|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేటలో ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం -
చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం -
అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ 2018లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆయా చట్టల అమలు విషయంలో మీనమేషాలు లెక్కించడం వలన ఆనాటి నుంచి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్ గారి సూచన మేరకు భారతీయ జనతా యువమోర్చా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ధర్నాలు సంతకాల సేకరణలు వంటి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. ఫలితంగా ఇప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన రెడ్డి గారు ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం ఆదేశాలు ఇచ్చారు. ఇది భారతీయ జనతా యువమోర్చా విజయంగా భావిస్తూనే ఇప్పటికైనా అగ్రవర్ణ పేదలకు ఆశాజ్యోతిగా మారిన ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ బిల్లును ఆమోదించినందుకు ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా యువమోర్చా నరసరావుపేట పార్లమెంటు శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రతుకు భారంగా భావిస్తున్న అగ్రవర్ణ పేదలకు భరోసానిస్తూ ఈ డబ్ల్యూ ఎస్ చట్టం చేసి వారి జీవితాల్లో ఆనందం నింపిన మన ప్రధానమంత్రి గారికి ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అగ్రవర్ణ పేదల తరఫున ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ , పట్టణ అధ్యక్షులు నందిగామ రాజు, సోషల్ మీడియా ఇంచార్జ్ వంకాయలపాటి వంశీధర్,ఎడ్లపాడు మండల ప్రధాన కార్యదర్శి వంకాయలపాటి సాయి, ఏబీవీపీ రాష్ట్ర సభ్యులు మురారి, ఏబీవీపీ పట్టణ నాయకులు లీలా కృష్ణ పలువురు పాల్గొన్నారు
చిలకలూరిపేట నియోజకవర్గంలో 15-07-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో 15-07-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజవర్గంలో 15-07-2021 గురువారం నాడు మొత్తం 12 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 5 కేసులు నమోదు అయ్యాయి.
డైక్ మెన్ కాలనీ లో - 3
రజక కాలనీ లో - 1
సుభాని నగర్ లో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి.
గోవిందపురం గ్రామంలో - 3
పసుమర్రు గ్రామంలో - 1
గొట్టిపాడు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండలంలో 2 కేసులు నమోదు అయ్యాయి.
తిమ్మాపురం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట నియోజకవర్గంలో 14-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో 14-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో 14-07-2021 బుధవారం నాడు మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి.
పురుషోత్తమపట్నం లో - 1
మారెళ్లవారివీధి లో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 10 కేసులు నమోదు అయ్యాయి.
వేలూరు గ్రామంలో - 1
గోవిందపురం గ్రామంలో - 8
బొప్పూడి గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండలంలో 1 కేసు నమోదు అయ్యింది.
యడ్లపాడు గ్రామంలో - 1
నాదెండ్ల మండల గ్రామంలో 4 కేసులు నమోదు అయ్యాయి.
గణపవరం గ్రామంలో - 2
నాదెండ్ల గ్రామంలో - 1
కనపర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేటలో రేపు 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి
చిలకలూరిపేటలో రేపు 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి
చిలకలూరిపేట పట్టణంలో రేపు నియోజకవర్గంలోని మూడు మండలాలలోని గ్రామ & పట్టణంలోని 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి జరుగుతుంది.రైతు బజారు వేదికగా MLA రజిని చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే మందుకు సంబంధించిన ప్యాకింగ్ ప్రక్రియ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో VR ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెడీ చేస్తున్నారు.మందుని పొందటానికి సంబందించిన టోకెన్లు ఇప్పటికే వార్డు కౌన్సిలర్లకు అందించారు.
ఆనందయ్య మందు డబ్బాలలో పంపినీ చేస్తున్నారు. ఒక డబ్బా ఆరుగురు వాడవచ్చు. నిల్వ ఉంచటానికి ఫ్రిడ్జ్ లో పెట్టరాదు.ఈ మందు వాడే రోజున ధూమపానం,మద్యం,మాంసాహారం తీసుకోవద్దు.మందు తీసుకున్న కానీ వ్యాక్సిన్ తెప్పనిసరి.గర్భిణీ స్త్రీలు వాడరాదు.ఇతర ఆయుర్వేదం,అల్లోపతి వాడే వారు కూడా ఈ మందు వాడవచ్చు. కచ్చితంగా మందు తీసుకున్న రోజు 5&6 లీటర్ల మంచినీరు త్రాగాలి.కరోనా వచ్చి తగ్గిన వారు కూడా ఈ మందు తీసుకోవచ్చు. చింతపండు గింజ అంత ఉంటుంది ఈ మందు ఉదయం,సాయత్రం భోజనానికి ముందు ఈ మందుని తీసుకోవాలి ఒక్కరోజు మాత్రమే.
చిలకలూరిపేట - బీజేపీ యువ మోర్చ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
చిలకలూరిపేట - బీజేపీ యువ మోర్చ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
ఆర్టికల్ 370 కి వ్యతిరేకంగా ఒక దేశంలో రెండు జండాలు,రెండు రాజ్యాంగాలు ఉండకూడదు అని ఆమరణ నిరాహారదీక్ష చేసి సంఘ విద్రోహుల చేతులో హత్య కాబడిన జనసంఘ్ పార్టీ సృష్టికర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి పుట్టిన రోజు వేడుకలు మన నరసరావుపేట పార్లమెంట్ యువమోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు ఆయన చేసిన ప్రాణ త్యాగం చేసినందుకు ఈనాడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆర్టికల్ 370 రద్దు చెయ్యటం వలన ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరుతుంది అని. ఏ నినాదంతో ఆయన మరణించారా నరేంద్రమోడీ ముఖర్జీ గారు కన్నా కళలన్ని నిజం చేసారు అని తెలిపారు. ఈ కార్యక్రమం భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిలకలూరిపేట జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ అచ్చుకోల బ్రహ్మస్వాములు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా నాయకులు ఎనుగంటి నరేష్,మాదాల మణి, తేజ,రవికుమార్ పలువురు నాయకులు పాల్గొన్నారు
పట్టణ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోలేదు - 30 కోట్ల కోసం గాంధీపార్కు,కంప్లెక్సులు తాకట్టు పెట్టె చర్య మానుకోవాలి - టీడీపీ
పట్టణ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోలేదు - 30 కోట్ల కోసం గాంధీపార్కు,కంప్లెక్సులు తాకట్టు పెట్టె చర్య మానుకోవాలి - టీడీపీ
చిలకలూరిపేట పట్టణ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు అభివృద్ధి కోసం
మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టె పరిస్థితి ఇంత వరకు ఎప్పుడు రాలేదు. మొత్తానికి మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టారు అని ఒప్పుకున్నారు.MLA గెలిచినప్పుడు సీఎం గారితో మాట్లాడి పట్టణ మునిసిపాలిటికి 50 కోట్ల రూపాయలు గ్రాండ్ ఇప్పిస్తూన్నాము అని తెలిపారు. అప్పుడు రాజకీయాలు పక్కనబెట్టి మేము ఆమెని అభినందించాము. కానీ ఈ రోజు ఆ గ్రాంట్ రావాలి అంటే మునిసిపల్ ఆస్తులను తాకట్టు పెట్టాలి అని చెప్తున్నారు.ఇది ముమ్మాటికి ప్రజలను మోసం చెయ్యటమే అవుతుంది అని పట్టణ టీడీపీ ఆఫీస్ నందు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రెస్సుమీట్లో తెలిపారు.
ప్రత్తిపాటి పుల్లారావు గారు పట్టణంలో మంచి నీటి సమస్య పరిష్కారానికి అమృత్ పధకం తీసుకు వచ్చి అంతర్గత పైపు లైనులు 41 కిలోమీటర్లకు గాను 11 కిలోమీటర్లు పూర్తి చేస్తే మీరు అధికారంలోకి వచ్చాక 1 కిలోమీటరు పని కూడా చెయ్యలేదు. 6 వ వార్డులో 2014 నుండి 2019 వరకు జరిగిన అభివృద్ధి మీకు తెలియదా రఫాని గారు అని తెలిపారు.పట్టణంలో ఎంత అభివృద్ధి చేసిన ఒక్క మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టలేదు అని తెలిపారు.మీరు మున్సిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టె చర్యలు మానుకోవాలి అని తెలిపారు.
చిలకలూరిపేట పట్టణ,మండల & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 06-07-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.
చిలకలూరిపేట పట్టణ,మండల & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 06-07-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.
చిలకలూరిపేట పట్టణ,మండల & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 06-07-2021,మంగళవారం నాడు 21 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో ఈ రోజు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు.
యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి.
చింఘిజ్ ఖాన్ పేట గ్రామంలో - 1
లింగారావుపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి.
కావూరు గ్రామంలో - 1
మురికిపూడి గ్రామంలో - 1
వేలూరు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.
నాదెండ్ల మండల గ్రామాలలో 15 కేసులు నమోదు అయ్యాయి.
సంక్రాంతిపాడు గ్రామంలో - 2
ఇర్లపాడు గ్రామంలో - 2
గణపవరం గ్రామంలో -7
కనపర్రు గ్రామంలో - 2
గిరిజవోలు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.











