|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట పట్టణంలో 04-07-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 04-07-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 04-07-2021,ఆదివారం నాడు మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
సుబ్భయతోట లో - 1
జాకిర్ హుస్సేన్ వీధి లో - 3
గుర్రాల చావిడి లో - 3 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో మార్కెట్ సెంటర్ నందు 10 లక్షలు చోరీ
చిలకలూరిపేట పట్టణంలో మార్కెట్ సెంటర్ నందు 10 లక్షలు చోరీ
చిలకలూరిపేట పట్టణంలో 10 లక్షల రూపాయల నగదు చోరీ జరిగింది.వివరాలలోకి వెళ్తే పట్టణంలోని మార్కెట్ సెంటర్ నందు మణికంఠ ట్రేడర్స్ అనే బియ్యం మిల్లు యజమాని అర్వపల్లి కాశీవిశ్వేశ్వరావు అనే వ్యక్తి తన మిల్లు ఎదురుగా ఉండే బియ్యం స్టోర్ చేసుకునే గౌడాన్ నందు రైతుల వద్ద బియ్యం కొనుగోలుకు 11లక్షల 50 వేల రూపాయలను బీరువాలో దాచాడు.అయితే రైతుల వద్ద బియ్యం కొనుగోలుకు డబ్బులు కోసం అని ఆదివారం నాడు గౌడాన్ తెరవగా అందులో బీరువా పగలగొట్టి అందులోని కొంత డబ్బులు క్రింద ఉండటాన్ని గమనించిన సదరు యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన CI,SI లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గౌడాన్ వెనుక వెంటిలేషన్ తొలగించి అందులోకి ప్రవేశించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది.క్లూస్ టీమ్ పిలిపించి ఆధారాలు పరిశీలిస్తునట్లు తెలిపారు. పోలీస్ అధికారులు.
పట్టణంలోని పలు చేపల విక్రయాల వ్యాపారుల పైనా కేసులు నమోదు - తూనికల, కొలతలశాఖాధికారి అల్లూరయ్య
పట్టణంలోని పలు చేపల విక్రయాల వ్యాపారుల పైనా కేసులు నమోదు - తూనికల, కొలతలశాఖాధికారి అల్లూరయ్య
చిలకలూరిపేట పట్టణంలో పలు చేపల విక్రయ వ్యాపారుల పైనా దాడులు నిర్వహించారు అధికారులు.తూనికల,కొలమానాల అధికారులు పట్టణంలో చేపల అమ్మకాల కొలతలతో తేడాలు జరుగుతున్నట్లు చాల ఫిర్యాదులు అందాయి అని అందుకే ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు.కొలతలతో అవినీతి పాల్పడేవారి పైనా కేసులు నమోదు చేసారు. 5గురి పైన కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వారం ఎలాంటి తనిఖీలు నిర్వహిస్తాం అని ముద్రలు లేని ఎలక్ట్రిక్ కటాలను వినియోగిస్తే వారిపైన చర్యలు తప్పవు అని తెలిపారు. ఈ దాడులలో కొలతలు, తూనికల శాకాధికారి అల్లూరయ్య ఇతర సిబ్బంది పాల్గిన్నారు .
చిలకలూరిపేట - నరసరావుపేట రహదారిలో రోడ్డు ప్రమాదం
చిలకలూరిపేట - నరసరావుపేట రహదారిలో రోడ్డు ప్రమాదం
చిలకలూరిపేట - నరసరావుపేట రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది.మండల పరిధిలోని కావూరు గ్రామం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కావూరు గ్రామానికి చెందిన బైక్,కారు ఢీ కొట్టటం వలన బైక్ పైన వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. కారు స్వల్పంగా దెబ్బతినగా. ద్విచక్ర వాహనదారులు మాత్రం తీవ్ర గాయాలపాలయ్యారు.వెంటనే సమాచారం అందుకున్న 108 సిబంది అక్కడికి చేసుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
చిలకలూరిపేట - నియోజకవర్గంలో రోజు రోజుకు పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు - కొత్తగా 4 గ్రామాలు
చిలకలూరిపేట - నియోజకవర్గంలో రోజు రోజుకు పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు - కొత్తగా 4 గ్రామాలు
చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న మూలంగా అధికారులు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కరోనా తీవ్రతను తగ్గించాలి అని సూచించారు. ఇప్పటికే యడ్లపాడు మండలంలో 3 కంటైన్మెంట్ జోన్లు ఉండగా కరోనా విస్తృతి పెరుగుతున్న రీత్యా మరో 4 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. యడ్లపాడు మండలం యడ్లపాడు గ్రామం, కొండవీడు, కొత్తపాలెం, లింగారావుపాలెం గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్లు గా ఇన్సిడెంట్ కమాండర్ తహసీల్దార్ జ్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే వంకాయలపాడు, ఉప్పరపాలెం, బోయపాలెం గ్రామాలు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి. ఆయా గ్రామాలలో ఉదయం 6 నుండి 11 గంటల వరకు మాత్రమే అత్యవసరంగా బయటకు రావాలి అని తెలిపారు. ప్రజలందరు సహకరించాలి అని కోరారు. అలాగే కరోనా నియమాలు పాటించని వారిపైన ఖఠినమైన చర్యలు, కేసులు నమోదు చేస్తాం అని తెలిపారు.
చిలకలూరిపేట,యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 03-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట,యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 03-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట,యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 03-07-2021,శనివారం నాడు మొత్తం 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
నాదెండ్ల మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి.
చంద్రవరం గ్రామంలో - 2
గణపవరం గ్రామంలో - 1
చిరుమామిళ్ల గ్రామంలో - 2
సంక్రాంతిపాడు గ్రామంలో - 2
సాతులూరు గ్రామంలో - 1
గిరిజవోలు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండల గ్రామాలలో 1 కేసు నమోదు అయింది.
తిమ్మాపురం గ్రామంలో - 1 గా నమోదు అయింది.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 3 కేసులు నమోదు అయ్యాయి.
గోవిందపురం గ్రామంలో - 2
వేలూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో 03-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 03-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 03-07-2021,శనివారం నాడు మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి.
తూర్పుమలపల్లి లో - 1
విశ్వబ్రాహ్మణ కాలనీ లో - 1
శివాలయం వీధి లో - 1 గా నమోదు అయ్యాయి.
Use MASK & Sanitizers and keep Social-Distance











