మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - ఆక్సిజెన్ సీలిండర్లు తెచ్చుకోండి ట్రీట్మెంట్ చేస్తాం - అయోమయంలో కరోనా రోగుల కుటుంబ సభ్యులు

చిలకలూరిపేట - ఆక్సిజెన్ సీలిండర్లు తెచ్చుకోండి ట్రీట్మెంట్ చేస్తాం - అయోమయంలో కరోనా రోగుల కుటుంబ సభ్యులు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేటలోని RK మల్టి స్పెషాలిటీ హాస్పిటల్కు  సోమవారం నాడు కలెక్టర్ ఆదేశాల మేరకు కరోనా రోగులకు వైద్య సేవలు నిలిపివేశారు. కానీ అక్కడ ఉన్న కరోనా రోగులకు ఒక వింత అనుభవం ఎదురైనది. కలెక్టర్ ఆదేశాలతో కరోనా వైద్య సేవలు నిలిచిపోయిన స్థానిక తసీల్ధార్ ఇన్సిడెంట్ కమాండర్ సుజాతగారు కొత్త రోగులను చేర్చుకోకుండా ఇప్పుడు ఉన్న రోగుల వరకు  చికిత్స్ అందించాలి అని తెలిపారు. అయితే సేవలు నిలిచిపోయిన సంధర్భంగా మా హాస్పిటల్కు ఆక్సిజెన్ సీలిండర్లు రావు అని మిరే సీలిండర్లు తెచ్చుకోవాలి అని అక్కడ సిబ్బంది తెలపటంతో కరోనా రోగులు ఒక్కసారిగా  ఖంగు తిన్నారు.  
పట్టంలో ఆక్సిజన్ సిలిండర్  ఇచ్చే సదరు ఏజెన్సీ దగిర ఆక్సిజన్ నిల్వలు ఐపోయ్యాయి అని. ఇప్పుడు ఉన్న ఆక్సిజన్ సీలిండర్లు అయిపోతే పరిస్థితి ఏంటి అని రోగుల కుటుంబ సభ్యులు అయోమయంలో పడ్డారు. 



































Share:

చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగిన మన మైలవరపు కృష్ణతేజను కేరళ ప్రభుత్వం కరోనా నియంత్రణ అధికారిగా నియమించారు

 చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగిన మన మైలవరపు కృష్ణతేజను కేరళ ప్రభుత్వం కరోనా నియంత్రణ అధికారిగా నియమించారు 

https://chilakaluripetspeednews.blogspot.com/

మన చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగిన మైలవరపు కృష్ణ తేజను కేరళ ప్రభుత్వం కరోనా నియంత్రణ అధికారిగా నియమించినది. గతంలో కేరళ వరదల సమయంలో వరద ముంపు ప్రాంతాల నుండి రెండు లక్షల మందికి పైగా ప్రాణాలు కాపాడి సమర్ధవంతంగా తన కార్యనిర్వహణను నిర్వహించారు అదే అనుభవంతో కరోనా నుండి ప్రజలను కాపాడటానికి రాష్ట్ర వ్యాప్తంగా కేరళ ప్రభుత్వం ఒక కమిటీ ఎర్పాటు చేసింది. ఆయా కమిటీ బాధ్యతలను మన IAS కి అప్పగించారు.  
























Share:

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా !!!

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా !!!

https://chilakaluripetspeednews.blogspot.com/

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివిగా నిర్ధారణ అయినది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. కరోనా కారణంగా ప్రస్తుతానికి అన్ని షూటింగ్స్ పోస్టుపోన్ చేసారు. "నేను బాగానే ఉన్నాను, నాతో పాటు కుటుంబము అంతా హోమ్ ఐసొలేషన్లో ఉన్నాము . డాక్టర్ పర్యవేక్షణలో అందరం జాగ్రత్తగా ఉన్నాము, కొన్ని రోజులుగా తనతో కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేపించుకొని జాగ్రత్తలు తీసుకోండి "అని తెలియజేసారు.



https://chilakaluripetspeednews.blogspot.com/


































Share:

చిలకలూరిపేట - RK మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కరోనా వైద్య సేవల అనుమతులు రద్దు - కలెక్టర్

 చిలకలూరిపేట - RK మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కరోనా వైద్య సేవల అనుమతులు రద్దు - కలెక్టర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట RK మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కరోనా వైద్య సేవలు నిలిపివెయ్యాలి అని కలెకర్ట్ నోటీసు రిలీజ్ చేసారు . చాలా రోజుల నుండి ఈ హాస్పిటల్  నందు కరోనా రోగుల & బంధువుల నుండి  అనేక ఆరోపణలు ఎదురుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు కలెక్టర్ అనుమతులు రద్దు చేస్తూ నిర్ణయం తెలుసుకున్నారు. రెమిడీరెసీవర్ , కరోనా రోగుల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లు చెయ్యటం వంటి ఆరోపణలు ఎదురుకుంటున్నారు. హాస్పిటల్లోని కరోనా రోగులను వేరే హాస్పిటల్లోకి మార్చాలి అని కలెక్టర్ వివేక్ యాదవ్  పేర్కొన్నారు. 






















Share:

ప్రముఖ తెలుగు సినిమా జర్నలిస్ట్, నటుడు TNR కరొనతో మృతి చెందారు

ప్రముఖ తెలుగు సినిమా జర్నలిస్ట్, నటుడు TNR కరొనతో మృతి చెందారు 

https://chilakaluripetspeednews.blogspot.com/


కరోనా సెకండ్ వేవ్ ఎవరిని వదలటం లేదు. తాజాగా తెలుగు సినిమా జర్నలిస్ట, నటుడు TNR ( తుమ్మల నరసింహ రెడ్డి ) ఈ రోజు కరొనతో మృతి చెందారు. ఫ్రాంక్లి స్పీక్ విత్ TNR  అనే పేరుతో చాలా మంది తెలుగు సినీ,రాజకీయ ప్రముఖులతో ఇంటర్వ్యూ చేసి మీడియా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఎర్పాటు చేసుకున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో కరోనా సోకింది అని కానీ దానికి భయపడవలసిన అవసరం లేదు అని దైర్యంగా ఎదురుకోవాలి అని ఒక వీడియో పోస్ట్ చేసారు. కానీ ఇంతలో కరోనా అతనిని కబళించివేసింది. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు దీక్బ్రాంతి వ్యక్తం చేసారు. హీరో నాని, డైరెక్టర్ మారుతీ ,బాబీ సంతాపం తెలియచేసారు. డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీ కి వచ్చి జర్నలిస్ట్ గా , నటుడిగా స్థానం సంపాదించుకున్నారు. త్వరలో డైరెక్టర్ ఆఫర్ వచ్చింది అని తెలిపారు. ఇంతలోనే అయన మరణ వార్త అభిమానులను కలచివేసింది.  

























Share:

చిలకలూరిపేట - ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్ అందజేసిన మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు

చిలకలూరిపేట - ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్ అందజేసిన మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు 

https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టంలోని ప్రగతి నర్సింగ్ హోంనకు ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్ ను అందించారు మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు. ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్ అంటే విద్యుత్ అంతరాయం లేకుండా ఉంటే ఇది నిరంతరం ఆక్సిజెన్ సప్లై చేస్తుంది, ఆక్సిజెన్ సిలిండర్ తో పని లేకుండా వాతావరంలోని గాలిని తీసుకొని ఆక్సిజెన్ ఉత్పత్తి చేస్తుంది. ప్రగతి హాస్పిటల్ డాక్టర్ కొల్ల అమర్ గారు మాట్లాడుతూ   ప్రస్తుతం ఆక్సిజన్ సీలిండర్లు కొరత ఉన్న ఈ సమయంలో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ చాలా ఉపయోగపడుతుంది. మర్రి రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. 




























Share:

అసభ్యపదజాలంతో ప్రతిపక్ష నాయకుడిని తిడుతున్నవాళ్ళని వదిలేసి వైద్యధికారులు ప్రకటించిన వైరస్ గురించి మాట్లాడిన చంద్రబాబు పైనా కేసు పెట్టటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము - ప్రత్తిపాటి

అసభ్యపదజాలంతో ప్రతిపక్ష నాయకుడిని తిడుతున్నవాళ్ళని వదిలేసి వైద్యధికారులు ప్రకటించిన వైరస్ గురించి మాట్లాడిన చంద్రబాబు పైనా కేసు పెట్టటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము - ప్రత్తిపాటి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చంద్రబాబు నాయుడి పైన పెట్టిన కేసును తీవ్రంగా ఖండిస్తున్నాము- పుల్లారావు , వివరాల్లోకి వెళ్తే

N - 440K  అనే ప్రమాదకర కరోనా వైరస్ ఏపీలో కనిపించింది అని చంద్రబాబు నాయుడు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అని ప్రతిపక్షనేత చంద్రబాబు గారి పైన కేసు నమోదు చేసారు. అయితే రాష్ట్రంలో రెమిడీసీవర్ , ఆక్సిజెన్ సమకూర్చటంలో విఫలం అయిన జగన్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మార్చటానికి కేసులు పెట్టి వాతావరణాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు. 

3 సార్లు ముఖ్యమంత్రి అయిన 40 సంవత్త్సరాలో రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని మీడియాలో ఒక మంత్రి ఇష్టం వచ్చినట్లు అసభ్యపదజాలంతో దూషిస్తున్న వారిని వదిలివేసి , వైద్యాధికారులే కొత్త వైరస్ ఏపీలో ఉన్నది అని ధ్రువీకరించిన వార్త ప్రస్తావన చేసిన చంద్రబాబునాయుడు పైన కేసు పెట్టటం ఏంటని ప్రశ్నించారు. ఆక్సిజెన్ లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు వారి పైన ద్రుష్టి పెట్టాలి అని తెలిపారు.  


























Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి