మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 5లక్షల విలువ చేసే వైద్య సామాగ్రి అందజేసిన అసిస్ట్ సంస్థ

చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 5లక్షల విలువ చేసే వైద్య సామాగ్రి అందజేసిన అసిస్ట్ సంస్థ  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - కరోనా వైద్య చికిత్సలు అందిస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్ నందు కరోనా రోగుల,వైద్యుల భద్రత కొరకు చిలకలూరిపేట ఇంటర్నేషనల్ సేవా సంస్థ అసిస్ట్ 5 లక్షల రూపాయల విలువగల వైద్య సామగ్రి అందజేశారు. ఆసుపత్రి వైద్యురాలు భవాని గారికి పి పి ఏ కిట్లు, ఎన్ 95 మాస్కులు , శానిటైజెర్ , సెలైన్ స్టాండ్లు,ధర్మామీటర్లు అందజేశారు. ఈ సందర్భంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఇంకా వైద్య సదుపాయాలు అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హరీష్ కృష్ణ. రంగారావు గారు, సూర్యనారాయణ, డేవిడ్, రాజు,ఇమ్రాన్,వంశీ తదితరులు పాల్గొన్నారు 
































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి

చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట కరోనా మొదటి వేవ్ నందు గ్రామాల ప్రజలు తపించుకున్నారు. కానీ ఈ సెకండ్ వేవ్ మాత్రం గ్రామాలను కూడా వదలటం లేదు. చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామాలలో మాత్రం ఈసారి ఏ పల్లెటూరుని కూడా వదలటం లేదు. ఎక్కడ నిర్లక్ష్యం గా వ్యవహరించినా అసలు కనికరం చూపటంలేదు. ముఖ్యంగా యడ్లపాడు, పసుమర్రు ఏరియాలలో చాపక్రింద నీరులాగా వ్యాపిస్తుంది. గ్రామాలలోని ప్రజలు కొన్ని రోజులపాటు 10 రోజులకు సరిపడా సరుకులను ఒకేసారి తెచ్చుకొని బయటకు రాకుండా ఉంటే పట్టణంలో కన్నా గ్రామాలలో త్వరగా తీవ్రతను తగ్గించవచ్చు. దయచేసి గ్రామాలలో ఉన్న యువకులు ముందుకి వచ్చి ఈ కరోనా సమయంలో ప్రోటోకాల్ పాటిస్తూ తమ తమ గ్రామాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. గ్రామాలలో ఉన్న పెద్ద మనుషులను సంప్రదించి ఊరులోని వ్యక్తులు బయట జాబ్ చేసుకునే వాళ్ళ నుండి కరోనా విపత్తు వివరించి చందాలు పోగుచేసి ఏ రోజుకి ఆ రోజు పని చేసుకునే వాళ్ళని ఇళ్లలో నుండి బయటకి రావద్దు అని చెప్పి వారికీ ఆహార సదుపాయాలు చూసుకుంటే కొన్ని రోజులలోనే కరోనా విపత్తు నుండి బయటపడవచ్చు. గ్రామపెద్దలు సహకారంతో యువకులు ముందుకు వచ్చి నిలబడాలి అని కోరుకుంటున్నాము. ఎంతో మంది డబ్బు ఉన్నవారు కరొనతో చనిపోయినవారు ఉన్నారు కానీ అక్కడ డబ్బు ఉపయోగపడలేదు. మనుషులు మాత్రమే ముఖ్యం.  యువకులు తలుచుకుంటే ఏది అయిన చెయ్యవచ్చు. మన గ్రామాలను అందులోని మనుషులను కాపాడుకుందాం. కరోనా తతీవ్రత తగ్గినప్పటి నుండి గ్రామాలలో వ్యాక్సిన్ ప్రక్రియకు కూడా మీ సహకారం అందించి గ్రామ సుభిక్షతకు తోడ్పడండి.  



























Share:

చిలకలూరిపేటలో రేపు 15-05-2021 ఈ ఏరియాలలో కరెంటు ఉండదు !

చిలకలూరిపేటలో రేపు 15-05-2021 ఈ ఏరియాలలో కరెంటు ఉండదు !

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట రేపు శనివారం కారణంగా విధ్యుత్ మరమ్మతులు కోసం పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో కరంటు కోత విధిస్తున్నట్లు డి ఈ ఈ సీహెచ్ రంబొట్ట్లు గారు తెలిపారు. పట్టణంలోని ఎన్ ఆర్ టి సెంటర్ నుండి విజయ బ్యాంకు వరకు స్టేట్ బ్యాంకు , సిటీ యూనియన్ బ్యాంకు , హనుమాయమ్మ సత్రం,గాంధీపేట,హైస్కూల్ రోడ్డు, మునిసిపల్ ఆఫీస్ రోడ్డు, కొత్త పోలీస్టేషన్ రోడ్డు, డిక్మెన్ నగర్  ఉదయం 8:30 నుండి 11:30 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుంది అని తెలిపారు . 






































Share:

చిలకలూరిపేట- బోసిపోయిన అడ్డరోడ్డు సెంటర్ - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ రంజాన్ వేడుకలు

చిలకలూరిపేట- బోసిపోయిన అడ్డరోడ్డు సెంటర్ - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ రంజాన్ వేడుకలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ నందు ప్రతి సంవత్సరం ఎర్పాటు చేసే సామూహిక ప్రార్ధనలూ కరోనా కారణంగా ఈసారి నిర్వహించలేక రోడ్లు అన్ని బోసిపోయాయి. అయినా పట్టణంలో రంజాన్ వేడుకలు కరోనా ప్రొటొకాల్ పాటిస్తూ ఘనంగా జరుగుతున్నాయి. పరిమితి సంఖ్యలో ముస్లిం సోదరులు మసీదులకు చేసుకొని మత పెద్దల సహకారంతో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అలాగే మసీదులకు రాని వారు తమ తమ ఇళ్లలోనే ప్రార్ధనలు నిర్వహించుకుంటున్నారు. దేశంలోని ప్రజలు ఆరోగ్యంగా గా ఉండాలి అని ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. అలాగే ప్రతి ఒక్కరు కరోనా వైరస్ కట్టడికి కలిసి కట్టుగా కృషి చెయ్యాలి అని తెలిపారు మత పెద్దలు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ , శానిటైజేర్ వాడాలి అని తెలిపారు. 





























 

Share:

MP పిలుపు మేరకు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పెరుగుతున్న ధాతల సహకారం

MP పిలుపు మేరకు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పెరుగుతున్న ధాతల సహకారం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట కొన్ని రోజుల క్రితం ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పర్యటించారు. ఆ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు మౌలిక సదుపాయాలు తనిఖీ చేశారు. హాస్పిటల్ గదులు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాల శుభ్రతను పరిశీలించి దిశా నిర్దేశం చేసారు. అలాగే కరోనా వార్డు నందు బెడ్లు పెంపు నాకు లేఖ జిల్లా అధికారులకు రాసారు. అలాగే త్వరలో రెమిడీసివెర్ ఇంజక్షన్,ఆక్సిజన్ సీలిండర్ల పైనా ద్రుష్టి పెట్టారు.హాస్పటల్ నందు అత్యవసర గా కొంత మంది డాక్టర్లను, నర్స్ లను తీసుకోవాలి అని ప్రధాన వైద్యురాలిని కోరారు. అలాగే కొత్తగా తీసుకున్న వారికీ గవర్నమెంట్ జాబులకు రెఫరెన్సు సిఫారసు చేస్తాము అని తెలిపారు. దాతలు ఎవరైనా హాస్పిటల్ నాకు సహకారం అందించాలి అని పిలుపునిచ్చారు. 
 
ఎంపీ పిలిపు మేరకు హాస్పిటల్ నందు నాయుడు రమేష్ గారు మరుగుదొడ్లు నందు పైపులను మరమ్మతు చేపించారు, హాస్పిటల్ గదుల నందు కొత్త ఫ్యాను లను ఎర్పాటు చేసారు. అలాగే గురువారం నాడు అసిస్ట్ సంస్థ నుండి కరోనా రోగులకు ఆక్సిజన్ మాస్కులు, గన్ మీటర్లు, పేస్ షీల్డులు , డాక్టర్లకు,సిబ్బందికి పి పి ఏ  కిట్లను అందజేశారు . అలాగే సింగపూర్ నందు ఉంటున్న బైరా స్వర్ణలత గారు 20 ఆక్సిజన్ సీలిండర్లను అందజేశారు. అలాగే కరోనా వార్డులలో ఉన్న 20 బెడ్లను 30 కి పెంచారు. మరో రెండు రోజులలో మరిన్ని సౌకర్యాలను అందజేస్తాం అని మంత్రి అనుచరులు తెలిపారు. ఈ సందర్భంలో పలువురు వైస్సార్సీపీ ముఖ్య నాయకులూ పాల్గొన్నారు.  


https://chilakaluripetspeednews.blogspot.com/


































Share:

చిలకలూరిపేట ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు - పట్టణ ముఖ్య నేతలు

చిలకలూరిపేట ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు - పట్టణ ముఖ్య నేతలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ముందుగా చిలకలూరిపేట ముస్లిం సోదరులకు చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ తరుపున రంజాన్ శుభాకాంక్షలు. అలాగే పట్టణములోని ముఖ్య నాయకులూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. MLA విడదల రజని గారు, ప్రతిపక్షనేత మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు పట్టణ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.అలాగే రంజాన్ విశిష్టత తెలియజేసారు. 
ఈ రంజాన్ పండుగ నుండి కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టి ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి అని అల్లా ని కోరుకుందాం. ప్రార్ధన సమయాలలో మాస్క్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం. 


































Share:

చిలకలూరిపేట - పట్టణాన్ని పలకరించి వెళ్లిన మేఘాలు,వరుణ దేవుడు

చిలకలూరిపేట - పట్టణాన్ని పలకరించి వెళ్లిన మేఘాలు,వరుణ దేవుడు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట -  పట్టణాన్ని వరుణ దేవుడు అలా పలకరించి వెళ్లారు . కొన్నిరోజులుగా పట్టణములో ఎండలు మండిపోతున్నాయి. లాక్ డౌన్ కారణంగా మధ్యాహ్నం 12 తరువాత ఎవరు బయటకి రాకపోవటంతో ఎండల తీవ్రత అర్ధం కావటం లేదు కానీ బయట ఎండలు మండిపోతున్నాయి. అయితే ఈరోజు 3 గంటల ప్రాంతంలో నల్లటి మొబ్బులతో చల్లటి వాతావరం ఏర్పడింది. అయితే దానికి తోడు తుపాను తలపించేలా గాలులు వీచాయి. దీనితో పట్టణములోని ప్రజలు కొంచం సేపు వాతావరణాన్ని ఆస్వాదించారు. చల్లటి గాలులు, చిన్న చిన్న వర్షపు చినుకులతో రోడ్లు అన్ని తడిచాయి. ఇంతలోనే మొబ్బులు మాయం గాలులు ఆగిపోయాయి . 






















Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి