మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్

చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్


చిలకలూరిపేట :- గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిపై రగడ నడుస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేష్ నాయుడు నేడు మంగళగిరిలోని టిడిపి ఆఫీసు నందు నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరటం ఖరారు అయినట్టు సమాచారం. ఇప్పటికే సన్నిహితులతో పాటు కార్యకర్తలతో టిడిపి ఆఫీస్ కు చేరుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన రాజేష్ నాయుడుని వైసీపీ పార్టీలో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు అనుచరులు తెలిపారు. తనతో పాటు 18 మంది వైసిపి వార్డు మెంబర్ల టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. దీంతో పట్టణంలో రాబోవు ఎన్నికలకు టిడిపి గెలుపు పై కాకుండా మెజారిటీపై చర్చలు జరుపుకుంటున్నారు.

Follow below


Share:

ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారా ?

ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారా ?

ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారా ?


2024 సాదారణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సిద్దం చేసుకోవలసిన వాటిలో ముఖ్యమైనవి.

నో డ్యూస్ సర్టిఫికెట్ :- మీ గ్రామ పంచాయితీ/మున్సిపాలిటీ నుండి తీసుకోవాలి.

కేస్ట్ సర్టిఫికెట్ :- రిజర్వుడు స్థానాల్లో పోటీ చేసే వారు తప్పనిసరిగా కొత్త కేస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి.

మిమ్మల్ని  బలపరుస్తున్నట్టు మీ నియోజక వర్గంలో 10 మంది ఓటరు కార్డు జిరాక్స్ లు.

పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ :- మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తారో ఆ స్టేషన్ నుండి పొందవచ్చు.

మీకు ఉన్న అన్ని బ్యాంకు ఖాతాల ఫస్ట్ పేజీ జిరాక్స్ మరియు 6 నెలల స్టేట్ మెంట్ మరియు పాన్ కార్డ్ జిరాక్స్ ( భార్య/భర్త, పిల్లలు ఉంటే వారివి కూడా)

స్థిర, చర ఆస్తుల వివరాలు మరియు అప్పుల వివరాలు.

డిపాజిట్ సొమ్ము ఎంపీ అభ్యర్థికి 25000 / ఎస్సీ ఎస్టీ వారికి 12500.

ఎమ్మెల్యే అభ్యర్థికి 10000 / ఎస్సీ ఎస్టీ వారికి 5000.

Share:

ఏపీలో బిజెపి 6 లోక్ సభ, జనసేన 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు వీరే.. టిడిపి స్థానంలో జనసేన అభ్యర్థి - రఘురామకృష్ణంరాజుకు మొండి చేయి

ఏపీలో బిజెపి 6 లోక్ సభ, జనసేన 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు వీరే.. టిడిపి స్థానంలో జనసేన అభ్యర్థి - రఘురామకృష్ణంరాజుకు మొండి చేయి

ఏపీలో బిజెపి 6 లోక్ సభ, జనసేన 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు వీరే.. టిడిపి స్థానంలో జనసేన అభ్యర్థి - రఘురామకృష్ణంరాజుకు మొండి చేయి


ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బిజెపి అభ్యర్థుల జాబితా APలో ఆరు పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను విడుదల చేసింది.

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

రాజమండ్రి- పురంధేశ్వరి, 

అనకాపల్లి- సీఎం రమేష్‌

అరకు-కొత్తపల్లి గీత, 

రాజంపేట- కిరణ్‌కుమార్‌రెడ్డి

తిరుపతి-వరప్రసాద్‌, 

నరసాపురం-శ్రీనివాసవర్మ

ఖమ్మం-తాండ్ర వినోద్‌రావు, (TS)

వరంగల్‌-ఆరూరి రమేష్‌ (TS)


18 మంది తో కూడిన జాబితా విడుదల చేసిన జనసేన...

1.పిఠాపురం : పవన్ కళ్యాణ్

2. నెల్లిమర్ల: లోకం మాధవి

3. అనకాపల్లి:కొణతాల రామకృష్ణ

4. కాకినాడ రూరల్: శ్రీ పంతం నానాజీ 

5.రాజానగరం: శ్రీ బత్తుల బలరామకృష్ణ 

6.తెనాలి: శ్రీ నాదెండ్ల మనోహర్

7.నిడదవోలు: శ్రీ కందుల దుర్గేష్ 

8.పెందుర్తి: శ్రీ పంచకర్ల రమేష్ బాబు 

9.యలమంచిలి: శ్రీ సుందరపు విజయ్ కుమార్ 

10.పి.గన్నవరం: శ్రీ గిడ్డి సత్యనారాయణ 

11.రాజోలు: శ్రీ దేవ వరప్రసాద్ 

12.తాడేపల్లిగూడెం: శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ 

13.భీమవరం: శ్రీ పులపర్తి ఆంజనేయులు 

14.నరసాపురం: శ్రీ బొమ్మిడి నాయకర్ 

15. ఉంగుటూరు: శ్రీ పత్సమట్ల ధర్మరాజు 

16.పోలవరం: శ్రీ చిర్రి బాలరాజు 

17.తిరుపతి: శ్రీ ఆరణి శ్రీనివాసులు 

18.రైల్వే కోడూరు: డా.యనమల భాస్కర రావు

పి గన్నవరం రాజేష్ మహాసేన టిడిపి అభ్యర్థిగా తప్పుకోవడంతో ఆస్థానంలో జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ బరిలోకి దిగారు.

నరసాపురం ఎంపీ స్థానాన్నిలో బిజెపి శ్రీనివాస వర్మ పోటీ చేయనున్నటంతో రఘురామకృష్ణం రాజు పరిస్థితి అయోమయం అయినది. గత కొన్ని రోజులుగా కూటమిలో తనకు స్థానం ఉందని ప్రకటించుకున్న రఘురామకృష్ణంరాజు సీటు దక్కకపోవడంతో కంగు తిన్నారు.

మరోవైపు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి చేరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని బిజెపి అధిష్టానం ఖరారు చేసింది.


Click on below

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

11 అసెంబ్లీ, 13 లోక్ సభ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి పై క్లారిటీ...

11 అసెంబ్లీ, 13 లోక్ సభ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి పై క్లారిటీ...

11 అసెంబ్లీ, 13 లోక్ సభ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి పై క్లారిటీ...


టీడీపీ మూడో జాబితా విడుదల. 13 మంది లోక్‌సభ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ.

గత కొంతకాలంగా నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా రకరకాల పేర్లు పుకార్లు షికారులు చేయక వాటన్నిటికీ తరలించుతూ నేడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు టికెట్ కన్ఫామ్ చేశారు. రెండు రోజుల క్రితం కూడా రామిరెడ్డి అనే వ్యక్తి చదలవాడకు టికెట్ కోరుతూ పురుగుల మందు తాగిన విషయం అందరికీ తెలిసినదే. దీంతో నరసరావుపేటలో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. గత రెండు పర్యాయాలుగా నరసరావుపేటలోని టిడిపి క్యాడర్ను కాపాడుకుంటూ వస్తున్న చదలవాడా అనింది బాబు కాకుండా వేరే వారికి ఇస్తే పరిస్థితి దారు మారవుతుందని ఉద్దేశంతో టిడిపి పునః ఆలోచన చేసి చదలవాడకే టికెట్ కన్ఫామ్ చేసింది. ఎంపీ అభ్యర్థులుగా ఈసారి యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. పార్లమెంట్లో తమ గళాన్ని వినిపించాలంటే యువత అయితే బాగుంటుందని టిడిపి ఆలోచించినట్టు తెలుస్తుంది.

హాట్ సీట్లైనా నరసరావుపేట, విజయవాడ. విశాఖపట్నం, గుంటూరులలో సామాజిక ఆర్థికపరంగా బలంగా ఉండే వ్యక్తులను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

పొత్తులో భాగంగా టిడిపికి 17 పార్లమెంట్ స్థానాలను కేటాయించగా అందులో 13 స్థానాలను ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలలో విజయనగరం, కడప, ఒంగోలు, అనంతపురం ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు తెలియాల్సి ఉంది.

ఎంపీ అభ్యర్థులు: శ్రీకాకుళం- రామ్మోహన్‌ నాయుడు,

 విశాఖపట్నం - భరత్, 

అమలాపురం - గంటి హరీష్ మాధుర్‌, 

ఏలూరు - పుట్టా మహేష్‌ యాదవ్, 

విజయవాడ - కేశినేని చిన్ని, 

గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్‌, 

నర్సరావుపేట - లావు శ్రీకృష్ణదేవరాయలు, 

బాపట్ల - టి. కృష్ణప్రసాద్, 

నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, 

చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్‌రావు, 

కర్నూలు - బస్తిపాటి నాగరాజు, 

నంద్యాల - బైరెడ్డి శబరి, 

హిందూపూర్‌-బీకే పార్థసారథి


టీడీపీ మూడో జాబితా విడుదల. 13 మంది లోక్‌సభ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ.

అసెంబ్లీ అభ్యర్థులు: పలాస-గౌతు శిరీష, 

పాతపట్నం-మామిడి గోవింద్‌రావు, 

శ్రీకాకుళం-గొండు శంకర్‌, 

శృంగవరపుకోట-కోళ్ల లలితా కుమారి, 

కాకినాడ సిటీ-వెంకటేశ్వరరావు, 

అమలాపురం-అయితాబత్తుల ఆనందరావు, 

పెనమలూరు-బోడె ప్రసాద్, 

మైలవరం-వసంత వెంకట కృష్ణప్రసాద్, 

నర్సరావుపేట - చదలవాడ అరవింద్‌ బాబు, 

చీరాల - మద్దులూరి మాలకొండయ్య యాదవ్,

సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి


Follw below

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట :- పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న పెద్ద శివాలయం నందు భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లోని పెద్ద శివాలయం నిర్మాణ పనులు పూర్తిచేసుకుని ఈరోజు విగ్రహా పునజీవ ప్రతిష్ట మహోత్సవం మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం రంగ రంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం నుంచి దేవాలయంలో భక్తులు రద్దీతో కిక్కిరిసిపోయింది. చుట్టుపక్కల ఊర్ల నుండి బంధువులు లతో ఆడపడుచులతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళామందిర్ సెంటర్ నందు, చలివేంద్రం బజార్ నందు, మార్కెట్ సెంటర్ నందు వేలాది మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీతో గడియార స్తంభం, కళామందిర్ సెంటర్ నందు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది.

ధ్వజస్తంభ ప్రతిష్ట వీడియో కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://youtu.be/103d3m9wA8w




https://youtu.be/103d3m9wA8w



Follow below for More


https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం


చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం



చిలకలూరిపేట పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ప్యాసింజర్లతో వెళుతున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చెన్నై నుంచి పొగాకు లోడు తో రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న గోడౌన్ కి వెళ్తున్న సమయంలో లారీని వెనక నుండి ఒంగోలు నుండి గుంటూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బస్సులోని ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు లోపల ఉన్న ప్యాసింజర్లకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో నేషనల్ హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ప్రోక్లైనేర ద్వారా ఘటనకు గురైన ఆర్టీసీ బస్సును పక్కకు జరిపి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.


చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం


Share:

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

చిలకలూరిపేట :- జనసేన, టిడిపి, బిజెపి ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఇప్పటికే కార్యకర్తలు భారీ ఎత్తున సభ స్థలానికి చేరుకున్నారు. కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే అల్పాహారం, మజ్జిగ, మంచినీళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా పోలీస్ వారి కనుసైగల్లో భారీ బందోబస్తు నడుమ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిన్నటి నుండి కూడా పట్టణంలోని లాడ్జ్ అండ్ హోటల్స్ అన్ని ముందుగానే బుక్ అయిపోవడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న విఐపి లకు వసతి సదుపాయానికి ఇక్కట్లు తప్పడం లేదు. అయినప్పటికీ పట్టణంలోని పెద్దపెద్ద హోటల్స్, టిఫిన్ సెంటర్లు జనాలతో కిరిసిపోయాయి. ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడటం వలన జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్రతను కొంతవరకు తగ్గించగలిగారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు సాయంత్రం అయినప్పటికీ కూడా ప్రజలు ఇప్పటినుండే సభ స్థలానికి బారులు తీరారు. సభా ప్రాంగణానికి విఐపి పాసులు ఉంటేనే కార్లకు అనుమతిస్తున్నారు. చిలకలూరిపేట నుండి బొప్పూడి వరకు రోడ్లన్నీ టిడిపి, జనసేన, బిజెపి జెండాలతో నిండిపోయాయి. ఇప్పటికే పలు ప్రధాన కూడలిలలో కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.


సంబంధించిన వీడియో చూడటం కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.


https://youtube.com/watch?v=QlCUBK4t7Tw&si=NfJQT1u7gCiZniIu

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి