మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - పట్టణంలో ఆపరేషన్ జీరో వేస్టేజ్ - ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ / డ్రై డే - ఫ్రైడే

చిలకలూరిపేట - పట్టణంలో ఆపరేషన్ జీరో వేస్టేజ్ - ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ / డ్రై డే - ఫ్రైడే 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ మరియు చైర్పర్సన్ ఆదేశాల మేరకు స్వచ్ఛ చిలకలూరిపేట సాధించాలని ప్రతిరోజు ఒక వార్డుని ఎంచుకొని వార్డు పరిసరాలలో చెత్తాచెదారం, పాడుబడ్డ బావులు, డ్రైనేజీ కాలువలు, మురికి కాల్వలను, క్లీన్ చేయడం కోసం ప్రత్యేక డ్రైవ్ ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలోని ప్రజలందరూ కచ్చితంగా డ్రై డే - ఫ్రైడే పాటించాలని కోరారు. ఇళ్లల్లో నీరు నిల్వ ఉంచే ప్రదేశాలను వారానికి ఒకరోజు పొడిగా ఉంచాలని వారు కోరారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం కోసం ఇల్లల్లో ఉండే చెత్తను పరిసరాలలో వేయకుండా మున్సిపాలిటీ చెత్త వాహనాలను ఉపయోగించుకోవాలని అని కోరారు. అలాగే డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పుర ప్రజలందరూ సహకరించాలని కోరారు. వార్డులోని పాడుపడ్డ బావులను శుభ్రపరిచి అందులో గంబూష చేపలను ఏర్పాటు చేసి దోమల బెడద లేకుండా చేస్తామని అని వారు తెలిపారు. ఈ చేపల వలన దోమల లార్వా ను (గుడ్డు) అది తిని వేస్తుందని. తద్వారా దోమల వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చని వారు తెలిపారు.

             * VIDEO*



Share:

దేశ చరిత్రలో మొట్టమొదటిసారి పెట్రోల్ పై 7రూ , డీజిల్ పై 8రూ‌ ల బాదుడు

దేశ చరిత్రలో మొట్టమొదటిసారి పెట్రోల్ పై 7రూ , డీజిల్ పై 8రూ‌ ల బాదుడు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా ఫస్ట్ లాక్ డౌన్ తరువాత నుండి దేశంలో ఇంధనం రేట్లు ఆకాశానికి వెళ్తున్నాయి. అయితే గత నెల సెప్టెంబర్ 28 నుండి ఈనెల అక్టోబర్ 28 వరకు మొత్తం 24 సార్లు ఇంధనం రేట్లు పెరిగాయి. అందులో పెట్రోల్ పైన 7.11రూ  డీజల్ పైన 8.43రూ పెరిగాయి. దేశంలో ఒక్క నెలలో ఇన్ని సార్లు ఇంత మొత్తంలో ఇంధనం రేట్లు పెరగటం ఇదే మొదటిసారి. చమురు రేట్లు ఈ విధంగా పెరగటంతో నిత్యావసర ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇంధనం రేట్లకి అడ్డుకట్ట ఎప్పుడు వేస్తారు అని సామాన్యులు లబోదిబో మంటున్నారు.



Share:

చిలకలూరిపేట:- టౌన్ & రూలర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ

చిలకలూరిపేట:-  టౌన్ & రూలర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ 

చిలకలూరిపేట అర్బన్ & రూలర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు భాగంగా ఈరోజు విద్యార్థులతో పట్టణంలోని ప్రధాన కుడళ్ళు అయిన NRT సెంటర్ నుండి చౌత్ర సెంటర్ మీదగా కళామందిర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నరసరావుపేట డి.ఎస్.పి విజయ భాస్కర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన అమరవీరుల త్యాగాలను కొనియాడారు విద్యార్థులు అందరూ కార్యక్రమానికి సహకరించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ రాజేశ్వరరావు, రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్సైలు మోహన్, ఫిరోజ్, రాజేష్ మరియు హోం గార్డ్లు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.



Share:

చిలకలూరిపేట స్క్రబ్ మెంటల్ డీలర్ స్టోరేజ్ నందు అగ్ని ప్రమాదం

చిలకలూరిపేట స్క్రబ్ మెంటల్ డీలర్ స్టోరేజ్ నందు అగ్ని ప్రమాదం 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని NRT సెంటర్ నందు ఉన్న ఒక స్క్రబ్ మెటల్ డీలర్ స్టోరేజ్ నందు అగ్ని ప్రమాదం సంభవించింది. Nrt సెంటర్ లోని నవయుగ వైన్స్ పక్కనే ఉన్న స్క్రబ్ స్టోరేజ్ నందు మంగళవారం ఉదయం ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు యజమానికి మరియు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే అక్కడ ఉన్నటువంటి పాత సామాను, ప్లాస్టిక్ వస్తువులు, పేపర్లు, సీసాలు, చాలా వరకు దగ్ధమయ్యాయి. అయితే భారీగానే ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.



Share:

చెలరేగిన పాకిస్తాన్ - తడబడిన కోహ్లీ సేన

చెలరేగిన పాకిస్తాన్ - తడబడిన కోహ్లీ సేన

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

భారత్ పై పాకిస్తాన్ భారీ విజయం. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో తడబడింది. రోహిత్ శర్మ డెకౌట్ అవగా వెంటనే కేఎల్ రాహుల్ (3) తో వెనుదిరిగాడు. వెంటనే సూర్యకుమార్ యాదవ్(11) అవుటయ్యాడు. కోహ్లీ(57) పంత్ కొంచెం సేపు మెరిపించినా భారత్ 20 ఓవర్లకు గాను 151-7 వికెట్లు నష్టంతో మొదటి ఇన్నింగ్స్ పూర్తి చేసుకుంది.

తర్వాత బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ బాబర్ ఆజం(68) రిజ్వాన్(79) చెలరేగిపోయారు. పాకిస్తాన్ ఆట ముందు భారత్ బౌలర్లు తేలిపోయారు. షమ్మీ, బూమ్రా, భువనేశ్వర్ కుమార్, జడేజా, వరుణ్ చక్రవర్తి ఎవరిని వదలకుండా వీర బాదుడు బాధి పారేశారు పాకిస్తాన్ బ్యాట్స్‌మన్స్. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 13 బాల్స్ మిగిలి ఉండగానే భారత్ పై పాకిస్తాన్ విజయం సాధించింది.



Share:

నేడే దాయాదుల పోరు - విజయం ఎవరిని వరించనుంది ?

నేడే దాయాదుల పోరు - విజయం ఎవరిని వరించనుంది ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ప్రపంచం మొత్తం ఆ రెండు దేశాల మధ్య ఏం జరిగినా పెద్ద న్యూస్ మరియు వింతలా చెప్పుకుంటారు. అలాంటిది గత కొంత కాలంగా ఆ రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొని చివరకు క్రీడలు ఆడుకోవడానికి కూడా సుముఖంగా లేని ఆ దాయాది దేశాలు నేడు మహా సంగ్రామంలో  పాల్గొన్న పోతున్నాయి. ఇంతకీ ఆ రెండు దేశాలు ఏంటో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. దాయాది దేశాలు అయినా ఇండియా పాకిస్తాన్ మధ్య నేడు 2021 టి20 వరల్డ్ కప్ ఆడబోతున్నాయి. దీంతో ఆ రెండు దేశాలు కాకా యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయిదు సార్లు ప్రపంచకప్లో పాల్గొనగా ఐదుసార్లు భారత్ విజయం సాధించింది. అయితే నేడు జరిగే మ్యాచ్ భారత్ జట్టు తో పాటు పాకిస్తాన్ జట్టు కూడా ఫామ్ లో ఉన్నారు. నేడు సాయంత్రం 7:30 నిమిషాలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం నందు ఈ మ్యాచ్ జరగనుంది.



Share:

చిలకలూరిపేట - బియ్యం దొంగలు - తరలించడానికి సిద్ధంగా ఉన్న అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

చిలకలూరిపేట - బియ్యం దొంగలు - తరలించడానికి సిద్ధంగా ఉన్న అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట - చిలకలూరిపేట నుండి  గణపవరం డొంక రోడ్డు నందు ఉన్న గోడౌన్ నందు అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్వాధీనం వివరాల్లోకి వెళ్తే

సివిల్ సప్లైస్ డిటి నాగమల్లేశ్వరరావు, గుంటూరు సివిల్ సప్లైస్ డిటి  హూక్, విఆర్వో సాంబశివరావులకు అందిన సమాచారం మేరకు గణపవరం డొంక రోడ్డు నందు ఒక గోడౌన్ నందు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 308 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటిని 25 కేజీల బస్తాల చొప్పున మొత్తం సుమారు 1200 బస్తాలను సిద్ధం చేసినట్లుగా గుర్తించారు. వెంకటేశ్వర్ రెడ్డి, చిన్నబ్బాయి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని అని వారిపై కేసు నమోదు చేశారు.




Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి