.చిలకలూరిపేట రూరల్ దారుణం:బోయపాలెం హైవేపై మృత్యుతాండవం.. రెండు లారీలు ఢీకొని ముగ్గురు సజీవ దహనం!... పూర్తి వివరాలు కోసం క్రింది లింక్ పైన క్లిక్ చెయ్యండి...
చిలకలూరిపేట రూరల్ (ఎడ్లపాడు): జాతీయ రహదారిపై మరోసారి నెత్తురు పారింది. ఎడ్లపాడు మండలం బోయపాలెం హైవేపై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం అందరి గుండెలను పిండేస్తోంది. ఒక చిన్న నిర్లక్ష్యం, ఊహించని విపత్తు కలిసి అమాయకుల ప్రాణాలను అగ్నికి ఆహుతి చేశాయి.
⛽ పెట్రోల్ అయిపోవడమే శాపమైందా..? 🛣️
హైవేపై వెళ్తున్న ఒక వాహనంలో అకస్మాత్తుగా పెట్రోల్ అయిపోవడంతో నడిరోడ్డుపైనే నిలిచిపోయింది. సరిగ్గా అదే సమయంలో వెనక నుంచి వేగంగా దూసుకొస్తున్న ఒక లారీ డ్రైవర్, ఆగి ఉన్న బండిని గమనించలేదు. దగ్గరకు వచ్చాక చూసుకుని, దాన్ని తప్పించే క్రమంలో బ్రేక్ వేయబోయి అదుపుతప్పి నేరుగా డివైడర్ ఎక్కించేశాడు.
💥 ఢీకొన్న మృత్యుశకటాలు.. ఇరుక్కుపోయిన నలుగురు! 🚛⚡🚚
డివైడర్ దూకిన ఆ లారీ.. అవతలి వైపు నుంచి అంతే వేగంగా వస్తున్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. కళ్లు చెదిరే వేగంతో రెండు భారీ వాహనాలు ఢీకొనడంతో ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ భీకర ప్రమాదంలో అవతలి లారీలో ఉన్న ముగ్గురు, ఇవతలి లారీలోని ఒకరు.. మొత్తం నలుగురు ఆ ఇనుప రేకుల మధ్యే ఇరుక్కుపోయారు. ప్రాణభయంతో హాహాకారాలు చేశారు.
🔥 కళ్లెదుటే సజీవ దహనం.. కన్నీరుమున్నీరైన స్థానికులు! 😭
రక్తపు మడుగులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు స్థానికులు, అటుగా వెళ్లేవారు శతవిధాలా ప్రయత్నించారు. కానీ వాహనాలు దారుణంగా దెబ్బతినడంతో వారిని బయటకు తీయడం ఎవరివల్లా కాలేదు. ఇంతలోనే లారీలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ మంటలు రెండు లారీలను చుట్టుముట్టాయి. ఇరుక్కుపోయిన వారు బయటకు రాలేక, కాపాడేవారు దగ్గరకు వెళ్లలేక.. కళ్లెదుటే ఆ హాహాకారాలు మంటల్లో కలిసిపోయాయి. ఈ ఘోర దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు పూర్తిగా దగ్ధమై సజీవ దహనమయ్యారు.
పూర్తి సమాచారం తో నెక్స్ట్ పోస్ట్ ఉంటుంది. ఇది ప్రాధమిక గా వచ్చిన ఇన్ఫర్మేషన్...
ఘటన వీడియో...
https://www.instagram.com/reel/DaO4LmeSQJC/?igsh=bXl2cXF5cXY3NTE1




