🚨 చిలకలూరిపేట- టీ స్టాల్ ఘటనలో విస్తృపోయే నిజాలు : వివాహేతర సంబంధం.. వెకిలి చేష్టలే హత్యాయత్నానికి దారితీశాయా? అసలు ఎందుకు జరిగింది? పూర్తి స్టోరీ.....🚨
చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ - ఎక్స్‌క్లూజివ్ క్రైమ్ రిపోర్ట్ 🎙️
🚨 చిలకలూరిపేటలో నెత్తురోడిన టీ స్టాల్: వివాహేతర సంబంధం.. వెకిలి చేష్టలే హత్యాయత్నానికి దారితీశాయా? 🚨
చిలకలూరిపేట పట్టణంలో గురువారం జరిగిన ఓ దారుణ హత్యాయత్నం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకప్పటి స్నేహం.. ఆపై వివాహేతర సంబంధం.. ఆ తర్వాత రెచ్చగొట్టే చేష్టలు.. వెరసి ఒకరి ప్రాణాల మీదకు తెచ్చాయి. స్థానిక సాయి కార్తిక సిటీ సెంటర్ సమీపంలోని 'సంపత్ రిలాక్స్ టీ స్టాల్' వద్ద జరిగిన ఈ రక్తపాతానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ "చిలకలూరిపేట స్పీడ్ న్యూస్"లో..
💔 స్నేహం.. ద్రోహం.. వివాహేతర సంబంధం:
పట్టణంలోని గుర్రాల చావిడి వద్ద వెల్డింగ్ పనులు చేసుకునే బషీర్, సుభానీ నగర్‌కు చెందిన సిమెంటు పని చేసే జానీ బాషా మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా జానీ బాషా.. బషీర్ ఇంటికి తరచుగా వెళ్లేంతగా పెరిగింది. ఇదే క్రమంలో బషీర్ భార్యతో జానీ బాషా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఒకరోజు వీరిద్దరినీ బషీర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో పెద్ద గొడవ జరిగింది. అప్పట్లో బషీర్ న్యాయం కోసం చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్‌ను సైతం ఆశ్రయించాడు. ఈ ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత బషీర్ తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు.
👨👩👧👦 పిల్లల కోసం రాజీ.. షరతులతో సహజీవనం:
విడాకులు జరిగిన కొన్ని రోజుల తర్వాత.. భార్య తన తప్పు తెలుసుకుని తిరిగి బషీర్ వద్దకు వచ్చింది. "తప్పైపోయింది.. క్షమించు, ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయను" అని బతిమిలాడటంతో, బషీర్ తన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాడు. అయితే "ఇకపై మన మధ్య ఎలాంటి శారీరక సంబంధం ఉండదు" అని ఖచ్చితమైన షరతు పెట్టి మరీ ఆమెను ఇంట్లోకి రానిచ్చి పిల్లల కోసం కలిసి ఉంటున్నాడు.
😡 ప్రాణం మీదకు తెచ్చిన వెకిలి చేష్టలు:
తాను గొడవలు పక్కనపెట్టి ప్రశాంతంగా బతుకుతున్న బషీర్‌ను జానీ బాషా వదల్లేదు. ఎదురుపడినప్పుడల్లా ప్యాంట్ జిప్ లాగడం, మీసాలు మెలేయడం లాంటి అసభ్యకరమైన, వెకిలి చేష్టలతో రెచ్చగొట్టేవాడు. గొడవలు ఎందుకని బషీర్ చాలా కాలం పాటు తన కోపాన్ని దిగమింగుకుంటూ సహనంతో తన పని తాను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
🔪 సహనం నశించింది.. నెత్తురు చిందింది:
నిన్న (గురువారం) జానీ బాషా పనులు ముగించుకుని సాయి కార్తిక సిటీ సెంటర్ పక్కన ఉన్న సంపత్ రిలాక్స్ టీ స్టాల్ వద్ద టీ తాగుతున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న బషీర్‌ను చూసి జానీ బాషా మళ్లీ మీసాలు మెలేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఇన్నాళ్లుగా అణచిపెట్టుకున్న బషీర్ సహనం కట్టలు తెంచుకుంది. బండిలో ఉన్న వెల్డింగ్‌కు సంబంధించిన ఇనుప ముక్కను తీసుకుని జానీ బాషా మెడ, వీపు భాగాలపై అత్యంత కిరాతకంగా 8 సార్లు పొడిచి, అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
🚑 అపస్మారక స్థితిలో బాధితుడు.. పరిస్థితి విషమం:
రక్తపు మడుగులో పడివున్న జానీ బాషాను చూసిన స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించారు. సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని అతడిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో, ఫస్ట్ ఎయిడ్ చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ (GGH) కు తరలించారు. మెడ వద్ద ఒక ముఖ్యమైన నరం కట్ అవ్వడంతో జానీ బాషా పరిస్థితి అత్యంత విషమంగా ఉందని గుంటూరు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
🔔 మరిన్ని స్థానిక తాజా, సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి.. మీ 'చిలకలూరిపేట స్పీడ్ న్యూస్'. 📰
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.




