకు అందనంత ఆదిత్యం లో ఉండటంతో YSRCPపార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది.



Share:

చిలకలూరిపేట:- లారీ బోల్తా - ఇద్దరికి తీవ్రగాయాలు

చిలకలూరిపేట:- లారీ బోల్తా - ఇద్దరికి తీవ్రగాయాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- చిలకలూరిపేట మండలం పరిధిలోని లింగంగుంట్ల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం - ఇద్దరికి గాయాలయ్యాయ.

వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి గుంటూరు ప్రత్తి లోడుతో లారీ వస్తోంది.  లారీ డ్రైవర్ విశ్రాంతి తీసుకోవడంతో.... ఆ  సమయంలో క్లీనర్ డ్రైవ్ చేస్తూ ఉండగా అదుపుతప్పి బోల్తా పడింది. లారీ డ్రైవర్ నాగిరెడ్డి తలకుతీవ్ర గాయాలు అయ్యాయి. ఇతనిది కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్ద పాసపుల్ల గ్రామం. లారీ క్లీనర్ జమాల్ బాషాకు స్వల్పగాయాలయ్యాయి. ఇతనిది కడప జిల్లా జమ్మలమడుగు. తెల్లవారు జాము 4 గంటల 30 నిమిషాల సమయంలో ఈ సంఘటన జరిగింది.. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకొని క్షతగాత్రులను హుటాహుటిన చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం లారీ డ్రైవర్ నాగిరెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు.



Share:

రోజు పెరిగే పెట్రోల్ రేటు కన్నా ఈరోజు రికార్డు స్థాయిలో పెరుగుదల - ఎంత అంటే ?

రోజు పెరిగే పెట్రోల్ రేటు కన్నా ఈరోజు రికార్డు స్థాయిలో పెరుగుదల - ఎంత అంటే ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


గత కొంత కాలంగా ఇంధన ధరలకు రెక్కలొచ్చి ఆకాశంలో వీర విహారంగా ఎగిరిపోతున్నాయి. ప్రతిరోజు 30 నుండి 35 పైసల వరకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగేవి. అలాంటివి మొట్టమొదటిసారిగా 40 పైసల పైకి ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా సోమవారం నాడు పెట్రోల్ పై 41 పైసా డీజిల్ పై 42 పైసలు పెరిగాయి. పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో మెట్రో నగరాల్లో వాహనదారులు ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.



Share:

చిలకలూరిపేట :- బైక్ పై నుండి లారీ క్రింద పడి మహిళ మృతి

చిలకలూరిపేట :- బైక్ పై నుండి లారీ క్రింద పడి మహిళ మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిల‌క‌లూరిపేట - కోట‌ప్ప‌కొండ మార్గంలో శ‌నివారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళ మృతి చెందింది. సేక‌రించిన వివ‌రాల మేర‌కు చిల‌క‌లూరిపేట మండ‌లంలోని క‌ట్టుబ‌డివారిపాలెం యూటీకి చెందిన కామ‌కూరి అనంత‌ల‌క్ష్మి(50) త‌న కుమార్తె విజ‌య‌దుర్గ‌కు ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో ప్ర‌త్తిపాడు మండ‌లం య‌న‌మ‌ద‌ల‌లోని కుమార్తె వ‌ద్ద ఉంటోంది. శ‌నివారం డ్వాక్రా ప‌ని ఉండ‌టంతో అల్లుడు భ‌లే వెంక‌టేశ్వ‌ర్లు ద్విచ‌క్ర‌వాహ‌నంపై యూటీ వ‌స్తోంది. పురుషోత్త‌మ‌ప‌ట్నం బొడ్డురాయి వ‌ద్ద  ముందు వెళుతున్న లారీని క్రాస్ చేయ‌బోతున్న స‌మ‌యంలో అనంత‌ల‌క్ష్మి ద్విచ‌క్ర‌వాహ‌నం పై నుంచి జారి లారీ కింద ప‌డింది. దీనితో ఆమె అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. అనంత‌ల‌క్ష్మి పుట్టిన ఊరు పురుషోత్త‌మ‌ప‌ట్నం. యూటీకి చెందిన అచ్చిబాబుతో ఆమె వివాహం జ‌రిగింది. పుట్టిన ఊరులోనే రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో రెండు గ్రామాల‌లోని ఆమె కుటుంబ స‌భ్యుల ఇళ్ల‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.


Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి