మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేటలో మంగళవారం నాడు కరోనా టెస్టుల కొరకు భారీగా వచ్చిన ప్రజలు - రిజిస్ట్రేషన్ ఫారంలు లేక ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదం

చిలకలూరిపేటలో మంగళవారం నాడు కరోనా టెస్టుల కొరకు భారీగా వచ్చిన ప్రజలు -  రిజిస్ట్రేషన్ ఫారంలు లేక ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదం 

https://chilakaluripetspeednews.blogspot.com/


చీరాల రోడ్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఈ రోజు కరోనా టెస్టులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ప్రజలు భారీగా తరలి వచ్చారు. హాస్పిటల్ బయట వరకు Q కట్టారు. అయితే సుమారు 400 మంది టెస్టులకి వచ్చారు అని అంచనా . హాస్పిటల్ సిబంది ముందస్తు చర్యలు తీసుకోకుండా అందరికి ఓపీ ఇచ్చారు. కానీ టెస్టులకు  మాత్రం 100 రెజిస్ట్రేషన్ ఫారంలు మాత్రమే ఉన్నాయి అని ఈ రోజుకి 100 మాత్రమే అని చెప్పారు. పొద్దున 7 గంటలకు వచ్చి ఇప్పటి వరకు మండుటెండలో నిలబడి ఇప్పుడు ఫోరంలు లేవు అంటారు ఏంటి అని కొంచంసేపు ఆసుపత్రి సిబ్బందికి ప్రజలకి వాగ్వివాదం జరిగింది. చివరకు హాస్పిటల్ డాక్టర్ గారి చొరవతో వచ్చిన అందరికి టెస్టులు చేస్తాం అని చెప్పారు.ప్రైవేట్ టెస్టుల వలన బయట మెడికల్ ఫెసిలిటీ లేదు. అందువలన అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చినట్టు చెప్పారు. 

వీడియో:-































Share:

చిలకలూరిపేటలో ఇద్దరు మెప్మా ఉద్యోగులు కరొన తో మృతి

 చిలకలూరిపేటలో ఇద్దరు మెప్మా ఉద్యోగులు కరొన తో మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరొనతో ఇద్దరు మెప్మా ఉద్యోగులు మృతి. వివరాలోకి వెళ్తే గుంటూరు కార్పొరేషన్ మెప్మా సిటీ మెషిన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ పట్టణంలోని సాంబ శివ నగరులో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు, మంగళగిరి లో మెప్మా సిటీ మెషిన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తు మండలంలోని తాతపూడి గ్రామంలో నివాసం ఉంటున్న విజయరాజులు గారు. వీరు ఇరువురు కరోనా వలన సోమవారం నాడు మృతి చెందారు. 









Share:

చిలకలూరిపేటలో కరోనా టెస్టుల కధ

 చిలకలూరిపేటలో కరోనా టెస్టుల కధ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా విలయతాండవం చేస్తుంది.  రోజు ఎవరో ఒకరు కరొనతో మృతి చెందుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే అసలు టెస్టులు ఎక్కడ చేస్తున్నారో ఎవ్వరికి తెలియదు. సోమవారం నాడు కరోనా టెస్టులు చేపించుకుందాం అని చీరాల రోడ్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళితే " సార్ ఈ రోజు సోమవారం టెస్టులు చెయ్యరు సార్ , మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం మాత్రమే చేస్తారు  " అని అక్కడి సిబంది చెప్పారు. అంటే మిగిలిన రోజులలో టెస్టులు చెయ్యరా అని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే రోజు సోషల్ మీడియాలో, వార్తలలో చిలకలూరిపేటలో ప్రతి రోజు 10 కేసులు, 15 కేసులు వచ్చాయి అని వార్తలు  వస్తుంటే అసలు టెస్టులు చెయ్యకుండా కేసులు ఎలా వస్తాయి అని ఆలోచిస్తున్నారు. రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ,పేదవారు ప్రైవేట్ లాబ్స్ లలో టెస్టులు చేపించుకుందాం అంటే 3000 లేనిదే RTPCR  టెస్టు లేదు, 3000 లేనిదే సిటీ స్కాన్ లేదు అని అసలే కరొన వల్ల ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం గా ఉంది. ఇప్పుడు ఈ టెస్టులు కి అంత డబ్బులు కట్టలేక కరోనా లక్షణాలు ఉన్న కాని అలాగే జీవనం సాగిస్తున్నారు. 

ఇప్పటికి అయినా ప్రతి రోజు టెస్టులు నిర్వహించాలి అని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.  


 











Share:

చిలకలూరిపేటలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులు నిలిపివేత

చిలకలూరిపేటలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులు నిలిపివేత 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా డ్రైవింగ్ లైసెన్సులు, లెర్నింగ్ లైసెన్సులు, 27-04-2021 నుండి 31-05-2021 వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి టెస్టులు నిలిపివేస్తునట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (M V I )  నాగేశ్వరరావు గారు తెలిపారు. ఏపీ రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకునట్లు చెప్పారు. 1-06-2021 న టెస్టుల నిర్వహణ ఎప్పుడు మొదలవుతుందో తెలియచేస్తాము అని చెప్పారు. 
















Share:

దేశంలో ఆక్సిజెన్ నిల్వలు లేక కరోనా రోగులు చనిపోతుంటే - ఎగుమతులు శాతం మాత్రం రేటింపుగా ఉంది.

దేశంలో ఆక్సిజెన్ నిల్వలు లేక కరోనా రోగులు చనిపోతుంటే - ఎగుమతులు శాతం మాత్రం రేటింపుగా ఉంది. 

https://chilakaluripetspeednews.blogspot.com/

భారతదేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న, ప్రజలు ఆక్సిజన్ నిల్వలు లేక రోగులకు ఆక్సిజన్ సరిపోక ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన లెక్కల ప్రకారం 2020-2021 ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలలో ఏకంగా 9300 మెట్రిక్ టన్నుల ఆక్సిజెన్ విదేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది రెండింతలకన్నా ఎక్కువ. వీటిలో చాలా వరకు మన చుట్టుపక్క దేశాలకు ముఖ్యంగా బంగ్లాదేశ్ కు ఎగుమతి చేసినట్లు తెలిపారు. ముందు దేశ ప్రజల ఆరోగ్యం ముఖ్యం అని దేశ ప్రజలు వాపోతున్నారు.  

















Share:

చిలకలూరిపేటలో కరోనా వలన మరొకరు మృతి

చిలకలూరిపేటలో కరోనా వలన మరొకరు మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా కేసులు మాత్రమే కాదు మృతులు కూడా పెరుగుతున్నారు. ఈ రోజు పట్టణంలోని స్థానికంగా ఎన్ ఆర్ టి సెంటర్లోని ఒక అపార్టుమెంట్ నందు నివాసం ఉంటున్న పొన్నూరు గణపతి (61) కరొనతో మృతి చెందారు. గత కొన్ని రోజులగా కరొనా తో గుంటూరు లోని ప్రముఖ హాస్పిటల్ నందు చికిత్స తీసుకుంటూ ఈ రోజు మృతి చెందారు. 

గత కొన్ని రోజులగా ఇద్దరు పాస్టర్లు, యంగ్ గోల్డ్ వ్యాపారి, ఇప్పుడు ఇంకొకరు మృతి చెందటంతో పట్టణంలో ప్రజలు బయాందోనలో ఉన్నారు. 










Share:

కరోనా రాకుండా ఉండాలి అంటే 1 సరిపోదు 2 మాస్కులు వాడాలి

కరోనా రాకుండా ఉండాలి అంటే 1 సరిపోదు 2 మాస్కులు వాడాలి


https://chilakaluripetspeednews.blogspot.com/


దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్న క్రమంలో ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా ఆసక్తి విషయాలు పంచుకున్నారు. దేశంలో కరోనా ఉదృతి ఆపాలి అంటే మాస్క్ వాడాలి అని. అది కూడా ఒక మాస్క్ సరిపోదు అని 2 మాస్కులు వాడాలి అని తెలిపారు. క్లాత్, సర్జికల్ మాస్క్ వాడేవారు 2 ఖచ్చితంగా వాడాలి అని తెలిపారు.  
















Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి