|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేటలో గుట్కా అమ్మే వారిపైన వరుస దాడులు - తాజాగా 11 లక్షల సరుకు సీజ్
చిలకలూరిపేటలో గుట్కా అమ్మే వారిపైన వరుస దాడులు - తాజాగా 11 లక్షల సరుకు సీజ్
చిలకలూరిపేట పట్టణంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న దాడులతో గుట్కా అమ్మే వారికీ గుండెలో రైళ్లు పరిగెట్టిస్తున్నారు పట్టణ పోలీసులు. తాజాగా మద్ది మల్లయ్య వీధిలోని ఒక గోడోన్లో నిర్వహించిన సోదాలలో 11 లక్షల నిషేదిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు. అలాగే కోటి రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా SP విశాల్ గున్ని ఆదేశాలతో సీఐ బిలాలుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు. డీఎస్పీ విజయభాస్కర్ గారు సీజ్ చేసిన సరుకుని పరిశీలించి ఇంకా పట్టణంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిని వదిలేది లేదు అని వారి పైన ఖఠినమైన చర్యలు తీసుకొంటాం అని తెలిపారు.
చిలకలూరిపేట పట్టణ & నియోజకవర్గ గ్రామాలలో 12-06-2021, శనివారం నాడు ఎక్కడెక్కడ ఎన్ని వ్యాక్సిన్లు వేస్తున్నారు అంటే !!!
చిలకలూరిపేట పట్టణ & నియోజకవర్గ గ్రామాలలో 12-06-2021, శనివారం నాడు ఎక్కడెక్కడ ఎన్ని వ్యాక్సిన్లు వేస్తున్నారు అంటే !!!
12-06-2021, శనివారం నాడు పట్టణ & నియోజకవర్గ మండల గ్రామాలలో ఎక్కడెక్కడ ఎన్ని వ్యాక్సిన్ డోసులు వెయ్యటానికి సిద్ధంగా ఉన్నాయి అంటే
చిలకలూరిపేట పట్టణంలో
చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు - 200
సుబ్బయ్యతోట మునిసిపాలిటీ డిస్పెన్సరీ నందు - 200
పురుషోత్తమపట్నం నందు - 100
రజక కాలనీ ఆరోగ్యకేంద్రం నందు - 200
నాదెండ్ల - 300
యడ్లపాడు పీ.హెచ్.సీ నందు - 300
కావూరు పీ.హెచ్.సీ నందు - 300 డోసుల కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు నోడల్ అధికారి గోపీనాయక్ తెలిపారు.
చిలకలూరిపేట - చలివేంద్రం బజారులో పలు అనుమానాస్పద గోడోన్లలో దాడులు
చిలకలూరిపేట - చలివేంద్రం బజారులో పలు అనుమానాస్పద గోడోన్లలో దాడులు
చిలకలూరిపేట పట్టణంలో నిషేదిత గుట్కా అమ్మే వారిపైన దృష్టిపెట్టారు పట్టణ పోలీసులు. గత 3 రోజుల క్రితం బయటపడ్డ గుట్కా నిల్వలతో పట్టణ పోలీసుల పైనే వత్తిడి ఎక్కువ అయినందున ఈ రోజు పట్టణ పోలీసువారు మూడు బృందాలుగా ఏర్పడి అనుమానిత గోడోన్లలో తనిఖీలు నిర్వహించారు. జప్పని భాస్కర్ గారి ఇంటి వద్ద ఉన్న గోడోన్లలో దాడులు నిర్వహించారు. ఇంకా అనుమానాస్పద షాపులలో సోదాలు నిర్వహించారు. ఇలాంటి అసాంఘిక పదార్ధాలను అమ్మే వారిపైన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు.
చిలకలూరిపేట రేపు 12-06-2021, శనివారం రోజు ఈ ప్రాంతాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత
చిలకలూరిపేట రేపు 12-06-2021, శనివారం రోజు ఈ ప్రాంతాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత
చిలకలూరిపేట పట్టణంలో రేపు రెండవ శనివారం కారణంగా సబ్ స్టేషన్ మరమ్మతులు జరిగుతున్నాని అందువలన పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తునట్లు సీ,హెచ్ రాంబొట్ల తెలిపారు. పోలిరెడ్డిపాళెం, కోండ్రుపాడు, వైయస్సార్ కాలనీ, జిడ్డు కాలనీ, లక్ష్మి నరసింహ కాలనీ, మదర్ థెరిసా కాలనీ, బ్యాంకు కాలనీ, సుగాలి కాలనీ, ఆదిఆంధ్ర కాలనీ, పండరీపురం 9,10 లైన్లు, సాంబశివనగర్, శాంతి నగర్, సుబ్బయ్యతోట, విజయాబ్యాంక్ రోడ్, హైస్కూల్ రోడ్, బోసు రోడ్, మండల ఆఫీస్ వెనుక బజార్, సుభాని నగర్, మార్కెట్ బజార్, గడియారస్తంభం రోడ్, వడ్డెర పాలెం, రాగన్నపాలెం, బొందిలిపాలెం, కొమరవల్లి పాడు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తునట్లు తెలిపారు.
చిలకలూరిపేట - డబ్బులు డిమాండ్ చేసిన వార్డు లేడీ వాలంటరీ తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ - మూడు వార్డు అడ్మిన్లను బదిలీ
CHILAKALURI PET SPEED NEWSFriday, June 11, 2021ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, చిలకలూరిపేట న్యూస్
No comments
చిలకలూరిపేట - డబ్బులు డిమాండ్ చేసిన వార్డు లేడీ వాలంటరీ తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ - మూడు వార్డు అడ్మిన్లను బదిలీ
గత రెండు రోజులుగా పట్టణంలోని 27వ వార్డు వాలంటరీ లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేసిన విషయం సామాజిక మాధ్యమాలలో, పట్టణ, రాష్ట్ర మీడియా ఛానళ్లలో కోడై కూసింది. వీడియో లో వాలంటరీ చెప్పినట్లుగా తాను ఒక్క రూపాయి కూడా తీసుకోను అంతా ఫై అధికారులకు వెళ్తుంది అని చెపింది. దీని పైనా సీరియస్ అయిన మునిసిపల్ కమిష్నర్ ఘటన తెలిసిన వెంటనే ఆయా వాలంటరీని విధుల నుండి తప్పించారు. అలాగే తాజాగా ఆమె పైన ఉన్న అడ్మిన్లను బదిలీ చేస్తూ మునిసిపల్ కమిష్నర్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేసారు. 9,27,29 వార్డు అడ్మిన్లను బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. 9 వ వార్డు అడ్మిన్ సిద్దాబత్తుని రాజేష్ ను 27 వ వార్డుకి , 29 వ వార్డు అడ్మిన్ కరిష్మాను 9 వ వార్డుకి, 27 వ వార్డు అడ్మిన్ గడ్డం మురళి కృష్ణ ను 29 వ వార్డుకి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 11-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 11-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
వెంకటరెడ్డి నగర్ లో - 4
పురుషోత్తమపట్నం లో - 1
పండరీపురం లో - 1
మారుతీ నగర్ లో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
వేలూరు గ్రామంలో - 1
బొప్పూడి గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
అక్రమ మద్యం, అక్రమ గుట్కాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా చిలకలూరిపేట - తాజాగా 735 మద్యం బాటిల్స్ సీజ్
అక్రమ మద్యం, అక్రమ గుట్కాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా చిలకలూరిపేట - తాజాగా 735 మద్యం బాటిల్స్ సీజ్
గత కొంతకాలంగా చిలకలూరిపేట అక్రమ, నిషేదిత మత్తు పదార్ధాల హోల్ సేల్ మార్కెట్ గా తయారవుతుంది. చిలకలూరిపేట చుట్టుపక్క గ్రామాలలో, మండలాలలో మందుబాబులు, చిన్న చిన్న గుట్కా అమ్మే షాపులను ఎవరిని అడిగినా వారి నోటు నుండి వచ్చే ఒకేఒక్క మాట చిలకలూరిపేటలో ఫలానా ఏరియాలో, ఫలానా వ్యక్తుల వద్ద దొరుకుతాయి అని చెప్తారు. ఆవిధంగా చిలకలూరిపేట లో అక్రమ వ్యాపారం కొనసాగుతుంది.
ఏపీ మందు క్వాలిటీ తక్కువ, రేట్ ఎక్కువ అని చెప్పి, ఇతర రాష్ట్ర మద్యం తక్కువ రేట్, క్వాలిటీ ఫిల్టరింగ్ ఎక్కువ అని చెప్పి యధేచ్చగా మద్యం విక్రయిస్తున్నారు. పక్క జిల్లాలో పోలీసులు మన ఊరికి వచ్చి ఇక్కడ అమ్మేవారి గుట్టు బయట పెడుతున్నారు. ఉదాహరణకి వేటపాలెం పోలీసులు పేటలో సుమారు 60 నుండి కోటి రూపాయలు విలువ చేసే గుట్కాలు అమ్మే పెద్ద చేపని పట్టుకున్నారు. అతనికి గుట్కాలు రైల్వే గూడ్స్ ద్వారా చీరాల, అక్కడి నుండి పేటకు గుట్టు చప్పుడు కాకుండా తరలించి హోల్ సేల్ గా చుట్టుపక్కల గ్రామాలకి అందిస్తున్నారు. ఈ విషయాన్ని పక్క జిల్లా పోలీసులు ఛేదించారు. మన పేట పోలీసులు ఎం చేస్తున్నారు అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లేదా పైన అధికారుల కన్ను సైగలలో ఇది నడుస్తుందా అని అందువలన మన పోలీసులు పట్టించుకోవటం లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఎలా ఉంటే చిలకలూరిపేట మండలంలోని మద్దిరాల గ్రామం వద్ద ఈ రోజు అనగా శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్రము నుండి తీసుకు వచ్చిన మద్యం అక్రమంగా తరలిస్తుండగా ఎక్ససైజ్ అధికారులు వారిని పట్టుకున్నారు. వీరు ఇన్నోవా కారు నుండి మద్యం ను 5 బైకులతో సర్ది అక్కడ నుండి తరలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అధికారులు 5 బైకులను, ఒక ఇన్నోవా కారు తో పాటుగా 735 మద్యం బాటిల్స్ సీజ్ చేసారు. 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.











