మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

ఆగని పెట్రోల్ వీర బాదుడు 😱

 ఆగని పెట్రోల్ వీర బాదుడు 😱

https://chilakaluripetspeednews.blogspot.com/

దేశంలో పెట్రోల్ వీరబాదుడు కొనసాగుతుంది. పెట్రోల్ పైన 29 పైసలు, డీజిల్ పైన 30 పైసలు పెరిగాయి. సామాన్యులు పెట్రోల్ రేట్ల దాడికి తమ వాహనాలను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. ఆయిల్ ధర పెరగటం వలన నిత్యావసర సరుకుల రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఢిల్లీ లో పెట్రోల్ - 96.41 గా డీజిల్ 87.28 గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ - 100.20 గా డీజిల్ - 95.14 గా ఉంది. విజయవాడలో పెట్రోల్ - 101.35 గా డీజిల్ 95.72 గా ఉంది. మే 4 నుండి ఎప్పటి వరకు 24 సార్లు రేట్లు పెరిగాయి. 





































Share:

అక్రమ మద్యం,గుట్కా వ్యాపారం,పేకాట శిబిరాలు,రేషన్ మాఫియా,కేబుల్ మాఫియా,దొంగ బంగారం,ఇసుక మాఫియా లకు చిలకలూరిపేట అడ్డాగా మారింది - టీడీపీ నేతలు

అక్రమ మద్యం,గుట్కా వ్యాపారం,పేకాట శిబిరాలు,రేషన్ మాఫియా,కేబుల్ మాఫియా,దొంగ బంగారం,ఇసుక మాఫియా లకు చిలకలూరిపేట అడ్డాగా మారింది - టీడీపీ నేతలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట టీడీపీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణంలో జరుగుతున్న అక్రమాల గురించి చర్చించారు టీడీపీ నేతలు. అధికారం అడ్డం పెట్టుకొని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు అని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చిలకలూరిపేట అక్రమాలకు అడ్డాగా మారిపోయింది అని తెలిపారు. గత లాక్ డౌన్ లో అక్రమ మద్యం వలన అరెస్ట్ చేసిన ఎక్ససైజ్ అధికారులకు అధికార పార్టీ నేతల నుండి కేసులు లేకుండా చూడాలి అని వత్తిడి తీసుకు వచ్చారు అని గుర్తు చేసారు. ఆయా అధికారిని బదిలీ చేసారు అని,ఓగెరు వాగులోని అక్రమ ఇసుక మాఫియా చాపక్రింద నీరులా సాగిపోతుంది అని. ఇక అక్రమ మద్యం, గుట్కా వ్యాపారాలు అయితే రేచిపోయి చెలరేగుతున్నారని, ఒక్కొక్కరి దగిర సుమారు 50 నుండి కోటి రూపాయ సరుకు దొరుకుతుంది అంటే చిలకలూరిపేట కేంద్రంగా రాష్ర వ్యాప్తంగా ఈ అక్రమ దందా జరుగుతుంది అని, పేకాట శిబిరాలు అయితే అచంగా అధికార పార్టీ నేతలే దగిర ఉండి నడిపిస్తున్నారు అని, రేషన్ మాఫియా కి అంతే లేదని రేషన్ డీలర్ల నుండి అక్రమ రేషన్ అమ్మే వారి వరకు అందరూ అధికార పార్టీ నేతలే అవటం విశేషం. దొంగ బంగారం గుట్టు చప్పుడు కాకుండా ఎదేచ్చగా సాగిపోతుంది అని. గతంలో పని చేసిన రురల్ SI కి అక్రమ బంగారం చొరవ చూపటం వలన VR కి పంపించారు అని, కేబుల్ మాఫియా అంటే ప్రజలందరూ డబ్బులు చెల్లించి టీవీ ప్రసారాలు చూదాం అనుకుంటే లోకల్ ఛానల్లో అధికార పార్టీ భజన తప్ప ఇంకేమి ఉండదు అని దీనితో ప్రజలు విసిగిపోయి DTH లను ఏర్పాటు చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి అని, పార్టీకి అండగా ఉన్న దళితుల భూములను లాక్కున్నారని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అని కచ్చితంగా గుణపాఠం చెప్తారు అని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ నెల్లూరి సదాశివరావు, టీడీపీ సీనియర్ నాయకులూ, ముఖ్య నాయకులూ పాల్గొన్నారు. 
























































Share:

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన MLA విడదల రజని

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన MLA విడదల రజని 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం నాడు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. మొత్తం 36.25 లక్షల రూపాయల చెక్కులను 230 మంది  లబ్దిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు.
మొదటిగా లింగం గుంట్లకు చెందిన కృష్ణ మూర్తికి 45 వేలు. తుర్లపాడుకు చెందిన మార్తమ్మకు 65 వేలు, కావూరికి చెందిన రామావత్ లక్ష్మి నాయక్ కు 45 వేలు, నాదెండ్లకు చెందిన సాయిలక్ష్మి కి 60 వేల రూపాయకు చెందిన చెక్కులను తన ఆఫీస్ నందు లబ్ధిదారులకు అందజేశారు. మిగిలిన వాటిని నేరుగా వారి ఇళ్ల వద్దకె తీసుకు వచ్చి అందజేయనున్నట్లు తెలిపారు. పేదవారికి ప్రైవేట్ వైద్యం చేపించుకున్నాక వాటికి సంబందించిన బిల్లులను సీఎం సహాయనిధికి పంపించిన తరువాత వాటికి సంబంధించిన ఫండ్స్ చెక్కుల రూపంలో రిలీజ్ చేస్తారు. అలాగే మొత్తం 230 పేద వారికీ లబ్ది చేకూరింది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల, వార్డు కౌన్సిలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. 










































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు,నాదెండ్ల మండలాలలో 13-06-2021, ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు,నాదెండ్ల మండలాలలో 13-06-2021, ఆదివారం నాడు  నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 21 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో 8 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

కొత్తపాలెం గ్రామంలో - 3

జాలాది గ్రామంలో - 1

మైదవోలు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

గణపవరం గ్రామంలో - 2

నాదెండ్ల గ్రామంలో - 5

సాతులూరు గ్రామంలో - 3

చిరుమామిళ్ల గ్రామంలో - 2

కనపర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 









































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 13-06-2021,ఆదివారం నాడు నమోదు అయినా కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 13-06-2021,ఆదివారం నాడు నమోదు అయినా కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 13-06-2021,ఆదివారం నాడు మొత్తం 6 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 


చిలకలూరిపేట పట్టణంలో 3 కేసులు నమోదు అయ్యాయి . వాటి వివరాలు 



పండరీపురం - 1

సుగాలి కాలనీ - 2 గా నమోదు అయ్యాయి 



చిలకలూరిపేట  మండల గ్రామాలలో మొత్తం 3 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 



గోవిందపురం గ్రామంలో - 2

వేలూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 








































Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో బ్లాక్ ఫంగస్ తో రైతు మృతి

చిలకలూరిపేట నియోజకవర్గంలో బ్లాక్ ఫంగస్ తో రైతు మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో బ్లాక్ ఫంగస్ తో అన్నదాత మృతి చెందారు. దీనితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ గ్రామంలో బ్లాక్ ఫంగస్ వాళ్ళ చనిపోవటం బాధకరం అని గ్రామ పెద్దలు తెలిపారు. 
వివరాల్లోకి వెళ్తే   సాతులూరు గ్రామానికి చెందిన రైతు (68) గత కొన్ని రోజుల క్రితం కరోనా బారి నుండి కోలుకున్నాడు. మళ్లీ ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో చేరి వైద్య పరిక్షలు చెయ్యగా అతనికి బ్లాక్ ఫంగస్ గా గుర్తించారు. వెంటనే GGH కి తరలించి చికిత్స అందిస్తుండగా పక్షవాతం వచ్చి శరీరంలోని అవయవాలు పని చెయ్యక, వైద్యానికి సహకరించక ఆరోగ్యం క్షిణించి మృతి చెందారు. 






































 
Share:

చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ నందు వ్యాక్సిన్ - ప్రజలు అపోహలు మాని వ్యాక్సిన్ తీసుకోండి ప్రాణాలను కాపాడుకోండి - డాక్టర్ రవి తేజా నాయక్

చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ నందు వ్యాక్సిన్ - ప్రజలు అపోహలు మాని వ్యాక్సిన్ తీసుకోండి ప్రాణాలను కాపాడుకోండి - డాక్టర్ రవి తేజా నాయక్ 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని RVSCVS హైస్కూల్ నందు శనివారం నాడు 100 డోసులు వ్యాక్సినేషన్ నిర్వహించారు. పట్టణంలోని RVSCVS హైస్కూల్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాలి అని డిస్పెన్సరీ డాక్టర్ రవి తేజా నాయక్ తెలిపారు. ప్రజలు అపోహలు మానేసి కరోనా నుండి బయపడటానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని, రెండవ డోసు తీసుకోవలసిన వారు 84 రోజుల తరవాత వచ్చి ఇక్కడే వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంధి, ANM లు, MNO లు పాల్గొన్నారు.  














































 
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి