మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేటలో దారుణం..... సభ్యసమాజం తలదించుకునే దారుణం...కన్నకూతురి లాంటి పసిబిడ్డపై అఘాయిత్యం.. కీచక తండ్రికి జీవిత ఖైదు!

చిలకలూరిపేటలో దారుణం..... సభ్యసమాజం తలదించుకునే దారుణం...కన్నకూతురి లాంటి పసిబిడ్డపై అఘాయిత్యం.. కీచక తండ్రికి జీవిత ఖైదు!

.

చిలకలూరిపేటలో సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ఓ దారుణ ఘటనలో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. రక్షణగా నిలవాల్సిన తండ్రే మృగంగా మారిన కేసులో.. గుంటూరు పోక్సో (POCSO) ప్రత్యేక కోర్టు నిందితుడికి జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొరడా ఝుళిపించింది.

​💔 నమ్మకద్రోహం.. తండ్రి ముసుగులో కీచక పర్వం!

చిలకలూరిపేట పట్టణానికి చెందిన రాయపూడి శ్రీదేవికి మొదటి భర్తతో 'పావని' (పేరు మార్చబడింది) అనే కుమార్తె ఉంది. భర్తతో విడిపోయిన అనంతరం ఆమె 2011లో రాయపూడి మరియదాసు అలియాస్ రాజు (31)ని రెండో వివాహం చేసుకుంది. అంతా సవ్యంగా సాగుతోందని అనుకుంటున్న తరుణంలో మరియదాసులో దాగున్న కామాంధుడు బయటపడ్డాడు. కన్నకూతురితో సమానమైన 12 ఏళ్ల మైనర్ బాలికపై వక్రబుద్ధి పెంచుకున్నాడు. ఇంట్లో భార్య లేని సమయం చూసి.. చాక్లెట్లు, ఐస్‌క్రీంలు కొనిస్తూ మాయమాటలతో ఆ పసిబిడ్డను లోబరుచుకున్నాడు. గత రెండేళ్లుగా ఆ బాలికపై పాశవికంగా అత్యాచారానికి, అశ్లీల చర్యలకు ఒడిగట్టాడు. ఈ ఘోరాన్ని బయటపెడితే ప్రాణాలు తీస్తానని తల్లీకూతుళ్లను దారుణంగా బెదిరించాడు.

​🚓 పోలీసుల ఎంట్రీ.. కటకటాల వెనక్కి కామాంధుడు!

నిందితుడి పైశాచికత్వాన్ని భరించలేక, బాధితురాలి తల్లి ధైర్యం చేసి 27 ఆగస్టు 2019న చిలకలూరిపేట అర్బన్ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే అప్పటి సీఐ వి. సూర్యనారాయణ ఆదేశాలతో ఎస్.ఐ శివరామయ్య వేగంగా స్పందించారు. పకడ్బందీగా విచారణ జరిపి నిందితుడు మరియదాసుపై ఐపీసీ సెక్షన్ 376, 506తో పాటు కఠినమైన పోక్సో చట్టం కింద (Cr. No. 237/2019) కేసు నమోదు చేశారు. ఆగస్టు 31, 2019న ఆ కీచకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

​⚖️ న్యాయస్థానం సంచలన తీర్పు.. జీవితాంతం జైలులోనే!

ఈ కేసులో సుదీర్ఘంగా విచారణ చేపట్టిన గుంటూరు పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి శ్రీమతి షమ్మి పర్వీన్ సుల్తానా బేగం గారు.. ప్రాసిక్యూషన్ సమర్పించిన పక్కా సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నేరం నిర్ధారణ కావడంతో శుక్రవారం (08.05.2026) చారిత్రాత్మక తుది తీర్పు వెలువరించారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వారికి వణుకు పుట్టేలా నిందితుడు మరియదాసుకు 'జీవితకాల కఠిన కారాగార శిక్ష' ఖరారు చేశారు. అంతేకాకుండా రూ. 10,000 నగదు జరిమానా కూడా విధించారు. ఈ తీర్పుతో బాధితురాలికి సరైన న్యాయం జరిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

​👏 ఖాకీలకు సలాం.. సమర్థవంతమైన దర్యాప్తునకు ప్రశంసలు!

ఈ కేసులో ఎక్కడా రాజీ పడకుండా నిందితుడికి శిక్ష పడేలా సాక్ష్యాలు సేకరించి, దర్యాప్తు జరిపిన అప్పటి ఇన్స్‌పెక్టర్ వి. సూర్యనారాయణను, కోర్టులో బాధితురాలి తరఫున బలమైన వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి. దుర్గా ప్రసాద్‌ను, అలాగే కోర్టు కానిస్టేబుల్ ఎం. బాలాజీ నాయక్‌ను పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

పోలీసుల వార్నింగ్: "మైనర్ల జోలికొస్తే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో ఈ తీర్పు మరోసారి నిరూపించింది. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే జీవితాంతం జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే" అని చిలకలూరిపేట అర్బన్ పోలీసులు హెచ్చరించారు.

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేటలో రూ.43 లక్షలతో పార్క్, సీసీ రోడ్డు.. నాదెండ్లలో రూ.60 లక్షలతో నూతన రహదారికి శ్రీకారం! నియోజకవర్గంలో పరుగులెడుతున్న అభివృద్ధి

చిలకలూరిపేటలో రూ.43 లక్షలతో పార్క్, సీసీ రోడ్డు.. నాదెండ్లలో రూ.60 లక్షలతో నూతన రహదారికి శ్రీకారం! నియోజకవర్గంలో పరుగులెడుతున్న అభివృద్ధి

చిలకలూరిపేట/నాదెండ్ల: కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. శుక్రవారం నరసరావుపేట లోక్ సభ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఒకవైపు చిలకలూరిపేట పట్టణంలో రూ.43 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూనే.. మరోవైపు నాదెండ్ల మండలంలో రూ.60 లక్షలతో నిర్మించిన నూతన రహదారిని ప్రారంభించి "డబుల్ ఇంజిన్ సర్కార్.. డబుల్ స్పీడ్ డెవలప్ మెంట్" అని నిరూపించారు.

​🌳 రూ.43 లక్షలతో పట్టణ రూపురేఖలు మార్చే పనులు:

చిలకలూరిపేట పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు నేతలు పెద్దపీట వేశారు. 6వ వార్డులోని బింగి రామ్మూర్తి పార్క్ ఆధునికీకరణ కోసం రూ.20 లక్షలతో పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం 7వ వార్డులో రూ.23 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎంపీ, ఎమ్మెల్యే సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి పార్టీల సమన్వయంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు.

​🛣️ నాదెండ్లలో రూ.60 లక్షలతో నూతన మెటల్ రోడ్డు ప్రారంభం:

గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందాలంటే మెరుగైన రవాణా వ్యవస్థే కీలకమని నమ్మిన కూటమి ప్రభుత్వం.. నాదెండ్ల మండలంలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించింది. రూ.60 లక్షల NREGS నిధులతో కేశానుపల్లి నుంచి నాదెండ్ల వరకు, మల్లాయపాలెం మీదుగా వేసిన నూతన మెటల్ రోడ్డును లావు, ప్రత్తిపాటి ఘనంగా ప్రారంభించారు. రహదారి ప్రారంభోత్సవం అనంతరం గ్రామస్తులతో సమావేశమై ప్రభుత్వ పనితీరు, వారి ఆలోచనలను ఆడిగి తెలుసుకున్నారు.

​🗣️ డబుల్ ఇంజిన్ సర్కార్ తో ప్రజలకు కష్టాల నుంచి ఉపశమనం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటే భావితరాలకు ఎనలేని ప్రయోజనాలు కలుగుతాయన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ లో జరుగుతున్న సమగ్ర పాలన వల్లే గత పాలకుల అసమర్థత నుంచి ప్రజలకు ఉపశమనం లభించిందని, అభివృద్ధి పరుగులు పెడుతోందని హర్షం వ్యక్తం చేశారు.

​🌟 సంక్షేమంలో చంద్రబాబు.. పల్లె రోడ్ల అభివృద్ధిలో పవన్ ఆలోచనలు విభిన్నం: ఎంపీ లావు

గత పాలకులు విస్మరించిన అభివృద్ధిని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు కొనియాడారు. రాష్ట్రానికి ఎన్ని ఆర్థిక కష్టాలున్నా లెక్కచేయకుండా ప్రజల సంతోషానికే సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అలాగే 'పల్లె పండుగ' కార్యక్రమంతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామీణ రోడ్ల రూపు రేఖలు మార్చేస్తున్నారని నేతలు ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు అసూయ చెందేలా కూటమి పాలన కొనసాగుతోందని స్పష్టం చేశారు.

​🤝 కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:

ఈ రెండు కీలక కార్యక్రమాల్లో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, బండారుపల్లి సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, అధికారులతో పాటు ఎంపీటీసీలు, సర్పంచులు, భారీ సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

(మరిన్ని నియోజకవర్గ తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి.. మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్! 🚀📱)

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - వందేళ్ల చరిత్రకు నూతన శోభ.. ఆధ్యాత్మిక పారవశ్యంలో పసుమర్రు.. వైభవంగా శ్రీ కోదండరాముని ధ్వజస్తంభ ప్రతిష్ఠ.. పోటెత్తిన భక్తజనం!

చిలకలూరిపేట - వందేళ్ల చరిత్రకు నూతన శోభ.. ఆధ్యాత్మిక పారవశ్యంలో పసుమర్రు.. వైభవంగా శ్రీ కోదండరాముని ధ్వజస్తంభ ప్రతిష్ఠ.. పోటెత్తిన భక్తజనం!


🚩 పసుమర్రులో మార్మోగిన రామనామం.. కన్నుల పండువగా శ్రీ కోదండరాముని ధ్వజస్తంభ ప్రతిష్ఠ! 🚩

చిలకలూరిపేట (గ్రామీణం): శ్రీరామచంద్రుని నామస్మరణతో పసుమర్రు గ్రామం పులకించిపోయింది. చిలకలూరిపేట మండల పరిధిలోని పసుమర్రులో కొలువై ఉన్న చారిత్రక శ్రీ కోదండ రామాలయం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయంలో శుక్రవారం ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా, అత్యంత నయనానందకరంగా జరిగింది.

✨ శతాబ్ది చరిత్రకు.. నూతన శోభ!

సుమారు 100 సంవత్సరాలకు పైగా గ్రామ ప్రజల నీరాజనాలు అందుకుంటున్న ఈ పురాతన కోదండ రామాలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా చేపట్టిన నూతన ధ్వజస్తంభ ఏర్పాటుతో గుడి ప్రాంగణం అంతా సరికొత్త తేజస్సుతో వెలుగొందుతోంది. తమ ఇలవేల్పుకు జరుగుతున్న ఈ మహత్కార్యాన్ని కనులారా చూసి తరించిన గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

🔥 వేదమంత్రాల ఘోష.. ఆధ్యాత్మిక పారవశ్యం!

గత మూడు రోజులుగా దేవస్థానంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆగమశాస్త్ర పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల ఘోష నడుమ ఉత్సవాలు అంబరాన్నంటాయి. మూడు రోజుల పాటు విశేష హోమాలు, స్వామివారికి పంచామృత అభిషేకాలు, లోక కల్యాణార్థం శాంతి పూజలు అత్యంత కమనీయంగా, రమణీయంగా నిర్వహించారు. భక్తుల "జై శ్రీరామ్" జయజయధ్వానాల మధ్య, శాస్త్రోక్తంగా, అత్యంత పవిత్రంగా శుక్రవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది.

👥 పోటెత్తిన భక్తజన సంద్రం!

ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించేందుకు పసుమర్రు గ్రామస్తులే కాకుండా, చిలకలూరిపేట చుట్టుపక్కల గ్రామాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఎటు చూసినా భక్తిభావం ఉట్టిపడేలా గ్రామం మొత్తం రామనామ స్మరణతో ఆధ్యాత్మికంగా వెల్లివిరిసింది.

🍛 ఆకలి తీర్చిన 'మహా' అన్నదానం!

విచ్చేసిన వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ యువత అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం వేలాది మందికి భారీ స్థాయిలో 'మహా అన్నదాన' కార్యక్రమాన్ని ఎంతో క్రమశిక్షణతో నిర్వహించారు. వడ్డనలో వలంటీర్ల సేవలు భక్తుల మన్ననలు పొందాయి.

🙏 భవిష్యత్తుకు భరోసా.. కోదండరాముని దీవెనలు: ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆలయ పునరుద్ధరణ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ విజయవంతంగా పూర్తికావడంతో పసుమర్రు గ్రామ ప్రజల ముఖాల్లో చెప్పలేనంత సంతోషం కనిపిస్తోంది. కోదండరాముని ఆశీస్సులు చిలకలూరిపేట ప్రజలందరిపై కలకాలం చల్లగా ఉండాలని భక్తులు ప్రార్థించారు.

 వీడియో కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://www.instagram.com/reel/DYEx1g-pejU/?igsh=MWJxYjJ2OTVib3V3NA==

(మరిన్ని స్థానిక తాజా, ఫాస్ట్ వార్తల కోసం చూస్తూనే ఉండండి.. మన చిలకలూరిపేట స్పీడ్ న్యూస్! 🚀📱)

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

​🚨 చిలకలూరిపేట- టీ స్టాల్ ఘటనలో విస్తృపోయే నిజాలు : వివాహేతర సంబంధం.. వెకిలి చేష్టలే హత్యాయత్నానికి దారితీశాయా? అసలు ఎందుకు జరిగింది? పూర్తి స్టోరీ.....🚨

​🚨 చిలకలూరిపేట-  టీ స్టాల్ ఘటనలో విస్తృపోయే నిజాలు : వివాహేతర సంబంధం.. వెకిలి చేష్టలే హత్యాయత్నానికి దారితీశాయా? అసలు ఎందుకు జరిగింది? పూర్తి స్టోరీ.....🚨


చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ - ఎక్స్‌క్లూజివ్ క్రైమ్ రిపోర్ట్ 🎙️

​🚨 చిలకలూరిపేటలో నెత్తురోడిన టీ స్టాల్: వివాహేతర సంబంధం.. వెకిలి చేష్టలే హత్యాయత్నానికి దారితీశాయా? 🚨

​చిలకలూరిపేట పట్టణంలో గురువారం జరిగిన ఓ దారుణ హత్యాయత్నం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకప్పటి స్నేహం.. ఆపై వివాహేతర సంబంధం.. ఆ తర్వాత రెచ్చగొట్టే చేష్టలు.. వెరసి ఒకరి ప్రాణాల మీదకు తెచ్చాయి. స్థానిక సాయి కార్తిక సిటీ సెంటర్ సమీపంలోని 'సంపత్ రిలాక్స్ టీ స్టాల్' వద్ద జరిగిన ఈ రక్తపాతానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ "చిలకలూరిపేట స్పీడ్ న్యూస్"లో..

​💔 స్నేహం.. ద్రోహం.. వివాహేతర సంబంధం:

పట్టణంలోని గుర్రాల చావిడి వద్ద వెల్డింగ్ పనులు చేసుకునే బషీర్, సుభానీ నగర్‌కు చెందిన సిమెంటు పని చేసే జానీ బాషా మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా జానీ బాషా.. బషీర్ ఇంటికి తరచుగా వెళ్లేంతగా పెరిగింది. ఇదే క్రమంలో బషీర్ భార్యతో జానీ బాషా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఒకరోజు వీరిద్దరినీ బషీర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో పెద్ద గొడవ జరిగింది. అప్పట్లో బషీర్ న్యాయం కోసం చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్‌ను సైతం ఆశ్రయించాడు. ఈ ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత బషీర్ తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు.

​👨‍👩‍👧‍👦 పిల్లల కోసం రాజీ.. షరతులతో సహజీవనం:

విడాకులు జరిగిన కొన్ని రోజుల తర్వాత.. భార్య తన తప్పు తెలుసుకుని తిరిగి బషీర్ వద్దకు వచ్చింది. "తప్పైపోయింది.. క్షమించు, ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయను" అని బతిమిలాడటంతో, బషీర్ తన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాడు. అయితే "ఇకపై మన మధ్య ఎలాంటి శారీరక సంబంధం ఉండదు" అని ఖచ్చితమైన షరతు పెట్టి మరీ ఆమెను ఇంట్లోకి రానిచ్చి పిల్లల కోసం కలిసి ఉంటున్నాడు.

​😡 ప్రాణం మీదకు తెచ్చిన వెకిలి చేష్టలు:

తాను గొడవలు పక్కనపెట్టి ప్రశాంతంగా బతుకుతున్న బషీర్‌ను జానీ బాషా వదల్లేదు. ఎదురుపడినప్పుడల్లా ప్యాంట్ జిప్ లాగడం, మీసాలు మెలేయడం లాంటి అసభ్యకరమైన, వెకిలి చేష్టలతో రెచ్చగొట్టేవాడు. గొడవలు ఎందుకని బషీర్ చాలా కాలం పాటు తన కోపాన్ని దిగమింగుకుంటూ సహనంతో తన పని తాను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

​🔪 సహనం నశించింది.. నెత్తురు చిందింది:

నిన్న (గురువారం) జానీ బాషా పనులు ముగించుకుని సాయి కార్తిక సిటీ సెంటర్ పక్కన ఉన్న సంపత్ రిలాక్స్ టీ స్టాల్ వద్ద టీ తాగుతున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న బషీర్‌ను చూసి జానీ బాషా మళ్లీ మీసాలు మెలేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఇన్నాళ్లుగా అణచిపెట్టుకున్న బషీర్ సహనం కట్టలు తెంచుకుంది. బండిలో ఉన్న వెల్డింగ్‌కు సంబంధించిన ఇనుప ముక్కను తీసుకుని జానీ బాషా మెడ, వీపు భాగాలపై అత్యంత కిరాతకంగా 8 సార్లు పొడిచి, అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

​🚑 అపస్మారక స్థితిలో బాధితుడు.. పరిస్థితి విషమం:

రక్తపు మడుగులో పడివున్న జానీ బాషాను చూసిన స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించారు. సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని అతడిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో, ఫస్ట్ ఎయిడ్ చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ (GGH) కు తరలించారు. మెడ వద్ద ఒక ముఖ్యమైన నరం కట్ అవ్వడంతో జానీ బాషా పరిస్థితి అత్యంత విషమంగా ఉందని గుంటూరు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

​🔔 మరిన్ని స్థానిక తాజా, సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి.. మీ 'చిలకలూరిపేట స్పీడ్ న్యూస్'. 📰

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేటలో దారుణం: పట్టపగలే 8 కత్తిపోట్లతో రెచ్చిపోయిన ఉన్మాది! నెత్తురోడిన సాయి కార్తిక సిటీ సెంటర్.. టీ తాగుతుండగా కిరాతక దాడి! 🩸

చిలకలూరిపేటలో దారుణం: పట్టపగలే 8 కత్తిపోట్లతో రెచ్చిపోయిన ఉన్మాది! నెత్తురోడిన సాయి కార్తిక సిటీ సెంటర్.. టీ తాగుతుండగా కిరాతక దాడి! 🩸



​🔪 పట్టపగలే దారుణం... 8 కత్తిపోట్లతో రెచ్చిపోయిన ఉన్మాది!

📍 నెత్తురోడిన సాయి కార్తిక సిటీ సెంటర్:

చిలకలూరిపేట పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే సాయి కార్తిక సిటీ సెంటర్ సమీపంలోని ఓ టీ షాప్ వద్ద పట్టపగలే కిరాతకమైన హత్యాయత్నం జరిగింది. పబ్లిక్ లో జరిగిన ఈ భయానక కత్తిదాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

💥 పాత కక్షల సెగ.. ఏకంగా 8 కత్తిపోట్లు:

సిమెంట్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే షేక్ జాన్ బాషా.. ఎప్పటిలాగే టీ కొట్టు వద్ద ప్రశాంతంగా టీ తాగుతున్నాడు. ఈ క్రమంలో పాత కక్షలను మనసులో పెట్టుకున్న గుర్రాల చావిడికి చెందిన బషీర్ (వెల్డింగ్ వర్కర్) అకస్మాత్తుగా అక్కడికి చేరుకున్నాడు. ఊహించని విధంగా సుభాని నగర్ కు చెందిన  జాన్ బాషాపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కసితీరా ఏకంగా 8 సార్లు కత్తితో పొడిచి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించి, వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.

🩸 మెడకు తీవ్ర గాయాలు.. రక్తం మడుగులో బాధితుడు:

బషీర్ చేసిన ఆకస్మిక దాడిలో జాన్ బాషా మెడకు రెండు వైపులా కత్తి పదునుగా దిగడంతో విపరీతమైన రక్తస్రావం జరిగింది. క్షణాల్లోనే రక్తం మడుగులో ప్రాణాపాయ స్థితిలో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘోరాన్ని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.



🚑 గుంటూరు జీజీహెచ్‌కి ఎమర్జెన్సీ తరలింపు:

స్థానికులు వెంటనే అప్రమత్తమై 108కి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది.. క్షతగాత్రుడిని ప్రాథమిక చికిత్స నిమిత్తం ముందుగా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మెడ భాగంలో బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం జరుగుతోంది. పరిస్థితి విషమంగా ఉండటంతో, ప్రాణాలను కాపాడేందుకు ఎమర్జెన్సీగా మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి (GGH) తరలిస్తున్నారు.

🚓 పరారీలో నిందితుడు.. పోలీసుల గాలింపు:

ఈ దారుణానికి ఒడిగట్టి పరారైన వెల్డింగ్ వర్కర్ బషీర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 వీడియో కోసం క్రింది లింక్ పైన క్లిక్ చేయండి.

https://www.instagram.com/reel/DYCYry_p7W7/?igsh=NXhkbm11OG9wOHlx

​పక్కా లోకల్ వార్తలు, ఎప్పటికప్పుడు తాజా క్రైమ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.. ఇది మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్! 🎤📺 ⚡

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట ప్రజల దశాబ్దాల కల సాకారం.. ఇకపై మన చిలకలూరిపేట నుంచే నేరుగా శ్రీశైలానికి బస్సు! 🔱మహిళలకు ఫ్రీ.. టైమింగ్స్ ఇవే! పూర్తి వివరాల కోసం...

చిలకలూరిపేట ప్రజల దశాబ్దాల కల సాకారం.. ఇకపై మన చిలకలూరిపేట నుంచే నేరుగా శ్రీశైలానికి బస్సు! 🔱మహిళలకు ఫ్రీ.. టైమింగ్స్ ఇవే! పూర్తి వివరాల కోసం...


🕉️ చిలకలూరిపేట ప్రజల దశాబ్దాల కల సాకారం.. మన ఊరి నుంచే నేరుగా శ్రీశైలానికి బస్సు! 🚌 ​మల్లన్న భక్తులకు శుభవార్త! పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం దర్శించుకోవాలని పరితపించే చిలకలూరిపేట ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది. భక్తుల ప్రయాణ కష్టాలకు చెక్ పెడుతూ, మన డిపో నుంచే నేరుగా శ్రీశైలానికి ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీస్ అందుబాటులోకి వచ్చేసింది.

​🛑 నరసరావుపేట వెళ్లే తిప్పలు ఇక తప్పినట్లే..!

ఒకప్పుడు శ్రీశైలం వెళ్లాలంటే చిలకలూరిపేట వాసులకు అదో పెద్ద ప్రహసనం. తెల్లవారుజామునే నిద్రలేచి, నరసరావుపేట వెళ్లి అక్కడ గంటల తరబడి ఎదురుచూసి శ్రీశైలం బస్సు పట్టుకోవాల్సి వచ్చేది. చలిలో, వర్షంలో చిన్నారులు, వృద్ధులతో ఆ ప్రయాణం తీవ్ర ఇబ్బందికరంగా ఉండేది. ఇకపై ఆ కష్టాలకు కాలం చెల్లినట్లే! నేరుగా మన ఊరి నుంచే బస్సు ఎక్కి మల్లికార్జునుడి సన్నిధికి చేరుకోవచ్చు.

​🙋‍♀️ మహిళా భక్తులకు మహా వరం.. 'ఉచిత' ప్రయాణం!

శివయ్యను దర్శించుకోవాలనుకునే మహిళామణులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్త. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా, చిలకలూరిపేట డిపో నుండి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ సర్వీసులో మహిళల కోసం 'స్త్రీశక్తి' పథకాన్ని వర్తింపజేయడం విశేషం. దీని ద్వారా మహిళలకు ప్రయాణం పూర్తిగా ఉచితం. భక్తి మార్గంలో వెళ్లే ఆడపడుచులకు ఇది ఆర్థికంగా గొప్ప ఊరట. (పురుషులకు అనగా పెద్దలకు టికెట్ ధర కేవలం రూ. 345/- గా నిర్ణయించారు).

​🤝 ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక చొరవ..

దశాబ్దాలుగా ఉన్న ఈ రవాణా సమస్యను మాజీ మంత్రి, ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రజల కష్టాలను గుర్తించిన ఆయన, ఆర్టీసీ అధికారులతో ప్రత్యేకంగా చర్చలు జరిపి, పట్టుబట్టి మరీ మన డిపోకు శ్రీశైలం బస్సు సర్వీసును మంజూరు చేయించారు.

​🎀 అట్టహాసంగా ప్రారంభోత్సవం: ఉదయం 10:00 గంటలకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా జెండా ఊపి ఈ బస్సు సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్నారు.

​⏰ బస్సు వేళలు - ప్రయాణ వివరాలు ఇవే:

చిలకలూరిపేట డిపో నుండి ప్రతిరోజూ నడిచే ఈ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ టైం టేబుల్:

  • ​🚌 బయలుదేరు సమయం: ప్రతిరోజూ ఉదయం 7:30 గంటలకు (చిలకలూరిపేట నుండి)
  • ​🛕 శ్రీశైలం చేరు సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
  • ​🔄 తిరుగు ప్రయాణం: మధ్యాహ్నం 2:15 గంటలకు (శ్రీశైలం నుండి)
  • ​📍 తిరిగి చేరు సమయం: రాత్రి 7:15 గంటలకు (చిలకలూరిపేట కు)

గమనిక: ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే మహిళా ప్రయాణీకులు విధిగా తమ ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఆధార్ తదితర) చూపించాల్సి ఉంటుంది.

- మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ⚡ (లోకల్ అప్డేట్స్ లో ఎప్పుడూ ముందు)

చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్

 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

చిలకలూరిపేట - రాష్ట్ర వేదికపై పల్నాడు సత్తా! "జనతా వారధి"గా దూసుకుపోతున్న మల్లెల శివ నాగేశ్వరరావు! 🚀

రాష్ట్ర వేదికపై పల్నాడు సత్తా! "జనతా వారధి"గా దూసుకుపోతున్న మల్లెల శివ నాగేశ్వరరావు! 🚀

పల్నాడు జిల్లాకు రాష్ట్రస్థాయిలో అరుదైన గుర్తింపు! "జనతా వారధి"గా దూసుకుపోతున్న మల్లెల శివ నాగేశ్వరరావు! 💥

​ప్రజల పక్షాన నిలబడుతూ, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "జనతా వారధి" కార్యక్రమంలో పల్నాడు జిల్లా రాష్ట్ర స్థాయిలోనే సత్తా చాటుతోంది! విజయవాడ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో పల్నాడు జిల్లా తరపున బీజేపీ ఉపాధ్యక్షులు, జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పాల్గొని జిల్లా సత్తాను రాష్ట్ర నాయకత్వానికి చాటిచెప్పారు.

🏛️ విజయవాడ వేదికగా.. రాష్ట్ర అధ్యక్షుల దిశానిర్దేశం!

విజయవాడలోని బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో, గౌరవనీయులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారి అధ్యక్షతన "జనతా వారధి" రివ్యూ సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా నుండి మల్లెల శివ నాగేశ్వరరావు గారు చురుగ్గా పాల్గొని, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ఎలా పనిచేయాలో, ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య అద్భుతమైన వారధిగా ఎలా నిలవాలో రాష్ట్ర నాయకత్వం నుండి విలువైన మార్గదర్శకాలను స్వీకరించారు.

💐 మల్లెల శివ నాగేశ్వరరావుకు సభాముఖంగా ప్రశంసల జల్లు!

పల్నాడు జిల్లాలో ఇప్పటివరకు "జనతా వారధి" ద్వారా జరిగిన అభివృద్ధి, చేపట్టిన కార్యక్రమాల పూర్తి నివేదికను మల్లెల శివ నాగేశ్వరరావు గారు రాష్ట్ర నాయకత్వానికి అందించారు. ఈ నివేదికను పరిశీలించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా, ప్రజల పట్ల శివ నాగేశ్వరరావు గారికి ఉన్న అంకితభావాన్ని మెచ్చుకుంటూ సభాముఖంగా ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రశంసలు పల్నాడు జిల్లా బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి!

📊 4000+ అర్జీలు.. 70% పరిష్కారం.. ఇది కదా అసలైన ప్రజాసేవ!

మాటలు కాదు, చేతల్లో చూపిస్తోంది పల్నాడు బీజేపీ! వేలాది మంది ప్రజలు అచంచలమైన నమ్మకంతో ఏకంగా 4000 పైగా అర్జీలను "జనతా వారధి"కి విన్నవించుకున్నారు. ఇందులో కేవలం స్వీకరించడమే కాకుండా, రికార్డు స్థాయిలో 70% సమస్యలను సానుకూల పరిష్కారం దిశగా తీసుకెళ్లడంలో మల్లెల శివ నాగేశ్వరరావు గారి బృందం అద్భుతమైన విజయం సాధించింది. ఈ గణాంకాలే వారి చిత్తశుద్ధికి నిదర్శనం.

🤝 మీ సమస్యే మా బాధ్యత.. ప్రతి శుక్రవారం మీకోసం!

ప్రజల కష్టాలు తీర్చడానికి, వారి గొంతుకగా నిలబడటానికి పల్నాడు జిల్లా బీజేపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. దీనిలో భాగంగానే ప్రతి శుక్రవారం బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ప్రజల కోసం తలుపులు బార్లా తెరిచి ఉంచుతున్నారు నాయకులు.


చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్


 మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.

https://whatsapp.com/channel/0029VaLWcILJUM2UjVzcs03g

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి