చిలకలూరిపేట - అన్నదాత సుఖీభవ" కాదు.. అది "చంద్ర దుఃఖీభవ".. యాప్‌లో యూరియానా..? రైతుల మెడకు ఉరితాడా..! టెక్నాలజీ పేరుతో బాబు దగా! కూటమి సర్కార్‌పై విడదల రజిని ఫైర్!
చిలకలూరిపేటలో చంద్రబాబు పర్యటన అనంతరం చిలకలూరిపేటలో తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి విడదల రజిని
సూపర్ సిక్స్ కాదు.. సూపర్ మోసం! 📉కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల పేరుతో రైతులను నిలువునా మోసం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రతి రైతుకూ ఏటా రూ. 20,000 ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. తీరా అధికారంలోకి వచ్చాక కేంద్రం ఇచ్చే 6 వేలు కూడా కలుపుకుని మాయమాటలు చెబుతున్నారు. జగనన్న హయాంలో 53.5 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తే, కూటమి ప్రభుత్వం ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మందికి కోత పెట్టింది. ఒక్క పల్నాడు జిల్లాలోనే 40 వేల మంది రైతుల పేర్లను తొలగించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ప్రతి రైతుకు రూ. 67,500 అందించి రైతు రాజుగా నిలబడితే, ఇప్పుడు బాబు గారి పాలనలో ప్రతి రైతుకు రూ. 32 వేల చొప్పున ప్రభుత్వం బాకీ పడిందని లెక్కలతో సహా ఎండగట్టారు.
😢 అది అన్నదాత సుఖీభవ కాదు.. 'చంద్ర దుఃఖీభవ' 💔
రైతులు పండించిన పొగాకు, మామిడి, ఆక్వా, శనగలు, మొక్కజొన్న.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. రైతు సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. చిలకలూరిపేట పక్కనే ఉన్న నాదెండ్లలో ఇద్దరు రైతులు, వినుకొండలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించిన పాపాన పోలేదు. రాష్ట్రంలో రోజుకు సగటున రెండు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా రియల్ టైం గవర్నెన్స్ పేరుతో సచివాలయంలో కూర్చుని మానిటర్ చేస్తాననడం హాస్యాస్పదం. రైతుల ఉసురు పోసుకుంటున్న ఈ పథకానికి 'అన్నదాత సుఖీభవ' అని కాకుండా 'చంద్ర దుఃఖీభవ' అని వైఎస్సార్సీపీ నామకరణం చేస్తోందని ఎద్దేవా చేశారు.
📱 యాప్ లో యూరియా.. స్మార్ట్ ఫోన్ కొనేదెలా? 🤷♂️
ఐటీ, టెక్నాలజీ అంటూ ఊదరగొట్టే చంద్రబాబు.. రైతులకు యూరియా కావాలంటే యాప్ లో బుక్ చేసుకోవాలని వింత రూల్స్ పెడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో తెలియని పేద రైతులు రూ. 20 వేలు పెట్టి ఫోన్ కొనుక్కుని, అందులో యాప్ డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోవాలా? అని ప్రశ్నించారు. యాప్ లో బుక్ చేయలేదని నెపం నెట్టి రైతులకు యూరియా ఇవ్వకుండా ఎగనామం పెట్టే కుట్ర జరుగుతోంది. మా హయాంలో ఆర్బీకేల (RBK) ద్వారా ఎరువుల నుంచి కొనుగోళ్ల వరకు ఇంటి ముంగిటే సేవలు అందిస్తే.. ఇప్పుడు కనీస శిక్షణ లేని యాప్‌లతో రైతులను బలిపశువులను చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
🎤 లోకల్ ఎంపీకి అదిరిపోయే కౌంటర్! 🔥
గడిచిన ఐదేళ్లలో చిలకలూరిపేటలో పోలీస్ రాజ్యం నడిచిందని పల్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు రజిని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "2019 నుంచి 2024 వరకు ఆయన మా వైఎస్సార్సీపీ పార్టీలోనే, ఎంపీగా ఉన్నారు కదా? అప్పుడు సైలెంట్‌గా లబ్ధి పొంది, ఇప్పుడు అవసరం కొద్దీ కండువా మార్చి మమ్మల్నే విమర్శిస్తారా? రేపు పొద్దున మళ్లీ పార్టీ మారితే టీడీపీ హయాంలో లాకప్ డెత్‌లు జరిగాయని కూడా ఆయన మాట్లాడుతారు. అలాంటి నాయకుల గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం" అని ఘాటుగా బదులిచ్చారు.





No comments:
Post a Comment