మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేటలో రేపు 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి

చిలకలూరిపేటలో రేపు 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో రేపు నియోజకవర్గంలోని మూడు మండలాలలోని గ్రామ & పట్టణంలోని 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి జరుగుతుంది.రైతు బజారు వేదికగా MLA రజిని చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే మందుకు సంబంధించిన ప్యాకింగ్ ప్రక్రియ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో VR ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెడీ చేస్తున్నారు.మందుని పొందటానికి సంబందించిన టోకెన్లు ఇప్పటికే వార్డు కౌన్సిలర్లకు అందించారు. 
 
ఆనందయ్య మందు డబ్బాలలో పంపినీ చేస్తున్నారు. ఒక డబ్బా ఆరుగురు వాడవచ్చు. నిల్వ ఉంచటానికి ఫ్రిడ్జ్ లో పెట్టరాదు.ఈ మందు వాడే రోజున ధూమపానం,మద్యం,మాంసాహారం తీసుకోవద్దు.మందు తీసుకున్న కానీ వ్యాక్సిన్ తెప్పనిసరి.గర్భిణీ స్త్రీలు వాడరాదు.ఇతర ఆయుర్వేదం,అల్లోపతి వాడే వారు కూడా ఈ మందు వాడవచ్చు. కచ్చితంగా మందు తీసుకున్న రోజు 5&6 లీటర్ల మంచినీరు త్రాగాలి.కరోనా వచ్చి తగ్గిన వారు కూడా ఈ మందు తీసుకోవచ్చు. చింతపండు గింజ అంత ఉంటుంది ఈ మందు ఉదయం,సాయత్రం భోజనానికి ముందు ఈ మందుని తీసుకోవాలి ఒక్కరోజు మాత్రమే. 




























Share:

చిలకలూరిపేట - బీజేపీ యువ మోర్చ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

చిలకలూరిపేట - బీజేపీ యువ మోర్చ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఆర్టికల్ 370 కి వ్యతిరేకంగా ఒక దేశంలో రెండు జండాలు,రెండు రాజ్యాంగాలు ఉండకూడదు అని ఆమరణ నిరాహారదీక్ష చేసి సంఘ విద్రోహుల చేతులో హత్య కాబడిన జనసంఘ్ పార్టీ సృష్టికర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి పుట్టిన రోజు వేడుకలు మన నరసరావుపేట పార్లమెంట్ యువమోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు ఆయన చేసిన ప్రాణ త్యాగం చేసినందుకు ఈనాడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆర్టికల్ 370 రద్దు చెయ్యటం వలన ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరుతుంది అని. ఏ నినాదంతో ఆయన మరణించారా నరేంద్రమోడీ ముఖర్జీ గారు కన్నా కళలన్ని నిజం చేసారు అని తెలిపారు. ఈ కార్యక్రమం భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిలకలూరిపేట జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ అచ్చుకోల బ్రహ్మస్వాములు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా నాయకులు ఎనుగంటి నరేష్,మాదాల మణి, తేజ,రవికుమార్ పలువురు నాయకులు పాల్గొన్నారు

























Share:

పట్టణ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోలేదు - 30 కోట్ల కోసం గాంధీపార్కు,కంప్లెక్సులు తాకట్టు పెట్టె చర్య మానుకోవాలి - టీడీపీ

పట్టణ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోలేదు - 30 కోట్ల కోసం గాంధీపార్కు,కంప్లెక్సులు తాకట్టు పెట్టె చర్య మానుకోవాలి - టీడీపీ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు అభివృద్ధి కోసం 
మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టె పరిస్థితి ఇంత వరకు ఎప్పుడు రాలేదు. మొత్తానికి మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టారు అని ఒప్పుకున్నారు.MLA గెలిచినప్పుడు సీఎం గారితో మాట్లాడి పట్టణ మునిసిపాలిటికి 50 కోట్ల రూపాయలు గ్రాండ్ ఇప్పిస్తూన్నాము అని తెలిపారు. అప్పుడు రాజకీయాలు పక్కనబెట్టి మేము ఆమెని అభినందించాము. కానీ ఈ రోజు ఆ గ్రాంట్ రావాలి అంటే మునిసిపల్ ఆస్తులను తాకట్టు పెట్టాలి అని చెప్తున్నారు.ఇది ముమ్మాటికి ప్రజలను మోసం చెయ్యటమే అవుతుంది అని పట్టణ టీడీపీ ఆఫీస్ నందు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రెస్సుమీట్లో తెలిపారు. 

ప్రత్తిపాటి పుల్లారావు గారు పట్టణంలో మంచి నీటి సమస్య పరిష్కారానికి అమృత్ పధకం తీసుకు వచ్చి అంతర్గత పైపు లైనులు 41 కిలోమీటర్లకు గాను 11 కిలోమీటర్లు పూర్తి చేస్తే మీరు అధికారంలోకి వచ్చాక 1 కిలోమీటరు పని కూడా చెయ్యలేదు. 6 వ వార్డులో 2014 నుండి 2019 వరకు జరిగిన అభివృద్ధి మీకు తెలియదా రఫాని గారు అని తెలిపారు.పట్టణంలో ఎంత అభివృద్ధి చేసిన ఒక్క మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టలేదు అని తెలిపారు.మీరు మున్సిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టె చర్యలు మానుకోవాలి అని తెలిపారు. 
































Share:

చిలకలూరిపేట పట్టణ,మండల & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 06-07-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

చిలకలూరిపేట పట్టణ,మండల & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 06-07-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ,మండల & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 06-07-2021,మంగళవారం నాడు 21 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో ఈ రోజు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు. 

యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

చింఘిజ్ ఖాన్ పేట గ్రామంలో - 1

లింగారావుపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి. 

కావూరు గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 15 కేసులు నమోదు అయ్యాయి. 

సంక్రాంతిపాడు గ్రామంలో - 2

ఇర్లపాడు గ్రామంలో - 2

గణపవరం గ్రామంలో -7 

కనపర్రు గ్రామంలో - 2

గిరిజవోలు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 



































Share:

చిలకలూరిపేట - వర్షన్ని కూడా లెక్క చెయ్యకుండా షాపులు మూయిస్తున్న మునిసిపల్ అధికారులు - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ మాకు సహకరించండి.

చిలకలూరిపేట - వర్షన్ని కూడా లెక్క చెయ్యకుండా షాపులు మూయిస్తున్న మునిసిపల్ అధికారులు - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ మాకు సహకరించండి. 

https://chilakaluripetspeednews.blogspot.com/



 

చిలకలూరిపేట పట్టణంలోని మునిసిపల్ అధికారులు మంగళవారం నాడు కర్ఫ్యూ అమలులో భాగంగా వర్షాన్ని కూడా లెక్క చెయ్యకుండా షాపులను మూయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ పట్టణంలోని దుకాణాలు అన్ని మధ్యాహ్నం 2 గంటలకల్లా మూసివేసి మాకు సహకరించండి అని కోరారు. అన్ని ప్రాంతాల వాళ్ళు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ మన పట్టణంలో మాత్రం కరోనా కర్ఫ్యూ పాటిస్తున్నాము.అందరూ కలసి కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ ఉంటే తీవ్రత తగ్గించగలిగితే ఎవరి వ్యాపారాలు వారు కొనసాగించుకోవచ్చు అని వారు తెలిపారు. 





























 
Share:

చిలకలూరిపేట RTC బస్సు వేళలలో మార్పులు - మధ్యాహ్నం 2 వరకు మాత్రమే బస్సులు తిరుగుతాయి.

చిలకలూరిపేట RTC బస్సు వేళలలో మార్పులు - మధ్యాహ్నం 2 వరకు మాత్రమే బస్సులు తిరుగుతాయి. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట RTC బస్సు వేళలలో మార్పులు చేస్తున్నట్లు డిపో మేనేజర్ ఎన్.సుజాత తెలిపారు. చిలకలూరిపేట నుండి మాచర్ల,చీరాల,గుంటూరు విజయవాడ, నరసరావుపేట,ఒంగోలు వేళ్ళ మార్గాలలో మధ్యాహ్నం 2 గంటల వరకే బస్సులు తిరుగుతాయి అని ఆమె తెలిపారు. ప్రయాణికులు గమనించి డిపో వారికీ సహారించాలి అని ఆమె కోరారు.అధికారుల నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బస్సు వేళలు ఇలాగే కొనసాగుతాయి అని ఆమె తెలిపారు.  


























Share:

చిలకలూరిపేట పట్టణంలో కఠినంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ - 2గంటలకల్లా మార్కెట్,పట్టణ నలుమూలలా వ్యాపారాలు బంద్

చిలకలూరిపేట పట్టణంలో కఠినంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ - 2గంటలకల్లా మార్కెట్,పట్టణ నలుమూలలా వ్యాపారాలు బంద్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న వేళా మన చిలకలూరిపేట నియోజకవర్గంలో మాత్రం కరోనా కేసులు విపరీతంగా పెరిగితున్నాయి. ఇన్సిడెంట్ కమాండర్ మల్లిఖార్జునరావు ఆదేశాల మేరకు పట్టణంలో కర్ఫ్యూ సమయాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసారు.ఉదయం 6 గంటల నుండి మధ్యాహనం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరచి ఉంటాయి అని తెలిపారు.అలాగే మంగళవారం నాడు కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్నారు.పట్టణంలోని టౌన్ పోలీసు వారు పలు సెంటర్లలో షాపులను 2 గంటలకల్లా మూపించారు.ప్రజలందరూ కరోనా నియమాలు పాటిస్తూ కరోనా తీవ్రత తగ్గించాలి అని తెలిపారు 

































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి