మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

ప్రత్తిపాటికి‌ TDP కుటుంబం అండగా ఉంటుంది - అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.

ప్రత్తిపాటికి‌ TDP కుటుంబం అండగా ఉంటుంది -  అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.

ప్రత్తిపాటికి‌ TDP కుటుంబం అండగా ఉంటుంది -  అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.

చిలకలూరిపేట నియోజకర్గం :-  మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి గెలుపు ఖాయమైన నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం ఆయన కుమారుడిని అక్రమంగా అరెస్టుచేసి  వేధింపులకు పాల్పడుతోందన్నారు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి. చిలకలూరిపేట నివాసంలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలిసిన ఆయన వారి కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. ఆయనతో పాటు నరసరావుపేట నియోజకవర్గ తెదేపా నేత నల్లపాటి రాము, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ప్రత్తిపాటి నివాసానికి తరలివచ్చారు.  ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ చిలకలూరిపేటలో ప్రత్తిపాటి గెలుపు ఖాయమని సర్వేల్లో సుస్పష్టంగా తెలిసిందని.. ప్రజల్లో అత్యంత ఆదరణ కలిగిన నాయకుడిగా ప్రత్తిపాటి నిలిచారని అన్నారు. ఇది గమనించి రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక, జీర్ణించుకోలేక ప్రత్తిపాటిని ఏమీ చేయలేక కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకున్నారని గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నీతిమాలిన రాజకీయాలకు ఇది పరాకాష్ట అని అభిప్రాయపడ్డారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఇటువంటి సవాళ్లు ఎన్నో చూశామని.. భయపడేది ప్రసక్తే లేదని తెదేపా నేతలకు తెలిపారు. నేను గానీ నా కుటుంబసభ్యులు గానీ తప్పు చేయలేదు.. తలవంచేది లేదన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కక్షకట్టి చిన్న పిల్లోడిని జైలులో పెట్టారనే బాధ ఉందన్నారు. శరత్ ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు... ఉన్నత విద్యావంతుడు. రాజకీయాలకు దూరంగా తన పని ఏదో తాను చేసుకుంటున్నాడని అని పేర్కొన్నారు. ఎక్కడా తెరపై కనిపించరు.. అత్యంత సౌమ్యుడు... అలా అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడిపై అక్రమ కేసు పెట్టి జైలులో పెట్టారనే బాధ ఉందన్నారు. తన రాజకీయ జీవితం కోసం కుటుంబసభ్యులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ కష్టసమయాన్ని తమ కుటుంబం మొత్తం కలిసి ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. తెదేపా కుటుంబం మొత్తం అండగా ఉంటుందని చంద్రబాబు, లోకేశ్ కూడా భరోసా ఇచ్చారని అన్నారు. ఈ సమయంలో తమకు మద్దతుగా సంఘీభావం తెలుపుతున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రత్తిపాటి.

Share:

ప్రత్తిపాటి కుమారుడుపై 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి - విజయవాడ సబ్ జైలుకు తరలింపు - అరెస్ట్ కు అసలు కారణం ఇదేనా ?

 ప్రత్తిపాటి కుమారుడుపై 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి - విజయవాడ సబ్ జైలుకు తరలింపు - అరెస్ట్ కు అసలు కారణం ఇదేనా ?

ప్రత్తిపాటి కుమారుడుపై 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి - విజయవాడ సబ్ జైలుకు తరలింపు - అరెస్ట్ కు కారణం ఇదేనా ?

పల్నాడు జిల్లా :- చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తనయుడు ప్రత్తిపాటి శరత్ కు జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. శరత్ పై పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేసి అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడంతో, ప్రాసిక్యూషన్ వాదోపవాదాలు విన్న అనంతరం న్యాయమూర్తి 14 రోజులు రిమైండర్ విధించారు. అనంతరం విజయవాడ సబ్ జైలుకు తరలించారు. తెలంగాణలో కూడా ఇదే తరహా కేసుని నమోదు చేసినట్లు, ఒకే రకం కేసు పై రెండు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం విరుద్ధమని, 409 సెక్షన్ వర్తించదు అని ప్రత్తిపాటికి సంబంధించిన బెనర్జీ లక్ష్మీనారాయణ వాదించారు. దీంతో 409 సెక్షన్ ను కేసు నుంచి తొలగించారు.

అసలు జీఎస్టీ ఎగవేత కేసులు ఇంత హడావిడిగా పోలీసులు అరెస్టు చేసి అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడంతో అసలు కారణం జీఎస్టీ ఎగవేత లేదా ఇంకేమైనా ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం వద్ద నుండి వెయ్యని రోడ్డుకు ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పొందినట్లు విచారణలో తేలింది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో పాటు మొత్తం ఏడుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 420, 409, 467,471, 477(A),120 B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లపై కేసు ఫైల్ అయ్యింది. శరత్ తో పాటు మరో ఆరుగురిపై పై కేసు నమోదు అయ్యింది. అలెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పన్ను ఎగవేసారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

Share:

లావు శ్రీకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరికపై - అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన ఎంపీ కార్యాలయం

లావు శ్రీకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరికపై - అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన ఎంపీ కార్యాలయం 

మార్చి 2న తెలుగుదేశం పార్టీలోకి లావు శ్రీ కృష్ణదేవరాయలు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన ఎంపీ కార్యాలయం

పలనాడు జిల్లా :- ఎప్పుడు ఎప్పుడు పార్టీలో చేరుతారా అని నరసరావుపేట పార్లమెంట్ టిడిపి కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు లావు శ్రీకృష్ణ TDP లో చేరిక తేదీ ఖరారు చేశారు. మార్చి 2వ తేదీన గురజాల నియోజకవర్గం, దాచేపల్లిలో జరగబోయే 'రా కదలి రా ' సభలో టిడిపిలోకి చేరుతున్నట్లు లావు శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు.  సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరలా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ, అభివృద్ధిని సాధించుటకే తన ప్రతి అడుగు, ఆలోచన ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో సాధించుకున్న వాటిని పూర్తి చేసుకోవటంతో పాటుగా రానున్న కాలంలో ఇంకొన్ని మన పల్నాడులో అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవాలని, వాటికి కట్టుబడి సదా తోడుగా ఉంటానని మరలా ఆశీర్వదించాలని శ్రీ కృష్ణ దేవరాయలు పల్నాడు ప్రజనీకాన్ని కోరారు.

- లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారి కార్యాలయం

Share:

భగ్గుమన్న చిలకలూరిపేట - సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ

భగ్గుమన్న చిలకలూరిపేట - సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ

భగ్గుమన్న చిలకలూరిపేట - సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ

చిలకలూరిపేట:-  మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు పత్తిపాటి శరత్ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తూ పట్టణంలోని టిడిపి శ్రేణులు సీఎం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీని చేపట్టారు. అనంతరం దిష్టిబొమ్మ తగలబెట్టి నరసరావుపేట సెంటర్లో భారీ మానవహారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ

జగన్మోహన్ రెడ్డి రాజకీయ వికృత చర్యకు పరాకాష్ట ఈ కేసు. ఆ కంపెనీతో ఎటువంటి సంబంధం లేకపోయినా మా అబ్బాయి శరత్ బాబుని అక్రమంగా ఈ కేసులో అరెస్టు చేశారు.

నారా చంద్రబాబు గారు నాకు సీటు కన్ఫర్మేషన్ చేయగానే కొన్ని గంటలలోనే ఈ కేసు రిజిస్టర్ అయింది అంటే అర్థమవుతుంది రాజకీయ ప్రేరేపిత కేసు అని.. కుటుంబ సభ్యుల పైన కేసులు పెట్టి మా మానసిక ధైర్యాన్ని నీవు దెబ్బతీయాలనుకుంటే అది జరగని పని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో.. నీ ఉడత ఊపులకి ఇక్కడ భయపడేది ఎవరూ లేరు. నాలుగు సంవత్సరాల నుంచి మమ్ములను వేధించిన వేధింపులు ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయి నిన్ను ప్రజా క్షేత్రం నుంచి తరిమి వేసే రోజులు దగ్గర పడ్డాయి.. అందుకే ఇటువంటి చేష్టకు నీవు పూనుకుంటున్నావు అంటూ ఆయన ద్వజమెత్తారు.

ప్రత్తిపాటి శరత్ బాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన తెలియజేసిన టిడిపి శ్రేణులు..

పత్తిపాటి నివాసం దగ్గర తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ఆందోళన చేశారు. బైపాస్ పై నిరసన తెలియజేస్తూ డౌన్ డౌన్ సీఎం, నశించాలి నిరంకుశ పాలన డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపీ -  జనసేనలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట - మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడు అరెస్ట్ - కారణం అంతేనా ?

చిలకలూరిపేట - మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడు అరెస్ట్ - కారణం అంతేనా ?

చిలకలూరిపేట - మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడు అరెస్ట్ - కారణం అంతేనా ?

చిలకలూరిపేట మంత్రి పార్టీ తనయుడు ప్రత్తిపాటి శరత్ ను బ్రెస్ట్ చేశారు వివరలోకి వెళితే ... GST పన్ను ఎగవేత కేసులో కృష్ణాజిల్లా విజయవాడ పరిధిలోని మాచవరం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన ఘటన చోటు చేసుకుంది. ఎటువంటి కంపెనీలలో షేర్ హోల్డర్ గా లేని తన తనయుడిని అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేపించారని ప్రత్తిపాటి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. సమాచారాన్ని అందుకున్న టిడిపి శ్రేణులు భారీ ఎత్తున ప్రత్తిపాటి నివాసానికి చేరుకుని అరెస్టుని ఖండిస్తూ ర్యాలీని నిర్వహించారు.

Share:

15 అసెంబ్లీ, 15 పార్లమెంట్ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించిన నవతరం పార్టీ - నారా లోకేష్ పై పోటీ చేయనున్న రావు సుబ్రహ్మణ్యం

15 అసెంబ్లీ, 15 పార్లమెంట్ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించిన నవతరం పార్టీ - నారా లోకేష్ పై పోటీ చేయనున్న రావు సుబ్రహ్మణ్యం

https://chilakaluripetspeednews.blogspot.com/search?updated-max=2021-11-24T23:49:00-05:00&max-results=14&start=28&by-date=false&m=1

చిలకలూరిపేట రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో  అన్యాయంపై పోరాటం చేయడంలో ముందుండే నవతరం పార్టీ 15 మంది అసెంబ్లీ 15 మంది పార్లమెంటు అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది.

నవతరంపార్టీ ఆంధ్రప్రదేశ్ 2024 సాధారణ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా పార్లమెంట్ 15 మరియు అసెంబ్లీ 15 మొత్తం 30 మంది అభ్యర్థులను నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు చిలకలూరిపేటలోని నవతరంపార్టీ కార్యాలయంలో ప్రకటించారు. మంగళగిరి అసెంబ్లీ నుండి నారా లోకేష్ పై జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూరేలా తమ మేనిఫెస్టో ఉన్నదని అధికారంలోకి వచ్చిన వెంటనే తమ మేనిఫెస్టో అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

అసెంబ్లీ నియోజకవర్గాలు అభ్యర్థులు: -

1) మంగళగిరి : శ్రీ రావు సుబ్రహ్మణ్యం

2)చిలకలూరిపేట : శ్రీమతి రావు రామతులసి

3)ప్రత్తిపాడు (sc) : శ్రీ మేరుగ విజయరాజు

4)తిరుపతి : శ్రీ షేక్ నౌషాద్ బాషా

5)పీలేరు : శ్రీమతి భుక్కే లలిత

6)తంబళ్లపల్లె : శ్రీ కొక్కాల శ్రీకాంత్

7)శ్రీకాళహస్తి : శ్రీ గానుగపెంట రమేష్

8)చీరాల : శ్రీ కొమరగిరి దుర్గారావు

9)సంతనూతలపాడు(ఎస్సి):శ్రీచెరుకూరి సుబ్బారావు

10)బాపట్ల : శ్రీ షేక్ కరీం

11)పర్చూరు: గోనుగుంట్ల వెంకట సుబ్బారావు

12)గుంటూరు తూర్పు : శ్రీ షేక్ అబ్దుల్ రజాక్

13)గుంటూరుపశ్చిమ:శ్రీవెల్లాల సాయి సుబ్రహ్మణ్యంరాజు

14)సత్తెనపల్లి:శ్రీ బక్కా వెంకట విఘ్నేశ్వరస్వామి

15)పెనుకొండ : ఎల్.ఆనంద్ కుమార్

*పార్లమెంట్ నియోజకవర్గాలు అభ్యర్థులు:*

1) శ్రీకాకుళం : శ్రీ నాయుడుగారి శేఖర్

2) విజయనగరం : శ్రీ పైడి గోవిందరావు

3)మచిలీపట్నం : శ్రీ కందుల చంద్రమౌళి

4)విజయవాడ :శ్రీ యణమండ్ర కృష్ణకిషోర్ శర్మ  

5)గుంటూరు: శ్రీమతి పోకూరి కవిత

6)నరసరావుపేట : శ్రీ చెల్లి దయారత్నం

7)బాపట్ల (ఎస్సి) : శ్రీ నలమాల తిరుపతిరావు

8)ఒంగోలు : శ్రీ వేమిశెట్టి యశ్వంత్

9)నంద్యాల : శ్రీ ఐ జె వెంకట రమణ

10)కర్నూల్ : శ్రీ తుడుము ఓబులేసు

11)   అనంతపూర్: శ్రీమతి హరిజన చాముండేశ్వరి

12)హిందుపూర్ : శ్రీ అల్లు మాలకొండ్రాయుడు

13)కడప : శ్రీ అల్లు వెంకటేశ్వర్లు

14)నెల్లూరు : శ్రీ తెనాలి రాంప్రసాద్

15)తిరుపతి (ఎస్సి) : శ్రీ Dr.కుక్కంబాకం చంద్రశేఖర్.

15 అసెంబ్లీ, 15 పార్లమెంట్ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించిన నవతరం పార్టీ - నారా లోకేష్ పై పోటీ చేయనున్న రావు సుబ్రహ్మణ్యం

Share:

చిలకలూరిపేట - సైన్స్ డే - విజ్ఞాన ప్రాజెక్టులతో ప్రతిభ చాటుకున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యార్థులు

 చిలకలూరిపేట - సైన్స్ డే - విజ్ఞాన ప్రాజెక్టులతో ప్రతిభ చాటుకున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యార్థులు

చిలకలూరిపేట:-  పట్టణంలోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలో విద్యార్థులు సైన్స్ డే నాడు వివిధ రకాల ప్రాజెక్టులతో వారి ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో కొత్త రకం సైన్స్ ఎక్స్పరిమెంటులను తయారుచేసి ఎక్స్పోగా నిర్వహించారు.

శ్రీచైతన్య పాఠశాల నందు

చిలకలూరిపేట - శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలలో సైన్స్ డే ప్రదర్శనలు - రకరకాల ప్రాజెక్టులతో ప్రతిభ చాటుకున్న విద్యార్థులు  చిలకలూరిపేట:-  పట్టణంలోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలో విద్యార్థులు సైన్స్ డే నాడు వివిధ రకాల ప్రాజెక్టులతో వారి ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో కొత్త రకం సైన్స్ ఎక్స్పరిమెంటులను తయారుచేసి ఎక్స్పోగా నిర్వహించారు.    శ్రీచైతన్య పాఠశాల నందు     శ్రీ చైతన్య పాఠశాల నందు కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా పోతురాజు, కొత్తపల్లి శ్రీనివాసరావు  ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు వారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి ఇటువంటివి ఇంకా ఎన్నో చేయాలనీ చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెడల్స్ నో అందజేశారు. సైన్స్ మనివాళికి ఎంతో ఉపయోగపడుతుందని చూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్  ప్రిన్సిపాల్ సంధ్య, డీన్ వీరాంజనేయులు, కో అల్డినేటర్ శ్రీనివాసరావు, ఏ. బి శ్రీనివాసరావు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యర్థులకు సైన్స్  యొక్క గొప్పతనం గురించి వివరించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టలను చూసి వారిని అభినందించారు.    నారాయణ స్కూల్ నందు  పట్టణంలో ఆర్టీసీ కాలనీ నందుగల నారాయణ స్కూల్ లో సైన్స్ డే ను పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులు తయారుచేసిన సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కాకర్ల శేషగిరి మాట్లాడుతూ సైన్స్ కు జీవితానికి విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు. విద్యార్థులందరూ సైంటిస్టులుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆయన పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సైన్స్ జీవిత ప్రయోగశాలని ప్రకృతి లోని ప్రతి అంశంలో సైన్స్ దాగుందని తెలియజేశారు. డీన్ మెహర్ జ్యోతి మాట్లాడుతూ జీవితానికి వెలుగుని, రంగులను, మార్గాన్ని సైన్స్ దిశా నిర్దేశం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రిన్సిపాల్ కాకర్ల శేషగిరి, వైస్ ప్రిన్సిపాల్ అల్లడి అవినాష్, డీన్ జ్యోతి నమూనాలను తయారు చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

 శ్రీ చైతన్య పాఠశాల నందు కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా పోతురాజు, కొత్తపల్లి శ్రీనివాసరావు

ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు వారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి ఇటువంటివి ఇంకా ఎన్నో చేయాలనీ చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెడల్స్ నో అందజేశారు. సైన్స్ మనివాళికి ఎంతో ఉపయోగపడుతుందని చూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్  ప్రిన్సిపాల్ సంధ్య, డీన్ వీరాంజనేయులు, కో అల్డినేటర్ శ్రీనివాసరావు, ఏ. బి శ్రీనివాసరావు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యర్థులకు సైన్స్  యొక్క గొప్పతనం గురించి వివరించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టలను చూసి వారిని అభినందించారు.

నారాయణ స్కూల్ నందు

చిలకలూరిపేట - శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలలో సైన్స్ డే ప్రదర్శనలు - రకరకాల ప్రాజెక్టులతో ప్రతిభ చాటుకున్న విద్యార్థులు  చిలకలూరిపేట:-  పట్టణంలోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలో విద్యార్థులు సైన్స్ డే నాడు వివిధ రకాల ప్రాజెక్టులతో వారి ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో కొత్త రకం సైన్స్ ఎక్స్పరిమెంటులను తయారుచేసి ఎక్స్పోగా నిర్వహించారు.    శ్రీచైతన్య పాఠశాల నందు     శ్రీ చైతన్య పాఠశాల నందు కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా పోతురాజు, కొత్తపల్లి శ్రీనివాసరావు  ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు వారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి ఇటువంటివి ఇంకా ఎన్నో చేయాలనీ చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెడల్స్ నో అందజేశారు. సైన్స్ మనివాళికి ఎంతో ఉపయోగపడుతుందని చూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్  ప్రిన్సిపాల్ సంధ్య, డీన్ వీరాంజనేయులు, కో అల్డినేటర్ శ్రీనివాసరావు, ఏ. బి శ్రీనివాసరావు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యర్థులకు సైన్స్  యొక్క గొప్పతనం గురించి వివరించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టలను చూసి వారిని అభినందించారు.    నారాయణ స్కూల్ నందు  పట్టణంలో ఆర్టీసీ కాలనీ నందుగల నారాయణ స్కూల్ లో సైన్స్ డే ను పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులు తయారుచేసిన సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కాకర్ల శేషగిరి మాట్లాడుతూ సైన్స్ కు జీవితానికి విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు. విద్యార్థులందరూ సైంటిస్టులుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆయన పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సైన్స్ జీవిత ప్రయోగశాలని ప్రకృతి లోని ప్రతి అంశంలో సైన్స్ దాగుందని తెలియజేశారు. డీన్ మెహర్ జ్యోతి మాట్లాడుతూ జీవితానికి వెలుగుని, రంగులను, మార్గాన్ని సైన్స్ దిశా నిర్దేశం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రిన్సిపాల్ కాకర్ల శేషగిరి, వైస్ ప్రిన్సిపాల్ అల్లడి అవినాష్, డీన్ జ్యోతి నమూనాలను తయారు చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

పట్టణంలో ఆర్టీసీ కాలనీ నందుగల నారాయణ స్కూల్ లో సైన్స్ డే ను పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులు తయారుచేసిన సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కాకర్ల శేషగిరి మాట్లాడుతూ సైన్స్ కు జీవితానికి విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు. విద్యార్థులందరూ సైంటిస్టులుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆయన పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సైన్స్ జీవిత ప్రయోగశాలని ప్రకృతి లోని ప్రతి అంశంలో సైన్స్ దాగుందని తెలియజేశారు. డీన్ మెహర్ జ్యోతి మాట్లాడుతూ జీవితానికి వెలుగుని, రంగులను, మార్గాన్ని సైన్స్ దిశా నిర్దేశం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రిన్సిపాల్ కాకర్ల శేషగిరి, వైస్ ప్రిన్సిపాల్ అల్లడి అవినాష్, డీన్ జ్యోతి నమూనాలను తయారు చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి