చిలకలూరిపేట - బైపాస్‌లో ఘోర ప్రమాదం: కారును ఈడ్చుకెళ్లిన కంటైనర్!ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం: కంటైనర్ కింద ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయిన కారు!..
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ - ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ ⚡
గురువారం మధ్యాహ్నం పట్టపగలు చిలకలూరిపేట నూతన బైపాస్ వద్ద చోటుచేసుకున్న ఓ ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. క్షణకాలం నిద్రమత్తు.. ఊహించని విషాదానికి దారితీసింది. ముందు వెళ్తున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టడమే కాకుండా, డ్రైవర్ గమనించకపోవడంతో కారును కొంత దూరం అలాగే ఈడ్చుకుపోయింది.
⚠️ నిద్రమత్తే ప్రాణాల మీదకు తెచ్చిందా?
గుంటూరుకు చెందిన ఉప్పుటూరి హర్ష (33) (తండ్రి: ఆంజనేయులు) తన కారులో గుంటూరు నుండి చిలకలూరిపేట మీదుగా మార్టూరు వైపు ప్రయాణిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం సమయం కావడంతో.. చిలకలూరిపేట కొత్త బైపాస్‌లో ఉన్న నూతన పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే హర్షకు ఒక్కసారిగా నిద్రమత్తు ఆవహించింది. దీంతో అదుపుతప్పిన కారు, ముందు వెళ్తున్న భారీ కంటైనర్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది.
😱 గగుర్పొడిచే దృశ్యం.. నుజ్జునుజ్జయిన కారు!
కారు ఢీకొట్టిన శబ్దాన్ని కంటైనర్ డ్రైవర్ ఏమాత్రం గమనించలేదు. కారు ముందు భాగం కంటైనర్ వెనుక ఇరుక్కుపోవడంతో, అలాగే దాన్ని రోడ్డుపై ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. రోడ్డు రాపిడికి కారు ముందు టైర్లు పూర్తిగా కాలిపోయి అరిగిపోగా.. ఇంజిన్ తో సహా కారు ముందు వైపు పూర్తిగా నుజ్జునుజ్జయి ఛిద్రమైంది. మధ్యాహ్నం పట్టపగలు జరగడంతో స్థానికులు వెంటనే ఈ భయానక దృశ్యాన్ని గమనించి అలర్ట్ అయ్యారు.
🩸 తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలింపు
ఈ భయంకరమైన ప్రమాదంలో డ్రైవింగ్ సీటులో ఉన్న ఉప్పుటూరి హర్షకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రధానంగా తల, గడ్డం భాగంలో బలమైన దెబ్బలు తగలగా.. పొత్తికడుపు (బ్లాడర్) ప్రాంతంలో ఎక్కువ డ్యామేజ్ జరిగినట్లు స్థానికులు తెలిపారు. పట్టపగలు కావడంతో వెంటనే స్పందించిన చుట్టుపక్కల వారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రుడిని అతి కష్టం మీద కారులోంచి బయటకు తీశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ప్రాణాలు కాపాడేందుకు హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
📌 చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ అలర్ట్:
వాహనదారులకు విజ్ఞప్తి! పగటిపూట అయినా, రాత్రి అయినా ప్రయాణాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమాత్రం అలసట, నిద్రమత్తుగా అనిపించినా వాహనాన్ని పక్కకు ఆపి కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఒక్క క్షణం ఏమరుపాటు పెను విషాదాన్ని మిగులుస్తుంది. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి.. సురక్షితంగా గమ్యం చేరుకోండి! 🚦🚘
యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి వీడియో కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి
https://www.instagram.com/reel/DbIrh5upWqB/?igsh=b3Y4ZXgzZjNtYXp2





No comments:
Post a Comment