మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - ​ప్రత్తిపాటి ప్రజా గ్రీవెన్స్‌లో పోటెత్తిన జనం... పట్టణంలో ప్రధానమైన సమస్యలపై గురి....ఏ సమస్యలపై సమీక్షించారంటే ?

చిలకలూరిపేట - ​ప్రత్తిపాటి ప్రజా గ్రీవెన్స్‌లో పోటెత్తిన జనం... పట్టణంలో ప్రధానమైన సమస్యలపై గురి....ఏ సమస్యలపై సమీక్షించారంటే ?


​చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు నిర్వహించిన 'ప్రజా గ్రీవెన్స్' కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా, తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

​ఈరోజు గ్రీవెన్స్‌లో ప్రస్తావనకు వచ్చిన ప్రధాన అంశాలు ఇవే:

  • ​రోడ్డు ఆక్రమణల తొలగింపు - ప్రాణనష్టంపై ఆవేదన: టీడీపీ పార్టీ ఆఫీసు నుండి పోలిరెడ్డిపాలెం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించాలని జంగా వినాయకరావు కోరారు. ఆక్రమణల వల్ల రోడ్డు ఇరుకై గత వారం రోజుల్లోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
  • ​గడియార స్తంభం మార్గంలో ఆక్రమణల తొలగింపు: గడియార స్తంభం నుండి పసుమర్రు వెళ్లే కొత్త బ్రిడ్జి వరకు ఉన్న రోడ్డు ఆక్రమణలను తొలగించి, రోడ్డును విశాలం చేయాలని స్థానికులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
  • ​చిన్నకోండ్రుపాడులో అంగన్వాడీ ఏర్పాటు: 38వ వార్డు పరిధిలోని చిన్నకోండ్రుపాడులో మూతపడిన ఎలిమెంటరీ స్కూల్ భవనానికి మరమ్మతులు చేయించి, దానిని అంగన్వాడీ స్కూల్‌కు వినియోగించుకునేలా అనుమతులు ఇవ్వాలని జంగా వినాయకరావు కోరారు.
  • ​కళామందిర్ సెంటర్ వ్యాపారుల ఆవేదన - అద్దెల తగ్గింపునకు వినతి: కళామందిర్ సెంటర్‌లోని మున్సిపల్ షాపుల అద్దెలు గడిచిన పాతికేళ్లలో రూ.1,500 నుండి ఏకంగా రూ.25,000 కు పెరిగాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారాలు లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఏటా 30% అద్దెలు పెంచుతున్న విధానానికి బ్రేక్ వేసి, అద్దెలు తగ్గించాలని కోరారు. మున్సిపల్ అధికారులతో సమీక్షించి వ్యాపారులకు న్యాయం చేస్తామని పుల్లారావు భరోసా ఇచ్చారు.
  • ​సకల మతాలకు ఒకే స్మశానవాటిక: వేలాది కుటుంబాలు నివసిస్తున్న 52 ఎకరాల ఎన్టీఆర్ నగర్, ఎన్టీఆర్ కాలనీ, వైఎస్సార్ కాలనీల ప్రజల సౌకర్యార్థం హిందూ, ముస్లిం, క్రైస్తవులకు ఉమ్మడిగా ఒక స్మశాన వాటికను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. దీనిపై అధికారులతో సమీక్షించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు.
  • ​విషసర్పాల భయం - డ్రైనేజీ సమస్యలు: మంత్రి గొట్టిపాటి బుజ్జి ఇంటి వెనుక భాగంలో దట్టమైన చెట్లు, పొదలు పెరిగి పాములు తిరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. అలాగే, వసుమతి డ్రైనేజీ నీరు ఏపీజే అబ్దుల్ కలాం షాదీఖానాలోకి చేరుతోందని, మురుగు నీరు లోపలికి రాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు.
  • ​భూ సమస్యలపై పోలీసులకు ఆదేశాలు: గ్రీవెన్స్‌కు వచ్చిన పలు ల్యాండ్ సమస్యలపై రూరల్ సీఐ రమేష్ మరియు మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆయన పిలుపునిచ్చారు.
  • ​రిపోర్టింగ్: చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

    నిరంతరం మీ కోసం.. స్థానిక వార్తల వేదిక!

Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి