ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరంటే ? గత ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటే ?
చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరంటే ? గత ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటే ?
చిలకలూరిపేట :- రాష్ట్ర రాజకీయమంతా ఒకలా ఉంటే చిలకలూరిపేటలో మాత్రం మరో రకంగా ఉంటుంది. అన్ని పార్టీలకు లాగానే కాంగ్రెస్ పార్టీలో కూడా రెండు వర్గాలు అసెంబ్లీ అసెంబ్లీ సీట్ కోసం పోటీపడ్డారు. వీటన్నిటికి తెరదించుతూ నేడు చిలకలూరిపేట కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది ఖరారు అయ్యింది. ఎన్నో సంవత్సరాలుగా దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నా కూడా ఎప్పటినుండో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న మద్దుల రాధాకృష్ణకు పార్టీ అధిష్టానం సీటు ఖరారు చేసింది. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీ నుండి బయటికి వచ్చి షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాయుడు వాసుకు పార్టీ అధిష్టానం మొండి చేయి చూపించింది. అనూహ్యంగా తెరమీదకు వచ్చిన నాయుడు వాసుకు ప్రజాబలం అంతంత మాత్రం ఉండటంతో పాటుగా పార్టీని నమ్ముకొని ఉన్న రాధాకృష్ణకు సీటు ఇవ్వకపోతే అతని అనుచర వర్గం అసంతృప్తిలోనయే అవకాశం ఉండటంతో ఎప్పటినుండో పార్టీలో కష్టపడుతున్న రాధాకృష్ణకు సీటు ఖరారు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.
గతంలో 2019 ఎలక్షన్లలో చిలకలూరిపేట తరపున పోటీ చేసిన మద్దుల రాధాకృష్ణకు 1473 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగారు. పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ పార్టీలో ఉన్న నాయకులను చిన్నచిన్న లీడర్లను పక్క పార్టీలోకి వెళ్లకుండా కాపాడటంలో రాధాకృష్ణ సఫలీకృతుడయ్యాడు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిగా రాధాకృష్ణకు మంచి పేరు ఉంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ హవా లేనప్పటికీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి నూతన ఉత్సాహం మొదలైందని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి.
చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్
చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్
చిలకలూరిపేట:- పట్టణంలో పరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రజా మేనిఫెస్టోని అమలు చేయాలని కమిటీ కన్వీనర్ మాదాసు భాను ప్రసాద్ కోరారు. ఈరోజు కార్యాలయంలో "పది" అంశాలతో కూడిన మేనిఫెస్టో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలకమైన "పది" అంశాలపై పోటీ చేసే అభ్యర్థులు వారి అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.
1. పట్టణంలో మంచినీటి సరఫరాకు కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ రోజు విడిచి రోజు మున్సిపల్ నీరు వదులుతున్నారు, ఇంకా అనేక ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు.
2. పట్టణంలోని ఏరియా హాస్పిటల్ లో ”వెంటిలేటర్ అంబులెన్స్” మరియు బ్లడ్ బ్యాంక్ ల కొరత ఉన్నవి.
3. పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయవలసి ఉన్నది.
4. పట్టణంలో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయవలసిన అవసరం తీవ్రంగా ఉన్నది.
5. పట్టణంలో బస్సు షెల్టర్స్ కొరత కారణంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు, గర్భిణీలు, బాలింతలు పొత్తిళ్లలో పిల్లలను పెట్టుకొని మండుటెండలో బస్సుల కోసం వేచి ఉంటున్నారు.
6. అద్దె ఇంట్లో నివసించే కుటుంబాలలో ఎవరైనా కాలం చేస్తే, వారి అంతిమ సంస్కార నిమిత్తమై వివిధ కారణాల రీత్యా కొందరు ఇంటి ఓనర్లు అభ్యంతర తెలుపుచున్నారు. కనుక, స్మశాన వాటిక సమీపంలో రెండు గదులు ఏర్పాటు చేయవలసి అవసరం ఉన్నది.
7. పట్టణంలో ఉన్న “రెండు కోర్టు”లలో “ఒకటి” అద్దె భవనంలో ఇరుకుగా మున్సిపల్ బిల్డింగ్లో పై అంతస్తులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అందరికీ తెలుసు. స్థలం ఏర్పాటు చేసినచో హైకోర్టు వారు నిర్మాణ ఖర్చులు భరించగలరు, స్థలం కొరత ఉన్నది.
8. పట్టణంలో నాలుగు ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అవసరం ఉన్నవి.
9. పట్టణంలో వాకింగ్ ట్రాక్స్ లేని కారణంగా రోడ్లపై వాకింగ్ చేస్తూ యాక్సిడెంట్స్ జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు విధితమే, కనుక వాకింగ్ ట్రాక్స్ మరియు పట్టణ ప్రజల ఆహ్లాదానికి మంచి పార్క్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది.
10. నియోజకవర్గంలోని అన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు మరియు సినీ నటుల ఫ్లెక్సీలు, ప్రజలకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నందున, అలాంటి ఫ్లెక్సీల ఏర్పాటును నియంత్రించవలసి ఉంది.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మురకొండ వెంకటరావు, శనగవరపు హరి ప్రసాద్, తమ్మిరిశ కృష్ణ ప్రసాద్, గంగసాని వెంకటేశ్వర రెడ్డి, T. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక
చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగుదేశంలోకి చేరికల జోరు పెరిగింది. పట్టణంతో పాటు గ్రామాల నుంచి చేరికల సందడి మొదలైంది. ఓం వైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు అధికార పార్టీ నాయకులు తెలుగుదేశంలోకి వరుస కడుతున్నారు. తాజాగా సోమవారం మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో చిలకలూరిపేట 14వ వార్డు కౌన్సిలర్ షేక్ జమీల, కొత్తపాలెం సర్పంచ్ మొలమంటి సుబ్బారావు, అదే గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు కొండబోయిన కోటయ్య వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. చిలకలూరిపేటలోని నివాసంలో ప్రత్తిపాటి పుల్లారావు వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి ప్రత్తి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైసీపీ విధానాలు నచ్చక చాలామంది ఆ పార్టీ నాయకులు తెలుగుదేశంలోకి చేరుతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో యడ్లపాడు జడ్పిటీసీ సభ్యుడు ముక్తా వాసు, మునిసిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి, జాలాది సుబ్బారావు, చెమిటిగంటి పార్వతి, బిట్రా రాజేంద్ర ప్రసాద్, గాలి బుచ్చయ్య , ఎం.వి రత్నారెడ్డి, పంగులూరి వెంగళరాయుడు, తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, యాదాల సుజాత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి జనార్దన్ రావు, మద్దిబోయిన దుర్గారావు, మొలమంటి అంకుల్, రాటనాల అంకారావు, తేళ్ల సుబ్బారావు, నెల్లూరి సదాశివరావు, తదితరులు పాల్గొన్నారు.
విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం - యువకుడు మృతి
విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం - యువకుడు మృతి
చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు వివరాల్లోకి వెళితే.. కుమ్మరి కాలనీకి చెందిన రావూరి రామకృష్ణ(27) అనే యువకుడు మరొక స్నేహితుడు డేనియల్(22) తో కలిసి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సంజీవ్ నగర్ లోని స్నేహితుడిని కలిసి కుమ్మరి కాలనీలోని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. పాత విజయ బ్యాంక్ వద్ద జాతీయ రహదారిపైకి వస్తుండగా అదే సమయంలో ఒంగోలు నుండి గుంటూరు వెళుతున్న పాల వ్యాను యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని రోడ్డుకి అవతల వైపుగా వెళ్లి ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న సర్వీసు రోడ్డు ఇనుప గ్రిల్స్ ను ఢీకొని వాహనం ఆగింది. ఈ ఘటనలో రామకృష్ణ తలకు తీవ్ర గాయమై రక్తశ్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు డేనియల్ వెన్నెముక విరగడంతో తీవ్ర గాయాలతో కదలని స్థితిలో ఉన్నాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. తీవ్ర గాయాలైన మరో యువకుడుని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికుల సమాచారం. రామకృష్ణ మృతితో కుమార్ కాలనీలోని స్వగృహం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి.
మద్యం మత్తులో వాహనాలు నడపరాదు.
మరిన్ని వార్తల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.
కడప పార్లమెంటు బరిలో వైయస్ షర్మిల
కడప పార్లమెంటు బరిలో వైయస్ షర్మిల
కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్‌లోనే పెట్టింది.
కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల (YS Sharmila) నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్‌లోనే పెట్టింది. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను ఏపీ కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో పెట్టింది.
రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నారు. అయితే సీనియర్ నేత రఘువీరా రెడ్డి మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. మాజీ ఎంపీ పల్లం రాజును కాంగ్రెస్ అధిష్టానం కాకినాడ నుంచి బరిలోకి దింపనుంది. ఏపీలో 117 అసెంబ్లీ,17 లోక్ సభ స్థానాలపై సీఈసీలో చర్చ జరిగింది. వీటిలో 58 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ పెండింగ్ పెట్టింది. నంద్యాల, తిరుపతి,అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్ సభ స్థానాలను పెండింగ్‌లో ఉంచింది.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటన:-
కడప నుంచి బరిలో YS షర్మిల
రాజమండ్రి నుంచి - గిడుగు రుద్రరాజు
బాపట్ల నుంచి జెడి శీలం
కాకినాడ నుంచి పళ్ళం రాజు
అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్
విశాఖ నుంచి సత్యారెడ్డి
ఏలూరు నుంచి లావణ్య
రాజంపేట నుంచి నజీర్ అహ్మద్
చిత్తూరు బరిలో చిట్టిబాబు
హిందూపురం నుంచి షాహిన్
ఎన్నికల్లో పోటీకి దూరంగా రఘువీరారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్న రఘువీరారెడ్డి
మొత్తం 58 అసెంబ్లీ స్థానాలు పెండింగ్. 8 లోక్సభ స్థానాలు పెండింగ్.
చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు వీరే ...
చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు వీరే ...
చిలకలూరిపేట నేడు నారా లోకి సమక్షంలో వైసిపి నుండి భారీ ఎత్తున ముఖ్య నాయకులు టిడిపిలో చేరారు. ఐదు సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నా కూడా అనేక సమస్యలు ఇబ్బందులకు గురి చేశారని వారు వాపోయారు. టిడిపి చేరిన ముఖ్య నాయకుల వివరాలు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ మాజీ డైరెక్టర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగి అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న మల్లెల రాజేష్‌నాయుడుగారు వైకాపాను వీడి శుక్రవారం తెదేపా తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి వర్యులు, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావుగారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సమక్షంలో మల్లెల రాజేష్‌నాయుడుగారు తెదేపాలో చేరారు. నారా లోకేష్ గారు రాజేష్‌నాయుడుగారికి పార్టీ కండువాకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజేష్‌గారితోపాటు 25 మంది చిలకలూరిపేట నియోజకవర్గ కీలకనేతలు వైకాపాకు రాజీనామా చేసి తెదేపా కండువాలు కప్పుకున్నారు. తెదేపాలో చేరినవారిలో యడ్లపాడు మండల జడ్పీటీసీ సభ్యులు ముక్తా వాసు, చిలకలూరిపేట మునిసిపల్ వైస్ ఛైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, మునిసిపల్ కౌన్సిలర్‌లు తులం సుధాకర్, చెమిటిగంటి పార్వతిదేవి, బిట్రా రాజేంద్రప్రసాద్, షేక్ జమీలా, జాలాది సుబ్బారావు, కౌన్సిలర్, వైసీపీ మైనార్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేరింగ్ మౌలాలి, ఎస్సీసెల్ రాష్ట్ర నాయకులు పంగులూరి వెంగళరాయుడు, వైకాపా సీనియర్ నాయకులు గాలి బుచ్చయ్య, బీసీసెల్ పట్టణ అధ్యక్షుడు, వైసీపీ ముఖ్య నాయకుడు ఎం.వి.రత్నారెడ్డి, మహిళావిభాగం పట్టణ అధ్యక్షురాలు యాదాల సుజాత, బుక్కాపురం సర్పంచ్ అల్లం ఆంజనేయులు, విద్యార్ధి విభాగం నాయకులు నాగూర్, ఇక్భాల్, గౌస్‌లు, సీనియర్ నాయకులు రామిశెట్టి తాండవేశ్వరరావు, తోట సీతయ్య, కోట నాగపూర్ణచంద్రరావు, గుంజి బాజిలతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు TDP లో చేరారు.
క్రింది లింక్ పై క్లిక్ చేయండి మరిన్ని వార్తలు పొందండి
https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY












