మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ వెనుక అసలు కుట్ర ఇదే.. విడదల రజిని సంచలన వ్యాఖ్యలు! పూర్తి వివరాలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి..

చిలకలూరిపేట - బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ వెనుక అసలు కుట్ర ఇదే.. విడదల రజిని సంచలన వ్యాఖ్యలు!


​🚨 బొల్లా బ్రహ్మనాయుడు గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: మాజీ మంత్రి విడదల రజిని 🚨

చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): పల్నాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్న మాజీ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టుపై మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ అరెస్టు ముమ్మాటికీ కక్షసాధింపు చర్యేనని, ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.

​ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించిన ముఖ్య అంశాలు:

​🤝 ప్రజల మనిషి.. పల్నాడు ఆప్తుడు!

బొల్లా బ్రహ్మనాయుడు వ్యక్తిత్వం ఎలాంటిదో పల్నాడు ప్రాంత ప్రజలందరికీ, ముఖ్యంగా వినుకొండ ప్రజలకు సుపరిచితమని రజిని గారు గుర్తుచేశారు. ఆపదలో ఉన్న నలుగురికి తనవంతు సాయం చేస్తూ, ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలిచే గొప్ప మనసున్న నాయకుడాయన అని కొనియాడారు. ఎవరికీ కలలో కూడా అన్యాయం చేసే తత్వం ఆయనది కాదని స్పష్టం చేశారు.

​🛑 బాధితుడినే నిందితుడిగా మారుస్తారా..?

ఈ వ్యవహారంలో అసలు బాధితుడైన బ్రహ్మనాయుడునే నిందితుడిగా చేర్చి అరెస్టు చేయడం అత్యంత విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ జీవోలు సృష్టించి జరుగుతున్న అక్రమాలను ధైర్యంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది ఆయన అనుచరులేనని తెలిపారు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన వారిపైనే అక్రమంగా కేసులు నమోదు చేయడం వెనుక ఉన్న కుట్రలు, ఉద్దేశాలపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాస్తవాలను తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

​⚔️ రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ కుట్రలు!

బ్రహ్మనాయుడుని నేరుగా రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే, ఇలాంటి అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలతో ఇబ్బందులకు గురిచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని రజిని ధ్వజమెత్తారు. ప్రజల్లో ఆయనకు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను దెబ్బతీయాలనే ఏకైక ఉద్దేశంతోనే ఈ విధమైన వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

​⚖️ న్యాయమే గెలుస్తుంది.. కడిగిన ముత్యంలా బయటకొస్తారు!

అధికార బలంతో ఎన్ని కుట్రలు చేసినా.. దేశ న్యాయవ్యవస్థపై తమకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని విడదల రజిని తేల్చిచెప్పారు. "నిజం నిప్పు లాంటిది.. అది ఎప్పటికైనా గెలుస్తుంది. న్యాయస్థానాల్లో వాస్తవాలు నిగ్గుతేలుతాయి. బొల్లా బ్రహ్మనాయుడు ఈ తప్పుడు కేసుల నుండి కడిగిన ముత్యం వలె, ఎలాంటి మచ్చా లేకుండా పూర్తి నిర్దోషిగా గర్వంగా బయటకు వస్తారు" అని ఆమె పూర్తి ధీమా వ్యక్తం చేశారు.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి - ధనలక్ష్మి గ్రూప్స్ డైరెక్టర్ పేర్ని వీరనారాయణ... చిలకలూరిపేటలో నిరుద్యోగులకు పండగే...జూన్ 16న ప్రత్తిపాటి గార్డెన్స్‌లో మెగా జాబ్ మేళా... ఇంటర్వ్యూకి వెళ్లాలంటే ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి..

చిలకలూరిపేట యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి - ధనలక్ష్మి గ్రూప్స్ డైరెక్టర్ పేర్ని వీరనారాయణ... చిలకలూరిపేటలో నిరుద్యోగులకు పండగే...జూన్ 16న ప్రత్తిపాటి గార్డెన్స్‌లో మెగా జాబ్ మేళా... ఇంటర్వ్యూకి వెళ్లాలంటే ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి..


పల్నాడు జిల్లా మరియు చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఇది నిజంగా ఒక సువర్ణావకాశం! నేటి తీవ్ర పోటీ ప్రపంచంలో ఒక మంచి ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి తరుణంలో, స్థానిక యువతకు అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మరియు మన స్థానిక శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి సంయుక్త ఆధ్వర్యంలో ఒక బృహత్తరమైన మెగా జాబ్ మేళాకు రంగం సిద్ధమైంది.

​స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు వేగంగా మీకందించే మన చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ద్వారా ఈ అద్భుతమైన అవకాశానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

🗣️ నిరుద్యోగుల పాలిట వరం: ధనలక్ష్మి గ్రూప్స్ డైరెక్టర్ పేర్ని వీరనారాయణ ప్రశంసలు

​ఈ మెగా జాబ్ మేళా నిర్వహణ పట్ల ధనలక్ష్మి గ్రూప్స్ డైరెక్టర్ శ్రీ పేర్ని వీరనారాయణ గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఎమ్మెల్యే గారి సేవలను కొనియాడారు.

"గతంలో 2014-19 మధ్య కాలంలో కూడా ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఇలాంటి భారీ కార్యక్రమమే నిర్వహించి సుమారు 1600 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఆయన నాయకత్వంలో ప్రతి సంవత్సరం ఉచిత కంటి ఆపరేషన్లు, మోకాళ్ల ఆపరేషన్లు లాంటి ఎన్నో ఆరోగ్య, అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా జరుగుతున్నాయి. అదే స్ఫూర్తితో ఇప్పుడు జరగబోయే ఈ మేళాలో సుమారు 40కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనడం, దాదాపు 2000 మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించడం నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టం. 10వ తరగతి మొదలుకొని ఇంజనీరింగ్ వరకు చదువుకున్న ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని జీవితంలో స్థిరపడాలి," అని శ్రీ పేర్ని వీరనారాయణ గారు పిలుపునిచ్చారు.

 వీడియో కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 

https://www.instagram.com/reel/DZR_9FFJF4o/?igsh=MXR3M3hpNnNua20wbA==

🏢 50+ దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు... 2000+ పైగా కొలువులు!

​ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50కి పైగా దిగ్గజ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు మన చిలకలూరిపేట తరలివస్తున్నాయి. Reliance Jio, TATA Capital, KIA Motors, D Mart, SBI Card, Flipkart, MedPlus, Hetero, ISUZU, Bank of Baroda, MRF, Zepto లాంటి ఎన్నో ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొని ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి.

📌 ఇంటర్వ్యూల పూర్తి వివరాలు ఇవే:

  • ​📅 తేదీ: 16 జూన్ 2026 (మంగళవారం)
  • ​🕘 సమయం: ఉదయం 09:00 గంటల నుండి ప్రారంభం
  • ​📍 వేదిక: ప్రత్తిపాటి గార్డెన్స్, మున్సిపల్ ఆఫీస్ రోడ్డు, చిలకలూరిపేట, పల్నాడు జిల్లా - 522616.

🎓 ఎవరు అర్హులు? వయోపరిమితి ఎంత?

  • విద్యార్హతలు: SSC (10వ తరగతి), Inter, ITI, Diploma, B.Tech, Pharmacy, Degree మరియు PG పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అర్హులే!
  • వయోపరిమితి: 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గలవారు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.

📲 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?

​ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు, క్రింది వెబ్‌సైట్ లింక్స్ ద్వారా తమ పేర్లను ఉచితంగా నమోదు చేసుకోవాలి:

​📞 మరిన్ని సందేహాలుంటే వెంటనే కాల్ చేయండి:

7779858789, 7842747682, 9848793357, 7702921219.

​💡 ఒక చిన్న విన్నపం: ఉద్యోగ అన్వేషణలో ఉన్న మీ మిత్రులకు, బంధువులకు ఈ వార్తను చేరవేయండి. మీరు చేసే ఒక చిన్న షేర్.. ఒకరి జీవితాన్ని నిలబెట్టవచ్చు! మరింత వేగవంతమైన స్థానిక వార్తల అప్‌డేట్స్ కోసం చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ను ఫాలో అవుతూ ఉండండి.

Share:

చిలకలూరిపేట - నాలుగు ఏళ్లుగా నరకమే.. సుబ్బయ్య తోటను వేధిస్తున్న 'విద్యుత్' కష్టాలు! అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం! విద్యుత్ అధికారులపై ఆగ్రహం... పూర్తి వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.

సుబ్బయ్య తోటలో 'కరెంటు' కష్టాలు.. ఏసీ ఆన్ చేస్తే ఆగిపోతున్న గుండెలు! విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న జనం! 🚨


​చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోట వాసులకు ఎండాకాలం వచ్చిందంటే చాలు.. చెమటకాయలతో పాటు 'కరెంటు' కష్టాలు కూడా తోడవుతున్నాయి. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు విద్యుత్ హెచ్చుతగ్గుల (Voltage Fluctuations) తో తీవ్ర నరకం అనుభవిస్తున్నారు. ఎండ దెబ్బకు తట్టుకోలేక ఏసీ వేసుకుందాం అనుకుంటే.. అది ఏ క్షణాన పేలిపోతుందోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి నెలకొంది.

​🏘️ టార్గెట్ అయిన వీధులు.. లో-వోల్టేజ్ తో నరకం!

​సుబ్బయ్య తోటలోని ముఖ్యమైన ప్రాంతాలైన సత్రం బజారు, గౌడ కళ్యాణ మండపం రోడ్డు, పోలయ్య హోటల్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఈ విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. మిగతా కాలాల్లో సాధారణంగానే ఉంటున్న కరెంటు సరఫరా, ఎండాకాలం రాగానే లోడ్ పెరిగిపోయి 'అప్ అండ్ డౌన్స్' మొదలవుతున్నాయి. మధ్యాహ్నం పూట ఏసీ వేసుకున్న ఐదు నిమిషాల్లోనే కరెంటు ఆగిపోవడం, వెంటనే మళ్ళీ రావడం.. ఇలా నిరంతరం జరగడంతో ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రమాదంలో పడుతున్నాయి.

​💥 పాడైపోతున్న ఏసీలు.. ఆర్థిక భారం భరించేది ఎవరు?

​ఈ వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ కారణంగా ఇప్పటికే స్థానికంగా రెండు ఏసీలు కాలిపోయి పూర్తిగా పాడైపోయాయి. ఇక్కడ నివసించే వారంతా దాదాపుగా మధ్యతరగతి కుటుంబాల వారే. ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో కొనుక్కున్న ఏసీలు, ఫ్రిడ్జ్ లు, టీవీలు ఇలా కళ్లెదుటే పాడైపోతుంటే వారి ఆవేదనకు అంతు లేకుండా పోతోంది. "మా ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతే ఆ ఆర్థిక నష్టాన్ని విద్యుత్ శాఖ అధికారులు భర్తీ చేయగలరా?" అని స్థానికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

​📞 చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే.. అధికారుల తీరు!

​గత మూడు, నాలుగు ఏళ్లుగా ఈ సమస్యపై స్థానికులు అధికారులకు, లైన్ మెన్ కు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా.. "అధిక లోడ్ వల్ల అలా జరుగుతోంది.. ఈ ప్రాంతానికి కచ్చితంగా ఒక సెపరేట్ ట్రాన్స్ ఫార్మర్ వేయాలి" అని అధికారులు ఉచిత సలహాలు ఇవ్వడమే తప్ప, ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇక సంబంధిత లైన్ మెన్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరైన సమాధానం ఇవ్వకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​💸 బిల్లు లేట్ అయితే ఫైన్.. మరి సేవల్లో లోపం ఉంటే?

​విద్యుత్ శాఖ అధికారుల తీరుపై ప్రజలు మండిపడటానికి మరో ప్రధాన కారణం.. వారి వసూళ్ల పర్వం! కరెంటు బిల్లు కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా సరే వంద రూపాయలు పెనాల్టీ ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు.. కానీ ప్రజలకు నాణ్యమైన కరెంటు ఇవ్వడంలో మాత్రం మీ బాధ్యత ఏమైందని ఇక్కడి ప్రజలు నిలదీస్తున్నారు. పెనాల్టీల మీద ఉన్న శ్రద్ధ, ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుపై ఎందుకు లేదని మండిపడుతున్నారు.

​ఇప్పటికైనా చిలకలూరిపేట విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మొద్దునిద్ర వీడాలి. వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ సుబ్బయ్య తోట ప్రజల కష్టాలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. తక్షణమే స్పందించి, ఆ ప్రాంతానికి ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేసి ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించాలి. లేనిపక్షంలో స్థానికులు విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంది!

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - ప్రియుడి మోజు.. ఇన్సూరెన్స్ కాజు: కట్టుకున్న వాడినే కడతేర్చిన కసాయి ఇల్లాలు!పక్కా స్కెచ్‌తో యాక్సిడెంట్ డ్రామా! అసలేం జరిగింది? పూర్తి వివరాల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.

చిలకలూరిపేట - ప్రియుడి మోజు.. ఇన్సూరెన్స్ కాజు: కట్టుకున్న వాడినే కడతేర్చిన కసాయి ఇల్లాలు!పక్కా స్కెచ్‌తో యాక్సిడెంట్ డ్రామా! అసలేం జరిగింది?


ప్రియుడి మోజు... ఇన్సూరెన్స్ కాజు! కట్టుకున్న మొగుడినే కడతేర్చిన కసాయి భార్య అరెస్ట్! 🚨

​కట్టుకున్న వాడికంటే.. కనికరించిన వాడే ఎక్కువయ్యాడు ఆ ఇల్లాలికి. పెళ్లికి ముందే పుట్టిన వలపు.. పెళ్లయ్యాక కసాయి బుద్ధిగా మారింది. ప్రియుడితో కలిసి ఉండాలన్న కోరిక, ఇన్సూరెన్స్ డబ్బులపై ఆశ.. వెరసి కట్టుకున్న భర్తనే పక్కా స్కెచ్‌తో హతమార్చిన ఒక కిరాతక ఇల్లాలి వ్యవహారం చిలకలూరిపేట రూరల్ పరిధిలో సంచలనం సృష్టించింది. ఎటువంటి ఆధారాలు లేని ఈ డెడ్ ఎండ్ కేసును ఛేదించిన పోలీసుల తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.

​💔 పెళ్లికి ముందే ప్రియుడితో కిలాడీ లేడీ ట్రాక్! 💸

ఒంగోలుకు చెందిన న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్‌(37)తో నాగజ్యోతి(30)కి వివాహం జరిగింది. పైకి ఎంతో అన్యోన్యంగా కనిపించే ఆ భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఉన్నాడు. బాపట్ల జిల్లాకు చెందిన ఉసరి వెంకట కోటయ్య(40)తో నాగజ్యోతికి పెళ్లికి ముందు నుంచే చీకటి వ్యవహారం నడుస్తోంది. అయితే, తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించారు. భర్తను అడ్డుతొలగించుకుంటే స్వేచ్ఛగా బతకొచ్చని, పైగా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయన్న దురాశ వారిలో పెరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం హరిప్రసాద్ పేరిట భారీ ఎత్తున ఇన్సూరెన్స్ చేయించి, ఆ కిలాడీ లేడీ తన పేరును నామినీగా మార్చుకుంది.

​🩸 మందు తాగించి.. రోడ్డు ప్రమాదంగా నమ్మించి..! 🏍️

భార్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పక్కాగా స్కెచ్ వేసిన ప్రియుడు కోటయ్య.. తన స్నేహితుడు శ్రీనివాసరావును వెంటబెట్టుకుని ఏప్రిల్ 10న రంగంలోకి దిగాడు. ఏమీ తెలియనట్లు హరిప్రసాద్‌కు బాగా మద్యం తాగించారు. మత్తులో ఉన్న హరిప్రసాద్‌ను యడవల్లి సమీపంలోకి తీసుకెళ్లి, ఇనుప రాడ్‌తో తలపై విచక్షణారహితంగా బాది దారుణంగా హత్య చేశారు. ఎవరికీ కనీస అనుమానం రాకూడదని.. శవాన్ని, అతని స్కూటీని రోడ్డు పక్కన పడేసి, ఇదొక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు హైలెవల్ డ్రామా ఆడారు.

​🕵️‍♂️ ఖాకీల ఎంట్రీతో సీన్ రివర్స్.. కటకటాల వెనక్కి భార్య! 🚓

యాక్సిడెంట్ అనుకుని అంతా సైలెంట్ అవుతారనుకున్న నిందితుల ప్లాన్‌ను చిలకలూరిపేట రూరల్ పోలీసులు తిప్పికొట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహంపై ఉన్న గాయాలను నిశితంగా గమనించిన పోలీసులు.. ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్డ్ మర్డర్ అని తేల్చారు. ఏప్రిల్ 12నే ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. అసలు సూత్రధారి, ఆ ఇంటి ఇల్లాలు 'నాగజ్యోతి' కుట్ర బట్టబయలైంది. దీంతో శనివారం (జూన్ 6) నాగజ్యోతిని కూడా అరెస్ట్ చేసి, ఆమె సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

​👏 పోలీసులకు ఎస్పీ అభినందనలు! 🌟

నిందితులు ఎటువంటి క్లూస్ వదలకుండా యాక్సిడెంట్‌గా క్రియేట్ చేసినప్పటికీ.. సాంకేతికతను ఉపయోగించి, అనుమానాస్పద మృతిని హత్య కేసుగా నిగ్గుతేల్చిన రూరల్ సీఐ సుబ్బనాయుడు, ఎస్.ఐ అనిల్ కుమార్‌ల బృందాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ అభినందించారు. కాసుల కోసం, కామం కోసం కట్టుకున్న వాడినే కాటేసిన ఈ లేడీ వ్యవహారం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - రక్షకుడే భక్షకుడైతే..? వినుకొండలో లొంగిపోయిన సిఐ... చిలకలూరిపేట కోర్టులో హాజరు.. 14 రోజుల రిమాండ్... పూర్తి వివరాల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.

చిలకలూరిపేట - రక్షకుడే భక్షకుడైతే..? వినుకొండలో లొంగిపోయిన సిఐ... చిలకలూరిపేట కోర్టులో హాజరు.. 14 రోజుల రిమాండ్... 


రేప్ కేసులో అడ్డంగా బుక్కైన మాజీ సీఐ! చిలకలూరిపేట కోర్టులో హాజరు.. 14 రోజుల రిమాండ్ ⚖️

​చిలకలూరిపేట మరియు వినుకొండ ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ! రక్షక భటుడిగా ఉండాల్సిన ఓ పోలీసు అధికారే ఏకంగా భక్షకుడిగా మారిన వైనం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వినుకొండకు చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో.. పోలీసు శాఖ నుండి ఏకంగా డిస్మిస్ (Dismiss) కు గురైన మాజీ సీఐ చిన్నమల్లయ్య జైలు పాలయ్యాడు.

​🚔 తెల్లవారుజామున వినుకొండలో నాటకీయ లొంగుబాటు..

గత కొంతకాలంగా ఈ కేసు ఉమ్మడి గుంటూరు జిల్లా పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తనపై తీవ్ర ఆరోపణలు రావడంతో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు చిన్నమల్లయ్య.. ఎట్టకేలకు ఈరోజు (శనివారం) తెల్లవారుజామున వినుకొండ పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసి అతడిని కట్టుదిట్టమైన భద్రత నడుమ చిలకలూరిపేట కోర్టుకు తరలించారు.

​⚖️ న్యాయమూర్తి ముందు హాజరు.. 14 రోజుల రిమాండ్!

వినుకొండ పోలీసులు నిందితుడిని నేడు చిలకలూరిపేట ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తి శ్రీ నరేంద్ర రెడ్డి గారి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేసుకు సంబంధించిన పూర్తి విచారణ నివేదికలను, ప్రాథమిక ఆధారాలను పోలీసులు న్యాయమూర్తి ముందు ఉంచారు. కేసు తీవ్రతను నిశితంగా పరిశీలించిన జడ్జి నరేంద్ర రెడ్డి గారు.. మాజీ సీఐ చిన్నమల్లయ్యకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.

​🚓 నరసరావుపేట సబ్ జైలు నుండి గుంటూరు జైలుకు.. ఎందుకంటే?

కోర్టు తీర్పు అనంతరం నిందితుడిని జైలుకు తరలించే క్రమంలో కొంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదటగా చిన్నమల్లయ్యను నరసరావుపేట సబ్ జైలుకు తరలించాలని పోలీసులు భావించారు. అయితే, భద్రతా కారణాలు మరియు కేసు ప్రాధాన్యత దృష్ట్యా నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిందితుడిని నేరుగా గుంటూరు జిల్లా జైలుకు తరలించడం జరిగింది.

​🛑 కాపలాదారే కంచె మేస్తే.. ప్రజల ఆగ్రహం!

సమాజానికి ఆదర్శంగా ఉంటూ మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఒక సీఐ స్థాయి అధికారి.. ఇలా దారుణమైన అత్యాచార ఆరోపణలు ఎదుర్కోవడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన వెలుగులోకి రాగానే ఉన్నతాధికారులు ఏమాత్రం ఉపేక్షించకుండా, కఠిన చర్యలు తీసుకుని అతన్ని సర్వీస్ నుండి డిస్మిస్ చేయడం గమనార్హం. చట్టం ముందు అందరూ సమానులే అని ఈ కేసు నిరూపించింది.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - నేటి ప్రజా దర్బార్‌లో ప్రత్తిపాటి ముందుకొచ్చిన ముఖ్యమైన అర్జీలు ఏంటంటే..? ఆక్రమణలు, మౌలిక సదుపాయాలపై ప్రత్తిపాటికి ఫిర్యాదుల వెల్లువ. పూర్తి వివరాల కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి

చిలకలూరిపేట - నేటి ప్రజా దర్బార్‌లో ప్రత్తిపాటి ముందుకొచ్చిన ముఖ్యమైన అర్జీలు ఏంటంటే..? ఆక్రమణలు, మౌలిక సదుపాయాలపై ప్రత్తిపాటికి ఫిర్యాదుల వెల్లువ.


చిలకలూరిపేట ప్రజా దర్బార్: ఎమ్మెల్యే ప్రత్తిపాటి దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు

​చిలకలూరిపేటలో ప్రతి శుక్రవారం నిర్వహించాల్సిన 'ప్రజా దర్బార్' అనివార్య కారణాల వల్ల శనివారం నాడు టిడిపి క్యాంప్ ఆఫీసులో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గ నలుమూలల నుండి అనేక మంది తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వాటిలో వచ్చిన ప్రధాన ఫిర్యాదుల వివరాలు:

భర్త మరణాన్ని ఆసరాగా తీసుకుని రూ. 28 లక్షల మోసం

నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన గండ్ర దీప్తి అనే మహిళ తన భర్త వేణుగోపాలకృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత మోసపోయినట్లు ఫిర్యాదు చేసింది. తన భర్త బంధువులైన పెంటెల శంకరరావు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, గండ్ర శివాజీ మాయమాటలు చెప్పి సుమారు రూ. 28 లక్షల విలువైన విద్యుత్ ప్రభల సామాగ్రిని, లారీలను తీసుకెళ్లిపోయారని, తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నారని వాపోయింది. తనకు న్యాయం చేసి సామాగ్రి ఇప్పించాలని విన్నవించింది.

6వ వార్డులో మౌలిక సదుపాయాల లేమి

చిలకలూరిపేట 6వ వార్డు (ఎన్.టి.ఆర్ కాలనీ) వాసి ఆరె మల్లికార్జున రావు డ్రైనేజీ మరియు త్రాగునీటి సమస్యలపై అర్జీ సమర్పించాడు. నరసరావుపేట రోడ్డు మసీదు నుండి మిషన్ కాంపౌండ్ వెళ్లే సందులో కాలువలు లేక మురుగునీరు నిల్వ ఉండి పలు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపాడు. త్రాగునీరు కూడా సక్రమంగా రావడం లేదని, వెంటనే సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరాడు.

కుప్పగంజి వాగుపై బ్రిడ్జిల నిర్మాణం

చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి పోరాట సమన్వయ కమిటీ సభ్యుడు పేలూరి రామారావు తదితరులు కుప్పగంజి వాగుపై పలు నిర్మాణాల కోసం వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా గణపవరం బైపాస్ రోడ్డులో మరియు వేలూరు గ్రామానికి వెళ్లే మార్గంలో నేలమట్టం బ్రిడ్జిల స్థానంలో హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు. అలాగే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కరకట్టలపై మొక్కలు నాటి, వాటిపై రాకపోకలకు అనువుగా మార్చాలని సూచించారు.

ఊగేరు వాగు బ్రిడ్జికి వీధి లైట్లు, రోడ్డు అనుసంధానం

బొందిలిపాలెంలో కొత్తగా నిర్మించిన ఊగేరు వాగు బ్రిడ్జిపై వీధి లైట్లు ఏర్పాటు చేయాలని సీపీఐ మరియు ప్రజా సంఘాల నాయకులు విన్నవించారు. గడియార స్తంభం సెంటర్ నుండి ఊగేరు వాగు మీదుగా గొర్లమండి గుండా పసుమర్రు బైపాస్ కు రోడ్డును అనుసంధానించాలని కోరారు. తద్వారా ఆ ప్రాంతంలో కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న సామాన్యులకు రవాణా, విద్యుత్ సమస్యలు తీరుతాయని తెలిపారు.

కృష్ణారెడ్డి డొంకలో ఆక్రమణల తొలగింపు

7వ వార్డులోని కృష్ణారెడ్డి డొంకలో స్థానికులు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యపై ఫిర్యాదు చేశారు. గతంలో ప్రభుత్వ ఇళ్ల స్థలాలు (డీ ఫార్మ్) పొందిన వారు కూడా తిరిగి ఇక్కడే ఆక్రమణలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ ఆక్రమణల వల్ల సైడు కాలువలు నిర్మించలేక మురుగునీరు రోడ్లపై పారుతోందని, దోమల వల్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయని వివరించారు. వెంటనే ఆక్రమణలను తొలగించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - ఇంట్లో తాత, మనవడికి ఒకే పేరు ఉంటే జాగ్రత్త...చిలకలూరిపేట ముస్లిం ఓటర్లకు టీడీపీ మైనార్టీ నేతల అత్యవసర పిలుపు... పూర్తి వివరాల కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి.

చిలకలూరిపేట - ఇంట్లో తాత, మనవడికి ఒకే పేరు ఉంటే జాగ్రత్త...చిలకలూరిపేట ముస్లిం ఓటర్లకు టీడీపీ మైనార్టీ నేతల అత్యవసర పిలుపు...


జూన్ 15 నుంచి ఇంటింటికి అధికారులు:

చిలకలూరిపేట పట్టణంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ప్రభుత్వం చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియ ఈనెల 15వ తేదీ నుండి ముమ్మరంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలు, ప్రత్యేకించి ముస్లిం మైనార్టీలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ మైనార్టీ దిగ్గజ నేతలు — మాజీ మున్సిపల్ చైర్మన్ రఫాని, మాజీ వైస్ చైర్మన్ వేటపాలెం సుభాని, టీడీపీ మైనార్టీ నాయకులు ఖాజా పిలుపునిచ్చారు. 🗣️

​❓ అపోహలు వద్దు.. అవగాహన ముద్దు! 🚫

ఓట్ల తొలగింపుపై మైనార్టీ ప్రాంతాల్లో అనవసర భయాలు నెలకొన్నాయని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముస్లింల పేర్లు పలికే విధానంలో తేడాలు రావడం, అక్షర దోషాలు (Spelling Mistakes) దొర్లడం సహజం. అలాగే ఒకే కుటుంబంలో తాత, తండ్రి, మనవడు.. ఇలా ఒకే పేరును ముగ్గురు పంచుకోవడం లాంటి సాంకేతిక కారణాల వల్ల, అధికారులు వాటిని ‘నకిలీ లేదా బోగస్ ఓట్లు’గా పొరబడి తొలగించే ప్రమాదం ఉందని వారు వివరించారు. దయచేసి ఎవరూ ఆందోళన చెందకుండా వాస్తవాలు గమనించి వ్యవహరించాలని కోరారు.

​📍 18వ వార్డులో స్పెషల్ ఫోకస్ అవసరం! 🔍

ముఖ్యంగా చిలకలూరిపేట 18వ వార్డులో ఇళ్ల పేర్లు, వ్యక్తుల పేర్లు తరచుగా ఒకేలా (రిపీట్) ఉండటంతో పెద్ద సమస్య వచ్చేలా ఉందన్నారు. ఒక ఇంట్లో ఒకే పేరుతో తాత, తండ్రి, కొడుకు ఉంటే.. అధికారులు కన్ఫ్యూజ్ అయ్యి, ఒకే వ్యక్తికి మూడు ఓట్లు ఉన్నాయని భావించి, అందులో రెండు ఓట్లు లేపేసే ప్రమాదం ఉందని వారు గట్టిగా హెచ్చరించారు. ఇలాంటి వార్డుల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ⚠️

​🪪 ప్రజలు ఏం చేయాలి? డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి! 📁

అధికారులు మీ ఇంటికి రాగానే కంగారు పడకండి. మీ ఓటును మీరు ధృవీకరించుకోవడానికి ప్రభుత్వం గుర్తించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాత ఓటరు గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డు వంటివి ముందుగానే సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా చదువుకున్న యువత చొరవ తీసుకుని, పెద్దల ఓటు వివరాలను ఆన్‌లైన్‌లో గానీ, ఇంటికి వచ్చే బీఎల్‌ఓ (BLO)ల వద్ద గానీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. 💻

​🤝 అధికారులకు నేతల కీలక విజ్ఞప్తి! 📢

సుమారు 22 ఏళ్ల క్రితం జరిగిన మ్యాపింగ్ మరియు పాత రికార్డులను సైతం అధికారులు ప్రాతిపదికగా తీసుకోవాలని మైనార్టీ నేతలు సూచించారు. ఇంటింటికీ వచ్చే అధికారులు ముస్లిం మైనార్టీ ప్రాంతాల్లో పేర్ల స్పెల్లింగ్స్‌ను సున్నితంగా పరిశీలించాలని, ఏ ఒక్క అర్హుడి ఓటు పోకుండా పారదర్శకంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

​🗳️ ఓటు మన హక్కు.. అది మన వజ్రాయుధం!

ఓటు అనేది రాజ్యాంగం మనకిచ్చిన బ్రహ్మాస్త్రం.. పౌరుడి ప్రాథమిక హక్కు. దాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి అధికారులు ఇంటికి వచ్చినప్పుడు వారికి పూర్తి వివరాలు తెలిపి, ఎటువంటి అపోహలకు తావులేకుండా సహకరించి మీ ఓటును భద్రపరుచుకోండి!

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి