మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట నియోజకవర్గంలో పిడుగుపాటు - ఇద్దరికి తీవ్రగాయాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో పిడుగుపాటు - ఇద్దరికి తీవ్రగాయాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం కారుచోల గ్రామం వద్ద పిడుగుపాటు వల్ల ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారుచోల పరిధిలోని పొలాల్లో మిర్చి పంటలు కలుపు తీస్తున్న ఇద్దరు మహిళలకు నాలుగడుగుల దూరంలో పిడుగు పడటంతో నందిగం రావమ్మ కవిత అనే అత్తా కోడలు గాయాల పాలయ్యారు.

Share:

పెట్రోల్ & డీజిల్ భగభగ - గ్యాస్ సిలిండర్లపై మళ్లీ బాదుడు

పెట్రోల్ & డీజిల్ భగభగ - గ్యాస్ సిలిండర్లపై మళ్లీ బాదుడు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

06-10-2021 అసలే పెట్రోల్ డీజిల్ రేట్లు రాకెట్ లాగా ఆకాశంలో దూసుకు వెళ్తుంటే దానికి తోడు తాజాగా వంట గ్యాస్ LPG పై 15 రూపాయలు పెంచుతున్నట్లు పెట్రోలియం కంపెనీలు తెలిపాయి. గత నెలలో డొమెస్టిక్ సిలిండర్లపై 25 రూపాయలు కమర్షియల్ 19 కేజీల సిలిండర్లపై 43 రూపాయలు పెంచారు. అయితే తాజాగా డొమెస్టిక్ సిలిండర్లపై 15 రూపాయలు పెంచుతున్నట్లు తెలిపాయి. ఇటు పెట్రోల్ డీజిల్ పై 33 పైసలు పెంచుతున్నట్లు ఇంధన శాఖ తెలియజేశారు. పెరిగిన సిలిండర్ల ధరలు ఈరోజు నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ పెరిగే, పెట్రోల్ & డీజిల్ గ్యాస్ సిలిండర్ల ధరలు వలన సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


Share:

భర్త మరణ వార్త విని గుండెపోటుతో భార్య మృతి

భర్త మరణ వార్త విని గుండెపోటుతో భార్య మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

గంగవరపు చిన్న పాపారావు (61) అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందిన వార్త విని భార్య రమాదేవి (57) గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతి చెందారు.

వివరాల్లోకి వెళితే ! ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అంబటిపూడి గ్రామానికి చెందిన చిన్న పాపా రావు & రమాదేవి భార్యాభర్తలు. అయితే గత కొంత కాలంగా పాపారావు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజుల క్రితం పాపారావు చిలకలూరిపేటలో నివాసం ఉంటున్న కుమార్తె వద్దకు వచ్చి ఉంటున్నాడు. ఈరోజు పాపారావు తీవ్ర అస్వస్థతకు గురిఅవ్వటంతో వెంటనే కూతురు అల్లుడు పాపారావును గుంటూరులోని హాస్పటల్కు తరలించారు. అప్పటికే పాపారావు మార్గమధ్యంలోనే మృతి చెందారు. దీంతో కుమార్తె తండ్రి మరణ వార్తను తల్లికి ఫోన్లో చెప్పడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెనూ స్థానిక హాస్పటల్కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాద వాతావరణం నెలకొంది. తండ్రి చనిపోయిన రెండు గంటల్లో తల్లి చనిపోవడంతో కూతురు కన్నీరు మున్నీరయ్యారు.


                                     *Advertisement*



Share:

పార్కింగ్ ప్రదేశాల్లో కాకుండా రోడ్డుకిరువైపులా వాహనాలను పార్క్ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు - టౌన్ సిఐ రాజేశ్వరరావు

చిలకలూరిపేట...‌‌ పార్కింగ్ ప్రదేశాల్లో కాకుండా రోడ్డుకిరువైపులా వాహనాలను పార్క్ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు - టౌన్ సిఐ రాజేశ్వరరావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

మంగళవారం నాడు చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించిన అర్బన్ సిఐ రాజేశ్వరరావు పట్టణంలోని ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండేందుకు కొన్ని చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పాత పశువుల సంత నుండి చౌత్ర సెంటర్ వరకు ఉన్న డబల్ రోడ్డుకు  ఇరువైపులా ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా వాహనాలను పార్క్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఉండే హోటళ్లు ఇతర దుకాణాలకు వచ్చేవారు వారి వాహనాలను ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా పార్క్ చేయటం వలన ట్రాఫిక్ సమస్య కలుగుతుందని అందువలన తమ వాహనాలను పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ చేయాలి అని తెలిపారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



Share:

చిలకలూరిపేట పట్టణంలో నేడు 05-10-2021 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

 చిలకలూరిపేట పట్టణంలో నేడు 05-10-2021 మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలో నేడు 05-10-2021 మంగళవారం నాడు మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు. 

పండరీపురంలో - 2

సుగాలి కాలనీలో - 1 గా నమోదు అయ్యాయి.

Share:

మహిళలు సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్కి రాలేని పక్షంలో సచివాలయంలోని మహిళా పోలీస్ సిబ్బందిని సంప్రదించండి - చిలకలూరిపేట టౌన్ సిఐ

మహిళలు సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్కి రాలేని పక్షంలో సచివాలయంలోని మహిళా పోలీస్ సిబ్బందిని సంప్రదించండి - చిలకలూరిపేట టౌన్ సిఐ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్యతోట లో ఉన్న నారాయణ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో పట్టణ టౌన్ సిఐ జి రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలు తప్పనిసరిగా వారి మొబైల్స్ లో దిశ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని , అలాగే దిశా యాప్ వలన జరిగే ప్రయోజనాలను తెలియజేశారు. అలాగే సమస్య వచ్చిన వెంటనే 100 నెంబర్కు కాల్ చేసి వారి సమస్యలను తెలియజేయాలని తెలిపారు. ఒకవేళ మహిళలు పోలీస్ స్టేషన్కి రాలేని పక్షంలో సచివాలయాల్లో ఉండే మహిళా పోలీస్ సిబ్బందిని సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోవాలి అని తెలిపారు.

Share:

చిలకలూరిపేట - ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజుల వేడుకల్లో భాగంగా ఈరోజు...

చిలకలూరిపేట - ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజుల వేడుకల్లో భాగంగా ఈరోజు...

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ రూరల్ మండలం అయిన మురికిపూడి,గోపాలంవారిపాలెం గ్రామాల యందు ఉన్న ప్రాథమిక విద్యా కేంద్రం, అంగన్వాడి కేంద్రాలను పరిశీలించి అక్కడ చదువుతున్న విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా జరుగుతున్న సేవా సమర్పణ కార్యక్రమం లో భాగంగా నియోజకవర్గ ఇంచార్జ్ రాష్ట్ర ఓబిసి ప్రోగ్రాం కన్వీనర్ శ్రీనివాసరావు,రూరల్ మండల మైనార్టీఅధ్యక్షులు పోతవరం సుభాని, ఉపాధ్యక్షులు మద్దిరాల సుభాని, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి గాత్రం సాంబశివరావు గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక విద్యా కేంద్రాలను కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయని తెలియజేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పట్టణ ఉపాధ్యక్షుడు డి పుల్లయ్య, పట్టణ యువ మోర్చా అధ్యక్షులు నందిగామ రాజు, సీనియర్ నాయకులు అన్నపరెడ్డి లక్ష్మణ్ ,పొత్తూరి బ్రహ్మానందం, పట్టణ ఓబీసీ మోర్చా కార్యదర్శి జే రాయుడు తో పాటుగా అక్కడి స్కూలు టీచర్లు అందరూ నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు.








Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి