చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేటలోని రాగన్నపాలెం నందు డాక్టర్ గోపీనాయక్ గారి ఆధ్వర్యంలో కరోనా టెస్టులు నిర్వహించారు
అసలు చిలకలూరిపేటలో వచ్చే కరోనా కేసుల వివరాలు నిజమైనవేన !!!
అసలు చిలకలూరిపేటలో వచ్చే కరోనా కేసుల వివరాలు నిజమైనవేన !!!
చిలకలూరిపేట పట్టణములో కరోనా కేసుల వివరాలు నిజమైనవేన అంటే కాదు అని చెప్పాలి. ఎందుకు అంటే ఒకప్పుడు కరోనా టెస్టులు ఎక్కడ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ లోనో లేక రజక కాలనీ లోని ఆరోగ్య కేంద్రం లోనో లేక పద్మా సాలిపేట డిస్పెన్సరీ నందు అని చెప్పేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి అసలు లేదు ఎక్కడ టెస్టులు చేస్తున్నారో కూడా సరిఅయిన ఇన్ఫర్మేషన్ లేదు. కరోనా అనుమానం ఉన్నవారు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ నందు టెస్టులు చేపించుకుంటున్నారు. అసలు అవన్నీ లెక్కలోకి వస్తాయా అంటే అదీలేదు. కానీ మనకి మాత్రం ఒక్కటి తెలుసు ఏదో ఒక న్యూస్ వెబ్సైట్స్ లో పేటలో అన్ని కేసులు, ఇన్ని కేసులకు అని లేదా ఎవరో ఒకరు ఆ న్యూస్ ని వాట్సాప్ స్టేటస్ గా పెడితే తెలుసుకుంటున్నాం. పేట లో ఏ వీధి లో వెతికిన వీధికి ఇద్దరు చొప్పున హోమ్ కోరంటైన్ లో ఉంటున్నట్లు సమాచారం. ఇవ్వని తెలియకుండా పేటలో 9 కేసులు వచ్చాయిట , 20 వచ్చాయట అని మాస్కలు వేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా తిరుగుతూ కరోనా వాహకాలుగా మారుతున్నారు ప్రజలు.
ఆక్సిజెన్ అంధక చనిపోయారు పాపం, ఇంటి మొత్తానికి ఒకడే అబ్బాయి కరోనా వలన చనిపోయాడు అనే మాటలు చెప్పుకుంటూ బాధపడతాం కానీ ఎవ్వరు సరిగ్గా కరోనా నియమాలు పాటించటంలేదు.మీరు ఈ రోజు మాస్క్ లేకుండా మీరు తిరిగితే ఒకరి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. రెండు సంవత్సరాలో విద్య దూరం అయ్యారు విద్యార్థులు. సరిగ్గా జాబ్ కి వెళ్లే సమయానికి ఈ రెండు సంవత్సరాల విలువ అప్పుడు వారికీ అర్ధం అవుతుంది వారికీ. దయచేసి మనం మన చిలకలూరిపేటని కరోనా ఫ్రీ గా మార్చుకోవటానికి కృషి చేయాలి. దేశం మొత్తం లాక్ డౌన్ పెట్టిన మన పేట లో మాత్రం కరోనా జోన్ లేని ఊరుగా తయారు చేసి బాధ్యత మన అందరిపైనా ఉంది.
చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనానికిలో చెలరేగిన మంటలు
చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనానికిలో చెలరేగిన మంటలు
చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్ నందు ద్విచక్ర వాహనానికి మంటలు వ్యాపించాయి. స్థానికంగా ఉండే ఒక వ్యక్తి నరసరావుపేట సెంటర్ నందు కిచిడి తినేందుకు వచ్చి వాహనాన్ని కిచిడి సెంటర్ ముందు పార్క్ చేసి వెళ్లి వచ్చిన క్రమంలో సదరు వాహనదారుడు ద్విచక్ర వాహనాన్ని స్టార్ట్ చేసి ముందుకి వెళ్లే సమయంలో అనూహ్యంగా వాహనంలో మంటలు చెలరేగాయి. వాహనదారుడు బైక్ ను క్రిందపడ వేసి భయంతో దూరంగా పరుగుతీసాడు.ఇదంతా చుసిన స్థానికులు వాహనం పైన నీరు చల్లి మంటలు అదుపుచేశారు.
చిలకలూరిపేటలో రేపు 15-04-2021 గురువారం ఈ ప్రాంతాల వారికి కరెంటు కోత
చిలకలూరిపేటలో రేపు 15-04-2021 గురువారం ఈ ప్రాంతాల వారికి కరెంటు కోత
పట్టణంలో రేపు గురువారం 15-04-2021న మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయం ఎర్పడుతుంది. పట్టణంలోని చౌత్రసెంటర్ , షరాఫ్ బజార్,యల్లయ్య హోటల్ రోడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్,పద్మసాలిపేట , గబ్బిటివారి వీధి, హైస్కూల్ రోడ్ , శివాలయం బజార్,మెయిన్ రోడ్ నందు రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఎర్పడుతుంది.
చిలకలూరిపేట టీడీపీ పార్టీ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి 130 వ జయంతి వేడుకలు
చిలకలూరిపేట టీడీపీ పార్టీ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 130 వ జయంతి వేడుకలు
పట్టణంలోని టీడీపీ పార్టీ ఆఫీస్ నందు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 130 వ జయంతి వేడుకలు ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తేళ్ల సుబ్బారావు గారు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సి రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్ గారు మాట్లాడుతూ న్యాయవాదిగా,ఆర్ధికవేత్తగా,రాజ్యాంగ నిర్మాతగా భారతీయ్యుల గుండెలో ఎప్పటికి చెరగని ముద్రవేసుకున్నారు అన్నారు. అలాగే ఈరోజు రిజర్వేషన్ ద్వారా వెనకబడిన వర్గాల ప్రజలు ఎంత లబ్ది పొందుతున్నారో అవన్నీ అంబెడ్కర్ గారి వలన అని ఆయనని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులూ, పెద్దలు, పాల్గొని జయప్రదం చేసారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు.
చిలకలూరిపేటలో కరోనా వాక్సిన్ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!
చిలకలూరిపేట రంగన్నపాలెంలోని వాసులకి కరోనా కలకలం - పాస్టర్ మృతితో చర్చి వెళ్లిన వాళ్లలో భయాందోలన
చిలకలూరిపేట రంగన్నపాలెంలోని వాసులకి కరోనా కలకలం - పాస్టర్ మృతితో చర్చి వెళ్లిన వాళ్లలో భయాందోలన
పట్టణములోని రాగన్నపాలెంలో స్థానికంగా ఉన్న ఒక చర్చ్ నందు పాస్టర్గ్ ఉంటున్న వ్యక్తి అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఈస్టర్ పండుగ నాడు రాగన్నపాలెం చర్చ్ నందు ప్రార్ధన నిర్వహించటానికి వచ్చిన వేలూరు గ్రామానికి చెందిన పాస్టర్ పని ముగించుకొని రాగన్నపాలెం ఉన్న పాస్టర్ని పలకరించి వేలూరు వెళ్లిపోయారు. శనివారం నాడు రాగన్నపాలెం పాస్టర్ కరొనతో మృతి చెందారు. ఆయన స్వగ్రామం వూనురు. అంతిమసంస్కారాలకి ఆయనను పూనూరుకి తరలించారు. ఆయన అంతిమసంస్కరరాలకి రాగన్నపాలెం నుండి 50 మందికి పైగా పాల్గొన్నారు. వేలూరు పాస్టర్ కి ఆరోగ్యం బాగోలేక మంగళవారం నాడు మృతి చెందారు. ఆయనకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినది.ఇక రాగన్నపాళెం వాసులకి భయం పట్టుకుంది.స్థానికులు రాగన్నపాలెం నందు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి శానిటైజ్ చెయ్యాలి అని అధికారులని కోరారు.











