మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేటలో NRT సెంటర్లో మద్యం మత్తులో లారీతో కారు ఢీ - తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.

చిలకలూరిపేటలో NRT సెంటర్లో మద్యం మత్తులో లారీతో కారు ఢీ - తృటిలో తప్పిన ఘోర ప్రమాదం. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది.ఒంగోలు నుండి విజయవాడ వైపు వెళ్తున్న చక్క దుంగల లోడుతో వెళ్తున్న లారీ కారుని NRT సెంటర్లో ఢీ కొన్నది. ఈ సమయంలో కారులో వారికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.లారీ డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చెయ్యటం వలనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులోని వ్యక్తులు నరసరావుపేట వైపు నుండి రోడ్డు దాటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు కేసు నమోదు చేసారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/



















































Share:

చిలకలూరిపేట - ప్రభుత్వం గ్యారెంటీ ఉంటూ లోను చెల్లిస్తుంది - పురప్రజల పై ఎటువంటి భారం పడదు - టీడీపీ కౌన్సిలర్లు అనవసరపు రాదంతం చేస్తున్నారు - ఛైర్మెన్ రఫాని

చిలకలూరిపేట - ప్రభుత్వం గ్యారెంటీ ఉంటూ లోను చెల్లిస్తుంది - పురప్రజల పై ఎటువంటి భారం పడదు - టీడీపీ కౌన్సిలర్లు అనవసరపు రాదంతం చేస్తున్నారు - ఛైర్మెన్ రఫాని 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట - గత ప్రభుత్వంలో చేసిన అప్పులు వలన మునిసిపాలిటీ రెవిన్యూ పూర్తిగా లోటు బడ్జెట్ లోకి వెళ్ళింది అని.గత ప్రభుత్వం హయాంలో పట్టణ ప్రజల కోసం ఏర్పాటు చేసిన అమృత్ పధకంలో మునిసిపాలిటీ వాటా 82 కోట్లుగా ఉంది.ఏడాది మునిసిపాలిటీ ఆదాయం మాత్రం 8 కోట్లు మాత్రమే. అయితే  MLA రజిని అమృత్ పధకం లోటు బడ్జెట్ను ముఖ్యమంత్రికి విన్నవించగా మునిసిపాలిటీలో ఉన్న ఆదాయ వనరులను చూపించి బ్యాంకులో ఋణం పొందండి. ఆయా నిధులకు సంబంధించిన లోనును మునిసిపాలిటీ ప్రజలపైన ఈ భారం పడకుండా ప్రభుత్వమే చెలిస్తుంది అని తెలిపారు. ప్రజలకు త్రాగునీరు సమస్య లేకుండా పరిష్కరించాలి అని చూస్తుంటే టీడీపీ కౌన్సిలర్లు మాత్రం మా పైన బురద చల్లుతూ ప్రజలను ప్రక్కదోవ పాటిస్తున్నారు అని మునిసిపల్ ఛైర్మెన్ రఫాని తెలిపారు. 

మార్కెట్ యార్డు ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక టీడీపీ కౌన్సిలర్లు తమ పైనే దుష్ప్రభావం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది - ఎంత అభివృద్ధి జరిగింది అనే దాని పైన బహిరంగ చర్చకు రావాలి అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఛైర్మెన్ రఫాని, యార్డు ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న,వైస్ ఛైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.  



































Share:

06-07-2021,మంగళవారం నుండి చిలకలూరిపేటలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు,బ్యాంకు కార్యకలాపాలు జరుగుతాయి - ఇన్సిడెంట్ కమాండర్

06-07-2021,మంగళవారం నుండి చిలకలూరిపేటలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు,బ్యాంకు కార్యకలాపాలు జరుగుతాయి - ఇన్సిడెంట్ కమాండర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంల,మండల గ్రామాలలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ 06-07-2021 మంగళవారం నుండి కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తూ వ్యాపారాలు, దుకాణాలు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటాయి అని కరోనా నియమాలు పాటించనివారి పైనా కఠిన చర్యలు తప్పవు అని ఇన్సిడెంట్ కమాండర్ మల్లిఖార్జునరావు తెలిపారు.సోమవారం జరిగిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో కరోనా తీవ్రత తగ్గించటానికి కర్ఫ్యూ సమయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. కరోనా నియమాలు కఠినంగా అమలు చేయాలి అని కమిటీ సభ్యులకు తెలిపారు.ఈ సమావేశంలో కమిషనర్ రవీంద్ర,నోడల్ డాక్టర్ గోపీనాయక్, SI నరసాదాసు,ఎంపీడీఓ హేమలతా దేవి, శివ నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు.  
































Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 05-07-2021,సోమవారం నాడు నమోదు ఐన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 05-07-2021,సోమవారం నాడు నమోదు ఐన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 05-07-2021,సోమవారం నాడు మొత్తం 11 కేసులు నమోదు అయ్యాయి. 

పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

సుబ్బయ్యతోట లో - 1

బొందిలిపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. 

గణపవరం గ్రామంలో - 4

సంక్రాంతిపాడు గ్రామంలో - 2

నాదెండ్ల గ్రామంలో - 1

గిరిజవోలు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 

ఈ రోజు చిలకలూరిపేట మండల గ్రామాలలో గాని, యడ్లపాడు మండలంలో కానీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 



























Share:

చిలకలూరిపేట పట్టణంలోని పలు సెంటర్లలో ఉన్న అల్లూరిసీతారామరాజు,వంగవీటి విగ్రహాలకు ఘన నివాళి తెలిపిన నాయకులు.

చిలకలూరిపేట పట్టణంలోని పలు సెంటర్లలో ఉన్న అల్లూరిసీతారామరాజు,వంగవీటి విగ్రహాలకు ఘన నివాళి తెలిపిన నాయకులు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

మన్యం దొర అల్లూరి సీతారామరాజు & వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా పట్టణంలోని పలు సెంటర్లో ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు పట్టణ నాయకులు.బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెటించిన మన అల్లూరి యొక్క గొప్పతనాన్ని ప్రజలకు చాటి చెప్పారు. ఆనాడు అల్లూరి లాంటి వారి చేసిన ప్రాణ త్యాగాలకు ఈ రోజు మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం అని తెలిపారు.అలాగే వంగవీటి మోహన రంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకోసం అయన చేసిన చర్యలను తలుచుకున్నారు. ఈ కార్యక్రమాలలో వైస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

శ్రీ అల్లూరి సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట లోని ఎన్నార్టీ సెంటర్లో ఉన్న అల్లూరి విగ్రహం వద్ద ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు చెరుకూరి కాంతయ్య గారు మరియు రోటరీ క్లబ్ సభ్యులు మరియు భగవద్గీత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుడిపల్లి నాగభూషణం గారు అల్లూరికి కి ఘన నివాళి అర్పించారు. అనంతరం బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపర్తి జయరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి తన్నీరు రామారావు, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ వంకాయలపాటి వంశీ మరియు ఇతర పార్టీ నాయకులు అల్లూరి సీతారామరాజు విగ్రహ వ్యవస్థాపకులు వేగేశ్న అంజి రాజు వివిధ స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొని నివాళులర్పించారు. 






































Share:

చిలకలూరిపేట - 30కోట్ల రూపాయలకు గాంధీపార్కు తాకట్టు పెట్టటం ఏంటి ! - మునిసిపల్ కౌన్సిల్ హాలును కూడా తాకట్టు పెట్టి కౌన్సిల్ సమావేశాలను చెట్ల క్రింద నిర్వహించండి - టీడీపీ కౌన్సిలర్లు

చిలకలూరిపేట - 30కోట్ల రూపాయలకు గాంధీపార్కు తాకట్టు పెట్టటం ఏంటి ! - మునిసిపల్ కౌన్సిల్ హాలును కూడా తాకట్టు పెట్టి కౌన్సిల్ సమావేశాలను చెట్ల క్రింద నిర్వహించండి - టీడీపీ కౌన్సిలర్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఆదివారం నాడు చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ కౌన్సిల్ సభ్యులు వైస్సార్సీపీ పట్టణంలో చేస్తున్న చర్యల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.57 సంవత్సరాల చరిత్ర ఉన్న చిలకలూరిపేట మునిసిపాలిటీ ఆస్తులను బ్యాంకులకు తాకట్టుపెట్టాన్ని వైస్సార్సీపీ చేతకాని తనంగా అభివర్ణించారు. అలాగే గాంధీ పార్కు మరియు పార్కు బయటఉన్న మునిసిపల్ కాంప్లెక్స్ లను తాకట్టు పెట్టటం సిగ్గు చేటు అని తెలిపారు. పార్క్ మరియు కంప్లెక్సలను బ్యాంకులో 50 కోట్లకి తాకట్టు పెడదాం అని అడిగితే దానికి సదరు బ్యాంకు అధికారులు వ్యాల్యూవేషన్ వేసి 30 కోట్లు మాత్రమే ఇస్తాము అని తెలపగా 30 కోట్ల రూపాయలకి తాకట్టు మాకు సమ్మతమే అని తెలిపారు అని విశ్వసనీయత సమాచారం అని తెలిపారు.పట్టణంలో ఎంత మంది MLA , మినిస్టర్ అయిన కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు సమీకరించారు కానీ ఇలా  ఆస్తులను తాకట్టు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని అన్నారు.మునిసిపల్ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టి కౌన్సిల్ సమావేశాని చెట్టు క్రింద నిర్వహించామని అన్నారు. అలా మునిస్పల్ ఆస్తులన్నీ అమ్మిన తరువాత మనుషులను కూడా తాకట్టు పెట్టండి అని అన్నారు. అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తూ ఇలా మునిసిపల్ ఆస్తులన్నీ తాకట్టు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే ఎలాంటి కార్యకలాపాలన్నీ విరమించుకోవాలి. లేదు అంటే ఉద్యమం చేసి ఆస్తులను కాపాడుకుంటాం అని తెలిపారు.ఈ సమావేశంలో 8 మంది టీడీపీ కౌన్సిలర్లు,టీడీపీ నాయకులూ పాల్గొన్నారు.    



























Share:

చిలకలూరిపేట పట్టణంలో 04-07-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణంలో 04-07-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 04-07-2021,ఆదివారం నాడు మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

సుబ్భయతోట లో - 1

జాకిర్ హుస్సేన్ వీధి లో - 3

గుర్రాల చావిడి లో - 3 గా నమోదు అయ్యాయి. 




























Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి