|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి
Home »
ACB
,
Chilakaluripet speed news
,
ఏసీబీ
,
చిలకలూరిపేట అధికారులు
» చిలకలూరిపేటలో "ఏసీబీ" హైటెన్షన్.. ఆఫీసుల్లో కుర్చీలు ఖాళీ! కలం వదిలేసి.. కాళ్లకి పనిచెప్పిన ఉద్యోగులు?
చిలకలూరిపేటలో "ఏసీబీ" హైటెన్షన్.. ఆఫీసుల్లో కుర్చీలు ఖాళీ! కలం వదిలేసి.. కాళ్లకి పనిచెప్పిన ఉద్యోగులు?
చిలకలూరిపేటలో "ఏసీబీ" హైటెన్షన్.. ఆఫీసుల్లో కుర్చీలు ఖాళీ!
కలం వదిలేసి.. కాళ్లకి పనిచెప్పిన ఉద్యోగులు?
రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఏఈ.. మిగతా ఆఫీసుల్లో "నో అటెండెన్స్"!
చిలకలూరిపేట ప్రభుత్వ కార్యాలయాల్లో ఈరోజు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవినీతికి పాల్పడుతున్న వారి భరతం పట్టేందుకు ఏసీబీ (ACB) రంగంలోకి దిగడంతో అవినీతి తిమింగలాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
అసలేం జరిగింది?
స్థానిక పంచాయతీరాజ్ కార్యాలయంలో ఓ అధికారి (AE) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిపోవడంతో ఈ డ్రామా మొదలైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్లాన్‌తో వచ్చిన ఏసీబీ అధికారులు, డబ్బులు మారుతుండగా పట్టుకుని షాక్ ఇచ్చారు.
చిలకలూరిపేటలో ఏసీబీ దాడుల కలకలం
రూ. 24 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఏఈ
చిలకలూరిపేటలో అవినీతి నిరోధక శాఖ ACB అధికారులు జరిపిన దాడులు ప్రభుత్వ కార్యాలయాల్లో తీవ్ర కలకలం రేపాయి. పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ AEగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ చార్యులు, ఒక కాంట్రాక్టర్ నుండి రూ. 24,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.గతంలో పూర్తి చేసిన కొన్ని కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయాలని సదరు కాంట్రాక్టర్ ఏఈని కోరారు. అయితే, ఆ బిల్లులు పాస్ చేయడానికి ఏఈ సత్యనారాయణ చార్యులు లంచం డిమాండ్ చేశారు. దీనితో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా, ముందస్తు ప్రణాళికతో దాడులు చేసిన ఏసీబీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది.
వణికిపోతున్న ఇతర శాఖలు:
ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో చిలకలూరిపేటలోని మిగతా ప్రభుత్వ ఆఫీసుల్లో సీన్ రివర్స్ అయ్యింది. ముఖ్యంగా ప్రజలతో నిత్యం రద్దీగా ఉండే కార్యాలయాల్లో ఉద్యోగులు మాయమయ్యారు.
కొందరు అధికారులు మధ్యాహ్న భోజనానికే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు.
ముఖ్యమైన ఫైళ్లు ఎక్కడ బయటపడతాయో అని సిబ్బంది కంగారు పడ్డారు.
నిన్నటి దాకా దర్జాగా లంచాలు అడిగిన వారు, ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు.
ప్రజల హర్షం:
ఏళ్ల తరబడి ఫైళ్లను కదిలించడానికి లంచాలు అడుగుతూ వేధిస్తున్న అధికారులకు ఏసీబీ సరైన బుద్ధి చెప్పిందని చిలకలూరిపేట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని, అవినీతి అధికారుల చిట్టా మొత్తం బయటకు తీస్తామని ఏసీబీ వర్గాల సమాచారం.
ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది! అని సామాన్యులు సెటైర్లు వేస్తున్నారు.





No comments:
Post a Comment