మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట:- రేషన్ డీలర్లు ఖాళీ బియ్యం గోతాలను బయట విక్రయిస్తే వారిపై కేసు నమోదు చేస్తాము - డిప్యూటీ తాసిల్దారు నాగమల్లేశ్వరరావు

చిలకలూరిపేట:- రేషన్ డీలర్లు ఖాళీ బియ్యం గోతాలను బయట విక్రయిస్తే వారిపై కేసు నమోదు చేస్తాము - డిప్యూటీ తాసిల్దారు నాగమల్లేశ్వరరావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట చౌక ధరల దుకాణాలలో (రేషన్ దుకాణాల్లో) ప్రజా పంపిణీ కోసం ఉపయోగించే బియ్యం గోతాలు తిరిగి ప్రభుత్వానికి అందజేయాలని చిలకలూరిపేట పౌరసరఫరాల డిప్యూటీ తాసిల్దార్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. గణపవరం లోని కొన్ని రేషన్ డిపోలలో తనిఖీలు నిర్వహించి సూచనలు చేశారు. ఒక్కొక్క గోతానికి 20 రూపాయల చొప్పున ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా బయట మార్కెట్లలో విక్రయిస్తే ఆయా డీలర్లపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.


Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-202 శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు

చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-202 శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-2021 శనివారం నాడు మొత్తం  2 కేసులు నమోదు అయ్యాయి. 

వాటి వివరాలు. 

బొబ్బిలి సత్యనారాయణ వీధి - 1

సుధా వారి పాలెం - 1 గా నమోదు అయ్యాయి.

Share:

చిలకలూరిపేట:- హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ రాజేశ్వరరావు - ప్రతి నెల నా వంతు సాయాన్ని అందజేస్తాను

చిలకలూరిపేట:- హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ రాజేశ్వరరావు - ప్రతి నెల నా వంతు సాయాన్ని అందజేస్తాను

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట రోష్ని సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐ.వి బాధిత పిల్లలకు ప్రతినెల పౌష్టికాహార పంపిణీ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చిలకలూరిపేట టౌన్ సిఐ రాజేశ్వరరావుగారి చేతుల మీదగా పౌష్టికాహార పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని తెలిపారు. అలాగే తన వంతు సాయాన్ని ప్రతి నెల అందజేస్తానని తెలిపారు. మంచిగా చదువుకొని పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.

Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపి వేసే ప్రాంతాలు

చిలకలూరిపేట నియోజకవర్గంలో  రేపు విద్యుత్ సరఫరా నిలిపి వేసే ప్రాంతాలు

చిలకలూరిపేట నియోజకవర్గంలో  రేపు విద్యుత్ సరఫరా నిలిపి వేసే ప్రాంతాలు


 చిల‌క‌లూరిపేట‌:  రేపు అనగా 09-10-21 రెండోవ శనివారం నరసరావుపేట 132/33 కేవీ సబ్ స్టేషన్ , నరసరావుపేట ఫీడర్ మరమత్తులు కారణంగా 

నాదెండ్ల మండలం లోని అమీన్ సాహెబ్ వారిపాలెం, కనపర్రు, బసికాపురం, మైనంపాడు, కొత్తపాలెం ST కాలనీ, ఇర్లపాడు,ఎండుగుంపాలేం, బుక్కా పురం, రాజుగారి పాలెం,గున్నవారిపాలెం, గోవిందపురం, కొత్తపాలెం  గ్రామాలకు   గృహ, వాణిజ్య, వ్యవసాయ ,చిన్న మరియు బారి పరిశ్రమలకు , మరియు చిలకలూరిపేట మండలంలోని కావూరు గ్రామంలోని పరిశ్రమల తో పాటు

మద్దిరాల, పసుమర్రు, బొప్పూడి సబ్ స్టేషన్ లో   మరమత్తులు కారణంగా చిలకలూరిపేట రూరల్ మండల. పరిధిలోని మద్దిరాల, పోతవరం,రా జాపేట, యడవల్లి, మురికిపూడి, తాతపూడి, ఈటి,కట్టుబడివారిపాలెం, గోపాలం వారి పాలెం, బోప్పూడి,బోప్పూడి హైవే,రామచంద్రాపురం, చిన పసుమర్రు, గుదేవారి పాలెం, మనుకొండవారిపాలెం, మిట్టపాలెం, కొత్తపాలెం, నాగబైరవారిపాలెం, గొరంట్లవారిపాలెం, దండమూడి, ఉప్పలపాడు గొట్టిపాడు గ్రామాలకు గృహ, వాణిజ్య, పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు సి.హెచ్. రాంభోట్లు, డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.

Share:

నా పై MPTC కుట్రలు,వేధింపులకు పాల్పడుతున్నాడు - చిలకలూరిపేట మహిళ వాలంటీర్ ఆవేదన

నా పై MPTC కుట్రలు,వేధింపులకు పాల్పడుతున్నాడు - చిలకలూరిపేట మహిళ వాలంటీర్ ఆవేదన

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలోని ఒకటో వార్డు మహిళ వాలంటీర్ పై ఎంపీటీసీ వేధింపులకు పాల్పడుతున్నారు అని సదరు మహిళ వాలంటీర్ సీఎం జగనన్నకు ఒక వీడియో సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. తన పేరు చెవుల యామిని నాదెండ్లలో ఒకటో వార్డు వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నానని.అయితే అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ అయినా గుడికందుల ఎల్లారావు తనపై కుట్రలు వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె వీడియోలో తెలిపారు. దళిత వర్గానికి చెందిన తాను టిటిసి పూర్తి చేసి వాలంటర్ పనిచేస్తూ వచ్చే ఐదు వేల జీతంతో ఇంట్లో వాళ్ళ పై ఆధారపడకుండా డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్నట్లు తెలిపారు. తల వాలంటరీ ఈ పోస్ట్ ను తీసివేసి తన స్థానంలో ఎంపీటీసీ ప్రియురాలి కుమార్తెను వాలంటరీ చేయాలనే ఉద్దేశంతో తనపై వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ ఉద్దేశంతో తాను సరిగ్గా పని చేయట్లేదు సమయానికి స్పందించలేదు అనే అభియోగాలతో సంతకాలు సేకరించి ఎంపీటీసీ తనపై కుట్ర పూరితంగా ఫిర్యాదు చేశారని ఆమె తెలిపారు.

వీడియో కోసం క్రింద చూడండి







Share:

చిలకలూరిపేట - 1319 డోక్రా సంఘాలకు వైయస్సార్ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ - MLA విడుదల రజిని

చిలకలూరిపేట - 1319 డోక్రా సంఘాలకు వైయస్సార్ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ - MLA విడుదల రజిని

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:-  1319 డ్వాక్రా సంఘాలకు వైయస్సార్ ఆసరా రెండో విడత చక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విడదల రజినితో పాటుగా వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. 11 సెప్టెంబర్ 2020 న మొదటి విడతగా చెక్కులు పంపిణీ చేయగా రెండో విడతగా శుక్రవారం నాడు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపము నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 1319 సంఘాలకు 10 కోట్ల 86 వేల 788 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లో ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ జగనన్న పాదయాత్రలో ప్రజల కష్టాలను చూస ఆర్థికంగా ముందుకు వెళ్లటం కోసం డోక్రా మహిళలకు వైయస్సార్ ఆసరా పథకాన్ని తీసుకువచ్చారని అని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఫాని, కమిషనర్ రవీంద్ర,  మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, మెప్మా సిబ్బంది, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.








Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-202 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

 చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-202 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-2021 బుధవారం నాడు మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి. 

వాటి వివరాలు. 

RTC బస్టాండు సమీపంలో - 2

సుబ్బయ్యతోట లో - 1 గా నమోదు అయ్యాయి.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి