|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిఇక పైన రాష్ట్రంలో ప్రతి నెల ప్రతి ఇంటి నుండి నగరాలలో 120, మునిసిపాలిటీలలో 90, పంచాయితీలలో 60 రూపాయల వసూళ్లు - త్వరలో ఆమోదం
ఇక పైన రాష్ట్రంలో ప్రతి నెల ప్రతి ఇంటి నుండి నగరాలలో 120, మునిసిపాలిటీలలో 90, పంచాయితీలలో 60 రూపాయల వసూళ్లు - త్వరలో ఆమోదం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మునిసిపాలిటీలలో, నగరపాలక సంస్థలలో సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ కోసం చార్జీలు వసూళ్లు చెయ్యనున్నారు. నగరపాలక సంస్థలలో, పురపాలక సంస్థలలో వేరు వేరుగా చార్జీలు వసూళు చెయ్యనున్నారు.
నగరపాలక సంస్థలలో, మునిసిపల్ కార్పొరేషన్ లలో అయితే ఇంటి ఇంటికి ప్రతి నెల 120 రూపాయల చొప్పున చార్జీలు వసూళ్లు చెయ్యనున్నారు. ఆలస్యం అయితే 15 రూపాయల పెనాలిటీ వసూళ్లు చేస్తారు. 500-1000 చదరపు అడుగుల హోటళ్లకు, రెస్టారెంట్లకు 1000 రూపాయలు, 1500 చదరపు అడుగులలో ఉన్న హోటళ్లకు, రెస్టారెంట్లకు 1500 రూపాయలు, చిన్న హోటళ్లకు 500 రూపాయలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు 300 రూపాయలు, 7 స్టార్ నుండి 5 స్టార్ హోటళ్లకు 15000, 3 స్టార్ హోటళ్లకు 10000, 50 గదులు ఉన్న హోటళ్లకు 5 వేలు, 20 నుండి 50 గదులు ఉన్న హోటళ్లకు 3 వేలు, హాస్టళ్లకు, మాల్స్, ఫంక్షన్ హాళ్లకు వేరువేరుగా, ఆలస్యం అయితే 100పెనాలిటీ చార్జీలు నిర్ణయించారు.
మునిసిపాలిటీలలో స్పెషల్, సెలక్షన్ గ్రేడులలో ఉన్న మునిసిపాలిటీలలో ఒకొక్క ఇంటికి ప్రతి నెలా 90 రూపాయలు, 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉన్న హోటళ్లకు 1000 రూపాయలు, బార్ అండ్ రెస్టారెంట్ లకు 2000 రూపాయలు, ప్రైవేట్ కమర్షియల్ కంప్లెక్సలకు 2500 రూపాయలు, ఫంక్షన్ హాళ్లకు 7500 రూపాయలు,కోల్డ్ స్టోరేజీలకు 1000 రూపాయలు, 40 పడకల నర్సింగ్ హోమ్ లకు 7500 రూపాయలు, చికెన్ మటన్ షాపులకు నెలకు 200 చొప్పున నిర్ణయించారు.
గ్రేడ్ 2, నగర పంచాయితీలకు నెలకు ఇంటికి నెలకు 60 రూపాయలు , లేటు పెనాలిటీ 5 రూపాయలుగా నిర్ణయించారు.
చిలకలూరిపేట - నిత్యం రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న తిమ్మాపురం ప్రాంతః ప్రజలు - తాజాగా మరొకరు మృతి
చిలకలూరిపేట - నిత్యం రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న తిమ్మాపురం ప్రాంతః ప్రజలు - తాజాగా మరొకరు మృతి
చిలకలూరిపేట నుండి గుంటూరు జాతీయ రహదారి పైనా తిమ్మాపురం వద్ద రోజూ ఏదో ఒక రోడ్డు ప్రమాదం వలన ఎవరో ఒకరు మృతి చెందుతున్నారు. తాజాగా ఆదివారం ( ఈ రోజు ) విజయవాడ నుండి ఒంగోలు వెళ్తున్న ట్రాలీ ఆటో తిమ్మాపురం వద్ద డివైడర్ ను ఢీ కొని బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో పొదిలికు చెందిన నరసయ్య (80) అక్కడే మృతి చెందారు. మిగిలిన వారికీ గాయాలవ్వగా వారిని హాస్పిటల్కు తరలించారు.
నిత్యం ఏదో ఒక ప్రమాదంతో ఆయా ప్రాంతః వాసులు భయాందోళనకు గురి అవుతున్నారు. చిలకలూరిపేట నుండి గుంటూరు మధ్యలో తిమ్మాపురం జంక్షన్ వద్ద మాత్రమే రోడ్డు వెడల్పు తక్కువగా, ప్రమాదాలకు అనుకూలంగా ఉంటుంది. అధికారులు దీని పైనా ద్రుష్టి పెట్టి తగుచర్యలు తీసుకోవాలి అని ఆ ప్రాంతః వాసులు తెలిపారు.
చిలకలూరిపేట - మందుబాబుల వికృత చేష్టలు
చిలకలూరిపేట - మందుబాబుల వికృత చేష్టలు
చిలకలూరిపేట పట్టణంలోని CR కాలనీ సమీపంలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి మిల్లుకు కూతవేటు దూరంలో ప్రతి రోజు రాత్రివేళలో మందు బాబులు ఫుల్ గా తాగేసి ఖాళీ మద్యం సీసాలను పగలకొట్టి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. దీని వలన పట్టణములోని CR కాలనీ, RTC కాలనీ వాళ్ళు పొద్దునే వాకింగ్ కు వెళ్తూ గురిఅవుతున్నారు . చిన్నపిల్లలతో మార్నింగ్ వాకింగ్ వెళ్లేవారికి వీటివలన గాయపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలాంటి వికృత చర్యలకు పాల్పడేవాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మార్నింగ్ వాకింగ్ కి వెళ్లే వారు కోరుకుంటున్నారు. ఇప్పటికి అయినా పోలీస్ వారు రాత్రి గస్తీ సమయంలో ఇటుగా వచ్చి ఇలాంటి సాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.
రైతు పొలం పని చేసుకునే సమయంలో కాళ్లకు చెప్పులు లేకుండా పొలం సాగు చేస్తారు. ఇలాంటి చర్యలకు పాల్పడి వారిని గాయాలపాలు చెయ్యకండి.
చిలకలూరిపేటలో కరొనతో మహిళా ANM మృతి
చిలకలూరిపేటలో కరొనతో మహిళా ANM మృతి
చిలకలూరిపేట రాగన్నపాలెం లో నివాసం ఉంటున్న మహిళా ANM కరోతో మృతి చెందారు. ఆమె మండల పరిధిలోని మురికిపూడి గ్రామము నందు ANM (Auxiliary Nursing Midwifery) గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొంత కాలముగా కరొనతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్సపొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆమె మృతికి పట్టణములోని ANM లు ధిక్బ్రాంతి వ్యక్తం చేసారు.
చిలకలూరిపేటలో ఫుల్ లాక్ డౌన్ దిశగా వర్తక సంఘాలు !!!
చిలకలూరిపేటలో ఫుల్ లాక్ డౌన్ దిశగా వర్తక సంఘాలు !!!
చిలకలూరిపేటలో కరోనా కేసులు,మరణాలు పెరుగుతున్న క్రమంలో వర్తక,వాణిజ్య సంఘాలు ఫుల్ లాక్ డౌన్ స్వచ్చంధంగా ప్రకటించనున్నాయి. పట్టణంలో లాక్ డౌన్ విధించిన నిర్ణిత సమయంలో ప్రజలు మార్కెట్ పరిసర ప్రాంతాలలో ఎక్కువ రద్దీ ఏర్పడి కేసులు పెరుగుదలకు కారణం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది వ్యాపారులను పోగొట్టుకున్నారు. ఇక పైన ఎవరు కరొన వల్ల ఇబ్బందులకు గురి కాకూడదు అని స్వచ్చంధంగా గోల్డ్ షాపులు, స్టీల్ కొట్లు ఈ నెల 10 వ తారీకు నుండి 20 వరకు పూర్తిగా మూసి ఉంచాలి అని ఆలోచిస్తున్నారు. వీరితో పటు వాణిజ్య , వర్తక సంఘాలు కూడా మూసివేయాలి అని ఆలోచిస్తున్నారు.ఇప్పటికే మార్కెట్ సెంటర్ లలో వాహనాలకు అనుమతి లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేసారు. ఈ ఫుల్ లాక్ డౌన్ అమలు చేస్తే పరిస్థితి కొంచమైనా అదుపులోకి వస్తుందేమో చూదాం.
చిలకలూరిపేటలో మార్కెట్ ప్రాంతం అంతా కొనసాగుతున్న ఆంక్షలు
చిలకలూరిపేటలో మార్కెట్ ప్రాంతం అంతా కొనసాగుతున్న ఆంక్షలు
పట్టణంలో కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్న కారణంగా ఎప్పుడు రద్దీగా ఉంటే మార్కెట్ పరిసర ప్రాంతాలు అయిన చలివేంద్రం బజార్, గోల్డ్ షాప్ బజార్ల, మెయిన్ రోడ్డు బజార్లో బారికేడ్స్ ఏర్పాటు చేసి వాహనాలను రాకుండా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. దీని వలన రద్దీ తగ్గి ప్రజలు తమ తమ పనులను త్వరగా పూర్తి చేసుకొని నిర్ణిత సమయంలో ఇళ్లకు చేరుకుంటున్నారు.
చిలకలూరిపేట ప్రజలకు మన న్యూస్ వెబ్సైటు కు 1లక్ష వ్యూస్ వచ్చిన సందర్భంగా అందరికి ధన్యవాదాలు
చిలకలూరిపేట ప్రజలకు మన న్యూస్ వెబ్సైటు కు 1లక్ష వ్యూస్ వచ్చిన సందర్భంగా అందరికి ధన్యవాదాలు
చిలకలూరిపేట పట్టణ మరియు పరిసర గ్రామా , మండల,నియోజకవర్గ ప్రజలందరికి CHILAKALURIPET SPEED NEWS అందరికి ధన్యవాదాలు. అతి తక్కువ కాలంలోనే మీ అందరి మన్నలను పొంది మీ వల్లన ఆదరించబడుతూ ఈ రోజు 1 లక్ష వ్యూస్ పూర్తి చేసుకున్నము. ఇలాగే మీ అందరి ఆదరణతో ఇంకా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాము.
స్పెషల్ గా మన సైట్ లో
* ఎప్పటికి అప్పుడు వాతావరణ రిపోర్ట్
* ఎ రోజుకు ఆ రోజు కూరగాయల ధరలు
* ఎప్పటికి అప్పుడు సినిమా థియేటర్ సమాచారం
* దేశం లో పెరుగుతున్న కరోనా కేసుల వివరాలు
తెలియజేస్తున్నాము . చాలా మంది తమకు కాంటాక్ట్ ఫారం ద్వారా మాకు మంచి మంచి సూచనలు సలహాలు ఇస్తున్నారు. వారి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.
త్వరలో ఇంకా కొన్ని ఫీచర్స్ add చేస్తాము.
ట్విట్టర్ :- https://twitter.com/chilakaluripet4
బ్లాగ్ సైట్ :- https://chilakaluripetspeednews.blogspot.com/
ఇంస్టాగ్రామ్ :- https://www.instagram.com/chilakaluripet_speed_news/
జిమెయిల్ :- chilakaluripetspeednews@gmail.com












