మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS) పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలి :- రాష్ట్ర TNSF ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ జాకీర్

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS) పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలి :- రాష్ట్ర TNSF ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ జాకీర్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఈ రోజు నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలో స్పందన 'కార్యక్రమంలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (TNSF)  ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS)పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని వినతి పత్రం ఇవ్వటం  జరిగింది. ఈ సందర్భంగా జాకీర్  మాట్లాడుతూ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉద్దేశించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ (BAS)పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న కార్పొరేట్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉద్దేశించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేయడం వల్ల పేద విద్యార్థులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కార్పొరేట్ యాజమాన్యాలు దుర్వినియోగం చేస్తున్నారన్న కారణంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయడం వలన పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని  తెలిపారు.ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అద్యక్షులు కూరపాటి హనుమంతురావు,ఉపాద్యక్షులు మచ్చు వీరయ్య ,  పార్లమెంటు అదికార ప్రతినిది  ధైదా చిన్న బాబు,కార్యనిర్వాహక కార్యదర్శి మాలెంపాటి ప్రవీణ్ , షేక్ సాధిక్ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు  పాల్గొన్నారు.

Share:

భీమానాయక్ సినిమాలో బయటికి రా రా నా కొడకా డైలాగ్ మాదిరిగా నా మీద గెలువు రా నా కొడకా అని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్

భీమానాయక్ సినిమాలో బయటికి రా రా నా కొడకా డైలాగ్ మాదిరిగా నా మీద గెలువు రా నా కొడకా అని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్

https://chilakaluripetspeednews.blogspot.com/2021/10/40.html?m=1

ఈరోజు జరుగుతున్న తెలుగు చిత్ర పరిశ్రమ మా ఎలక్షన్ లో వింత వాతావరణం చోటు చేసుకుంది. పొద్దు పొద్దున్నే మోహన్ బాబు సమక్షంలో మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ లు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. దీంతో మా ఎలక్షన్ లో సందడి వాతావరణం నెలకొన్నది. ఈలోపే నటి హేమ శివ బాలాజీ చేతిని కోరుతున్న వీడియో వైరల్ అయింది. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే ప్రకాష్ రాజ్ మరియు నరేష్ ఎదురు పడ్డారు. ఈలోపే ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోగా ప్రకాష్ రాజ్ ఆగ్రహంతో భీమానాయక్ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన బయటికి రా రా నా కొడకా అనే రేంజ్  లో రా రా నా కొడకా నా మీద గెలువు అని ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఒక్కసారిగా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో హడావిడి వాతావరణం నెలకొన్నది.


భీమానాయక్ సినిమాలో బయటికి రా రా నా కొడకా డైలాగ్ మాదిరిగా నా మీద గెలువు రా నా కొడకా అని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్



Share:

చిలకలూరిపేట నియోజకవర్గం 40 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

చిలకలూరిపేట నియోజకవర్గం :- 40 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గం అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం అందుకున్న యడ్లపాడు ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం తో ఉన్న ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులకు అందజేశారు. తిమ్మాపురం నుండి నాదెండ్ల తరలిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్తిపాడు కి చెందిన నాగేశ్వరరావును అలాగే యడ్లపాడు మండలం కారుచోల గ్రామానికి చెందిన బాబు, వంశీ, కోటేశ్వరరావు లను అదుపులోకి తీసుకున్నారు.



Share:

చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కొన్ని సూచనలతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ సీఐకు అందజేసిన లోక్ సత్తా పార్టీ నాయకులు

చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కొన్ని సూచనలతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ సీఐకు అందజేసిన లోక్‌ సత్తా పార్టీ నాయకుపాల్గొన్నారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:-  రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కొన్ని సూచనలతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ సీఐ రాజేశ్వరరావుకు లోక్ సత్తా పార్టీ నాయకులు అందజేశారు. 

* కళ్యాణి సెంటర్, విజయ బ్యాంక్ సెంటర్, నరసరావుపేట సెంటర్ మరియు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఎదురు, విధిగా ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

* వేకువజాము వేళలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదు అవుతున్నందున విధిగా ఆయా వేళల్లో పైన పేర్కొన్న నాలుగు ప్రధాన సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు విధులలో ఉండే లాగున ఏర్పాటు చేయాలి.

* రోజు రోజుకి ఇబ్బడిముబ్బడిగా ట్రాఫిక్ పెరుగుతున్నందున విధిగా చిలకలూరిపేట కు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలి.

* డ్రైవర్ల వ్యక్తిగత అవసరాల కోసం వాహనాల పార్కింగ్ ను ఊరి చివరన స్థలాన్ని కేటాయించడం కానీ, మరేదైనా నిర్దేశించిన ప్రదేశంలో వాహనాలను నిలుపుకొనుటకు అవకాశం కల్పించాలి.

* సర్వీస్ రోడ్లు ఆక్రమణకు గురై పాడైనందున మరమ్మతులు నిర్వహించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవలయును.

* వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, మహిళలు నరసరావుపేట సెంటర్, కళ్యాణి సెంటర్ లలో నడిచి రోడ్డు దాటే వారికోసం ప్రత్యేకముగా నాలుగు వైపుల నుండి రోడ్డు దాటు అవకాశం కల్పించాలి.

* తిమ్మాపురం సెంటర్ నుండి గణపవరం వాగు వరకు డివైడర్ పై మొక్కల కుండీలు ఏర్పాటు, లేదా ఏదైనా ఒక రేకును వాహనాల లైటింగ్ ఒకదాని మీద ఒకటి పడకుండా ఏర్పాటు చేయాలి.

* హైవే పెట్రోలింగ్ వారు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలలో  నిరంతరం పర్యవేక్షించ గలగాలి.

* చిలకలూరిపేట హైవే పై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున,  రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు  అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పనిచేసే వారితో రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేయాలి.

* ఆగి ఉన్న లారీలను 'ఢీ' కొట్టడం ద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్నందున ఎట్టి పరిస్థితుల్లో వేకువజాము వేళల్లో లారీలను హైవేపై ఆపకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

పై సూచనలను కలిగిన వినతిపత్రాన్ని సిఐ రాజేశ్వరరావుకు కు అందజేసి ప్రజల ప్రాణాలను కాపాడతారని ఆశిస్తున్నట్లు తెలిపారు మాదాసు భానుప్రసాద్

లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్

ఈ కార్యక్రమంలో మురికిపూడి ప్రసాద్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పటేల్, సాంబయ్య, శిఖాకొల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట:- రేషన్ డీలర్లు ఖాళీ బియ్యం గోతాలను బయట విక్రయిస్తే వారిపై కేసు నమోదు చేస్తాము - డిప్యూటీ తాసిల్దారు నాగమల్లేశ్వరరావు

చిలకలూరిపేట:- రేషన్ డీలర్లు ఖాళీ బియ్యం గోతాలను బయట విక్రయిస్తే వారిపై కేసు నమోదు చేస్తాము - డిప్యూటీ తాసిల్దారు నాగమల్లేశ్వరరావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట చౌక ధరల దుకాణాలలో (రేషన్ దుకాణాల్లో) ప్రజా పంపిణీ కోసం ఉపయోగించే బియ్యం గోతాలు తిరిగి ప్రభుత్వానికి అందజేయాలని చిలకలూరిపేట పౌరసరఫరాల డిప్యూటీ తాసిల్దార్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. గణపవరం లోని కొన్ని రేషన్ డిపోలలో తనిఖీలు నిర్వహించి సూచనలు చేశారు. ఒక్కొక్క గోతానికి 20 రూపాయల చొప్పున ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా బయట మార్కెట్లలో విక్రయిస్తే ఆయా డీలర్లపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.


Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-202 శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు

చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-202 శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-2021 శనివారం నాడు మొత్తం  2 కేసులు నమోదు అయ్యాయి. 

వాటి వివరాలు. 

బొబ్బిలి సత్యనారాయణ వీధి - 1

సుధా వారి పాలెం - 1 గా నమోదు అయ్యాయి.

Share:

చిలకలూరిపేట:- హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ రాజేశ్వరరావు - ప్రతి నెల నా వంతు సాయాన్ని అందజేస్తాను

చిలకలూరిపేట:- హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ రాజేశ్వరరావు - ప్రతి నెల నా వంతు సాయాన్ని అందజేస్తాను

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట రోష్ని సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐ.వి బాధిత పిల్లలకు ప్రతినెల పౌష్టికాహార పంపిణీ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చిలకలూరిపేట టౌన్ సిఐ రాజేశ్వరరావుగారి చేతుల మీదగా పౌష్టికాహార పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని తెలిపారు. అలాగే తన వంతు సాయాన్ని ప్రతి నెల అందజేస్తానని తెలిపారు. మంచిగా చదువుకొని పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి