యడ్లపాడు మాత తిరుణాల్లలో దారుణం.. రక్తమోడిన ఎర్రకొండ రహదారి!
🚨 చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ - ఫ్లాష్ అప్డేట్ 🚨
పూర్తి వివరాలు:
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎడ్లపాడు మండలం పరిధిలోని ఎర్రకొండ రహదారి వద్ద అత్యంత వైభవంగా జరుగుతున్న 'మాత తిరుణాళ్ల'లో ఒక్కసారిగా నెత్తురు చిందింది. ఉత్సవాల్లో ఆనందోత్సాహాలతో గడపాల్సిన చోట వ్యాపారుల మధ్య ఆధిపత్య పోరు రణరంగాన్ని తలపించింది.
తిరుణాళ్ల ప్రాంగణంలో ఆట పరికరాలు, స్టాల్స్ ఏర్పాటు చేసుకునే స్థలం విషయంలో చిరు వ్యాపారుల మధ్య చిన్నపాటి వివాదం మొదలైంది. ఉత్సవాల కోసం తెనాలి, సత్తెనపల్లి, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల నుండి వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన స్టాల్స్ నిర్వాహకులు రెండు వర్గాలుగా విడిపోయారు. స్థలం కోసం మొదలైన వాగ్వాదం.. మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన ఇరువర్గాలు పరస్పరం కర్రలు, ఇనుప రాడ్లతో దాడులకు తెగబడ్డారు.
సరిగ్గా పండుగ వాతావరణంలో ఈ దాడులు జరగడంతో తిరుణాళ్లకు వచ్చిన భక్తులు, మహిళలు, చిన్నారులు తీవ్ర భయభ్రాంతులకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ దాడుల్లో పలువురు వ్యాపారులకు తీవ్ర గాయాలు కాగా.. రక్తమోడుతున్న క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం యడ్లపాడు, చిలకలూరిపేటలోని ఆసుపత్రులకు తరలించారు.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో ఎడ్లపాడులో ఉద్రిక్తత నెలకొనడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.





No comments:
Post a Comment