చిలకలూరిపేట - ఉత్తరకొరియా కాదు.. ఇది ఇండియా! బెంగాల్ బంగ్లాదేశ్, రోహింగ్యాలకు డోర్లు క్లోజ్! చిలకలూరిపేట గడ్డపై బీజేపీ నేతల సింహగర్జన! బీజేపీ గెలుపు పై ఏమన్నారంటే
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సాగించిన 15 ఏళ్ల నియంతృత్వ మరియు అరాచక పాలనకు బీజేపీ విజయంతో చరమగీతం పాడామని, దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన అక్రమ చొరబాటుదారులను ఏరివేస్తామని బీజేపీ, బీజేవైఎం నాయకులు స్పష్టం చేశారు. నేడు చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన స్థానిక ప్రెస్ మీట్‌లో నాయకులు మాట్లాడుతూ మమతా బెనర్జీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ ప్రెస్ మీట్‌లో ఎవరెవరు ఏమన్నారంటే:
- వరికూటి నాగేశ్వరరావు (కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి): > "పశ్చిమ బెంగాల్‌లో నియంత పాలనకు నేటితో చరమగీతం పాడాం. బెంగాల్ ప్రజలను ఉత్తరకొరియా మాదిరి భయభ్రాంతులకు గురిచేసిన మమతా బెనర్జీ నియంతృత్వ పోకడలకు బీజేపీ సాధించిన అద్భుతమైన విజయంతో చెక్ పెట్టడం జరిగింది. ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు."
- మల్లెల నాగేశ్వరరావు (బీజేపీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు): > "గత 15 సంవత్సరాలుగా బెంగాల్‌లో దుష్టపాలన సాగింది. బయటి రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ప్రజలను తన గుప్పెట్లో ఉంచుకుని, మత ఛాందసవాదానికి తెరలేపారు. ఎన్నో హత్యలు, ఆకృత్యాలతో ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకున్న మమతా బెనర్జీకి కర్మఫలం అనుభవించక తప్పదు. ఆమె చేసిన ఆకృత్యాలు దానికి తగిన ప్రతిఫలం ఆమె పొందుతారు."
- పులుగుజ్జు మహేష్ (బీజేవైఎం పల్నాడు జిల్లా అధ్యక్షులు): > "బతకడం చేతగాక బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చి, ఇక్కడి అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న విదేశీ మూకలకు పశ్చిమ బెంగాల్ డోర్లు క్లోజ్ చేసే సమయం ఆసన్నమైంది. రోహింగ్యాలు, అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులను కచ్చితంగా ఏరివేసి, తిరిగి వాళ్ల దేశానికి పంపించి వేస్తాం. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు."
- వంకాయలపాటి వంశీధర్ (బీజేవైఎం స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్): > "భారతదేశ ప్రజలను చేతకాని వారిని చేసి, భయభ్రాంతులతో అరచేతిలో వైకుంఠం చూపిన వారికి బెంగాల్ ఫలితాలు చెంపపెట్టు. ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా బీజేపీ సత్తా చాటుతాం, మా దమ్ము ఏంటో చూపిస్తాం."
- రిపోర్టింగ్: చిలకలూరిపేట స్పీడ్ న్యూస్.





No comments:
Post a Comment