చిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్త
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్త
ఆంధ్రప్రదేశ్ - రాష్ట్రంలో రేపటి నుండి కరెంటు కోతలు నిజమేనా !??
ఆంధ్రప్రదేశ్ - రాష్ట్రంలో రేపటి నుండి కరెంటు కోతలు నిజమేనా !??
ఆంధ్రప్రదేశ్ గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో కరెంటు కోతలు తప్పవని విలేకర్ల సమావేశంలో తెలిపారు. అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆదివారం నుండి 4 గంటలు కరెంటు కోతలు ఉంటాయి అనే వార్త చెక్కర్లు కొడుతుంది. అయితే తాజాగా రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు ఈ వార్తపై స్పందిస్తూ కరెంటు కోతలు వాస్తవమే కానీ రోజుకి 4 గంటల కరెంటు కోత ఉంటుందని, అది కూడా ఆదివారం నుండి అమలులోకి వస్తుంది అనే వార్త అవాస్తవమని తెలిపారు. ప్రజలెవరూ ఇలాంటి వార్తలను నమ్మవద్దని వారు తెలిపారు. ప్రస్తుతానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏమీ ఉండదని. సీఎం జగన్ ప్రజలెవరూ ఇబ్బందులకు గురి అవకుండా చూడాలని చెప్పినట్లు వారు తెలిపారు. గ్రామాలలో సాయంత్రం 6 నుండి 10 వరకు పట్టణాలలో రాత్రి 9 నుండి 12 వరకు నగరాలలో రాత్రి 11 నుండి మూడు గంటల వరకు కరెంటు కోతలు ఉంటాయని అవాస్తవమైన వార్త చెక్కర్లు కొడుతుంది.దయచేసి ఎవరు నమ్మవద్దు అని వారు తెలిపారు.
చిలకలూరిపేట - విజయబ్యాంక్ వద్ద ఆటోను ఢీకొన్న అంబులెన్స్
చిలకలూరిపేట - విజయబ్యాంక్ వద్ద ఆటోను ఢీకొన్న అంబులెన్స్
చిలకలూరిపేట పట్టణంలోని విజయ బ్యాంక్ ముందు ఉన్న జాతీయ రహదారి వద్ద ఆటోని అంబులెన్స్ ఢీకొన్నది. వివరాల్లోకి వెళ్తే కలకత్తా నుండి చెన్నై వెళ్తున్న అంబులెన్స్ విజయ బ్యాంక్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారి వద్ద ఆటోను ఢీ కొట్టినది. ఆ సమయంలో ఆటో ఉన్న డ్రైవర్ షేక్ ఇస్మాయిల్ కు గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఇస్మాయిల్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో జాతీయ రహదారి మొత్తం ట్రాఫిక్‌తో నిలిచిపోయింది. సమాచారం అందుకున్న సీఐ రాజేశ్వరరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.
చిలకలూరిపేట:- పండక్కి పిండివంటలు చేస్తుండగా గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం - స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళ
చిలకలూరిపేట:- పండక్కి పిండివంటలు చేస్తుండగా గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం - స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళ
చిలకలూరిపేట పట్టణంలోని శారదా హైస్కూల్ సమీపంలో పండగ సందర్భంగా పిండివంటలు చేస్తున్న ఒక ఇంట్లో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే శారదా హైస్కూల్ సమీపంలోని కావమ్మ గుడి బజార్‌లోని నాయుడు భవాని అనే మహిళ పండుగ సందర్భంగా పిండి వంటలు చేస్తున్నారు. ఇంతలో గ్యాస్ సిలిండర్ పైపు లీక్ అవడంతో గ్యాస్ బయటికి వచ్చి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంతలో సదరు మహిళ ప్రమాదాన్ని గమనించి ఇంట్లో నుంచి స్వల్ప గాయాలతో బయట పడ్డారు. స్థానికుల సహాయంతో మంటలు అదుపు చేసి అగ్నిప్రమాద సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్నా అగ్నిమాపక సిబ్బంది వివరాలను నమోదు చేసుకున్నారు. మహిళకు స్వల్ప గాయాలతో బయటపడటంతో ఆ ఈ ప్రాంతంలోని ప్రజలు ఊపిరి తీసుకున్నారు.
చిలకలూరిపేట - టెస్ట్ డ్రైవ్ కు తీసుకు వెళ్ళిన టు వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ దగ్ధం
చిలకలూరిపేట - టెస్ట్ డ్రైవ్ కు తీసుకు వెళ్ళిన టు వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ దగ్ధం
చిలకలూరిపేట పట్టణంలోని అడ్ రోడ్డు సెంటర్ సమీపంలో ఎలక్ట్రికల్ వెహికల్ పూర్తిగా దగ్ధం అయినది. వివరాల్లోకి వెళితే అడ్ రోడ్డు సెంటర్ సమీపంలోని ఒక ఎలక్ట్రికల్ టూ వీలర్ షో రూమ్ నందు వెహికల్ కొనుగోలుకు వచ్చిన వ్యక్తి దానిని టెస్ట్ డ్రైవ్ చేయడానికి రోడ్డుపైకి తీసుకొని వచ్చారు. అయితే సదరు వ్యక్తి డ్రైవ్ చేస్తుండగా వెహికల్ సీటు వేడిగా ఉండటంతో ఆ వ్యక్తి వెహికల్‌కు స్టాండ్ వేసి పక్కకు వచ్చారు. ఇదే సమయంలో వెహికల్లో నుంచి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. దగ్ధమైన ఎలక్ట్రికల్ వెహికల్ విలువ సుమారు 60 వేల రూపాయలు వరకు ఉండవచ్చు అని అంచనా.
మళ్లీ నవతరం పార్టీకే గాజు గ్లాస్ గుర్తు - నాడు తిరుపతి & నేడు బద్వేల్
మళ్లీ నవతరం పార్టీకే గాజు గ్లాస్ గుర్తు - నాడు తిరుపతి & నేడు బద్వేల్
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఆవిర్భవించినప్పుడు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీ గుర్తుగా నిర్ణయించారు. అయితే గడిచిన అసెంబ్లీ ఎలక్షన్స్‌లో జనసేన పార్టీకి తగినన్ని సీట్లు దక్కపోవడంతో ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చారు. మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం జాతీయ పార్టీ అయిన నవతరం పార్టీకి కేటాయించింది. మళ్లీ ఈ నాడు బద్వేల్ ఉప ఎన్నికలకు కూడా గాజు గ్లాస్ గుర్తును నవతరం పార్టీకే ఎన్నికల సంఘం కేటాయించారు. ఈ విషయాన్ని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో నవతరం పార్టీ తరఫున డాక్టర్ గోదా రమేష్ బాబు పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో తో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తమ గాజు గ్లాస్ గుర్తు వేరే పార్టీకి కేటాయించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి - అఖిల భారత అవినీతి నిర్మూలన & వినియోగదారుల సంఘం
వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి - అఖిల భారత అవినీతి నిర్మూలన & వినియోగదారుల సంఘం
చిలకలూరిపేట : చీరాల రోడ్డు లో గల బాపూజీ వృద్ధుల సేవా ఆశ్రమంలో అఖిల భారత అవినీతి నిర్మూలన& వినియోగదారుల సంఘము సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ఎం వెంకట రాం ప్రసాద్ అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ న్యాయవాది మాదాసు భానుప్రసాద్ గారు మాట్లాడుతూ వినియోగ దారుల హక్కుల గురుంచి తెలుయజేశారు.వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువును విధిగా బిల్లు తీసుకోవాలి అన్నారు. గ్యారంటీ, వారంటీ బిల్లులను భద్రపరుచుకోవాలి. మోసపోయిన సందర్భంలో వినియోగదారుల జిల్లా కమిషన్ ను సంప్రదించి వ్యాపారి నుండి నష్ట పరిహారం పొందవచ్చు అన్నారు. అర్యవైస్య సంఘం అధ్యక్షుడు పటేల్ మాట్లాడుతూ ఓటు హక్కు నిజాయితీగా వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ అవినీతి నిర్మూలన ద్వారానే అభివృద్ధి సాధ్యం అన్నారు. అవినీతి కి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కొనుగోలు దారులందరు వినియోగదారులే. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కోసం మా సంస్థ కృషి చేస్తుందన్నారు.ధరల్లో వ్యత్యాసం,అధిక ధరలు అమ్మడం,కల్తీ సరుకులు అమ్మడం,నకిలీ వస్తువులు అంట గడితే,తూకాల్లో మోసం చేస్తే వినియోగదారుల సంస్థను సంప్రదిస్తే అండగా ఉండి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాం అన్నారు. ఈ సందర్భంగా నూతన నియోజకవర్గ కమిటీని ఎన్నుకోవడమైనది.
అఖిల భారత అవినీతి నిర్మూలన&వినియోగదారుల సంఘము నియోజకవర్గ అధ్యక్షులు గా మురికి పూడి ప్రసాద్, ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ జబ్బార్, ప్రధాన కార్యదర్శి గా పి.సురేష్ కుమార్,కార్యదర్శిగా పి.శ్రీనివాస రావు,సహాయ కార్యదర్శి గా నిడమానూరు రవి కుమార్, భవిరిసెట్టీమణి, కార్యవర్గ సభ్యులు గా ఎంవి ఎస్ గుప్తా,భలే.శ్రీనివాస్,ఎన్. రవీంద్ర, గౌరవ సలహాదారు లుగా ఎం.భానుప్రసాద్, ఏ. రామ కృష్ణ, డాక్టర్ టి.కృష్ణ ప్రసాద్ లు ఏక గ్రీవముగా ఎన్నికయ్యారు.ఎన్నికైన సభ్యులందరికీ రాష్ట్ర అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలియజేశారు.




