|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట - కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో ప్రభుత్వంలో వైయ్సర్ ఎవరో తెలీదు అని వారి పేర్లు మారిస్తే, యూజర్ చార్జీల పన్ను మోత ఆమోదం నిలిపివేయాలి - టీడీపీ వార్డు కౌన్సిలర్లు
చిలకలూరిపేట - కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో ప్రభుత్వంలో వైయ్సర్ ఎవరో తెలీదు అని వారి పేర్లు మారిస్తే, యూజర్ చార్జీల పన్ను మోత ఆమోదం నిలిపివేయాలి - టీడీపీ వార్డు కౌన్సిలర్లు
చిలకలూరిపేట టీడీపీ పార్టీ ఆఫీస్ నందు ఎర్పాటు చేసిన సమావేశంలో వార్డు కౌన్సిలర్లు మునిసిపల్ హాళ్లు నందు ఏక పక్షంగా నిర్ణయం తీసుంటునట్లు తెలిపారు. చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పు విషయంలో వైస్సార్సీపీ కౌన్సిలర్లు తమకు కల్లూరి చంద్రశేఖర్ ఎవరో తెలీదు అనటం విడ్డురంగా ఉంది అన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైయస్సార్ ఎవరో తమకి తెలియదు అని వారి పేర్లు మార్పు చేస్తే ఏమి చేస్తారు. మన పాత ప్రజా ప్రతినిధులను గౌరవించుకోవటం మన సంస్కారం, వాటి పేర్లు ఉనంతకాలం వారి ఎప్పటికి అందరి మనసులలో నిలిచివుంటారు. అందుకు గుర్తిగా,వారి పైన గౌరవం తో వారికీ ఆయా పేర్లు పెట్టుకుంటారు అని తెలిపారు. చిలకలూరిపేటలో నిర్మించే కొత్త భవనాలకు వైయస్సార్ పేరు పెట్టుకోండి మేము అలంటి వాటికీ ఆక్షేపణ పెట్టాము అని తెలియజేసారు. ఎప్పుడు అయితే మార్కెట్ పేరు మారుస్తున్నారు అని పుర ప్రజలకి తెలిసిందో అప్పటి నుండి మీ పైన విమర్శలు మొదలయ్యాయి అని. వాటిని సమీక్షించుకోవాలి అని తెలిపారు. ఎప్పటికి అయిన పేరు మార్పుకు పునః సమీక్షించుకోవాలి అని తెలిపారు
అలాగే చెత్త సేకరణ పురపాలక సంఘాల బాధ్యత, పట్టణంలో ప్రజలు యూజర్ చార్జీల పన్నుపైన తీవ్ర వెతిరేకతగా ఉన్నారు అని. ఫండ్ పుటించటం చేతకాక ఇలా ప్రజల పైన పన్ను భారం వేస్తున్నరు అని తెలిపారు.
కరోనా వలన చనిపోయిన వారికీ ఉచిత వెహికల్ ఫోన్ నెంబర్ బోర్డులను ఆసుపత్రి ప్రాంగణంలో ఎర్పాటు చెయ్యాలి అని తెలిపారు.
మంచినీటి చెరువు వద్ద ఉన్న సుజల వాటర్ ప్లాంట్ పునః ప్రారంభించి మినరల్ వాటర్ కొనే అవసరం లేకుండా చెయ్యాలి అని తెలిపారు
ఈ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు గంగా శ్రీనివాసరావు, పాములపాటి శివ కుమారి, జంగా సుజాత, కంచర్ల కరుణ, కనమర్లపూడి లక్ష్మి తిరుమల, రాయని హరిత, కొత్త కుమారి, కునాల ప్రమీల పాల్గొన్నారు
చిలకలూరిపేటలో రోజుకి 300 నుండి 350 నో మాస్క్ కేసులు నమోదు అవుతున్నాయి - పట్టణ పోలీస్
చిలకలూరిపేటలో రోజుకి 300 నుండి 350 నో మాస్క్ కేసులు నమోదు అవుతున్నాయి - పట్టణ పోలీస్
చిలకలూరిపేట పట్టణంలో టౌన్ పోలీసువారి ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన సెంటలలో నో మాస్క్ మరియు లాక్ డౌన్ సమయాలలో అనవసరంగా బయట తరుగుతున్న వారి పైన ప్రతి రోజు సుమారు 300 నుండి 350 కేసులు నమోదు చేస్తున్నట్లు టౌన్ పోలీస్ వారు తెలిపారు.
అనవసరంగా సాకులు చెపుతూ రోడ్లపైన తిరిగే వాళ్ళ పైన కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కర్ఫ్యూ సమయం కంటే ముందు గానే హాస్పిటల్,మెడికల్ కి సంబందించిన పనులను పూర్తి చేసుకోవాలి అని తెలిపారు. మరి కొన్ని రోజులు ఈ లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా ఫాలో అయితే కరోనా నుండి కొంచం ఉపశమన పొందవచు అని తెలిపారు.
ఏపీ లో సెంచరి కొట్టిన పెట్రోల్ ధర
ఏపీ లో సెంచరి కొట్టిన పెట్రోల్ ధర
గత కొన్ని రోజుల క్రితం దేశంలో ఎన్నికలు ముగిసిన తరువాత నుండి పెట్రోల్ రేట్ మోత మోగించటం మళ్లీ మొదలైంది. ప్రస్తుత సమాజంలో మోటార్ వెహికల్ ఉండటం సాదాసీదాగా అయిపోయింది. అయితే దిగువ మధ్య తరగతి కుటుంబాలు కూడా మినిమం టూ వీలర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ పెట్రోల్ భారం సామాన్యు ప్రజలు మోయలేనిదే అని చెప్పొచ్చు. వారి సంపాదనలో 20% &30% పెట్రోల్ ఖర్చు చేస్తే వారి జీవితం ఎలా సాగుతుందో అర్ధంకావటం లేదు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పెంచటం వలన వచ్చే డబ్బులతో కరోనా ప్యాకేజీలు, టీకాలు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. అటు టీకాలు సమయానికి దొరక్క , పెట్రోల్ బాదుడు సామాన్య ప్రజలకు సర్కారు పైన విశ్వాసం తగ్గుతుంది అని చెప్పుతున్నారు ప్రతిపక్షాలు.
ఈ రోజు విజయవాడ పెట్రోల్ రేట్ :- 100.48 , డీజిల్ :- 94.76
డీజిల్ రేట్లు పెరిగితే రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోతున్నాయి.
ఈ పెట్రోల్ ,డీజిల్ రేట్లు పెరుగుదలతో సామాన్యు ప్రజలు చుక్కలు చూస్తున్నారు.
చిలకలూరిపేట - ఆర్ధికంగా చితికిపోయి ఉన్నాము - వ్యాపారాలు లేక కమిషన్ షాపులకి డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలి అని అనిపిస్తుంది
చిలకలూరిపేట - ఆర్ధికంగా చితికిపోయి ఉన్నాము - వ్యాపారాలు లేక కమిషన్ షాపులకి డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలి అని అనిపిస్తుంది
చిలకలూరిపేట - ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ , జిల్లాలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో , సౌత్ ఇండియా లోని ప్రధాన కూరగాయల ఇంపోర్ట్స్ లో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన చంద్రమౌళి కూరగాయల మార్కెట్ ఈ రోజు చాల గడ్డు పరిస్థితిని ఎదురుకుంటుంది.మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో పండే ఎటువంటి కూరగాయల పంటలను సైతం హోల్ సేల్ & రిటైల్ సప్లై చేసిన ఘనత చిలకలూరిపేట మార్కెట్ ఉన్నదన్న విషయం ఇప్పుడు ఉన్నకొత్త వ్యాపారులకు, ప్రజా పతినిధులకు తెలియకపోవచ్చు. పాత రోజులలో పక్క రాష్ట్రాలలో ఉండే రైతులు సైతం ఇక్కడి వారితో స్నేహపూర్వక సంబంధాలు ఉండేవారు.విపత్తు వచ్చిన సమయాలలో మార్కెట్ తరుపున వారి స్థోమత తగట్టుగా ఆర్ధిక సాయం,కూరగాయల పంపిణి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికి మన రాష్ట్రము లోని ప్రముఖ పుణ్యక్షేతాలకు పండుగ రోజులలో ఉచితంగా కూరగాయల పంపిణి చేస్తూ ఉంటారు. ఆలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉంటాయి. ఇక్కడ ఉన్న వర్తకసంఘం వారు ఐకమత్యంతో ఉంటూ తమ తమ వ్యాపారాలలో బిజీ గా ఉండేవారు. కమిషన్ షాపు వారు అయితే నైట్ 1 గంటల నుండి వ్యాపారాలకు అన్ని ఎర్పాట్లు చేసుకుంటూ సమయానికి నిద్ర,ఆహారాలు లేకుండా ఎప్పుడు పట్టణానికి కూరగాయల సప్లై అందించేవారు.
కానీ ఇప్పుడు పరిస్థితి చాల దారుణంగా తయారు అయినది. చుట్టుపక్కల వ్యాపారాలు పెరిగిపోవటంతో మార్కెట్లో వ్యాపారాలు లేక కనీసం ఇంట్లో ఖర్చులకు తీసుకువెళ్లే పరిస్థితి కూడా లేనంత దారుణమైన తాయారు అయినది. ముఖ్యంగా కరోనా కష్ట కాలంలో వ్యాపారాలు లేక కమిషన్ షాపులకు లక్షలలో అప్పులలో కురుకుపోయి ఉన్నారు. కరోనా కారణంగా మార్కెట్ షాపులను చిన్న మార్కెట్ యార్డ్ లోనికి మార్చారు. అయితే అసలే ఎండా కాలం కూరగాయల పైనా ఎప్పుడు తేమ లేకపోతే కుళ్లిపోయి పాడైపోతాయి. వేడిగాలులు తో కూరగాయలు వడపడిపోయి వ్యాపారులు చాల నష్టపోతున్నారు.
అక్కడి వారితో మాట్లాడిన మా బృందానికి వారి మాటలు విని చాల బాధ అనిపించింది.
కరోనా అని చెప్పి మమ్మల్ని మార్కెట్ యార్డుకి (ఇక్కడికి) పంపించారు. 100 షాపులలో గత లాక్ డౌన్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాపారాలు షాపులు పెట్టుకోవటానికి ధైర్యం సరిపోక 40 షాపులు ముందుకు వచ్చాయి. అయితే వడగాలులకు కూరగాయలు కుళ్లిపోవటంతో వ్యాపారాలు లేక నష్టాలలో కమిషన్ షాపులకు లక్షలలో నష్టాలు పడి షాపులు తీసేసారు. ఇప్పటికి 10 షాపులు రన్నింగ్ లో ఉన్నాయి. మిగిలిన వారు వ్యాపారాలు మానేసి ఇంట్లోనే ఉంటున్నారు. రెక్కాడితే డొక్కాడని మా బ్రతుకులకు 2 నెలలుగా ఇంట్లో కనీసం సరుకులు తెచుకోవటనికి డబ్బులు లేక ఇంట్లో వాళ్ళని పిల్లల్ని , పెద్ద వారిని, చూసుకోలేక అటు కమిషన్ వ్యాపారులకు డబ్బులు కట్టలేక ఆత్మ హత్య చేసుకుందాం అని చాల సార్లు ఆలోచించా అన్నారు. ఆ మాటలకూ మా రిపోర్టర్ షాక్ గురి అయ్యారు. నిజంగానే ఆ వ్యాపారాలు పడే బాధ వారికీ మాత్రమే తెలుస్తుంది. కూరగాయల వ్యాపారం తప్ప ఇంకేం చెయ్యలేని మేము కొత్త వ్యాపారాలలో ఇమడలేము అని తెలిపారు.
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1000 మందికి పైగా ఈ మార్కెట్ పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎటువంటి విపత్తు వచ్చిన ముందుగా మార్కెట్ పైన పడి, మార్కెట్ ఖాళీ చేపించి, వ్యాపారాల స్థావరాన్ని మారుస్తున్నారు. వ్యాపారాలు లేక మేము మా కుటుంబాలు పడుతున్న బాధలు ఎవరికీ రాకూడదు అని అనుకుంటున్నాం. మార్కెట్ చుట్టుపక్కలో ఉన్న చిల్లర కోట్ల దుకాణాల్లో రోజు చూస్తున్నాం కరోనా రూల్స్ పాటించకుండా గుంపులు గుంపులుగా ఎలా ఉంటున్నారో. అయితే మార్కెట్ లో షాప్ మార్చి షాప్ ( బేసి, సరి సంఖ్యల విధానంతో ) కోవిద్ రూల్స్ పాటిస్తూ వ్యాపారాలు సాగిస్తాం అని చెప్తున్నా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోని పరిస్థితిలో మేము ఇలా ఉన్నాము అని వాపోయారు.
ఏ ప్రాంత అభివృద్ధి లో అయిన వ్యాపారులే ముఖ్య పాత్ర పోషిస్తారు. అంతే కానీ వాళ్ళని బాధ పెట్టాలి అని చూస్తే మాత్రం ప్రాంతానికి చాల నష్టం కలుగుతుంది.
ఇది చిలకలూరిపేట కూరగాయల మార్కెట్ కధనం - CHILAKALURIPET SPEED NEWS
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు 31-05-2021 సోమవారం
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు 31-05-2021 సోమవారం
గత కొన్ని రోజులతో పోల్చుకుంటే ఈ రోజు 31/05/2021 సోమవారం నాడు కరోనా కేసులు భారీగా తగ్గాయి. ప్రతి రోజు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతూ ఉండేవి అలాంటిది ఈ రోజు చాలా తక్కువ గా 7943 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే 98 మంది చనిపోయినట్టు తెలిపారు. ఈ రోజుతో రాష్ట్రంలో కరోనా కేసులు 16,93,085 లకు చేరింది. ఆక్టివ్ కేసులు 1,53,795గా ఉంది.
చిలకలూరిపేట - కరోనా తీవ్రతని లెక్కచెయ్యకుండా పోదు పొద్దునే ఆధార్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్న పట్టణ ప్రజలు
చిలకలూరిపేట - కరోనా తీవ్రతని లెక్కచెయ్యకుండా పోదు పొద్దునే ఆధార్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్న పట్టణ ప్రజలు
అసలే కరోనా లాక్ డౌన్తో ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైనది. ప్రభుత్వం ఇచ్చే పధకాలకు ఆధార కార్డులోని మార్పులు,మొబైల్ నెంబర్ లింక్ వంటి మార్పులకు మధ్యతరగతి ప్రజలు ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
అయితే పొద్దున్న 6గంటల నుండి ఆధార్ కేంద్రాల వద్ద జనం క్యూ లైన్ లో నిల్చుంటున్నారు. లాక్ డౌన్ వలన 12 గంటల వరకు అనుమతి, మధ్యాహ్నం అదిరిపోయే ఎండలు వలన ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అయితే అధికారులు ఆధార్ కేంధ్రాల పెంపు చేపడితే మాత్రం కొంతవరకు ఈ హడావిడి తగ్గించవచ్చు.
అయినా మధ్యతరగతి బాధలు ఎవరికీ పట్టవు 3 రోజుల నుండి చూస్తున్నాను ఇంత వరకు మొబైల్ నెంబర్ లింక్ చేపించుకోలేకపోయాయని అని ఒకతని తెలిపారు. కరోనా ని కూడా లెక్కచెయ్యకుండా క్యూ లైన్లో సోషల్ డిస్టెన్స్ లేకుండా నుంచుంటున్నారు.
ఆనందయ్య కరోనా ముందుకున ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ - కరోనా బాధితులు కాకుండా వాళ్ళ కుటుంబసభ్యులు, బంధువులకు అనుమతి
ఆనందయ్య కరోనా ముందుకున ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ - కరోనా బాధితులు కాకుండా వాళ్ళ కుటుంబసభ్యులు, బంధువులకు అనుమతి
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో యావత్ ప్రపంచం మొత్తం తన గురుంచి మాట్లాడుకునేలా చేసిన ఆనందయ్య మూలికల వైద్యంనకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతులు ఇచ్చింది. సీసీఆర్ఎఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆనందయ్య పసరు ముందుకు అనుమతులు లభించాయి. అయితే కంటిలో వేసుకునే మందుకు, కే అనేమందుకు మాత్రం అనుమతులు రాలేదు. వాటి పైనే ఇంకా నివేదికలు రావలసి వున్నది అని తెలిపారు. మందులో ఆరోగ్యానికి హాని కలిగేంచే పదార్ధాలు ఏమి లేవు అని స్పష్టం చేసారు. అయిన మందు వలన కరోనా రోగం తగ్గుతుంది అని కానీ, దాని వల్ల దుష్ప్రబావాలు ఉంటాయి అని కానీ ఎక్కడ నివేదికలో తెలపలేదు అని తెలిపారు. కంట్లో వేసే మందు కు ఇంకా 2&3 వారల వరకు పట్టొచ్చు అని, మాములు ఇంగ్లీష్ మెడిసన్ వాడుతున్న కానీ ఈ మందు వాడొచ్చు అని తెలిపారు. అయితే మందు కోసం కరోనా ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలి అని. కరోనా బాధితులు మందు కోసం రావొద్దు అని,వారి కుటుంబసభ్యులు కానీ బంధువులు కానీ వచ్చి తీసుకోవచ్చు అని తెలిపారు.












