చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌కు హాజరై పోలీస్ స్టేషన్లో పాస్పోర్ట్ ని అప్పగించిన మాజీ మంత్రి రజిని - అసలు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్లారు అంటే?
అసలు విడదల రజిని ఈరోజు పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లారు?
ఈరోజు మాజీ మంత్రి విడదల రజిని చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి ప్రధాన కారణం: హైకోర్టు ఆదేశాల మేరకు తన పాస్‌పోర్ట్‌ను పోలీసులకు అప్పగించడం కోసం! కేసు నేపథ్యం: గతంలో టీడీపీ నేత పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విడదల రజినిపై చిలకలూరిపేటలో 'ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు' నమోదైంది. ఈ కేసులో తనపై ఉన్న అభియోగాలను కొట్టివేయాలని (Quash) కోరుతూ ఆమె ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ క్రమంలోనే ఆమెకు కోర్టు కొన్ని కఠిన నిబంధనలతో కూడిన ఆదేశాలను జారీ చేసింది. అందులో భాగంగా విచారణకు సహకరించాలని, అలాగే తన పాస్ పోర్ట్ ను పోలీసులకు సరెండర్ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ఆదేశాలను అనుసరించే విడదల రజిని నేడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, పోలీసులకు తన పాస్‌పోర్ట్‌ను అప్పగించి స్టేషన్ రిజిస్టర్‌లో సంతకం చేశారు.
పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారంటే?
🚨 మాజీ మంత్రి విడదల రజిని ఫైర్: ఏపీలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదు.. రెడ్‌బుక్ రాజ్యాంగం! 🚨
చిలకలూరిపేటలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆదివారం స్థానిక చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌కు హాజరైన రాష్ట్ర మాజీ మంత్రి విడదల రజిని.. కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆమె చేసిన కామెంట్స్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ వివరాలు స్పీడ్ న్యూస్ లో మీకోసం:
📕 రెడ్ బుక్ కాస్తా.. బ్లడ్ బుక్‌గా మారిపోయింది!
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం కనుమరుగైందని, దాని స్థానంలో 'రెడ్‌బుక్' రాజ్యాంగం రాజ్యమేలుతోందని మాజీ మంత్రి విడదల రజిని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఈ రెడ్‌బుక్ కాస్తా సామాన్యుల ప్రాణాలు తీసే 'బ్లడ్‌బుక్'గా మారిపోయిందని ఆమె ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడానికే పోలీసు వ్యవస్థను కూటమి నేతలు ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని రజిని నిప్పులు చెరిగారు.
⚖️ అందరూ ఆ బుక్ బాధితులే.. దాడులు చేసినా భయపడేది లేదు!
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనపై కావాలనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని రజిని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హత్యలు, హత్యాయత్నాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. ఏకంగా 70 మందికి పైగా జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేశారని, ఐఏఎస్ అధికారులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం ఈ రెడ్ బుక్ నుంచి తప్పించుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీకి చెందిన రషీద్, మందా సాల్మన్ వంటి వారిని దారుణంగా హత్య చేస్తే.. పోలీసులు మాత్రం కేవలం వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేయడం శోచనీయమన్నారు. ఈ ఏకపక్ష వైఖరి వల్లే నేడు ఏపీ పోలీస్ శాఖ ర్యాంకింగ్ అట్టడుగుకు పడిపోయిందని ఎద్దేవా చేశారు.
✊ నా నిజాయితీనే నా బలం.. సత్యమేవ జయతే నా సిద్ధాంతం!
చిలకలూరిపేట నియోజకవర్గంలో తాను యాక్టివ్‌గా ప్రజల్లో ఉంటున్నాననే అక్కసుతోనే తనపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రజల పక్షాన పోరాడకూడదా? విద్యుత్ ఛార్జీల బాదుడు తగ్గించమని నిరసన ర్యాలీ చేస్తే నాపైనే కేసు.. గుడికి వెళ్లి వస్తుంటే నాపై దాడి చేసి, తిరిగి నాపైనే కేసు పెట్టారు!" అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఎన్ని కట్టుకథలు అల్లి అక్రమ కేసులు పెట్టినా తాను భయపడేది లేదన్న రజిని.. సత్యమేవ జయతే అన్నదే తన సిద్ధాంతమని, నిజాయితీయే తన బలం, ధైర్యం అని స్పష్టం చేశారు.
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.





No comments:
Post a Comment